Funday interview
-
Health: మెనోపాజ్ వల్ల హార్మోన్స్ సమస్యా? అయితే ఇలా చేయండి!
మెనోపాజ్ వల్ల హార్మోన్స్ తగ్గిపోతాయి కదా.. దాని ప్రభావం ఆరోగ్యం మీద పడకుండా ఉండటానికి మాత్రల ద్వారా హార్మోన్స్‌ను రీప్లేస్ చేయవచ్చా? – జి. సోనీ, సిద్ధిపేటమెనోపాజ్ తరువాత హార్మోన్స్ డెఫిషియెన్సీ వల్ల సైడ్ఎఫెక్ట్స్, ఇబ్బందులతో చాలామంది బాధపడుతుంటారు. వాటిని తగ్గించడానికి చాలామంది హెచ్ఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారిప్పుడు. అయితే దీనిని డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి. అదికూడా వైద్య పరీక్షల అనంతరం. ఈ హెచ్ఆర్టీ అందరికీ సరిపడకపోవచ్చు.ఈ హార్మోన్స్ థెరపీతో ముఖ్యంగా హాట్ ఫ్లషెస్, రాత్రిళ్లు చెమటలు పట్టడం, మూడ్ స్వింగ్స్, వెజైనా పొడిబారిపోవడం వంటి సమస్యలను పరిష్కరించవచ్చు. ఆస్టియోపొరాసిస్ అంటే ఎముకలు గుల్లబారడం వంటి సమస్యనూ నివారిస్తుందీ హెచ్ఆర్టీ. ఈ సింప్టమ్స్ అన్నీ మెనోసాజ్ వచ్చిన కొన్నినెలలకు కనపడతాయి. ట్రీట్మెంట్ మొదలుపెట్టాక కనీసం మూడు నెలలు అయితే కానీ దాని ప్రభావం కనిపించదు.ఒకవేళ ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే డోస్, ప్రిపరేషన్ మార్చేయవచ్చు. అయితే బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, అంతకుముందు బ్లడ్ క్లాట్స్ ఉన్నా, హై బీపీ, లివర్ ప్రాబ్లమ్ ఉన్నవారిలో హెచ్ఆర్టీ సురక్షితం కాదు. హెచ్ఆర్టీలో హార్మోన్స్‌ను సింగిల్ డోస్‌గా కానీ.. కంబైన్డ్ డోస్ టాబ్లెట్స్‌గా కానీ ఇస్తారు. ఇవి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్స్‌తో ఉంటాయి. స్కిన్ పాచెస్, జెల్స్, పెసరీస్ కూడా ఉంటాయి. హెచ్ఆర్టీకి ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి.జీవనశైలిలో మార్పులు అంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, మసాలా ఆహారపదార్థాలు, టీ, కాఫీ, ఆల్కహాల్ వంటివాటికి దూరంగా ఉంటూ.. తాజా ఆకుకూరలు, బాదం పప్పు, అక్రోట్స్, సోయా బీన్స్ వంటివి తీసుకుంటూంటే మెనోపాజ్ సింప్టమ్స్ అంతగా బాధించవు.. తగ్గుతాయి కూడా.ఇవి చదవండి: Health: లోయర్ బ్యాక్ పెయిన్‌తో ఇబ్బందా! ఆలస్యం చేశారో?? -
Health: లోయర్ బ్యాక్ పెయిన్‌తో ఇబ్బందా! ఆలస్యం చేశారో??
నాకు 35 ఏళ్లు. చాలా రోజులుగా లోయర్ బ్యాక్ పెయిన్‌తో సఫర్ అవుతున్నాను. డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలా? ఎక్సర్‌సైజెస్‌తో మేనేజ్ చేయొచ్చా? ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి.. ఎలాంటివి చేయకూడదు? – వి. శుభదా, హైదరాబాద్లోయర్ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఎక్సర్సైజెస్ కూడా స్టార్ట్ చేయాలి. ఆలస్యం చేయడం వల్ల సమస్యలు ఎక్కువవుతాయి. స్పైన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. దాని చుట్టూ లిగమెంట్స్, జాయింట్స్, మజిల్స్ ఉండి.. దాన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అదేపనిగా రెస్ట్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. కదలికలతోనే స్పైన్ ఆరోగ్యంగా ఉంటుంది. దానికి పూర్తిగా విశ్రాంతి ఇస్తే కదలికలు తగ్గి ఇంకా పెయిన్ పెరిగే ప్రమాదం ఉంటుంది.రెండు రోజుల కన్నా ఎక్కువ బెడ్ రెస్ట్ తీసుకోకూడదు. స్పెషలిస్ట్‌ని సంప్రదించి సమస్య ఎక్కడుందో తెలుసుకోవాలి. మొబిలిటి పెరిగే వ్యాయామాలు చేయాలి. జాయింట్స్ బిగుసుకుపోకుండా చూసుకోవాలి. జాయింట్స్ స్టిఫ్‌గా అయిపోతే బ్యాక్ పెయిన్ మరింత ఎక్కువవుతుంది. యాక్టివ్‌గా ఉంటే కండరాలు స్ట్రాంగ్‌గా ఉంటాయి. వాకింగ్, స్విమ్మింగ్, యోగా, డాన్సింగ్ వంటివి చేయొచ్చు. Knee రోలింగ్, Knee to Chest, పెల్విక్ టిల్ట్స్ వంటి సింపుల్ ఎక్సర్సైజెస్ చేయాలి.ఇవన్నీ కూడా ఫిజియోథెరపిస్ట్ సమక్షంలో ప్రయత్నించాలి. కొంచెం నొప్పి తగ్గాక బ్యాక్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్ చేయాలి. వెల్లకిలా పడుకుని మోకాళ్ల కిందిభాగంలో రెండు పిల్లోస్‌ని, బోర్లా పడుకునే అలవాటున్నవారు పొట్టకింద రెండు పిల్లోస్, పక్కకు తిరిగి పడుకునేవారు రెండు మోకాళ్ల మధ్యలో ఒక పిల్లోను సపోర్ట్‌గా పెట్టుకోవాలి. అలాగే కూర్చుని ఉన్నప్పుడు నడుము వెనకభాగంలో పిల్లోని సపోర్ట్‌గా పెట్టుకోవాలి. లోయర్ బ్యాక్ పెయిన్ సూచనలు కనిపించగానే వెంటనే సంబంధిత డాక్టర్ని సంప్రదించాలి.మూత్ర విసర్జన కష్టమవుతున్నా, మలమూత్రాల మీద నియంత్రణ తప్పినా, మల ద్వారం దగ్గర నంబ్నెస్ ఉన్నా.. కాళ్లు నిస్సత్తువగా అనిపించినా.. తిమ్మిర్లున్నా, బాలెన్స్ తప్పుతున్నా, కాళ్లల్లో తీవ్రమైన నొప్పి ఉన్నా దగ్గర్లోని ఫిజీషియన్ని లేదా న్యూరాలజిస్ట్‌ని సంప్రదించాలి. అవసరమైన టెస్ట్‌లు చేస్తారు. పైన చెప్పిన పరిస్థితులు ఉంటే ఇంట్లో ఎలాంటి చిట్కా వైద్యాలు చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.ఇవి చదవండి: విడిపోతామని భయంగా ఉంది! అసలు కారణమేంటి? -
60కి పైగా యాడ్స్‌లో నటించిన ఈ భామను గుర్తుపట్టారా?
రుచా ఇనామ్దార్.. కథక్ కళాకారిణిగా, మోడల్‌గా, థియేటర్ ఆర్టిస్ట్‌గా సుపరిచితమైన పేరు. ఇప్పుడు వెబ్స్టార్గానూ ఖ్యాతినార్జిస్తోంది. ఆమె గురించి... పుట్టింది, పెరిగింది, చదివింది అంతా ముంబైలోనే. తల్లి రుటా ఇనామ్దార్ డాక్టర్. ఆ స్ఫూర్తితో రుచా కూడా మెడిసిన్ చదివింది. ఏసీపీఎమ్ (అన్నాసాహెబ్ చూడామణ్ పాటిల్ మెమోరియల్) డెంటల్ కాలేజ్‌లో కోర్సు పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఉన్న ఇష్టంతో కథక్, లాటిన్ అమెరికన్ జానపద నృత్యాల్లో శిక్షణ తీసుకుంది. సుమారు అరవైకి పైగా వాణిజ్య ప్రకటనల్లో బాలీవుడ్ ప్రముఖుల సరసన కనిపించింది. 2014లో ‘చిల్డ్రన్ ఆఫ్ వార్ ’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘అండర్ ది సేమ్ సన్’, ‘భక్తి’, ‘భిఖారీ’, ‘ వెడ్డింగ్ చా షినేమా’ సినిమాల్లోనూ నటిచింది. నటన మీద ఆసక్తితో మరాఠీ, హిందీ థియేటర్లో పనిచేసింది. సుమారు అరవైకి పైగా వాణిజ్య ప్రకటనల్లో బాలీవుడ్ ప్రముఖుల సరసన కనిపించింది. 2014లో ‘చిల్డ్రన్ ఆఫ్ వార్ ’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘అండర్ ది సేమ్ సన్’, ‘భక్తి’, ‘భిఖారీ’, ‘వెడ్డింగ్ చా షినేమా’ సినిమాల్లోనూ నటిచింది. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో ప్రసారమవుతోన్న ‘క్రిమినల్ జస్టిస్’తో వెబ్ వీక్షకులను అలరిస్తోంది. ఇందులో తను కనబర్చిన అద్భుతమైన నటనకు ‘బెస్ట్ పాపులర్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్’ అవార్డునూ అందుకుంది. ‘టైమ్ దొరికితే అది చేయాలి, ఇది చేయాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. నేను ఫోటోగ్రఫీ నేర్చుకోవాలని అనుకునేదాన్ని. లాక్ డౌన్లో సెమీ ఫోటోగ్రఫీ ఆన్లైన్ కోర్సు పూర్తి చేశా. త్వరలోనే పెద్ద ఫోటోగ్రాఫర్‌గా కూడా నన్ను చూడొచ్చు!’ – రుచా ఇనామ్దార్ చదవండి: అందం.. అదితిరావు హైదరి సొంతం -
అవకాశాల కోసం అగచాట్లు పడిన నటి
పమ్మీగా వెబ్ వ్యూయర్స్‌కి బాగా తెలిసిన నటే సమ్రిధి దేవన్. ‘ద ఆఫీస్’లో పమ్మీగా ఆమె చేసిన కామెడీ... సోషల్ మీడియాలో మీమ్స్‌గా నెటిజన్స్‌ను ఆకట్టుకుంటూనే ఉంది. ఢిల్లీలో పుట్టి, పెరిగింది. పంజాబీ కుటుంబం. మిరిండా హౌజ్‌లో బీఏ పూర్తి చేసింది. చదువుకునేటప్పుడు నాటకాల్లో పాల్గొనడంతో నటన మీద ఆసక్తి పెరిగింది. దాంతో డిగ్రీ అయిపోయిన వెంటనే ముంబైలోని డ్రామా స్కూల్లో చేరి శిక్షణ తీసుకుంది. యాక్టింగ్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంటే అయినా తెర మీద అవకాశాల కోసం మాత్రం చాలానే కష్టపడాల్సి వచ్చింది. 2015లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కి వచ్చిన ‘స్టోరీస్ బై రవీంద్రనాథ్ ఠాగూర్’తో వెబ్ తెరకు పరిచయం అయింది. మొదటి అవకాశంతోనే నటిగా నిరూపించుకుంది. పలు ప్రశంసలను అందుకుంది. వెంటవెంటనే ‘నాట్ ఫిట్’, ‘లక్నో సెంట్రల్’, ‘ ఇమ్ఫర్ఫెక్ట్ ’ వంటి వివిధ సిరీస్, సినిమాలూ చేసి ఇటు వెబ్, అటు వెండితెర ప్రేక్షకులనూ తన అభిమానులుగా మార్చుకుంది. ‘ద ఆఫీస్’లోని ‘పమ్మి’ పాత్ర ఆమెకు అవార్డునూ అందించింది. స్విమ్మింగ్, డాన్స్ అంటే చాలా ఇష్టం. సంగీతంలోనూ శిక్షణ తీసుకుంటోంది. ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది. "ఇప్పటి వరకు నాకు వచ్చినవన్నీ డిఫరెంట్ రోల్సే. అన్నిరకాల పాత్రలు చేయడానికి ఇష్టపడ్తాను. మార్వెల్ సూపర్ హీరో, హ్యారీ పోటర్, పూర్తి స్థాయి యాక్షన్ రోల్స్ చేయటం నా కల" – సమ్రిధి దేవన్ - దీపిక కొండి చదవండి: గర్భవతిని చేసి.. ఇప్పుడు బెదిరిస్తున్నాడు : నటి చాందినీ -
టీవీ బ్రేక్‌లో వచ్చే ఈ అమ్మాయిని గుర్తుపట్టారా?
టీవీలో బ్రేక్ వస్తే.. ఈ అమ్మాయి తప్పకుండా మీకు దర్శనమిస్తుంది. ఎందుకంటే, ఆ ఐదు నిమిషాల బ్రేక్‌లో పది యాడ్స్ వస్తే.. ఒక దానిలోనైనా సంజనా సంఘీ నటించి ఉంటుంది. పుట్టింది, పెరిగింది, చదివింది అంతా ఢిల్లీలోనే.. తండ్రి సందీప్ సంఘీ బిజినెస్‌మన్, తల్లి సుగాన్ హోమ్ మేకర్, అన్న సమీర్ గూగుల్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇదీ సంజన కుటుంబం. పదమూడేళ్ల వయసులో బాలీవుడ్ మూవీ ‘రాక్‌స్టార్’తో బాలనటిగా ఎంటర్ అయినా, నటిగా గుర్తింపు సాధించింది మాత్రం 2019లో ‘దిల్ బేచారా’ సినిమాతో. క్యాన్సర్ రోగిగా తను కనబరచిన నటన చాలా మందిని కంటతడి పెట్టించింది. ఫిట్నెస్ పట్ల చాలా శ్రద్ధ సంజనాకు. యోగాతోనే తన రోజు మొదలవుతుంది. కథక్ డాన్స్‌లో శిక్షణ తీసుకుంది. యాడ్స్, మూవీస్ అంటూ ఎంత బిజీగా ఉన్నా చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఇంటర్లో తను సాధించిన మార్కులకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రశంసా పత్రం బహూకరించి, అభినందించారు. ఇక లేడీ శ్రీరామ్ కాలేజీ నుంచి మాస్ కమ్యూనికేషన్స్‌లో గోల్డ్ మెడల్ పొందింది. అభిరుచులు.. పెంపుడు కుక్కతో ఆడుకోవడం, షాపింగ్ చేయడం. మురికివాడల్లోని పిల్లలకు చదువు చెప్పడం. సినిమా కంటే ముందు వాణిజ్య ప్రకటనలు ఆమెను ప్రేక్షకులకు పరిచయం చేశాయి. తన క్యూట్ ఫేస్‌తో కోకా కోలా, క్యాడ్బరీ, మింత్రా, ఎయిర్‌సెల్, డాబర్, తనిష్క్ వంటి సుమారు నూటాయాభై ప్రకటనల్లో కనిపించింది. ఆ తర్వాత ‘హిందీ మీడియం’, ‘ఫుక్రే రిటర్న్స్’ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆదిత్యరాయ్ కపూర్‌తో కలసి ‘ఓమ్’ సినిమాలో నటిస్తోంది. పుస్తకాలతో స్నేహం చేసే ఆమె.. కాలేజీ రోజుల్లోనే ‘యూత్ కీ ఆవాజ్’, ‘ది శాటిలైట్’ వెబ్‌సైట్స్‌కు ఫీచర్ రైటర్‌గా పనిచేసింది. చదువు పూర్తి చేసిన తర్వాత కొద్దిరోజులు బీబీసీలో ఇంటర్న్‌షిప్ కూడా చేసింది. రాక్‌స్టార్ మూవీ షూట్లోనే నటిగా మారాలని నిర్ణయించుకున్నా.. అప్పటి వరకు నేను సినిమాల్లో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు - సంజనా సంఘీ చదవండి: కోరిక తీరకుండానే వెళ్లిపోయిన వివేక్ టాలీవుడ్లో మరో విషాదం.. పూజా హెగ్డే ఎమోషనల్ ట్వీట్ -
రేలంగి తన సంపాదనంతా ఆమెకే ఇచ్చేవారు..!
రేలంగిని ఆప్యాయంగా రేలంగోడు అంటూ సొంతవానిగా అక్కున చేర్చుకుంటారు. సినిమాలో రేలంగి కనపడితే నవ్వులే నవ్వులు. నడక, మాట తీరు, వస్త్ర ధారణ.. అన్నీ హాస్యమే. తెలుగు హాస్యానికి చిరునామా రేలంగి. ఆయనే రేలంగి వెంకట్రామయ్య. హాస్యంతో పాటు వీలునామా కూడా విలక్షణమే.. రేలంగి మనవరాలు గాయత్రి, తన తాతను గుర్తు చేసుకుంటూ, అందమైన సంఘటనలెన్నో సాక్షికి వివరించారు. మా ముత్తాత రామస్వామి (రేలంగి తండ్రి) హరికథలు చెప్పేవారు. ఆయనకు తాతయ్య ఏకైక సంతానం. ఆగస్టు 13, 1910న రావులపాడులో పుట్టారు. తాతయ్యకు నాన్న ఏకైక సంతానం. నాన్నను సత్యనారాయణబాబు, రేలంగి బాబు అని పిలిచేవారు. నాన్నగారికి మేం ఇద్దరు మగపిల్లలు, నలుగురు ఆడపిల్లలం. తాతయ్యకు ఆడ పిల్లలంటే చాలా ఇష్టం. బంధువుల పిల్లలతో ఇల్లంతా కళకళలాడుతుండేది. యంగ్మెన్స్ ఆర్టిస్ట్స్ క్లబ్లో తాతయ్య హార్మోనియం నేర్చుకున్నారు. ఆ రోజుల్లోనే తాతయ్య నాటకాలు వేసేవారు. పి. పుల్లయ్య గారితో కలకత్తా వెళ్లి, ఒక సినిమాలో చేశాక, చెన్నైలో ఎన్నో ఇబ్బందులు పడుతూ చిన్నచిన్న వేషాలు వేశాక, గుర్తింపు వచ్చింది. 1950 – 70 మధ్య హీరోలకు దీటుగా పని చేశారు. తాతయ్యను చూడటానికి బస్సులలో వచ్చిన అభిమానులందరికీ భోజనాలు పెట్టి పంపేవారట. నా పేరు పెట్టొద్దు అన్నారు... దానధర్మాల్లో తాతయ్యకు మంచి పేరు. ఎవరైనా చదువుకోవటానికి ఆర్థిక సహాయం కోసం వస్తే, ‘మంచి మార్కులతో పాస్ అయి చూపించాలి’ అనేవారట. 1967లో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించే ముందు, ‘రేలంగి వెంకటేశ్వర యూనివర్సిటీ’ అని పేరు పెడతాం, ఐదు లక్షలు విరాళం ఇవ్వమన్నారట. అందుకు తాతయ్య, ‘నా పేరు పెట్టక్కర్లేదు, నాలుగు లక్షలు ఇస్తాను, మా వాళ్లందరికీ చదువు రావాలని మొక్కుకోండి’ అన్నారట. దానధర్మాలలో ‘నాగయ్యగారి తరవాత రేలంగి గారు’ అన్న పేరు సంపాదించుకున్నారు. పిల్లల మీద చాలా ప్రేమ.. దక్షిణాది భాషల చిత్రాల షూటింగ్‌లన్నీ వాహిని స్టూడియోలో జరిగేవి. ఆ స్టూడియో పక్కనే ఉన్న విజయా గార్డెన్స్‌ను తాతయ్య 1956లో కొని, అందులో పంటలు పండించారు. ఆ చోటును∙వాహిని వారికి లీజ్‌కిచ్చారు. ఆ స్థలం తాలూకు వీలునామా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆడ, మగ తేడా లేకుండా ఎంతమంది మనవలు పుడితే అంతమంది సమానంగా అనుభవించేలా విల్లు రాయించారు. అప్పటికి నాన్నకి ఇంకా వివాహం అవ్వలేదు. నాన్న జీవించినంత కాలం ఆ ఆస్తిని మనవలకు అమ్మే హక్కు లేకుండా రాయించారు. ఆ వీలునామా ఎన్నటికీ మరచిపోలేని విషయం. తాతయ్యతో చూడలేకపోయాం.. తాతయ్యతో ఎక్కువ సమయం గడపలేక పోయామనే బాధ ఉంది మాకు. ఆయన ఉండి ఉంటే మమ్మల్ని చూసి ఆనందించేవారనుకుంటాం. మాయాబజార్, పాతాళభైరవి వంటి చిత్రాలు తాతయ్యతో కలిసి చూడలేకపోయాం. ఆయన నటించిన సినిమాలన్నీ టీవీలో చూస్తూ, ఎంజాయ్ చేస్తాం. తాతయ్య 360కి పైగా సినిమాలు చేశారని తరవాత తెలిసింది. సినిమా పరిశ్రమలో ఉండే రాజకీయాలు తాతయ్యకి తెలుసు. అందుకే నాన్నను సినిమాలలోకి వద్దన్నారు. నాన్న ‘బాలానందం’ అనే ఒకే ఒక్క సినిమాలో నటించారు. తాతయ్య చివరి రోజుల్లో తాడేపల్లిగూడెంలో ఉన్నారు. ఎవరైనా వస్తే ఉండటానికి వీలుగా అక్కడ పోర్షన్స్‌గా కట్టించారు. తాతగారికి మనుషులు కావాలి. నాకు తొమ్మిదేళ్లు వచ్చేసరికే తాతయ్య పోయారు. ఆయన పోయాక కూడా ఆంధ్ర నుంచి తెలుగువారు చెన్నై వచ్చి మా ఇంట్లో ఉండేవారు. మద్రాసు పాండీబజార్లో... తాతయ్య బాగా డబ్బు సంపాదించిన రోజుల్లో, మద్రాసు పాండీ బజారులో థియేటర్ కడదామనుకున్నారు. కాని తాతగారి బంధువులంతా తాడేపల్లిగూడెంలో ఉండటంతో, ‘మన పేరు తెలిసేచోట కడితే, మనల్ని పదికాలాల పాటు గుర్తు చేసుకుంటారు’ అని తాడేపల్లి గూడెంలో 1962లో ‘రేలంగి చిత్ర మందిర్’ కట్టారు. నాటి తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజు థియేటర్ ప్రారంభించారు. అందులో విడుదలైన మొదటి సినిమా లవకుశ. ఇప్పుడు అది బాగా పాతబడిపోవటంతో ‘పద్మశ్రీ వెంకట్రామయ్య మాల్’ గా మారుస్తున్నాం. మనవలంటే ప్రాణం... తాతయ్యకు మనవలంటే మహా ఇష్టం. మాతో చాలా స్నేహంగా ఉండేవారు. నానమ్మతో మా గురించి చెప్పుకుంటూ మురిసి పోయేవారట. మేమంతా మద్రాసులోనే పుట్టి పెరిగాం. తాతయ్య సినిమాలలో బిజీగా ఉండటం వల్ల ఇంటి విషయాలన్నీ నానమ్మ చూసుకునేది. మా బంధువులలో చాలామందికి తాతయ్యే పెళ్లిళ్లు జరిపించారు. తాతగారి డాడ్జ్ కారు నెంబరు ఎంఎస్ఆర్ 1722. అప్పట్లో పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు కారు నెంబరుతో పిలిచేవారు. అలా వినటం వల్ల నెంబరు గుర్తుండిపోయింది. ఆయనకు వీలు కుదిరినప్పుడల్లా అందరినీ బయటకు తీసుకువెళ్లేవారు. పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు కూడా చాలామందిని తనతో ఢిల్లీ తీసుకువెళ్లారు. ఇంట్లో నిశ్శబ్దంగా ఉండేవారు. సినిమాలలో బిజీగా ఉండటం వల్ల, మాతో ఎక్కువ సమయం గడపేవారు కాదు. కాని మా బాధ్యతలన్నీ తన భుజాల మీద వేసుకున్నారు. షైన్ వేలాంకణి స్కూల్లో చేర్పించారు. అందువల్ల మాకు చదువులో మంచి ఫౌండేషన్ పడింది. – గాయత్రీ దేవి, రేలంగి మనవరాలు అందరూ చక్కగా ఉన్నారు... తాతగారి వైపు బంధువులంతా వృద్ధిలోకి వచ్చారు. తాతగారి దగ్గర పనిచేసిన మేనేజర్, మా నాన్నగారి దగ్గర కూడా చేశారు. అప్పట్లో మేం తాతాజీ సినిమాలు చాలా తక్కువ చూశాం. తాతాజీతో ఒకటిరెండు ప్రివ్యూలకు వెళ్లాం. ఆయనతో ఎక్కువ సమయం గడపలేకపోయామని బాధపడతాం. ఆయన ఉండి ఉంటే మమ్మల్ని చూసి ఆనందించేవారనుకుంటాం. మరచిపోలేని అదృష్టాలు... తాతాజీతో బీచ్‌కి వెళ్లినరోజులు ఇప్పటికీ మరిచిపోలేం. మద్రాసు బీచ్‌లో కారు ఆపుకుని, సముద్రం వరకు నడిచేవాళ్లం. తాతాజీకి ఫోల్డింగ్ చైర్ తీసుకువెళ్లేవాళ్లం. ఆయన అందులో కూర్చునేవారు. చాలాసేపు అక్కడే ఆడుకునేవాళ్లం. మేం ఏం కొనుక్కోవాలన్నా నానమ్మకే చెప్పేవాళ్లం. ఇంటి విషయాలన్నీ నానమ్మకు వదిలేశారు. తాతాజీ సంపాదనంతా నానమ్మకి ఇచ్చేవారు. నానమ్మ తన దగ్గర నగలన్నీ ఎవరికి కావాలంటే వారికి పెట్టేసేది. అందరికీ పెట్టగలిగేంత బంగారం ఉండేది. ఇంట్లో చాలామంది భోజనాలు చేసేవారు. నేను తాతాజీ వాళ్ల అమ్మలా ఉంటానని, నన్ను ‘అమ్మ’ అని పిలిచేవారు. పిల్లలకు పెళ్లిళ్లు అయ్యి, అత్తవారిళ్లకు వెళితే ఎలా అని బెంగగా ఉండేవారు. తాతాజీ తన చేతుల మీదుగా ఒక్క మనవరాలికి మాత్రమే కన్యాదానం చేశారు. ఇంకా కొంతకాలం ఉండి ఉంటే, మాకు కూడా చేసేవారేమో. అందరి ఫంక్షన్లు బాగా ఘనంగా చేశారు. అది లోటే మాకు. జకార్తా వెళ్లినప్పుడు వాచ్ తెచ్చారు. స్ట్రాప్స్, బెల్టులు మార్చుకోవచ్చు. ఇప్పుడు పనిచేయకపోయినా, ఆయన గుర్తుగా ఉంచుకున్నాను. మా అక్కను అపురూపంగా చూసేవారు. కారులోనే స్కూల్‌కి వెళ్లేది. అక్క చిన్నప్పటి నుంచి సుకుమారం. ఆ వీలునామాలో ముందుజాగ్రత్త... ‘‘మాది రైతు కుటుంబం కనుక, తాతగారి పొలం ఆడ, మగ తేడా లేకుండా నా కొడుకు పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికీ సమానంగా ఇవ్వాలి. వారంతా నా పేరు చెప్పుకుని కడుపు నిండా తినాలి’’ అన్నారట తాతయ్య. అప్పటికి మా నాన్న వయసు పందొమ్మిది సంవత్సరాలు. ఇంకా పెళ్లి కూడా కాలేదు. తాతయ్య పెద్దగా చదువుకోకపోయినా ఎంతో దూరదృష్టితో ఈ పని చేసి ఉంటారనుకుంటాం. మనవలు అమ్మకుండా, డబ్బు పాడవ్వకుండా ఆ రోజుల్లో అంత బిగింపుగా వీలునామా రాశారంటే తాతయ్య నిజంగా చాలా గొప్పవారనిపిస్తుంది. మా కుటుంబం తాతాజీకి మేం ఆరుగురు మనవలం. పెద్దక్కయ్య చాముండేశ్వరీ దేవి, అన్నయ్య తిరుమలబాబు, మూడు నేను గాయత్రీ దేవి, నాలుగు రాజ్యలక్ష్మి, ఐదు శ్రీదేవి (నానమ్మ పేరు, తాతగారు నానమ్మని శ్రీదేవమ్మ అని పిలిచేవారు), ఆరు హేమంత్‌కుమార్. మేమంతా నానమ్మను అమ్మ అనేవాళ్లం. తాతయ్యను తాతాజీ అనేవాళ్లం. మా నాన్నగారు కూడా అలాగే పిలిచేవారు. ఏం కొనాలన్నా వాళ్ల సలహా తీసుకునేవాళ్లం. నాన్నగారు ఆరు సంవత్సరాల క్రితం, అమ్మ రెండు సంవత్సరాల క్రితం పోయారు. తాతాజీ, నానమ్మలే కాకుండా మా అమ్మనాన్నలు కూడా లేకపోవటం మాకు ఎంతో పెద్ద నష్టం అనిపిస్తుంది. 1975లో తాతాజీ కన్నుమూశారు. – గాయత్రీ దేవి, రేలంగి మనవరాలు సంభాషణ: వైజయంతి పురాణపండ -
