నాకు 35 ఏళ్లు. చాలా రోజులుగా లోయర్ బ్యాక్ పెయిన్‌తో సఫర్ అవుతున్నాను. డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలా? ఎక్సర్‌సైజెస్‌తో మేనేజ్ చేయొచ్చా? ఎలాంటి ఎక్సర్‌సైజెస్ చేయాలి.. ఎలాంటివి చేయకూడదు? – వి. శుభదా, హైదరాబాద్
లోయర్ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు త్వరగా ట్రీట్‌మెంట్ తీసుకోవడం మంచిది. ఎక్సర్‌సైజెస్ కూడా స్టార్ట్ చేయాలి. ఆలస్యం చేయడం వల్ల సమస్యలు ఎక్కువవుతాయి. స్పైన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. దాని చుట్టూ లిగమెంట్స్, జాయింట్స్, మజిల్స్ ఉండి.. దాన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అదేపనిగా రెస్ట్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. కదలికలతోనే స్పైన్ ఆరోగ్యంగా ఉంటుంది. దానికి పూర్తిగా విశ్రాంతి ఇస్తే కదలికలు తగ్గి ఇంకా పెయిన్ పెరిగే ప్రమాదం ఉంటుంది.
రెండు రోజుల కన్నా ఎక్కువ బెడ్ రెస్ట్ తీసుకోకూడదు. స్పెషలిస్ట్‌ని సంప్రదించి సమస్య ఎక్కడుందో తెలుసుకోవాలి. మొబిలిటి పెరిగే వ్యాయామాలు చేయాలి. జాయింట్స్ బిగుసుకుపోకుండా చూసుకోవాలి. జాయింట్స్ స్టిఫ్‌గా అయిపోతే బ్యాక్ పెయిన్ మరింత ఎక్కువవుతుంది. యాక్టివ్‌గా ఉంటే కండరాలు స్ట్రాంగ్‌గా ఉంటాయి. వాకింగ్, స్విమ్మింగ్, యోగా, డాన్సింగ్ వంటివి చేయొచ్చు. Knee రోలింగ్, Knee to Chest, పెల్విక్ టిల్ట్స్ వంటి సింపుల్ ఎక్సర్‌సైజెస్ చేయాలి.
ఇవన్నీ కూడా ఫిజియోథెరపిస్ట్ సమక్షంలో ప్రయత్నించాలి. కొంచెం నొప్పి తగ్గాక బ్యాక్ ఎక్స్‌టెన్షన్ ఎక్సర్‌సైజెస్ చేయాలి. వెల్లకిలా పడుకుని మోకాళ్ల కిందిభాగంలో రెండు పిల్లోస్‌ని, బోర్లా పడుకునే అలవాటున్నవారు పొట్టకింద రెండు పిల్లోస్, పక్కకు తిరిగి పడుకునేవారు రెండు మోకాళ్ల మధ్యలో ఒక పిల్లోను సపోర్ట్‌గా పెట్టుకోవాలి. అలాగే కూర్చుని ఉన్నప్పుడు నడుము వెనకభాగంలో పిల్లోని సపోర్ట్‌గా పెట్టుకోవాలి. లోయర్ బ్యాక్ పెయిన్ సూచనలు కనిపించగానే వెంటనే సంబంధిత డాక్టర్‌ని సంప్రదించాలి.
మూత్ర విసర్జన కష్టమవుతున్నా, మలమూత్రాల మీద నియంత్రణ తప్పినా, మల ద్వారం దగ్గర నంబ్‌నెస్ ఉన్నా.. కాళ్లు నిస్సత్తువగా అనిపించినా.. తిమ్మిర్లున్నా, బాలెన్స్ తప్పుతున్నా, కాళ్లల్లో తీవ్రమైన నొప్పి ఉన్నా దగ్గర్లోని ఫిజీషియన్‌ని లేదా న్యూరాలజిస్ట్‌ని సంప్రదించాలి. అవసరమైన టెస్ట్‌లు చేస్తారు. పైన చెప్పిన పరిస్థితులు ఉంటే ఇంట్లో ఎలాంటి చిట్కా వైద్యాలు చేయకుండా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.
ఇవి చదవండి: విడిపోతామని భయంగా ఉంది! అసలు కారణమేంటి?
Comments
Please login to add a commentAdd a comment