అవకాశాల కోసం అగచాట్లు పడిన నటి | Samridhi Dewan: Know About The Office Actress | Sakshi
Sakshi News home page

ఈ నటి యాక్టింగ్‌లో ఫస్ట్‌, అయినప్పటికీ..

May 30 2021 7:42 AM | Updated on May 30 2021 7:42 AM

Samridhi Dewan: Know About The Office Actress - Sakshi

యాక్టింగ్‌ స్కూల్లో ఫస్ట్‌ క్లాస్‌ స్టూడెంటే అయినా తెర మీద అవకాశాల కోసం మాత్రం చాలానే కష్టపడాల్సి వచ్చింది. 

పమ్మీగా వెబ్‌ వ్యూయర్స్‌కి బాగా తెలిసిన నటే సమ్రిధి దేవన్‌. ‘ద ఆఫీస్‌’లో పమ్మీగా ఆమె చేసిన కామెడీ... సోషల్‌ మీడియాలో  మీమ్స్‌గా నెటిజన్స్‌ను ఆకట్టుకుంటూనే ఉంది. ఢిల్లీలో పుట్టి, పెరిగింది. పంజాబీ కుటుంబం. మిరిండా హౌజ్‌లో బీఏ పూర్తి చేసింది. చదువుకునేటప్పుడు నాటకాల్లో పాల్గొనడంతో నటన మీద ఆసక్తి పెరిగింది. దాంతో డిగ్రీ అయిపోయిన  వెంటనే ముంబైలోని  డ్రామా స్కూల్లో చేరి శిక్షణ తీసుకుంది.

యాక్టింగ్‌ స్కూల్లో ఫస్ట్‌ క్లాస్‌ స్టూడెంటే అయినా తెర మీద అవకాశాల కోసం మాత్రం చాలానే కష్టపడాల్సి వచ్చింది. 2015లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చిన ‘స్టోరీస్‌ బై రవీంద్రనాథ్‌ ఠాగూర్‌’తో వెబ్‌ తెరకు పరిచయం అయింది. మొదటి అవకాశంతోనే నటిగా నిరూపించుకుంది. పలు ప్రశంసలను అందుకుంది. వెంటవెంటనే ‘నాట్‌ ఫిట్‌’, ‘లక్నో సెంట్రల్‌’, ‘ ఇమ్‌ఫర్‌ఫెక్ట్‌ ’ వంటి వివిధ సిరీస్, సినిమాలూ చేసి ఇటు వెబ్, అటు వెండితెర ప్రేక్షకులనూ తన అభిమానులుగా మార్చుకుంది. 

‘ద ఆఫీస్‌’లోని  ‘పమ్మి’ పాత్ర ఆమెకు అవార్డునూ  అందించింది. స్విమ్మింగ్, డాన్స్‌ అంటే చాలా ఇష్టం. సంగీతంలోనూ శిక్షణ తీసుకుంటోంది. ప్రస్తుతం బాక్సింగ్‌ నేపథ్యంలో ఓ వెబ్‌సిరీస్‌ చేస్తోంది.

"ఇప్పటి వరకు నాకు వచ్చినవన్నీ డిఫరెంట్‌ రోల్సే. అన్నిరకాల పాత్రలు చేయడానికి ఇష్టపడ్తాను.  మార్వెల్‌ సూపర్‌ హీరో, హ్యారీ పోటర్, పూర్తి స్థాయి యాక్షన్‌ రోల్స్‌  చేయటం నా కల" – సమ్రిధి దేవన్‌ 

- దీపిక కొండి

చదవండి: గర్భవతిని చేసి.. ఇప్పుడు బెదిరిస్తున్నాడు : నటి చాందినీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement