రుచా ఇనామ్‌దార్.. కథక్ కళాకారిణిగా, మోడల్‌గా, థియేటర్ ఆర్టిస్ట్‌గా సుపరిచితమైన పేరు. ఇప్పుడు వెబ్‌స్టార్‌గానూ ఖ్యాతినార్జిస్తోంది. ఆమె గురించి...
పుట్టింది, పెరిగింది, చదివింది అంతా ముంబైలోనే. తల్లి రుటా ఇనామ్‌దార్ డాక్టర్. ఆ స్ఫూర్తితో రుచా కూడా మెడిసిన్ చదివింది. ఏసీపీఎమ్ (అన్నాసాహెబ్ చూడామణ్ పాటిల్ మెమోరియల్) డెంటల్ కాలేజ్‌లో కోర్సు పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఉన్న ఇష్టంతో కథక్, లాటిన్ అమెరికన్ జానపద నృత్యాల్లో శిక్షణ తీసుకుంది. సుమారు అరవైకి పైగా వాణిజ్య ప్రకటనల్లో బాలీవుడ్ ప్రముఖుల సరసన కనిపించింది.
2014లో ‘చిల్డ్రన్ ఆఫ్ వార్ ’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘అండర్ ది సేమ్ సన్’, ‘భక్తి’, ‘భిఖారీ’, ‘ వెడ్డింగ్ చా షినేమా’ సినిమాల్లోనూ నటిచింది. నటన మీద ఆసక్తితో మరాఠీ, హిందీ థియేటర్‌లో పనిచేసింది. సుమారు అరవైకి పైగా వాణిజ్య ప్రకటనల్లో బాలీవుడ్ ప్రముఖుల సరసన కనిపించింది. 2014లో ‘చిల్డ్రన్ ఆఫ్ వార్ ’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘అండర్ ది సేమ్ సన్’, ‘భక్తి’, ‘భిఖారీ’, ‘వెడ్డింగ్ చా షినేమా’ సినిమాల్లోనూ నటిచింది.
ప్రస్తుతం హాట్‌స్టార్‌లో ప్రసారమవుతోన్న ‘క్రిమినల్ జస్టిస్’తో వెబ్ వీక్షకులను అలరిస్తోంది. ఇందులో తను కనబర్చిన అద్భుతమైన నటనకు ‘బెస్ట్ పాపులర్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్’ అవార్డునూ అందుకుంది.
‘టైమ్ దొరికితే అది చేయాలి, ఇది చేయాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. నేను ఫోటోగ్రఫీ నేర్చుకోవాలని అనుకునేదాన్ని. లాక్ డౌన్‌లో సెమీ ఫోటోగ్రఫీ ఆన్‌లైన్ కోర్సు పూర్తి చేశా. త్వరలోనే పెద్ద ఫోటోగ్రాఫర్‌గా కూడా నన్ను చూడొచ్చు!’
– రుచా ఇనామ్‌దార్
చదవండి: అందం.. అదితిరావు హైదరి సొంతం
Comments
Please login to add a commentAdd a comment