rachana
-
అత్త, వారి బంధువుల వేధింపులు తాళలేక క్షోభ అనుభవిస్తున్నా
పంజగుట్ట: గత 10 నెలలుగా అత్త, అత్త తరపు బంధువులు పెట్టే వేధింపులను తట్టుకోలేకపోతున్నానని, తమ సమీపబంధువు గౌతంరెడ్డి, అత్త గుణపటి పార్వతి, భర్త ఆదాల దామోదర్ రెడ్డి నుంచి తనకు, తన కుటుంబానికి ఆపద ఉందని గ్రీన్‌పార్క్, మారీగోల్డ్, ఆవాసా హోటల్స్ డైరెక్టర్ ఆదాల దామోదర్ రెడ్డి సతీమణి రచనా రెడ్డి వాపోయారు. ఇంట్లో ఉన్న తనను ఈ నెల 6న 15మంది బౌన్సర్లు వచ్చి దాడిచేసి కిడ్నాప్ చేసేందుకు యతి్నంచారన్నారు.ఈ విషయమై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ చెయ్యలేదని ఆమె ఆరోపించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తన సోదరితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 2022 సంవత్సరంలో తనకు దామోదర్ రెడ్డికి వివాహం అయ్యిందని అప్పటినుండి కొద్దికాలం సజావుగానే తమ దాంపత్యం కొనసాగిందన్నారు. తన భర్త తన మాటవింటున్నాడు కానీ తన అత్త పార్వతి భర్తనుండి విడదీసేందుకు కుట్రలు పన్నిందన్నారు. తమ సమీపబంధువు గ్రీన్‌పార్క్, మారీగోల్డ్ హోటల్స్ సీఈఓ గౌతంరెడ్డి మా అత్త సాయంతో తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారన్నారు. తన భర్తనుండి విడాకుల నోటీసు ఇప్పించడంతో గత కొంతకాలంగా తాను ఇల్లు వదిలి వెల్లిపోయానని తిరిగి కోర్టు ఆదేశాలతో గత నెల ఫిల్మ్‌నగర్ లోని తన భర్త ఇంటికి వచ్చినట్లు తెలిపారు. అప్పటినుండి తనను ఇంట్లోవేసి తాళం వెయ్యడం, గదిలో బంధించడం తీవ్రమానసిక వేదనకు గురిచేశారని తెలిపారు. తన అత్త పార్వతి, భర్త దామోదర్ రెడ్డి, గౌతమ్ రెడ్డి నుండి తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని రచనా రెడ్డి వాపోయారు. -
డాక్టర్ రచనా రెడ్డి ఆత్మహత్య కేసులో కీలక పరిణామం
-
60కి పైగా యాడ్స్‌లో నటించిన ఈ భామను గుర్తుపట్టారా?
రుచా ఇనామ్దార్.. కథక్ కళాకారిణిగా, మోడల్‌గా, థియేటర్ ఆర్టిస్ట్‌గా సుపరిచితమైన పేరు. ఇప్పుడు వెబ్స్టార్గానూ ఖ్యాతినార్జిస్తోంది. ఆమె గురించి... పుట్టింది, పెరిగింది, చదివింది అంతా ముంబైలోనే. తల్లి రుటా ఇనామ్దార్ డాక్టర్. ఆ స్ఫూర్తితో రుచా కూడా మెడిసిన్ చదివింది. ఏసీపీఎమ్ (అన్నాసాహెబ్ చూడామణ్ పాటిల్ మెమోరియల్) డెంటల్ కాలేజ్‌లో కోర్సు పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఉన్న ఇష్టంతో కథక్, లాటిన్ అమెరికన్ జానపద నృత్యాల్లో శిక్షణ తీసుకుంది. సుమారు అరవైకి పైగా వాణిజ్య ప్రకటనల్లో బాలీవుడ్ ప్రముఖుల సరసన కనిపించింది. 2014లో ‘చిల్డ్రన్ ఆఫ్ వార్ ’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘అండర్ ది సేమ్ సన్’, ‘భక్తి’, ‘భిఖారీ’, ‘ వెడ్డింగ్ చా షినేమా’ సినిమాల్లోనూ నటిచింది. నటన మీద ఆసక్తితో మరాఠీ, హిందీ థియేటర్లో పనిచేసింది. సుమారు అరవైకి పైగా వాణిజ్య ప్రకటనల్లో బాలీవుడ్ ప్రముఖుల సరసన కనిపించింది. 2014లో ‘చిల్డ్రన్ ఆఫ్ వార్ ’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘అండర్ ది సేమ్ సన్’, ‘భక్తి’, ‘భిఖారీ’, ‘వెడ్డింగ్ చా షినేమా’ సినిమాల్లోనూ నటిచింది. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో ప్రసారమవుతోన్న ‘క్రిమినల్ జస్టిస్’తో వెబ్ వీక్షకులను అలరిస్తోంది. ఇందులో తను కనబర్చిన అద్భుతమైన నటనకు ‘బెస్ట్ పాపులర్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్’ అవార్డునూ అందుకుంది. ‘టైమ్ దొరికితే అది చేయాలి, ఇది చేయాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. నేను ఫోటోగ్రఫీ నేర్చుకోవాలని అనుకునేదాన్ని. లాక్ డౌన్లో సెమీ ఫోటోగ్రఫీ ఆన్లైన్ కోర్సు పూర్తి చేశా. త్వరలోనే పెద్ద ఫోటోగ్రాఫర్‌గా కూడా నన్ను చూడొచ్చు!’ – రుచా ఇనామ్దార్ చదవండి: అందం.. అదితిరావు హైదరి సొంతం -
మనసు మెచ్చిన పని!