డీగ్లామరస్ రోల్‌తో సినిమాల్లోకి ఎంట్రీ
ఆమె ఓ గ్లామర్ డాల్. కానీ, వెండితెరకు డీగ్లామరస్‌గా పరిచయమైంది. పాత్ర ఏదైనా, అందులో ఒదిగిపోతుంది. అందుకే, సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా, వరుస అవకాశాలతో దూసుకుపోతోంది ఆశిమా నర్వాల్. పుట్టింది హర్యానాలోని రోహ్తక్. పెరిగింది ఆస్ట్రేలియా. జాట్ కుటుంబానికి చెందిన ఆశిమాకు ఆస్ట్రేలియా పౌరసత్వం ఉంది. సిడ్నీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో నర్సింగ్ చేసి, కొంతకాలం అక్కడే పని చేసింది. ఫ్యాషన్‌పై ఉన్న ఇష్టంతో మోడల్ కావాలనుకుంది. ఆ లక్ష్యంతోనే ఒకే సంవత్సరంలో రెండు వేర్వేరు అందాల పోటీల్లో పాల్గొని విజయం సాధించింది. అలా ‘మిస్ సిడ్నీ ఆస్ట్రేలియా ఎలిగెన్స్ 2015’, ‘మిస్ గ్లోబల్ 2015’ టైటిల్స్ గెలిచింది. 2018లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి వరకూ అందంతో అలరించిన ఆమె.. మొదటి తెలుగు సినిమా ‘నాటకం’లో డీగ్లామరస్ రోల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఆ సినిమా అంతగా ఆడలేదు. ఆ తర్వాత చేసిన ‘జెస్సీ’ కూడా అంతే. కానీ, 2019లో విజయ్ ఆంటోనీతో కలసి నటించిన తమిళ చిత్రం ‘కోలైగరన్’ మంచి విజయాన్ని అందించింది. అదే చిత్రం ‘కిల్లర్’గా తెలుగులో డబ్ చేశారు. ‘రాజ భీమ’ తమిళ సినిమా కూడా హిట్. సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటుంది ఆశిమా. గత సంవత్సరం సిగరెట్ తాగుతూ పోస్ట్ చేసిన వీడియో వివాదాస్పదంగా మారింది. దీంతో అది ఓ సినిమా కోసం చేసిన వీడియో అంటూ వివరణ ఇచ్చింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఆర్ఎస్వీపీ మూవీస్, ఫ్లైయింగ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ నిర్మించిన ‘పిట్ట కథలు’ సినిమాలో నటించింది. ఈ సినిమాను నలుగురు డైరెక్టర్లు చిత్రీకరించారు. ఇందులో శ్రుతిహాసన్, అమలాపాల్ వంటి స్టార్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. 'ఆనందం, ఆశ్చర్యం, బాధ, కోపం, సిగ్గు వంటి అనేక భావాలను కెమెరా ముందు చూపించడం చాలా కష్టం. సినిమా అంటే కేవలం నటనే కాదు, అనేక పనుల కలయిక. ఇక్కడ చాలా సూక్ష్మమైన, సంక్లిష్టమైన విషయాలను నేర్చుకునే వీలు ఉంటుంది. అందుకు చాలా సంతోషిస్తున్నా'. – ఆశిమా నర్వాల్ -
నాటకాలు కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి
గ్లామర్ కన్నా యాక్టింగ్ గ్రామర్‌తో గుర్తింపు పొందడాన్ని మించిన కితాబు లేదు. అలాంటి అవార్డ్ కోసమే తాపత్రయపడుతుంటారు చాలామంది నటీనటులు. అలా ప్రేక్షకుల మనసుల్లో ముద్రవేసిన నటి అమృతా సుభాష్. మరాఠీ, హిందీ సినిమా, వెబ్ సిరీస్ నటే కాదు, గాయని కూడా. ముంబైలో పుట్టి పెరిగింది. తండ్రి సుభాష్‌చంద్ర ధేంబ్రే. తల్లి జ్యోతి సుభాష్... సుప్రసిద్ధ మరాఠీ నటి. ప్రఖ్యాత నాటక రచయిత గోవింద్ పురుషోత్తమ్ దేశ్‌పాండే అమృత మేనమామ. ఆమెకు ఒక సోదరుడు. పేరు.. జయ్. పుణెలోని ఎస్పీ కాలేజ్‌లో డిగ్రీ చదువుకుంది. ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో నటనలో శిక్షణ తీసుకుంది. మరాఠీ, హిందీ నాటకాల్లోని అమృత అభినయ కళే ఆమెను సినిమాలకు పరిచయం చేసింది. 2004లో ‘శ్వాస్’తో మరాఠీ సినిమా రంగంలోకి ప్రవేశించింది. అది ఆ ఏటి జాతీయ ఉత్తమ చిత్రంగా పురస్కారం అందుకోవడంతోపాటు ఆస్కార్ నామినేషన్స్‌కీ వెళ్లింది మన దేశపు అఫీషియల్ ఎంట్రీగా. 2009లో వాళ్లమ్మ జ్యోతి సుభాష్‌తో కలిసి ‘గంధా’ అనే సినిమాలోనూ నటించింది. బాలీవుడ్‌లోనూ ఆమె నటనా సంతకం ఉంది. ‘రమణ్ రాఘవ్ 2.0’, ‘గల్లీ బాయ్’ వంటి సినిమాలు ఆమె ప్రతిభను దేశమంతటికీ చూపించాయి. నిండా నలభై ఏళ్లు లేని అమృతా ‘గల్లీ బాయ్’లో రణ్వీర్ సింగ్‌కు తల్లిగా నటించి మెప్పించింది. శాస్త్రీయ సంగీతం, భరత నాట్యం నేర్చుకుంది. ఉత్తమ గాయనిగా మహారాష్ట్ర ప్రభుత్వపు పురస్కారాన్నీ పొందింది. ‘జోకా’, ‘పాల్‌ఖుణ’, ‘అవఘాఛి’ వంటి మరాఠీ టీవీ షోల్లో నటించింది. ‘కట్టి బట్టి’ అనే సీరియల్‌కు సంగీతం సమకూర్చింది. ‘సెలెక్షన్ డే’, ‘సేక్రెడ్ గేమ్స్ సీజన్ 2’.. సిరీస్‌తో ఓటీటీలోనూ మోస్ట్ టాలెంటెడ్‌గా మన్ననలందుకుంది. అమృత సుభాష్ సామాజిక కార్యకర్త, రచయిత కూడా. 2014లో ‘ఎక్ ఉలట్ ఎక్ సులట్’ అనే పుస్తకం రాసింది. ‘సినిమాలు, సిరీస్ కంటే కూడా థియేటర్ మీదే నాకు ప్రేమ. నాటకాలు నాలో కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపుతాయి’ అంటుంది అమృతా సుభాష్. -
పుస్తకాలంటే పిచ్చి.. కాని నా బ్యాడ్‌లక్
ఎ సూటబుల్ బాయ్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న సిరీస్. అందులో ‘లతా మెహ్రా’గా నటించిన తాన్యా మాణిక్తలా ఓటీటీ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. వాళ్ల చర్చల్లోనూ ప్రధాన భూమిక అయింది. ఎవరీ తాన్యా? ఢిల్లీలో పుట్టి పెరిగింది. ఢిల్లీ యూనివర్సిటీ కాలేజ్ (శివాజీ కాలేజ్)లో డిగ్రీ ఇంగ్లిష్ లిటరేచర్ చదివింది. తాన్యాకు ఇద్దరు తోబుట్టువులు.. అన్న అభిజీత్, అక్క సాన్యా. డిగ్రీ అయిపోయిన వెంటనే ‘ది సోషల్ రష్’ అనే మీడియా వెబ్సైట్లో కాపీ రైటర్‌గా చేరింది. ఆ అనుభవంతో ఆ టైమ్‌లోనే అంటే 2018లోనే తనూ ఒక యూట్యూబ్ చానెల్‌ను మొదలుపెట్టింది ‘తాన్యా మాణిక్తలా’ పేరుతోనే. తన యూట్యూబ్ చానెల్ పాపులారిటీ ‘టీవీఎఫ్’ వాళ్ల ‘ఫ్లేమ్స్’ సిరీస్‌లో నటించే అవకాశాన్నిచ్చింది. అదే సమయంలో ‘ది టైమ్లైనర్స్’ అనే యూ ట్యూబ్ చానెల్‌కూ పనిచేయమనే పిలుపొచ్చింది. ఈ రెండిటితో డిజిటల్ మీడియా వీక్షకులకు సుపరిచితమైంది తాన్యా. ‘ఫ్లేమ్స్’తో సంపాదించుకున్న అభిమానం ఆ సిరీస్ సీక్వెల్లోనూ తాన్యా స్థానాన్ని స్థిరం చేసింది. ఒక వైపు టీవీఎఫ్ వెబ్ సిరీస్, తన యూట్యూబ్ చానెల్, ది టైమ్ లైనర్స్, ది సోషల్ రష్‌తో క్షణం తీరికలేకుండా ఉన్నప్పుడే ‘ఎ సూటబుల్ బాయ్’ చాన్స్ ఆమె కాల్షీట్ డైరీ చెక్ చేసుకొమ్మంది. అభినయ ప్రజ్ఞాశాలి టబు, విలక్షణ నటుడు అనిపించుకోవాలనే తపనతో ఉన్న ఇషాన్ ఖట్టర్‌లతో కలిసి నటించే ఆపర్చునిటీ.. అన్నిటికీ మించి ది గ్రేట్ డైరెక్టర్ మీరా నాయర్ దర్శకత్వం.. రెండో ఆలోచన లేకుండా ఆడిషన్స్‌కు వెళ్లింది. సెలెక్ట్ అయింది. ఇలా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో భారతీయ వెబ్ వీక్షకులకు అభిమాన తార అయింది. హిందీ, ఇంగ్లిష్తో పాటు స్పానిష్ భాషలోనూ దిట్ట తాన్యా. పుస్తక పఠనం హాబీ. ‘పుస్తకాలంటే పిచ్చి. కాని నా బ్యాడ్‌లక్ ఏంటంటే ఏ నవల (ఎ సూటబుల్ బాయ్) ఆధారంగానైతే ‘ఎ సూటబుల్ బాయ్’ సిరీస్ తీశారో ఆ నవలే నేను చదవకపోవడం. విక్రమ్ సేథ్ తతిమా బుక్స్ కొన్ని చదివాను. కాని ఈ నవలే చదవలేదు. మా యూనివర్సిటీ థియేటర్ గ్రూప్‌లోని ఒక ఫ్రెండ్ ఒకరోజు ఫోన్ చేసింది. ‘బీబీసీ వాళ్ల కోసం మీరా నాయర్ ఓ సిరీస్ తీస్తున్నారట.. ఆడిషన్స్ ఉన్నాయి రా’ అని. వెళ్లాను. ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ అయ్యాను. నన్ను మీరా నాయర్ ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారని, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాక మళ్లీ ఆవిడ ఆడిషన్స్ తీసుకుంటారని.. ఆమె డెసిషనే ఫైనల్ అని చెప్పారు. అప్పుడే తెలిసింది ఆవిడ తీయబోయే సిరీస్ ఎ సూటబుల్ బాయ్ నవల అని. గుండెలో రాయిపడ్డట్టయింది. ఎందుకంటే ఆ బుక్ చదవలేదు కదా. మా ఫ్రెండ్‌తో చెబితే ‘ఓస్ ఇంతదానికి కంగారెందుకు? నేను చదివాను’ అంటూ ఆ కథ మొత్తం నాకు చెప్పింది ఇంపార్టెంట్ డైలాగ్స్‌తో సహా. దాంతో నా ఇంటర్వ్యూ చక్కగా పూర్తయింది. ఆడిషన్స్‌లోనూ మీరా నాయర్‌కు నచ్చాను. లతా మెహ్రా పాత్రకు ఓకే అయ్యాను. రిజల్ట్స్ మీ ముందుకొచ్చాయి’ అంటూ జరిగింది గుర్తుచేసుకుంది తాన్యా మాణిక్తలా... ఎ సూటబుల్ యాక్ట్రెస్. -
అమ్మ,నాన్నకు షార్ట్ టెంపర్.. నాకు మాత్రం
శ్రియ సచిన్ పిల్గావ్కర్.. నటనావారసత్వంతో మేకప్ వేసుకున్నా పెర్ఫార్మెన్స్తోనే పేరు, అవకాశాలను తెచ్చుకుంటోంది. మాతృభాష మరాఠీతోపాటు హిందీ, ఇంగ్లిష్ థియేటర్, సినిమా, వెబ్ సిరీస్‌లతో కెరీర్‌ను ఫ్రేమ్ చేసుకుంటోంది. జన్మస్థలం.. ముంబై. పెరిగింది కూడా అక్కడే. తల్లిదండ్రులు సుప్రియా పిల్గావ్కర్, సచిన్ పిల్గావ్కర్లు. ఇద్దరూ ప్రముఖ నటులే మరాఠీ, హిందీ భాషల్లో. సచిన్ పిల్గావ్కర్ రచయిత, దర్శకుడు కూడా. ఆ బహుముఖ ప్రజ్ఞకూ వారసురాలే శ్రియ. నటి మాత్రమే కాదు, కథక్ నర్తకి, గాయని, దర్శకురాలునూ. ∙‘పెయింటెడ్ సిగ్నల్స్’, ‘డ్రెస్వాలా’ అనే షార్ట్‌ఫిల్మ్స్‌కు దర్శకత్వం వహించింది. ‘పంచగవ్య’ అనే డాక్యుమెంటరీ తీసింది. చదువు.. సోషియాలజీలో డిగ్రీ. పుణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, హార్వర్డ్ సమ్మర్ స్కూల్ నుంచి నటనలో డిప్లొమా. స్పోర్ట్స్‌లోనూ ఫస్టే. ప్రొఫెషనల్ స్విమ్మర్. కొత్త భాషలను నేర్చుకోవడమంటే ఆసక్తి. జపనీస్ వచ్చు. నటి కాకముందు జపనీస్ ట్రాన్స్‌లేటర్ కావాలనేదే ఆమె లక్ష్యం. మరాఠీ, హిందీ, ఇంగ్లిష్ థియేటర్‌తో పనిచేస్తూనే 2013లో తన తండ్రి దర్శకత్వం వహించిన ‘ఎకుల్తి ఏక్’ అనే మరాఠీ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. హిందీలో షారుఖ్ ఖాన్ నటించిన ‘ఫ్యాన్’ అనే చిత్రంతో జాతీయ నటిగా మారింది. ‘మీర్జాపూర్’, ‘హౌస్ అరెస్ట్’ అనే వెబ్ సిరీస్, వెబ్ మూవీస్‌తో ఇల్లిల్లూ ఆమెను గుర్తుపెట్టుకుంది. ఆమె ప్రతిభా అకాడమీ అవార్డ్ విన్నర్ ఫ్రెంచ్ డైరెక్టర్ క్లాడె లెలోషే కంటాపడింది. తను తీసిన ‘అ ప్లుస్ ఇన్’ అనే ఫ్రెంచ్ సినిమాలో శ్రియను నటింపచేశాడు. ‘బీచమ్ హౌస్’ అనే బ్రిటిష్ సిరీస్‌లోనూ నటించింది. థియేటర్, సినిమా, వెబ్ సిరీస్ బిజీ షెడ్యూల్స్ నుంచి సేదతీరేది ప్రయాణాలు, పుస్తక పఠనంతోనే. ‘‘అమ్మ, నాన్న ప్రభావం ఉన్నా వాళ్లను అనుకరించను. అమ్మలోని సహనం, నాన్నలోని క్రమశిక్షణ నాకు వస్తే బాగుండు అనుకుంటా. ఇద్దరికీ ఉన్న షార్ట్ టెంపర్ మాత్రం దరిచేరకుండా జాగ్రత్త పడ్తా. నాకే గనుక చాన్స్ దొరికితే ఓ సీక్రెట్ సొసైటీ స్థాపిస్తా. సోషల్ మీడియాలో బుల్లీయింగ్‌కు పాల్పడేవాళ్ల పనిపట్టేందుకు’’ అంటుంది శ్రియ సచిన్ పిల్గావ్కర్. -
వెబ్ సిరీస్ సంచలనం.. మిథిలా పాల్కర్
మిథిలా పాల్కర్.. కప్పును మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్‌గా చేసుకొని మిథిల పాడిన ‘హై చాల్ తురు తురు’ అనే మరాఠీ ప్రైవేట్ సాంగ్ ఒక్క రోజులోనే ఆమెను యూట్యూబ్ స్టార్‌ను చేసింది. సినిమా స్క్రీన్కు ఆమెను చూపించింది. సొంతూరు ముంబై. ఉండేది కూడా అక్కడే. మాస్ కమ్యూనికేషన్ చదువుకుంది. ఫస్ట్ లవ్... థియేటరే. డిగ్రీ సెకండియర్‌లో ఉన్నప్పుడే క్యూ థియేటర్ ప్రొడక్షన్స్‌లో చేరింది. ఫిల్టర్ కాపీ... అనే యూట్యూబ్ చానెల్లో సెటైర్ షో ‘న్యూస్ దర్శన్’కు హోస్ట్‌గా, ధ్రువ్ సెహగల్‌తో కలిసి ‘ఎన్నాయింగ్ థింగ్స్ బాయ్‌ఫ్రెండ్స్ డు’ అండ్ ‘కన్ఫ్యూజింగ్ థింగ్స్ గర్ల్‌ఫ్రెండ్స్ సే’ అనే షోనూ నిర్వహించింది. ఈ వీడియోలూ వైరల్ అయ్యి మిథిలాను సెలెబ్రిటీని చేశాయి. మాఝా హనీమూన్... ఈ మరాఠీ షార్ట్ ఫిల్మ్‌లోని తన నటనతో బాలీవుడ్ ఎంట్రీ ఖాయం చేసుకుంది మిథిల. ఆమె మొదటి హిందీ సినిమా ‘కట్టీ బట్టీ’. ఇందులో ఇమ్రాన్‌ఖాన్‌కు చెల్లెలుగా యాక్ట్ చేసింది. తర్వాత మరాఠీ సినిమా మురాంబాలోనూ హీరోయిన్ అయింది. అందులో పాట కూడా పాడింది. నటనతోపాటు న్యాటం, సంగీతం కూడా ఉన్నాయి ఆమె ప్రజ్ఞాపాటవాల జాబితాలో. కథక్ నేర్చుకుంది. పాటంటే ప్రాణం. ‘నా పాటే నన్ను వర్ణిస్తుంది’ అంటుంది. గర్ల్ ఇన్ ద సిటీ, లిటిల్ థింగ్స్, చాప్ స్టిక్స్.. వెబ్ సిరీస్‌లతో మిథిలను తమ ఇంటి పిల్లగా అభిమానించడం మొదలుపెట్టారు వెబ్ ఆడియెన్స్. కారవాన్... ఉత్తమనటులతో పోటీపడగల మిథిల నటనాసామర్థ్యాన్ని చూపించింది. ఈ సినిమాలో దుల్ఖర్ సల్మాన్, ఇర్ఫాన్ ఖాన్‌లతో కలిసి యాక్ట్ చేసింది ఆమె. అమ్మమ్మతాత దగ్గరే పెరిగింది. సంప్రదాయ మరాఠీ కుటుంబం. మిథిల.. నటనారంగాన్ని ఎంచుకోవడం ఆమె తాతకు ఇష్టం లేదు. మనవరాలి పట్టుదల చూసి కాదనలేకపోయాడు. ఇప్పుడు ఆమె ప్రతి సినిమా, ప్రతి సిరీస్.. అంతెందుకు ఆమె చేసే ప్రతి కమర్షియల్ యాడ్‌నూ చూసి ముచ్చటపడ్తాడట. స్క్రీన్ మీద మనవరాలిని చూసుకునేందుకు స్మార్ట్ ఫోన్ తెప్పించుకున్నాడట ఆమె తాత. ‘మా ఫ్యామిలీయే నా స్ట్రెంగ్త్. నా బిగ్గెస్ట్ ఫ్యాన్ ఎవరో తెలుసా? మా తాత. నేను ఎవరికి పే..ద్ద ఫ్యాన్నో తెలుసా.. మా తాతకు!’ అంటుంది మిథిలా పాల్కర్. -
'పక్కింటి అమ్మాయిలా ఉండడానికి ఇష్టపడతా'
‘పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దుబిడ్డ ఉయ్యాలవాడ నరసింహుడా చరిత్ర పుటలు విస్మరించ వీలులేని వీరా’ అంటూ ‘సైరా’లో ఉత్తేజ పరిచింది తమన్నా భాటియా. గ్లామర్ పాత్రలే కాదు కళనే ఆయుధంగా వాడుకున్న ‘లక్ష్మి’లాంటి పాత్రలను కూడా ‘శబ్భాష్’ అనిపించేలా నటించగలనని మరోసారి నిరూపించిన తమన్నా ముచ్చట్లు... పర్సనల్ స్టైల్ నా మానసిక స్థితిని బట్టి నా పర్సనల్ డ్రెస్సింగ్ ఆధారపడి ఉంటుంది. పొరుగింటి అమ్మాయిలా సహజంగా ఉండడానికి ఇష్టపడినట్లే రాణిలా అట్టహాసంగా ఉండడానికీ అంతే ఇష్టపడతాను. ∙నా దృష్టిలో ఫ్యాషన్ అంటే గుడ్డిగా ట్రెండ్‌ను అనుసరించడం కాదు. అది పూర్తిగా మన అవగాహనకు సంబంధించినది. ∙ఫ్యాషన్ ప్రపంచం చుట్టూ చక్కర్లు కొట్టడానికి ఇష్టపడను. అయితే ఫ్యాషన్‌కు సంబంధించిన ఆర్టికల్స్‌ను చదువుతాను. పుట్టకతోనే ‘ఫ్యాషన్ సెన్స్’ ఎవరికీ రాదు. పరిశీలనతో అది మనలో వృద్ధి చెందుతుంది. ఫ్యాషన్ అంటే పడి చావను కాని ఏది చేసినా కొత్తగా కనిపించాలని అనుకుంటాను. ∙ఫ్యాషన్‌కు సంబంధించి గతంలో కంటే కూడా ఇప్పుడే ఎక్కువ ప్రయోగాలు చేస్తున్నాను. మామూలుగానైతే టీషర్ట్ – జీన్స్ ధరించడం అంటే ఇష్టం. గ్లామర్ గ్లామర్ కోసం సౌందర్యసాధనాల మీద అతిగా అధారపడను. తినే తిండిపై శ్రద్ధ పెడతాను. న్యూట్రిషనిస్ట్ సలహాలు తీసుకుంటాను. మెరిసే చర్మానికి కాస్మొటిక్స్ కంటే క్రమశిక్షణ ముఖ్యమని నమ్ముతాను. ఆయిల్ ఫుడ్‌కు దూరంగా ఉండటం, ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర, సానుకూల దృక్పథం ఉండడం... మొదలైనవి ఆ క్రమశిక్షణలో బాగం.. అలా కుదరదు సినిమా ఫీల్డ్‌లో కెరీర్‌ను ప్లాన్ చేసుకోవడం కుదరదు. ఇక్కడ ‘అస్థిరత’ ఎక్కువ. స్ట్రాటజీ ముఖ్యం. కొత్త ప్రదేశాలు, కొత్త భాష అంటే ఇష్టపడతాను. వాటిని ఎంజాయ్ చేస్తాను. అలా కాకుండా ‘అమ్మో’ అనుకుంటే కొత్తదనాన్ని ఆస్వాదించలేము. కొత్త ప్రదేశం, కొత్త భాషలు మన జ్ఞానాన్ని పెంచుతాయి. మరో కోణం మా ఫాదర్ ఎప్పటి నుంచో నగల వ్యాపారంలో ఉన్నారు. కాబట్టి నగలంటే చిన్నప్పటి నుంచే ప్యాషన్ ఉంది. ఈ కాలనికి సరిపడే, సౌకర్యంగా ఉండే నగలను డిజైన్ చేయడం అంటే ఇష్టం. ‘వసువం సర్వనం ఒన్న పడి చవంగ’ అనే తమిళ సినిమాలో నేను డిజైన్ చేసిన నగలను ఉపయోగించారు. మరొక విషయం ఏమిటంటే... ఖాళీ సమయంలో రచనలు కూడా చేస్తుంటాను. వంటలు చేయడం ఇష్టమే కాని చాలా సందర్భాల్లో ఉప్పు వేయడం మరిచిపోతుంటాను. పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ఓషో, పాల్ కోయిలో పుస్తకాలు ఎక్కువగా చదువుతుంటాను. ఆటలు అంటే ఇష్టం ఉండదు కాని యోగ, రన్నింగ్ చేస్తాను. ఒంటరిగా ఉండడం అంటే ఇష్టం ఉండదు. కంపెనీ ఉండాలి. కబుర్లూ ఉండాలి! -
నిను చూసిన ఆనందంలో..
‘అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెల్సా. ఇట్స్ ఏ క్రైం’ అంటూ ‘గ్యాంగ్‌లీడర్’లో ప్రియాంక మోహన్‌ను చూసి మెలికలు తిరిగిపోతూ ‘నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినది’ అని తీయగా పాడుకున్నాడు నాని. తొలి సినిమాతోనే ‘క్యూట్ గర్ల్’ ‘హోమ్లీ గర్ల్’గా పేరు తెచ్చుకున్న ప్రియాంక మోహన్ తాజాగా శర్వానంద్ సరసన ‘శ్రీకారం’లో నటిస్తోంది. ఆమె అంతరంగాలు.... నాటకం బెంగళూరులో చదువుకున్నాను. అమ్మ కన్నడిగ, నాన్న తమిళియన్. రెండు భాషలూ వచ్చు. హైదరాబాద్‌లో మా బంధువులు ఉంటారు. అప్పుడప్పుడూ వచ్చిపోవడం వల్ల కాస్తో కూస్తో తెలుగు కూడా వచ్చు. మా కుటుంబం, బం«ధువుల్లో సినిమా నేపథ్యం ఉన్న వారు లేరు. చదువుకునే రోజుల్లోనే నాటకాలు అంటే ఇష్టం. ఎన్నో నాటకాల్లో నటించాను. పేరెంట్స్ అభ్యంతర పెట్టేవారు కాదు. సంతోషం సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ ఆనుకోలేదు. సినిమా అవకాశాలు వచ్చినా పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ, ఆ తరువాత నా ఆలోచనల్లో మార్పు వచ్చింది, ‘సినిమాల్లో మాత్రం ఎందుకు నటించకూడదు’ అనుకున్నాను. నా ఫోటోలు చూసి డైరెక్టర్ విక్రమ్ కుమార్ పిలిపించారు. సెలక్ట్ అవుతానా? లేదా? అనేది వేరే విషయం. ఆయన నుంచి పిలుపు రావడమే గొప్పగా భావించాను. విక్రమ్ కుమార్ సినిమాలు నాకు ఎంతో నచ్చుతాయి. పీసీ శ్రీరామ్ ఆఫీసులో ఫోటోషూట్ జరిగింది. ఆయన పచ్చజెండా ఊపడంతో ‘గ్యాంగ్ లీడర్’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాను. ‘అచ్చం తెలుగు అమ్మాయిలాగే ఉన్నావు’ అని అంటుంటారు చాలామంది. ధైర్యం మొదటి రోజు షూటింగ్లో లక్ష్మి, శరణ్యలాంటి సీనియర్ నటీమణులను చూసి భయమేసింది. అంత పెద్ద నటీమణులను లైవ్‌గా చూడడంతో టెన్షన్ పడ్డాను. వీళ్లతో కలిసి నేను నటించగలనా? అనుకున్నాను. ఆ టెన్షన్‌తోనే...‘సర్, మీరు నన్ను ఎంపిక చేసుకోవడం కరెక్టేనా?’ అని విక్రమ్ కుమార్‌ని అడిగాను. ‘సరిౖయెన నిర్ణయమే తీసుకున్నాను. నువ్వు చక్కగా నటించగలవు!’ అని ధైర్యం చెప్పారు ఆయన. ఆ తరువాత ‘నేను చెప్పానుగా నువ్వు బాగా నటిస్తావని’ అంటూ మెచ్చుకున్నారు కూడా. ఈ సినిమా ద్వారా సీనియర్ నటుల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం దొరికింది. కెరీర్ మొదట్లో కనిపించే అంకితభావం, ఉత్సాహం ఇప్పటికీ వారిలో కనిపిస్తుంది. ఒకవిధంగా చెప్పాలంటే సెట్లో ప్రతిరోజూ ఒక కొత్త పాఠం నేర్చుకోవచ్చు. ఒక్క భాషకే పరిమితం కాకుండా రకరకాల భాషల్లో నటించాలని ఉంది. -
కాస్టింగ్ కౌచ్‌తో భయపడ్డాను..!
యశ్‌రాజ్ ఫిల్మ్ వారి ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’తో బాలీవుడ్‌కు పరిచయమైన వాణీ కపూర్ ‘ఆహా కళ్యాణం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. శ్రుతి సుబ్రమణ్యం పాత్రతో ఆకట్టుకుంది. ఆదిత్యచోప్రా భారీ చిత్రం ‘వార్’తో ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఈ సినిమాలో హృతిక్‌రోషన్, టైగర్ ష్రాఫ్‌లతో కలిసి నటించిన వాణి కపూర్ అంతరంగాలు... ఎంత ప్రేమంటే... ఢిల్లీలో పుట్టి పెరిగాను. భోజనప్రియురాలిని. సినిమాలు...కొత్త, పాత, హిట్టు, ఫట్టు అనే తేడా లేకుండా తెగ చూసేదాన్ని. మా ఫామ్‌హౌస్‌లో ఎన్నో జంతువులు ఉండేవి. కుక్కలు, కోతులు, గుర్రాలు, కుందేళ్లు, పిల్లులు..ఇలా ఎన్నో. మినీ జూ అని చెప్పుకోవచ్చు. కుక్కపిల్లలంటే ఎంత ప్రేమంటే..బురదలో పొర్లాడే వాటిని కూడా ఇంటికి తీసుకువచ్చి శుభ్రపరిచేదాన్ని. ఇంట్లో చాలా క్రమశిక్షణగా పెంచారు. స్వేచ్ఛగా ఎక్కడికైనా ఎగిరిపోవాలనిపించేది. టూరిజం స్టడీస్ కోసం మొదటిసారి ఢిల్లీలో హాస్టల్లో ఉన్నాను. నేను మోడలింగ్‌లోకి రావడం మా నాన్నకి ఎంతమాత్రం ఇష్టంలేదు. ఆర్మీ నేపథ్యం నుంచి వచ్చిన అమ్మ మాత్రం నన్ను ప్రోత్సహించేది. మా అక్కకు పద్దెనిమిది సంవత్సరాలకే పెళ్లయింది. నాకు స్వతంత్రభావాలు ఎక్కువ. మోడలింగ్ ఏజెన్సీలకు ఇంటర్వ్యూలకు వెళుతున్న సమయంలో లావుగా ఉండేదాన్ని. అయినప్పటికీ సెలెక్ట్ అయ్యాను. ఆ తరువాత మాత్రం రకరకాల వ్యాయమాలు చేసి బరువు తగ్గాను. కాస్టింగ్ కౌచ్ భయంతో మొదట్లో ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి భయపడ్డాను. గుర్తింపు ఉన్న మోడలింగ్ ఏజెన్సీ నుంచి రావడం వల్ల కావచ్చు...అదృష్టవశాత్తు నాకు అలాంటి సమస్యలు ఎదురుకాలేదు. ఇష్టపడే డైరెక్టర్ ఆదిత్య చోప్రాతో కలిసి పని చేయడం ఇష్టం. ఆయనలో మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. ఎంతో జ్ఞానం ఉంది. ఏ విషయాన్ని గురించి అడిగినా టక్కుమని చెప్పేస్తారు. ప్రొఫెషనల్‌గా ఉంటారు. స్పష్టమైన దార్శనికత ఉంది. సినిమా షూటింగ్ ముందు వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంటారు. టైమ్ విషయంలో ఆయన కచ్చితంగా ఉంటారు. సందేహాలు ఏమైనా ఉంటే షూట్‌కు ముందే అడగాలి. కెమెరా ముందుకు వెళ్లాక మాత్రం...బాగా నటించాలి. అందుకే బాగా ప్రిపేరై కెమెరా ముందుకు వెళ్లేవాళ్లం. ఇష్టమైన ప్రదేశం ప్యారిస్ అంటే చాలా ఇష్టం. ఈ సిటీ అందాలను ఆస్వాదించాలంటే కారు ప్రయాణం చెయ్యనేకూడదు. నడవాలి. అక్కడి వాతావరణం ఆహ్లాదభరితంగా ఉంటుంది. అర్కిటెక్చర్ అద్భుతం. ‘శుద్ధ్దేశీ’ సినిమాలో ప్యారిస్‌లో పుట్టి, పెరిగిన అమ్మాయి పాత్ర చేశాను. షూటింగ్ చేయడానికి ముందు ఎన్నో ఫ్రెంచ్ సినిమాలు చూశాను. ప్యారిస్‌కు వెళ్లి ఫ్రెంచ్ ప్రజలతో చాలా సమయాన్ని గడిపాను. వారి హావభావాలను క్షుణ్ణంగా పరిశీలించాను. -
పూల అందం నువ్వే నువ్వే!
‘అఖిల్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన సాయేషా సైగల్ బాలీవుడ్ నటదిగ్గజం దిలీప్‌కుమార్ ముద్దుల మనవరాలు. అజయ్‌దేవగణ్‌తో కలిసి నటించిన ‘శివాయ్’ ఆమెకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. తాజాగా ‘బందోబస్త్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సాయేషా అంతరంగాలు... నేర్చుకుంటూనే.. స్కూల్ నుంచి రావడం, హోమ్‌వర్క్ చేసుకోవడం, తరువాత డ్యాన్స్ క్లాసో, ఆర్ట్ క్లాసో... ఏదో క్లాస్‌కు వెళుతుండేదాన్ని. ఇలా నేర్చుకోవడం అనేది తొమ్మిదో ఏట నుంచే మొదలైంది. అప్పుడే కాదు ఇప్పుడూ ఉంది. భవిష్యత్‌లో కూడా ఉండాలనుకుంటున్నాను. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రొఫెసర్ అజయ్‌జోషి మా ఇంటికి తరచుగా వస్తుండేవారు. ఆయన నిర్వహించే యాక్టింగ్ వర్క్‌షాప్‌లలో చురుగ్గా పాల్గొనేదాన్ని. మనం ఎక్స్‌ప్రెసివ్ అయితే ‘నటన’ గురించి ప్రత్యేకంగా కష్టపడనక్కర్లేదు. రెండు కళ్లతో కూడా బోలెడు భావాలు చెప్పవచ్చు. ఓన్లీ మెరిట్ మాది సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం అయినా ఇంట్లో సినిమాల గురించి మాట్లాడుకునేది చాలా తక్కువ. మా అందరికీ ఇష్టమైనది ‘ట్రావెలింగ్’. అందరం కలిసి మాట్లాడుకునే ఇష్టమైన టాపిక్ కూడా అదే. ‘శివాయ్’లో అవకాశం నా ప్రతిభ వల్లే తప్ప కుటుంబ నేపథ్యం వల్ల రాలేదు. ‘శివాయ్’లో అజయ్దేవ్గణ్లాంటి నటుడితో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. పదేపదే రిహార్సల్స్ చేసి కాకుండా చాలా స్పాంటేనియస్‌గా నటిస్తారు ఆయన. డైలాగులు చెబుతున్నప్పుడు పక్కవ్యక్తితో సంభాషిస్తున్నట్లుగా ఉంటుంది తప్ప ‘నటన’ అనిపించేలా ఉండదు. చాలా సహజంగా నటిస్తారు. ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఇదే. రామ్ లఖన్లో రాధ పాత సినిమాల రీమేక్‌లో నటిస్తే, సంబంధిత పాత్రకు న్యాయం చేస్తానో లేదో తెలియదుగానీ ‘రామ్ లఖన్’ సినిమాలో మాధురి దీక్షిత్ పోషించిన ‘రాధ’ పాత్ర చేయాలని ఉంది. హుషారైన డ్యాన్స్‌లు చేయడానికి మంచి అవకాశం ఉంది. నేను ట్రైన్డ్ డ్యాన్సర్‌ని. సౌత్ ఆఫ్రికా, లండన్, బ్రెజిల్‌లలో లాటిన్ అమెరికన్ డ్యాన్స్ నేర్చుకున్నాను. ముంబైలో కథక్, ఒడిస్సీ నేర్చుకున్నాను. పాఠాలు ఫిల్మ్ కెమెరాలను సెట్ మీదే తొలిసారిగా చూశాను. ‘శివాయ్’కి ఆరు కెమెరాలు సెట్ చేశారు. ప్రతి యాంగిల్‌ను ఆ కెమెరాలు పట్టుకుంటాయి. ఇదొక బిగ్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌గా పనిచేసింది నాకు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ సాంకేతిక విషయాలలో ఉన్నతంగా ఉంది. ‘అఖిల్’ చేస్తున్న సమయంలో లేటెస్ట్ ఫిల్మ్ టెక్నాలజీ గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. ప్రతి అనుభవం నుంచి ప్రతి వ్యక్తి నుంచి ఏదో ఒక పాఠం నేర్చుకోవచ్చు. -
సిటీతో ప్రేమలో పడిపోయాను
‘కంచె’ సినిమాలో హీరోగారు ‘సీతగారూ! మీరు బాగా మాట్లాడతారు’ అని ఊరకే ప్రశంసిస్తే... మెరిసిన సిగ్గు! ‘ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరితో..’ అని పాడుకుంటే.. కన్నులతో చెప్పిన జాడ! ‘మన ఊరి విశేషాలు తెలుసా సీతగారు... వడగండ్ల వాన పడిందట’ అని బ్రేకింగ్ న్యూస్ చెబితే... అందంగా బెదిరిన ఆ కళ్లు! ప్రగ్యా జైస్వాల్. మధ్యప్రదేశ్‌లోని జబల్పూరులో పుట్టి పెరిగిన ప్రగ్యా పుణే లా స్కూలులో చదువుకుంది. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు సక్సెస్ఫుల్ మోడల్‌గా రాణించింది. ‘మిర్చీలాంటి కుర్రాడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రగ్యా ‘కంచె’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘ఓం నమో వెంకటేశాయ’, ‘గుంటూరోడు’, ‘నక్షత్రం’, ‘జయ జానకీ నాయక’ ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. ప్రగ్యా చెప్పిన ముచ్చట్లు కొన్ని... మోడలింగ్‌తో... సినిమాల్లోకి రాక ముందు మోడలింగ్ చేశాను. ‘డేగ’(తమిళ్–తెలుగు) నా మొదటి సినిమా. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్. మొదటి సినిమా కాబట్టి చాలా గారాబంగా చూసుకునేవాళ్లు. తమిళం, తెలుగు రాకపోయినా చిరాకు పడకుండా చాలా ఓపిగ్గా డైలాగులు, సీన్ గురించి చెప్పేవాళ్లు. బిర్యానీ ప్లస్... రెండో సినిమాకి వచ్చే సరికి నటన గురించి అవగాహన వచ్చింది. బాడీలాంగ్వేజ్, డైలాగుల గురించి కాస్త ఎక్కువగా తెలిసింది. అందుకే అంటారేమో... అనుభవం అన్నీ నేర్పిస్తుందని! నా రెండో సినిమా ‘టిటూ ఎంబీఏ’ (హిందీ) మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. స్వీట్లవ్ స్టోరీ. తెలుగు సినిమా ‘కంచె’ షూట్ కోసం హైదరాబాద్‌కు వచ్చాను. అప్పుడే ఈ సిటీతో లవ్‌లో పడిపోయాను. ఇక్కడి బిర్యానీతో పాటు లైఫ్‌స్టైల్ అంటే కూడా చాలా ఇష్టం. హైదరాబాద్‌లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది. టైమ్ మెషిన్‌లోకి... ‘కంచె’ సినిమాలో 1930 కాలం అమ్మాయి పాత్ర వేశాను. టైమ్ మెషిన్లో అక్కడికి వెళ్లినట్లు అనిపించింది. ఈ ప్రాజెక్ట్‌లో ఎంత మమేకమయ్యానంటే సినిమా షూట్ పూర్తయిన తరువాత కూడా మళ్లీ సాధారణ జీవితంలోకి రావడానికి కొంత టైమ్ పట్టింది. నాకు ప్రయాణాలు అంటే బోలెడు ఇష్టం. కొత్త ప్రదేశాలు కొత్త విషయాలను నేర్పుతాయి. మనకు తెలియకుండానే ఎడ్యుకేట్ అవుతాము. ట్రావెలింగ్‌తో పాటు డ్యాన్స్ చేయడమన్నా, సంగీతం వినడమన్నా ఇష్టం. -
పాడుతా తీయగా అంటున్న నటి
బాలీవుడ్లో ‘జన్నత్’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది సోనాల్ చౌహాన్ ‘రెయిన్ బో’ ‘పండగ చేస్కో’ ‘షేర్’ ‘లెజెండ్’ ‘డిక్టేటర్’ (ఇందు)... తెలుగు సినిమాల్లోనూ నటించింది. బాలకృష్ణతో ముచ్చటగా మూడోసారి నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘పాట’లో కూడా తన ప్రతిభ చాటుకుంటున్న సోనాల్ గురించి కొన్ని ముచ్చట్లు... తన మాటల్లోనే.. రెస్టారెంట్లో... ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో తెలియనట్లే... ఏ రెస్టారెంట్లో ఏ అవకాశం ఉందో కూడా తెలియదు. సినిమాల్లోకి రావడానికి ముందు నేను మోడలింగ్ చేసేదాన్ని. 2005లో ‘మిస్ వరల్డ్ టూరిజం’ టైటిల్ గెలుచుకున్నాను. మోడలింగ్ చేస్తున్న రోజుల్లో ఒకరోజు ముంబైలోని ఒక రెస్టారెంట్‌కు వెళ్లాను. కునాల్ దేశ్‌ముఖ్ నన్ను చూసి తన సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆయనే ‘జన్నత్’ సినిమా డైరెక్టర్. ఆ సినిమాలో నేను చేసిన ‘జోయా మాథుర్’ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. పాడుతా తీయగా! సంగీతం అంటే చెప్పలేనంత ఇష్టం. పాడుతున్నప్పుడు ఏదో శక్తి కొత్తగా చేరినట్లు అనిపిస్తుంది. ఒత్తిడిని జయించడానికి సంగీతానికి మించిన ఆయుధం లేదు. ‘త్రీజీ’ సినిమా సెట్స్‌లో ఏదో డమ్మీ పాట పాడుతున్నప్పుడు డైరెక్టర్ విన్నారు. ఆయన నా గురించి మ్యూజిక్ డైరెక్టర్ మిథున్‌కు చెప్పారు. ‘‘నువ్వు ఎలా పాడినా సరే ఒకే’’ అని ఆయన ఆఫర్ ఇచ్చారు. అలా ‘త్రీజీ’ సినిమా కోసం ‘కైసే బతాహూ’ పాట పాడాను. నా అభిమాన గాయకుడు కేకేతో కలిసి పాట పాడడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు సంగీతాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నాను. సంగీతంలో శిక్షణ కూడా తీసుకుంటున్నాను. అక్కడ నేను సోనాల్ కాదు... కెమెరా ముందు నేను ఏ పాత్ర అయితే పోషిస్తున్నానో అది మాత్రమే... సోనాల్ మాత్రం కాదు. పాత్రలో ఎలా పరకాయప్రవేశం చేయాలి అనేదాని గురించి రకరకాలుగా ఆలోచిస్తాను. పాత్ర డిమాండ్ మేరకు బికినీ కూడా ధరిస్తాను. పేరెంట్స్ బాధ పడనంత వరకు నేను గాసిప్స్‌ను పెద్దగా పట్టించుకోను. గ్లామర్ఫీల్డ్లో ఇవి సహజమే! అయితే ఈ ఫీల్డ్ గురించి వాళ్లకు అంతగా అవగాహన లేదు కాబట్టి ఫీలయ్యే అవకాశం ఉంది. నా ఇష్టం తీరిక దొరికితే చాలు సినిమా చూస్తుంటాను. ‘బిఫోర్ సన్‌రైజ్’, ‘ఎటర్నల్ సన్‌షైన్ ఆఫ్ ది స్పాట్‌లెస్ మైండ్’ సినిమాలు మళ్లీ మళ్లీ చూశాను. తెలుపు రంగు దుస్తులు నాకు బాగా నప్పుతాయి. తెలుపు దుస్తులు ధరించడానికి ఎక్కువగా ఇష్టపడతాను. మనసు ప్రశాంతంగా ఉంటేనే చేసే పనిలో చురుకుగా ఉండగలుగుతాం. అందుకు ఫిట్నెస్ కూడా కావాలి. నా దృష్టిలో ఫిట్నెస్ మంత్ర అంటే...‘ఈట్ ఇట్ ఆల్ బట్ బర్న్ ఇట్ ఆల్’. పరఫెక్ట్ డే అంటే.. ఈట్. స్లీప్. నెట్‌ఫ్లిక్స్ అండ్ రిపీట్! -
విరాజ్పేట్ లిల్లీ!
‘కిరాక్ పార్టీ’ (కన్నడ) సినిమాతో తెరంగేట్రం చేసిన రష్మిక మందన ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ‘గీతాగోవిందం’, ‘దేవదాస్’ సినిమాలతో మరింత చేరువయ్యింది. ‘డియర్ కామ్రేడ్’లో లిల్లీ పాత్రతో అద్భుతమైన నటనను ప్రదర్శించిన రష్మిక తన గురించి చెప్పిన కొన్ని ముచ్చట్లు... కష్టం–ఇష్టం నా స్వస్థలం కొడగు జిల్లా(కర్ణాటక)లోని విరాజ్పేట్. జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ చేశాను. నా మదిలో ఎప్పటి నుంచో నటనకు సంబంధించి ఆసక్తి ఉంది. అందుకే నా కలలను నిజం చేసుకోవడానికి తొలిమెట్టుగా మోడలింగ్ రూట్‌ను ఎంచుకున్నాను. బ్యాక్‌గ్రౌండ్, సరిౖయెన కాంటాక్ట్‌లు లేకుండా సినిమా ఫీల్డ్‌లోకి ప్రవేశించడం ఎంత కష్టమో నాకు తెలియనిది కాదు. అలా అని ఆగిపోలేదు. ఏదో ఒక రోజు వెండితెరపై కనిపిస్తానన్న గట్టి నమ్మకం ఉండేది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నమ్మకం కోల్పోలేదు. మోడలింగ్ ద్వారా కెమెరాను ఎలా ఫేస్ చేయాలో నేర్చుకోగలిగాను. చిరునవ్వుతో... వైవిధ్యమైన సాంస్కృతిక వాతావరణం నుంచి వచ్చిన నాకు మొదట బెంగళూరు, ఇక్కడి వాతావరణం, లైఫ్‌స్టైల్ కొత్తకొత్తగా అనిపించేవి. అయితే త్వరలోనే ఈ వాతావరణానికి అలవాటు పడిపోయాను. ‘మనం ఏంటి?’ అనేదానిపైనే మన విజయం ఆధారపడి ఉంటుంది. విజయానికి ప్రతిభ ఎంత ముఖ్యమో ఆత్మవిశ్వాసం కూడా అంతే ముఖ్యం. ‘‘నా వల్ల కాదేమో’’ అనుకుంటే అది ఎప్పటికీ కాదు. ‘‘యస్... సాధించగలను’’ అనుకుంటే ఆ నమ్మకం ఎప్పుడూ వృథా పోదు. చిన్న చిన్న విషయాలకే చలించను. ధైర్యం కోల్పోను. నా పెదాలపై ఎప్పుడూ చిరునవ్వు ఉండాల్సిందే. అది నా ఆత్మవిశ్వాసానికి సంకేతం. నాకు నవ్వడం ఎంత ఇష్టమో నా చుట్టుపక్కల వాళ్లను నవ్వించడం కూడా అంతే ఇష్టం. చలో చలో... కేవలం రంగుల కలలు కని సినిమాల్లోకి రాలేదు. ఈ వృత్తిలో ఉండే సాధకబాధకాల గురించి నాకు తెలుసు. అయితే ప్రతి వృత్తిలో ఉన్నట్లే సినిమారంగంలో కూడా ఒడిదొడుకులు, ఎగుడుదిగుళ్లు ఉంటాయనేది కూడా బాగా తెలుసు. నా మనసులో కోరిక మొదట పేరేంట్స్‌కు చెప్పినప్పుడు భయపడిపోయారు. అయితే నా మొదటి సినిమా ‘కిరాక్ పార్టీ’ టీమ్‌ను కలిసిన తరువాత వారి అభిప్రాయంలో మార్పు వచ్చింది. ఆ సినిమాలో నటించడం మంచి అవకాశం అనే విషయం అర్థమైంది. ఇక భాష విషయానికి వస్తే– తమిళం అర్థమవుతుంది. మలయాళం చాలా కొంచెం అర్థమవుతుంది. తెలుగు మాత్రం ఒక్క ముక్క కూడా రాదు. ‘ఛలో’ సినిమా పుణ్యమా అని తెలుగు తెలిసింది. సెట్లోని వాతావరణమే తెలుగు నేర్పించే గురువు అయింది. తాజాగా ‘డియర్ కామ్రేడ్’లో నా నటనకు వచ్చిన ప్రశంసలు సంతోషాన్ని ఇచ్చాయి. ఈ సినిమాలో స్టేట్ లెవెల్ క్రికెటర్ ‘లిల్లీ’ పాత్ర కోసం కొన్ని నెలల పాటు క్రికెట్ పాఠాలు నేర్చుకున్నాను. -
సింగిల్ టేక్‌లో చేయలేను..!
బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ‘హౌస్‌ఫుల్’ ‘రేస్’ ‘కిక్’... సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మన తెలుగు సినిమాలో ఎప్పుడు నటిస్తుందో తెలియదుగానీ... ప్రభాస్ ‘సాహో’లో ఐటమ్‌సాంగ్ చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలంక సుందరి జాక్వెలైన్ మనసులో మాటలు సంక్షిప్తంగా... నటనపై ఆసక్తి : ఏడేళ్ల వయసులో. నటి కాకపోయి ఉంటే : జంతువులంటే ఇష్టం. వాటి గురించి తెలుసుకోవడం అంటే ఇష్టం. సినిమాల్లోకి రాకుండా ఉండి ఉంటే... వైల్డ్‌లైఫ్ డాక్యుమెంటేరియన్ అయ్యేదాన్ని. ఇండస్ట్రీలో నచ్చే వ్యక్తులు : చాలా మంది ఉన్నారు. మచ్చుకు కొందరు... సాజిత్ నడియాడ్వాలా... ఈయనతో ఏడు సినిమాలు చేశాను. అఫ్కోర్స్ సల్మాన్‌ఖాన్! నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన సుజయ్ ఘోష్, నా బెస్ట్ ఫ్రెండ్ సోనమ్ కపూర్, నటనలో ఇన్స్పిరేషన్ ప్రియాంక చోప్రా. సినిమాల్లో ఇష్టమైన జానర్ : కమర్షియల్. నేర్చుకున్నది: ‘అయ్యో తప్పులు చేస్తున్నాను’ అని టెన్షన్ పడితే మరిన్ని తప్పులు చేస్తాం. టెన్షన్ పడుతున్న టైమ్‌లో సగం టైమ్ ‘ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి?’ అనే దాని గురించి ఆలోచిస్తే తప్పులకు దూరంగా ఉండవచ్చు. సినిమా కోసం నేర్చుకున్నది : పోల్ డ్యాన్స్. నేర్చుకునేటప్పుడుగాని తెలియలేదు అదెంత కష్టమో! కష్టం సంగతి ఎలా ఉన్నప్పటికి పోల్ డ్యాన్స్‌ను ‘ఫెంటాస్టిక్ వర్కవుట్’ అంటాను. బాడీని ఫిట్‌గా ఉంచుతుంది. నవ్వు తెప్పించే జ్ఞాపకం : ఒక సీన్ చేయడానికి టేక్‌ల మీద టేక్‌లు తీసుకుంటున్నాను. ‘‘ఈసారి అలా జరగడానికి వీల్లేదు. ఓకే అయిపోవాలి’’ అంటున్నాడు డైరెక్టర్. ‘‘మహానటి మార్లిన్ మన్రో ఒక సీన్ కోసం 53 టేక్‌లు తీసుకుందట. నేనేంత!’’ అన్నాను. ‘‘కానీ నువ్వు మార్లిన్ మన్రో కాదు కదా’’ అన్నాడు డైరెక్టర్. అంతే... అక్కడ ఉన్నవాళ్లంతా ఒకటే నవ్వడం! సల్మాన్ గురించి : డైలాగులు పలకడంలో ఏమైనా ఇబ్బంది పడితే... ఎలా పలకాలో కూల్‌గా చెబుతారు. సెట్లో ఎంత సరదాగా ఉంటారో! పని విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్! సల్మాన్‌లో బాగా నచ్చే విషయం ఏమిటంటే ‘క్రెడిట్’ను ఎప్పుడూ తన ఖాతాలో వేసుకోడు. ఎవరైతే కష్టపడతారో వాళ్ల ఖాతాలో వేస్తాడు! సలహా: సల్మాన్‌ఖాన్‌ను సలహాలు అడగడానికి ఇష్టపడతాను. ఏదో సలహా ఇవ్వాలి కాబట్టి ఇచ్చాను అని కాకుండా ఆయన సలహాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ప్రతి ఒక్కరికీ తనవంతుగా సహాయపడాలనేది ఆయన విధానం. అదృష్టం అంటే? : రాత్రి బెడ్ మీద వాలగానే కంటినిండా నిద్ర పట్టడం. హాట్ హాట్‌గా: పొద్దున వర్కవుట్స్ తరువాత వేడివేడిగా బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ తీసుకుంటాను. పర్సనల్ స్టైల్: కంఫర్ట్‌గా ఉండే స్టైల్‌ను ఇష్టపడతాను. నచ్చేవి: ప్రయాణాలు. ప్రయాణాల వల్ల మనం రీఛార్జ్ అవుతాం. కొత్త వ్యక్తులను, కొత్త ప్రదేశాలను చూడడం మాత్రమే కాదు... కొత్తగా ఆలోచించగలుగుతాం. ఇష్టం: పుస్తక పఠనం. చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ‘ఒక యోగి ఆత్మకథ’ ఇష్టమైన పుస్తకం. పాల్ కోయిలో పుస్తకాలు ఎక్కువగా చదువుతాను. -
‘అక్షరా’లా అది నా ఆరో ప్రాణం..