రోణంకి రచన విశాఖపట్నం నగరంలో పుట్టి పెరిగినప్పటికీ వ్యవసాయం అంటే చిన్నప్పటి నుంచే మక్కువ. నాన్న మోహనరావు వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చారు. ఊరెళ్లినప్పుడల్లా పొలానికి రచన తప్పకుండా వెళ్లి వ్యవసాయం గురించి గమనిస్తూ పెరిగింది. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఓ మంచి కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ♦ ఎందుకో గాని సంతృప్తిగా అనిపించలేదు. ఉద్యోగానికి బై చెప్పి.. తిరిగి వైజాగ్ వచ్చేశారు. రచన ఇక అక్కడ ఏ ఉద్యోగంలోనూ చేరలేదు.. మనసుకు నచ్చే పని చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంటిపైనే కూరగాయల సాగు మొదలు పెట్టారు, సుమారు రెండేళ్ల క్రితం. ♦ విశాఖ పీఎంపాలెంలో నివసిస్తున్న రచన తొలుత 10 కుండీల్లో ఆకుకూరలు పెంచడం ప్రారంభించారు. వాళ్లు ఉంటున్న అపార్ట్మెంట్.. 5 అంతస్థుల భవనం. లిఫ్ట్ లేదు. మట్టి, సేంద్రియ ఎరువు కొని తెచ్చి తండ్రితో కలిసి స్వయంగా మేడపైకి మోసుకుంటూ వెళ్లి మొక్కల పెంపకం ప్రారంభించారు. నగర శివార్లలో ఉన్న పశువుల కొట్టాం నుంచి ఆవుపేడ ఎరువును కొనుగోలు చేసి, మట్టిలో కలిపి కుండీలు, మడుల్లో వినియోగిస్తున్నారు. వంటింటి వ్యర్థాలను ఏ రోజుకారోజు కుండీలు, మడుల్లో వేస్తున్నారు. నెలకోసారి వర్మీ కంపోస్టు కొంచెం కొంచెం మొక్కలకు వేస్తున్నారు. జీవామృతం కూడా ఇక మీదట వాడాలనుకుంటున్నానని తెలిపారామె. ♦ రెండేళ్ల క్రితమే మొదలు పెట్టినా ఏడాది క్రితం నుంచి పూర్తిస్థాయిలో సేంద్రియ ఇంటిపంటలపై దృష్టి కేంద్రీకరించానన్నారు. వంగ, మిరప, మొక్కజొన్నతో పాటు వేరుశనగ వంటి పంటలు కూడా పండిస్తున్నారు. కొద్ది నెలల క్రితం కొన్ని కుండీల్లో రాగులు కూడా పండించారు. జామ తదితర పండ్ల మొక్కలను సైతం నాటారు. ♦ ఎత్తు తక్కువలో ఉండే సిల్పాలిన్ మడిలో మొక్కల్ని పెంపుడు కుక్క తవ్వి పాడు చేస్తోందని ఓ ఉపాయం ఆలోచించారు రచన. టెర్రస్ మీద కొద్ది అడుగుల ఎత్తులో కట్టెలతో మంచె లాగా కట్టి.. దానిపైన సిల్పాలిన్ బెడ్‌ను ఏర్పాటు చేశారు. అందులో గోంగూర, తోటకూర తదితర ఆకుకూరలు పెంచుతున్నారు. వీటితో పాటు టమాటా, మిరప నారు కూడా పోశారు. మొక్కలు పెరిగిన తర్వాత పీకి కుండీల్లో నాటుతానన్నారు. ♦ దేశవాళీ కూరగాయలతోపాటు నలుపు, పసుపు రంగు టమాటాలు, పర్పుల్ బీన్స్ వంటి విదేశీ రకాలను కూడా సాగు చేయటం తనకు ఇష్టమన్నారు. కోవిడ్ మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో సేంద్రియ ఇంటిపంటలపై మరింత శ్రద్ధ పెరిగిందన్నారు. తమ టెర్రస్ గార్డెన్లో పండించే కూరగాయలు, ఆకుకూరలతో సుమారు 50% మేరకు ఇంటి అవసరాలు తీరుతున్నాయని.. తాను ఇంకా చాలా మెలకువలు నేర్చుకోవాల్సి ఉందని, మరింత ఎక్కువ పంటలు ఏడాది పొడవునా కొరతలేకుండా పండించాలన్నది తన అభిమతమని రచన అంటున్నారు. – కరుకోల గోపీ కిశోర్ రాజా, సాక్షి, విశాఖపట్నంఫోటోలు: ఎమ్డీ నవాజ్ రైతు కష్టం తెలుస్తుందని.. మా ఇంటిపైన పండిస్తున్న పంటలను చూసి స్నేహితులు చాలా మంది అభినందిస్తున్నారు. అందుకే ఈ పంటలపై అందరికీ అవగాహన కల్పించాలని భావించాను. ఇందుకోసం సోషల్ మీడియాని వేదికగా ఎంచుకున్నాను. నా ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో మా మేడపై పండుతున్న కూరగాయల ఫోటోల్ని షేర్ చేశాను. అందరూ అభినందిస్తున్నారు. కొంతమంది తాము కూడా ఇంటిపంటల సాగు ప్రారంభిస్తామని మెసేజ్ చేస్తున్నప్పుడు చాలా ఆనందమనిపించింది. నా ఏజ్ ఉన్న వారిలో చాలా మందికి పంటలు పండించేందుకు రైతులు ఎంత కష్టపడతారనే విషయం తెలీదు. ఇలా స్వయంగా ప్రారంభిస్తే.. రైతు కష్టం తెలుస్తుందని నా ఉద్దేశం. మొక్కల వెరైటీలు.. ఇంకా ఎక్కువ పెంచేందుకు ప్రయత్నిస్తున్నాను. – రోణంకి రచన, విశాఖపట్నం ఇన్స్టాగ్రామ్:@organic.blooms -
రైతువాది
టెన్నిస్ అంటే ఇష్టం.. స్విమ్మింగ్ హాబీ.. రన్నింగ్ డైలీ రొటీన్... యోగా స్ట్రెస్ బస్టర్... ఇవన్నీ రచనారెడ్డి డే స్టార్టర్స్. మానవహక్కుల పోరాటం... రైతుల భూమికి న్యాయసహాయం... మహిళలకు న్యాయసేవ.. ఇవీ, సామాజిక న్యాయ సాధన కోసం ఆమె ఎంచుకున్న మార్గాలు. అన్నం పెట్టిన నేలతల్లిని వదల్లేక.. ప్రభుత్వంతో పోరాడలేక కన్నీళ్ల పర్యంతమవుతున్న రైతుల పక్షాన నిలిచారామె. 9న ‘వరల్డ్ లీగల్ సర్వీసెస్ డే’ సందర్భంగా.. ఆమె పరిచయం ఇది. రచన పుట్టింది హైదరాబాద్‌లో. సొంతూరు కామారెడ్డి (నిజామాబాద్) జిల్లా, నాగిరెడ్డిపేట గ్రామం. ‘‘నాలుగేళ్ల వరకు నాగిరెడ్డిపేటలోనే పెరిగాను. స్కూల్లో చేరడానికి మళ్లీ హైదరాబాద్‌కి తీసుకొచ్చి, వెస్ట్ మారేడ్‌పల్లిలో సెయింట్ ఆన్స్ గాళ్స్ స్కూల్లో చేర్చారు అమ్మానాన్న. నాన్న బొల్లు నర్సింహా రెడ్డి సోషల్‌సైన్సెస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన రైతు. అమ్మ ఇందిర గృహిణి. ఆమె సెయింట్ ఆన్స్ స్టూడెంట్. ఇద్దరూ చదువుకున్న వాళ్లు, సొసైటీ పట్ల అవగాహనతో విశాలమైన దృక్పథం ఉన్న వాళ్లు కావడంతో నాకు మంచి దారి ఏర్పడింది. ఆ రకంగా నేను బ్లెస్డ్ చైల్డ్ని అనే చెప్పాలి’’ అంటారు రచన. రచన కాలేజ్ ఎడ్యుకేషన్ బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్‌లో. ఆ తర్వాత పూనాలోని ఇండియన్ లా