‘షమితాబ్’ సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేసిన అక్షర హాసన్... తొలి సినిమాతోనే అక్షరాలా అందమైన నటి అనిపించుకుంది. అక్షర పాండేగా ఆ సినిమాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఎడా పెడా కాకుండా ఏరి కోరి సినిమాలు చేస్తున్న అక్షర, తాజాగా ‘మిస్టర్ కేకే’తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అక్షర హాసన్ ముచ్చట్లు ఆమె మాటల్లోనే... అలా అయితేనే... నేను చెన్నైలోనే పుట్టి పెరిగాను. నా పదో యేట అమ్మా, నాన్నలు విడిపోయారు. 2002లో అమ్మతో పాటు ముంబై వెళ్లిపోయాను. ఇక్కడ రెండు సంవత్సరాలు చదివిన తరువాత బెంగళూరు బోర్డింగ్ స్కూలో చేర్పించారు. అయితే అక్కడ చదువు సజావుగా సాగలేదు. చదవాలి కాబట్టి చదవాలి అని నేను అనుకోను. చదువుకు వందశాతం న్యాయం చేయగలిగినప్పుడే చదువుకోవాలి. అంతేగానీ, వాళ్లు వీళ్లు ఏమనుకుంటారో అని చదువుకోకూడదు అనేది నా అభిప్రాయం. ఆరోప్రాణం డ్యాన్స్ అంటే నాకు ఆరోప్రాణం. ఎనిమిదో యేట డ్యాన్స్ నేర్చుకోవడం మొదలైంది. సల్సా, పాప్, భరతనాట్యం, కూచిపూడి...ఇలా రకరకాల డ్యాన్సులు వచ్చు. ఒకసారి కాలికి గాయం వల్ల సంవత్సరం పాటు డ్యాన్స్‌కు దూరంగా ఉండాల్సివచ్చింది. ఊపిరి ఆగినంత పనైంది. ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్లాను. గాయం నుంచి బయటపడిన తరువాత కమర్శియల్ యాడ్స్, స్టేజీపై నృత్యరూపకాలు చేశాను. ఆ సమయంలోనే నటించాలనే కోరిక మొదలైంది. అలా మొదలైంది... రాహుల్ ఢోలకియా ‘సొసైటీ’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. నా చిన్నప్పుడు అప్పుడప్పుడు ఆయన షూటింగ్‌లకు వెళ్లేదాన్ని. వ్యాన్‌లో కూర్చొని హోంవర్క్ చేసుకునేదాన్ని. ఒకసారి ఒక యాడ్ చేసి వస్తున్నప్పుడు స్టూడియో దగ్గర డైరెక్టర్ బాల్కి కనిపిస్తే పలకరించాను. ఆ సమయంలోనే ‘షమితాబ్’ సినిమా గురించి చెప్పారు. అలా ఆ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆయనతో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. రాహుల్, బాల్కీలను గురువులుగా భావిస్తాను. ఆమె మహారాణి ‘ఈ ప్రపంచంలో నువ్వు అత్యంత ప్రేమించే వ్యక్తి ఎవరు?’ అని అడిగితే మొదటి స్థానం నాకు ఇచ్చుకుంటాను, రెండో స్థానంలో అమ్మ ఉంటుంది. నా జీవితానికి అమ్మ మహారాణి. ఆమె ఎప్పుడూ నాకు ఆదర్శమే. అమ్మ ఆలోచన తీరు, నాది ఒకే తీరుగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు ఆందోళనపడదు, ఒత్తిడిని దరి చేరనివ్వదు. స్పోర్టివ్‌గా ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే...అమ్మది స్వీట్హార్ట్. అమ్మ శక్తిమంతమైన స్త్రీ. ఆమె నుంచి నాకు కావలసిన శక్తిని తీసుకుంటాను. -
4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా
గ్లామర్, డీగ్లామర్ అనే తేడా లేకుండా నటనలో బహుముఖి అనిపించుకుంటోంది ఇషా తల్వార్. బాలీవుడ్ నిర్మాత వినోద్ తల్వార్ కూతురైన ఇషా ముంబైలో పుట్టి పెరిగింది. ఎకనామిక్స్‌లో పట్టా అందుకుంది. ఐ లవ్ మీ(మలయాళం), థిల్లు ముల్లు–2 (తమిళం), గుండెజారి గల్లంతయిందే (తెలుగు)లాంటి హిట్ సినిమాలలో నటించిన ఇషా తాజాగా బాలీవుడ్ సినిమా ‘ఆర్టికల్ 15’తో ‘అదితి’ పాత్రతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇషా గురించి మినీ సంగతులు... గ్లామర్: దుస్తుల్లో కాదు వ్యక్తిత్వంలో ప్రతిఫలించేది. దృష్టి: ఎప్పుడూ వాణిజ్యదృష్టి మాత్రమే కాదు... అందుకు భిన్నమైన దృష్టి కూడా ఉండాలి. అప్పుడే మంచి చిత్రాలు చేయగలుగుతాము. సినిమాలకు ముందు: కమర్షియల్ యాడ్స్‌లో నటించాను. డ్యాన్స్: చాలా ఇష్టం. టెరెన్స్ డ్యాన్స్ స్కూల్లో శిక్షణ తీసుకున్నాను. బాలే, జాజ్, సల్సా, హిప్–హాప్లలో ప్రవేశం ఉంది. బోర్: ఒకేరకమైన పాత్రలు మళ్లీ మళ్లీ చేయడం. నా మొదటి సినిమాలో డీగ్లామర్ రోల్ చేశాను. రెండో సినిమాలో కూడా అలాగే చేసి ఉంటే వరుస పెట్టి అలాంటి పాత్రలే వచ్చేవి. అదృష్టవశాత్తు రెండో సినిమాలో అలాంటి పాత్ర చేయలేదు. నచ్చనిది: ‘సక్సెస్ఫుల్ యాక్ట్రెస్’ అని పిలిపించుకోవాలనుకోవడం. నమ్మేది: రాశి కంటే వాసి ముఖ్యం. ప్రతిభ నిరూపించుకోవడానికి ఎడాపెడా సినిమాలు చేయనక్కర్లేదు. కలకాలం గుర్తుండేలా కొన్ని సినిమాలు చేసినా చాలు. ప్రేక్షకులు: గౌరవనీయ వ్యక్తులు. వాళ్లు డబ్బు పెట్టి సినిమాకు వస్తేనే కదా సినిమాలు బతికేవి! ఒకరు ‘జీరో’ అయినా ‘హీరో’ అయినా అది వారి మీదే ఆధారపడి ఉంటుంది. సంతోషం: మొదటి సినిమా హిట్ కావడం. (తట్టతిన్ మరయతు–మలయాళం) ఆ తరువాత: ‘ఆ తరువాత ఏంటి?’ అనేది అవసరమేగానీ అదే ప్రధానమైపోతే... చేస్తున్న పనికి న్యాయం చేయలేం. 4జీ: ఒక సినిమాను ఎంపిక చేసుకునేటప్పుడు 4జీ గురించి ఆలోచిస్తాను. 1. గుడ్ డైరెక్టర్, 2. గుడ్ స్క్రిప్ట్, 3. గుడ్ ప్రొడక్షన్ హౌస్, 4. గుడ్ టీం. నచ్చేవి: నాలోని నటనను మెరుగు పరిచే పాత్రలు. డ్రీమ్‌రోల్: ‘డ్రీమ్‌రోల్’ అని ప్రత్యేకంగా ఏదీ లేదు. చేస్తున్న ప్రతిరోల్ను డ్రీమ్రోల్గానే భావిస్తాను. ఇష్టమైన ప్రదేశం: పొలాచ్చి ఇబ్బంది: చేసిన సినిమానే రీమేక్ రూపంలో మళ్లీ చేయడం. అయితే కొన్ని సందర్భాలలో తప్పదు! తేలిక–కష్టం: మాయ చేసి బతకడం తేలిక. నిజాయతీగా బతకడం చాలా కష్టం. -
నీ చూపే చల్లని చిరుగాలై...
‘బీరువా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సురభి... ఎక్స్‌ప్రెస్‌రాజా, ఎటాక్, జెంటిల్మెన్... సినిమాలతో సుపరిచితమయ్యారు. తాజాగా ‘ఓటర్’ సినిమాతో ఆకట్టుకున్న సురభి ముచ్చట్లు... నా బలం: పేరెంట్స్ ఇష్టమైన నటి: మాధురీ దీక్షిత్ కష్టమైన పాత్ర: మొదటి సినిమాలో చేసింది. నటి కాకపోయి ఉంటే: కచ్చితంగా నటినే! మరో సందేహమే లేదు!! సమయం దొరికితే: మ్యూజిక్ వింటాను. నెట్‌ఫ్లిక్స్ చూస్తాను. సౌత్‌లో నచ్చిన నటి: అనుష్కా శెట్టి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్: సహనం. నాలో ఓపిక, సహనంలాంటివి చాలా తక్కువ. సినిమాల పుణ్యమా అనే సహనాన్ని అలవర్చుకున్నాను. నచ్చిన డైరెక్టర్లు: ఈ జాబితా చాలా పెద్దది గురూ! ఫ్యాషన్ సెన్స్: సింపుల్‌గా ఉండాలి. బాడీకి సూట్ కావాలి. అతిగా ఉండకూడదు. నచ్చిన ప్రదేశం: గ్రీస్ నచ్చిన గాయని: లతా మంగేష్కర్ నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్: ఏఆర్ రెహమాన్ హైదరాబాదీస్: 1. సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తారు. 2. భోజనప్రియులు. 3. మంచి మనసున్న మనుషులు బాగా ఆడే ఆట: క్యారమ్స్ బాగా చూసే ఆట: రేసింగ్ గేమ్స్ మ్యూజిక్‌లో ఇష్టపడే జానర్: జాస్ నచ్చే పేరు: లిపిక ఫస్ట్ క్రష్: హృతిక్ రోషన్ నచ్చే పానీయం: స్ట్రాబెర్రీ బలహీనత: నా స్వీట్నెస్? సూపర్ పవర్ ఉంటే?: ఎదుటి వాళ్ల మనసులను చదువుతాను. ఫెవరైట్ స్పైస్: గ్రీన్‌చిల్లీ ఫెవరెట్ టీవీ షో: కపిల్‌శర్మ షో బోధించడానికి ఇష్టపడే సబ్జెక్ట్: సైకాలజీ ఊత పదాలు: సా...ర్, అచ్ఛా చేయాలనుకునే రోల్స్: ఛాలెంజింగ్ రోల్స్ చేయాలని ఉంది. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్: ఇది వ్యక్తులను బట్టి మారుతుంది. రెండిట్లో ఏది ఉత్తమం అనేదాన్ని పక్కన పెడితే...పెళ్లికి ముందు భాగస్వామి గురించి తెలుసుకోవడం తప్పనిసరి. ఎలాంటి భర్త కావాలి: జెంటిల్మెన్గా ఉండాలి. ప్రతి ఒక్కరినీ గౌరవించాలి. తాను చేసే పనిని గౌరవించాలి. ‘ఆడవాళ్లు వంటింటికే పరిమితం’ అనే భావం ఉండకూడదు. ఇష్టమైనది: ప్రకృతి ఆరాధన. -
మనోగళం: ఎప్పుడూ అంత ఆనందం కలగలేదు!
ఇతరుల్లో మీకు నచ్చేది/నచ్చనిది? నచ్చేది ప్లీజింగ్ పర్సనాలిటీ. నచ్చనిది అహంభావం. మీలో మీకు నచ్చేది? నాలోని ప్రేమతత్వం, మానవత్వం. నేను ప్రపంచాన్ని ప్రేమిస్తాను... మనస్ఫూర్తిగా! మీలో మీకు నచ్చనిది? కాస్త త్వరగా విసిగిపోతాను. కష్టపడి ఓ యాభై శాతం తగ్గించుకున్నాను. పూర్తిగా మారడానికి ట్రై చేస్తున్నాను. మీ ఊతపదం? నచ్చినవాళ్లందరినీ ‘బంగారం’ అంటుంటాను. మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి/ఎందుకు? మా అమ్మ. నిజమైన ఆత్మానందం ఎదుటివారికి సాయపడటంలోనే ఉంటుందని ఆవిడే చెప్పింది నాకు. ఎందుకిలా చేశానా అని మీరు బాధపడేది ఏదైనా ఉందా? లేదు. నేను వేసే ప్రతి అడుగూ భగవత్ప్రేరణతోనే పడుతుందని నమ్ముతాను. కాబట్టి చేసిన దానికి ఎప్పుడూ చింతించను. అత్యంత సంతోషపడిన సందర్భం? 2000వ సంవత్సరం, జూలై 30. నా కూతురు సంస్కృతి పుట్టిన రోజు. తనని నేను తొలిసారి చూసిన రోజు. నా జీవితంలో ఆ రోజు కలిగినంత ఆనందం మరెప్పుడూ కలగలేదు. అత్యంత బాధ కలిగించిన సందర్భం? సత్య సాయిబాబా మరణం. ఆ రోజు నేను పడిన బాధ వర్ణనాతీతం. ఆకలి విలువ తెలిసిన క్షణం? భారతీయ విద్యాభవన్‌లో పని చేస్తున్నప్పుడు ఓసారి (1986) నా ఫుడ్ కూపన్స్ అయిపోయాయి. మళ్లీ తీసుకోవాలంటే జీతం రావాలి. అంతవరకూ భోజనం పెట్టమని క్యాంటీన్ వాడిని అడగడానికి మనసు రాలేదు. దాంతో రెండు రోజుల పాటు నీళ్లు మాత్రమే తాగాను. అప్పుడు తెలిసింది ఆకలి బాధ ఎలా ఉంటుందో! ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి ఉందా? ఉంటే ఎవరికి? ఎవరినైనా బాధపెట్టానని గ్రహిస్తే వెంటనే క్షమాపణ చెప్పేస్తాను. ఒకవేళ గ్రహించలేకపోయి ఎవరికైనా చెప్పకుండా ఉంటే... ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇప్పుడే చెప్పేస్తున్నాను. నన్ను క్షమించండి. మీ గురించి ఎవరికీ తెలియని ఓ విషయం? నేను పాటలు పాడతానని అందరికీ తెలుసు కదా! కానీ నేను డ్యాన్స్ కూడా చేస్తాను. ఇంట్లో నా చిట్టితల్లి సంస్కృతి, నేను పాటలు వింటూ డ్యాన్స్ చేస్తుంటాం! మిమ్మల్ని భయపెట్టే విషయం ఏమైనా ఉందా? మోసం అంటే భయం. మోసం చేసేవాళ్లంటే ఇంకా భయం. ఎలాంటి సమయాల్లో అబద్ధాలాడతారు? జీతం కోసం ఆడతాను తప్ప జీవితం కోసం ఆడను. వృత్తిపరంగా కొన్నిసార్లు చెప్పక తప్పదు. దానివల్ల ఎవరికీ నష్టం ఉండదు. కానీ వ్యక్తిగతంగా చెప్పే అబద్ధాలు అవతలివారికి హాని కలిగిస్తాయి. అందుకే అలాంటివి చెప్పను. ఎలాంటి వాటికి ఎక్కువ ఖర్చు పెడుతుంటారు? సేవా కార్యక్రమాలకు ఎక్కువ ఖర్చుపెడతాను. తర్వాత నా భార్య సురేఖ కోసం, నా కూతురి కోసం ఖర్చు పెడతాను. ఎప్పుడైనా ఏదైనా షాప్‌కి వెళ్తే వాళ్లిద్దరికీ పది, పదిహేను జతల బట్టలు ఒకేసారి కొనేస్తుంటాను! మీరు నమ్మే సిద్ధాంతం...? మనుషుల మెచ్చుకోలు కోసం కాకుండా భగవంతుని మెచ్చుకోలు కోసం బతకాలి. ఎప్పటికైనా చేసి తీరాలనుకునేది? ప్రపంచ శాంతి కోసం ఉద్యమించాలన్నది నేనేనాడో ఏర్పరచుకున్న లక్ష్యం. ఇన్నాళ్లూ అదే చేశాను. ఇప్పుడూ అదే చేస్తున్నాను. ఇక ముందు కూడా ఆ దిశగానే కృషి చేస్తాను. దేవుడు కనిపిస్తే ఏ వరం అడుగుతారు? అందరికీ సమదర్శన దృష్టి ఇవ్వమని అడుగుతాను. అది వచ్చిననాడు ఈ ప్రపంచమే మారిపోతుంది. నదికి సమదర్శన దృష్టి ఉంది. చెట్టుకు కూడా ఉంది. కానీ హార్దిక సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోయాక మనిషికి ‘సమదర్శన దృష్టి’ పోయి ‘తన దర్శన దృషి’్ట వచ్చింది. మీ జీవితంలో ఒకే ఒక్క రోజు మిగిలివుందని తెలిస్తే... ఆ రోజును ఎలా గడుపుతారు? నా భార్యాబిడ్డలతో కలిసి భగవంతుడిని ధ్యానం చేస్తూ గడిపేస్తాను. మరణానికి భయపడతారా? చావుకు భయపడుతూ... ప్రతిరోజూ చస్తూ బతకడం నాకు నచ్చదు. మరణం రాక తప్పదు. ఎప్పుడొస్తుందో తెలియని దానికోసం భయపడటం అనవసరం. అందరికీ ఎలా గుర్తుండిపోవాలనుకుంటారు? గజల్ శ్రీనివాస్ ఒక కారణంతో పుట్టాడు, దానికోసమే జీవించాడు అని అంతా అనుకోవాలి. మళ్లీ జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటారు? మళ్లీ జన్మ అంటే ఈ జన్మకు సీక్వెల్ కదా! అందుకే నేను గజల్ శ్రీనివాస్ 2గా పుట్టాలని కోరుకుంటాను. - సమీర నేలపూడి -
మనోగళం: నాకు చావంటే భయం లేదు!
ఇలా చేయాలి అలా చేయాలి అంటూ పని గట్టుకుని ఏదీ ప్లాన్ చేసుకునే అలవాటు లేదు నాకు. ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేసెయ్యడమే. - నందినీరెడ్డి, దర్శకురాలు ఇతరుల్లో మీకు నచ్చేది/నచ్చనిది? నచ్చేది నిజాయితీ. నచ్చనిది అబద్ధాలు చెప్పడం. మీలో మీకు నచ్చేది? నేనెప్పుడూ చాలా హ్యాపీగా ఉంటాను. ఎలాంటి టెన్షన్ పెట్టుకోను. అంతా మన మంచికే అనుకుంటాను. మీలో మీకు నచ్చనిది? బద్దకం. కాస్త ఎక్కువే ఉంది. మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి/ఎందుకు? మా అమ్మ. ఎన్ని కష్టాలొచ్చినా ధైర్యం కోల్పోలేదు. ఎంత పెద్ద సమస్య అయినా, అందులోంచి పాజిటివ్ ఫలితాన్ని ఎలా రాబట్టాలా అని చూసేది. షి ఈజ్ మై ఇన్స్పిరేషన్! ఎందుకిలా చేశానా అని మీరు బాధపడేది ఏదైనా ఉందా? ఎందుకుండవ్! అందరం తప్పులు చేస్తూనే ఉంటాం కదా! నేను కూడా చేశాను. కానీ వాటిని తలచుకుని బాధపడే తత్వం కాదు నాది. తప్పు చేస్తే దాన్నుంచి పాఠం నేర్చుకోవాలి తప్ప ఫీలవుతూ కూర్చోవడం నాకు నచ్చదు. అత్యంత సంతోషపడిన సందర్భం? చాలామంది అనుకుంటారు... ‘అలా మొదలైంది’ రిలీజైన రోజు నా జీవితంలో అత్యంత సంతోషకరమైనదని చెబుతానేమో అని. కానీ చెప్పను. ఎందుకంటే, అది నా జీవితంలో ఓ ముఖ్యమైన సందర్భం తప్ప, అన్నిటికంటే సంతోషకరమైనదేమీ కాదు. స్కూల్, కాలేజీ రోజుల్లో అంతకన్నా ఆనందాన్ని పంచిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీ హృదయం గాయపడిన సందర్భం? నన్ను అంత త్వరగా ఎవరూ హర్ట్ చేయలేరు. ఎందుకంటే, చిన్న వాటికే ఫీలైపోయే తత్వం కాదు నాది. కాకపోతే బాగా దగ్గరనుకున్నవాళ్లు నెగిటివ్‌గా మాట్లాడినప్పుడు మనసు చివుక్కుమంటుంది. చెప్పను కానీ అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. ఒకరకంగా అది మంచిదే. ఎందుకంటే, అప్పుడే మనవాళ్లెవరో బయటివాళ్లెవరో తెలుస్తుంది. ఆకలి విలువ తెలిసిన క్షణం? ఆ పరిస్థితి నాకెప్పుడూ లేదు. అదేంటో కానీ... ఎక్కడ ఎవరింట్లో ఉన్నా నాకు భోజనం క్షణాల్లో వచ్చేస్తుంది. చిన్నప్పుడు మా అమ్మ ఎక్కడికైనా వెళ్తే చుట్టుపక్కల వాళ్లు ఎవరో ఒకరు భోజనం తెచ్చి పెట్టేసేవారు. ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి ఉందా? ఉంటే ఎవరికి? ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద కోపమొచ్చినా దాన్ని ఇంటికొచ్చాక అమ్మ మీదనే చూపిస్తాను. పాపం మౌనంగా భరిస్తుంది. అందుకే తనకు క్షమాపణ చెప్పి తీరాలి. మీ గురించి ఎవరికీ తెలియని ఓ విషయం? నాకు ఎవరైనా వంట చేస్తుంటే చూడటం ఇష్టం. కానీ చేయడం మాత్రం ఇష్టం ఉండదు. తీరిక దొరికితే కుకరీ షోలు తెగ చూస్తుంటాను! మిమ్మల్ని అత్యంత భయపెట్టే విషయం...? చిన్నప్పుడు దెయ్యాలంటే భయపడేదాన్ని. తర్వాత అది పోయింది. ఇప్పుడు పెద్దవాళ్లెవరికైనా ఒంట్లో బాగోకపోతే భయపడుతుంటాను... వాళ్లెక్కడ దూరమవుతారోనని! అబద్ధాలు చెబుతారా? భేషుగ్గా! ఇబ్బంది పెట్టే అబద్ధాలు కాదు, తప్పించుకునే అబద్ధాలు. ఫలానా టైముకి వస్తానని చెప్తాను. మావాళ్లు చూసి చూసి ఫోన్ చేస్తారు. వచ్చేశాను, మీ వీధి చివరే ఉన్నాను అంటాను. నిజానికి ఎక్కడో ఉంటాను. ఇలాంటివి బోలెడన్ని చెబుతాను. కానీ వాళ్లు కనిపెట్టేస్తారు. నా ఫ్రెండ్స్ అంటారు... అబద్ధం చెబితే నా ముక్కు ఎరుపెక్కుతుందని! మీరు నమ్మే సిద్ధాంతం ఏమిటి? నువ్వేంటో తెలుసుకో. నీ తప్పులు, ఒప్పులు ముందు బేరీజు వేసుకో. వాటిని సరిచేసుకుంటూ నిజాయితీగా ముందుకు సాగిపో. నిన్నెవరూ ఆపలేరు. ఎప్పటికైనా చేసి తీరాలనుకునేది? ఒక ఓల్డేజ్ హోమ్ కట్టించాలని చిన్నప్పట్నుంచీ అనుకుంటున్నాను. అది ఎలాగైనా చేయాలి. దేవుడు మీకేదైనా ప్రత్యేక శక్తినిస్తే... దానితో ఏం చేస్తారు? ఏ ఒక్కరూ ఆకలితో ఉండకుండా చూస్తాను. మీ జీవితంలో ఒకే ఒక్క రోజు మిగిలివుందని తెలిస్తే... ఆ రోజును ఎలా గడుపుతారు? నాకు ఏ రోజైనా ఒకటే. ఇప్పుడెలా నా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో గడుపుతున్నానో ఆ రోజూ అలాగే గడుపుతాను. మరణానికి భయపడతారా? రెండుసార్లు చావు ముఖంలో ముఖంపెట్టి చూసొచ్చాను. చావంటే భయం లేదు నాకు! అందరికీ ఎలా గుర్తుండిపోవాలనుకుంటారు? నందిని కొన్ని చిరునవ్వులు పంచి వెళ్లిపోయిందని నా గురించి అందరూ చెప్పుకోవాలి. మళ్లీ జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటారు? డాల్ఫిన్‌గా పుడతాను. నాకు నీళ్లంటే ఇష్టం. నీటిలో ఉండే డాల్ఫిన్లంటే మరీ ఇష్టం. అవి చాలా సరదా జంతువులు. ఎప్పుడూ హ్యాపీగా ఉంటాయి. అందుకే నేనూ అలా పుడతా! - సమీర నేలపూడి -
మనోగళం: వచ్చే జన్మలో ఆవిడలా పుట్టాలి!
ఎదుటివాళ్లు మీ గురించి తప్పుగా అనుకునేది? నా పని నేను చేసుకుపోతాను తప్ప ఎవరి జోలికీ పోను. పైగా ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడేస్తాను. దాంతో కొందరు నాకు పొగరనుకుంటారు. అది నిజం కాదు. నాతో స్నేహం చేసిన వాళ్లను అడిగితే తెలుస్తుంది, నేనేంటో. ఒక్కసారి నాతో స్నేహం చేస్తే, నన్ను వదిలిపెట్టలేరు. ఇతరుల్లో మీకు నచ్చేది/నచ్చనిది! నచ్చేది నిజాయితీ, పాజిటివ్ థింకింగ్. నచ్చనిది... మన ముందు మంచిగా మాట్లాడి, అటు వెళ్లగానే చెడుగా మాట్లాడే గుణం. అలాంటి వాళ్లను అస్సలు భరించలేను. మీలో మీకు నచ్చేది/నచ్చనిది? నచ్చేది ముక్కుసూటితనం. నచ్చనిది షార్ట్ టెంపర్. మీ ఊతపదం? ఆయ్, ఏమ్మా, అయ్యబాబోయ్... మద్రాస్ వెళ్లినా, హైదరాబాద్ వచ్చి సెటిలైనా... ఇవి నన్ను వదలడం లేదు. మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి/ఎందుకు? నా భార్య అరుణ. చాలా సౌమ్యంగా ఉంటుంది. నేనేం చేస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అంటూ ఆరాలు తీయదు. తన బాధ్యతలు తను సెలైంట్‌గా నెరవేరుస్తుంది. ఇలాక్కూడా ఉండవచ్చా అనిపిస్తుంది నాకు. చాలా ఇన్స్పైర్ అవుతుంటాను తనని చూసి. అత్యంత సంతోషపడిన సందర్భం? నా మొదటి సినిమా ‘కళ్లు’ ప్రివ్యూ చూడటం నా జీవితంలోనే గొప్ప సందర్భం. నన్ను నేను తెరమీద చూసుకున్నప్పుడు పడిన సంతోషం మాటల్లో చెప్పలేనిది. మీ హృదయం గాయపడిన సందర్భం? ఎందుకో తెలీదు కానీ... నా అనుకున్న వాళ్లు ఒకరితో ఎప్పుడు మాట్లాడినా సంభాషణ డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అది నా మనసును గాయపరుస్తూ ఉంటుంది. ఆకలి విలువ తెలిసిన క్షణం? కెరీర్ ప్రారంభంలో మద్రాస్‌లో ఉన్నప్పుడు ఆకలంటే ఏంటో తెలిసింది. అలాగని మరీ ఎక్కువ కష్టమేమీ పడలేదు. ఓసారి వారం పాటు వర్షం పడుతూనే ఉంది. మెస్ చాలా దూరం. వెళ్దామంటే జేబులో డబ్బుల్లేవు. రెండు మూడు రోజులు చాలా అవస్థ పడ్డాను. ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి ఉందా? ఉంటే ఎవరికి? తెలిసి నేనెవరినీ బాధపెట్టలేదు. కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉందనుకోను. మీ గురించి ఎవరికీ తెలియని ఓ విషయం? పొద్దున్నే ఐదున్నరకు లేస్తాను. వాకింగుకి వెళ్దామని ట్రాక్ సూట్, షూస్ వేసుకుని రెడీ అయిపోతాను. తలుపు తీసి బయటకొస్తాను. పేపర్ కోసం చూస్తాను. అప్పటికింకా రాదు. ఏడున్నర వరకూ రాదని కూడా తెలుసు. అయినా పేపర్ కోసం ఎదురుచూస్తూ కూర్చుంటాను. పేపర్ వచ్చాక చదువుతాను. మళ్లీ లోనికి వెళ్లి ట్రాక్‌సూట్, షూస్ తీసేసి పడుకుంటాను. అంత గొప్పగా ఉంటుంది నా వ్యాయామం! మిమ్మల్ని అత్యంత భయపెట్టే విషయం ఏమిటి? ప్రేమతో చేతులు కట్టేయడమంటారే... ఆ పరిస్థితి చాలా భయంగా ఉంటుంది. అటు నో అనలేం. ఇటు తేలిగ్గా ఎస్ అనీ అనలేం. అలాంటి ప్రేమకి తప్ప దేనికీ భయపడను. ఎలాంటి సమయాల్లో అబద్ధాలాడతారు? సాధారణంగా అబద్ధాలు చెప్పను, ఎవరినీ బాధపెట్టను. కానీ నా ఫ్రెండ్స్‌ని ఏడిపించడానికి ప్రాక్టికల్ జోక్స్ బాగా వేస్తాను. అవే నా అబద్ధాలు! మీరు నమ్మే సిద్ధాంతం ఏమిటి? ‘ప్రార్థించే పెదవుల కన్నా, సాయం చేసే చేతులు మిన్న’ అన్న మదర్ థెరిసా మాటలే నేను నమ్మే సిద్ధాంతం. ఎప్పటికైనా చేసి తీరాలనుకునేది? వంద దేశాలు తిరగాలన్నది నా కల. ఓ అరవై తిరిగేశాను. ఇంకా నలభై ఉన్నాయి. అవి కూడా పూర్తి చేయాలి. ఎలాంటి వాటికి ఖర్చు చేస్తారు? ఉపయోగం లేని వాటికి! అవసరం లేకపోయినా కంటికి నచ్చినదాన్ని కొనేస్తాను. అలా కొన్నవాటితో ఇంట్లోనే ఓ చిన్న మ్యూజియం పెట్టాను. (నవ్వుతూ) అందుకే నేనెక్కడికైనా వెళ్తుంటే మా ఆవిడ అంటుంది... దయచేసి శంఖాలు, ఫొటోఫ్రేముల్లాంటి అనవసర వస్తువులు కొనుక్కురాకండి అని. దేవుడు మీకేదైనా ప్రత్యేక శక్తినిస్తే... దానితో ఏం చేస్తారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక అలాంటి శక్తి వస్తే... తెలుగువారంతా ఒక్కటిగా ఉండేలా చేస్తాను! ఎలాంటి ముగింపును కోరుకుంటారు? ఎవరికీ ఒక్క పైసా కూడా బాకీ ఉండకూడదు. ఎవరూ నన్ను తిట్టుకోకూడదు. అలాంటి పరిస్థితుల్లోనే నేను పోవాలి. మరో విషయం... (నవ్వుతూ) నాకో ఇద్దరు శత్రువులు ఉన్నారు. నాతోపాటు వాళ్లను కూడా తీసుకునే పోవాలి. అందరికీ ఎలా గుర్తుండిపోవాలనుకుంటారు? మంచి మనిషిగా! (నవ్వుతూ) అది అసాధ్యమని తెలుసనుకోండి. అయినా అదే నా కోరిక! మళ్లీ జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటారు? మదర్ థెరిసా పుట్టిన ఊరిలో, మదర్ థెరిసాలాగే పుట్టాలి. ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి సేవ చేస్తూ బతికిందా దేవత. అంతకన్నా గొప్ప జన్మ ఏదైనా ఉంటుందా! - సమీర నేలపూడి