సొసైటీస్ లా కాలేజ్ (ఐఎల్ఎస్ లా కాలేజ్)లో న్యాయశాస్త్రం చదవడం ఆమె కెరీర్‌కి ఒక డైరెక్షన్‌ని ఇచ్చింది. ఆ కాలేజ్‌లో చదివిన వారిలో సుప్రీంకోర్టు జడ్జిలు చాలా మందే ఉన్నారు. ‘‘మాస్టర్స్ కోర్సుకి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్‌లో సీటు తెచ్చుకోగలిగానంటే ప్రతిష్ఠాత్మకమైన పూనా విద్యాసంస్థలో చదవడం వల్లనే’’ అంటారు రచన. అక్కడ అంతర్జాతీయ మానవహక్కులు, అంతర్జాతీయ చట్టాల మీద ఎక్కువ వర్క్ చేశారు. ఇంటర్నేషనల్ లా క్లాసులు తీసుకోవడం కూడా ఆమెకో టర్నింగ్ పాయింట్. కాలిఫోర్నియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ లా ఫోరమ్‌లో గెస్ట్ ఫ్యాకల్టీగా చేయడం.. ఇండియాకు వచ్చేటప్పుడు కెరీర్ ప్లానింగ్‌లో ఓ భరోసానిచ్చింది. నల్సార్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఆహ్వానం వచ్చింది. అక్కడ మూడేళ్ల పాటు పాఠాలు చెప్పిన తర్వాత హైకోర్టులో అడుగుపెట్టారామె. భూమి హక్కుల కోసం న్యాయపోరాటం ఆమె స్పెషలైజేషన్‌గా మారిపోయింది. పేపర్లకు, లీగల్ జర్నల్స్‌కి వ్యాసాలు రాయడం అమెరికాలో ఉండగానే వ్యాపకంగా మారింది. ఇదా లోకం?! లా కోర్సులో చదివేటప్పుడు నేర్చుకున్న దానికంటే.. ఆచరణలో నేర్చుకునేదే చాలా ఎక్కువ. ఆ విషయమే చెబుతూ.. ‘‘నా పాతికేళ్ల వయసులో అమెరికాలో అంతర్జాతీయ మానవహక్కులు, అంతర్జాతీయ చట్టాల మీద అధ్యయనం చేసేటప్పుడు ఒక్కో కేసు ఒక్కో పాఠం అయింది. ఇథియోపియా, జాంబియా, సోమాలియా దేశాల నుంచి పారిపోయి వచ్చే మహిళల కేసులు కొల్లలుగా ఉండేవి. వారంతా జెనిటికల్ మ్యుటేషన్‌కు భయపడి పారిపోయి వచ్చినవాళ్లు! కొలంబియా నుంచి డ్రగ్ విష వలయంలో చిక్కుకున్న వాళ్లు, శ్రీలంక, సిరియా, జోర్డాన్, ఇరాన్, ఇరాక్ వంటి దేశాల నుంచి రాజకీయ కల్లోలాల కారణంగా ఎదురయ్యే హింసకు భయపడి పారిపోయే వాళ్లు, చైనా నుంచి రెండవసారి గర్భం దాల్చిన వాళ్లు (ఒక కుటుంబానికి ఒకే బిడ్డ చట్టం ఉన్న రోజుల్లో), నార్త్ కొరియా నుంచి ఆకలి బాధలు తట్టుకోలేక పారిపోయి వచ్చేవాళ్లు ఎక్కువ . వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందంటే.. తమ దేశాల నుంచి ఒక్క ధృవీకరణ పత్రమూ ఉండదు, అమెరికా రావడానికి అనుమతి పత్రమూ ఉండదు. ఎటువంటి డాక్యుమెంట్లూ లేకుండా.. రైళ్లు, పడవలు ఏదో ఒక దొరికిన రవాణా సాధనంలో అమెరికాకి చేరుకుంటారు. ఇలాంటి కేసుల్లో గ్వాటిమెలా మహిళ ఉదంతం నన్ను బాగా కలచి వేసింది. ఆమె భర్త ఆ దేశంలో పెద్ద పొజిషన్లో ఉన్న లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్. అతడు ఆమెను శారీరకంగా, మానసికంగా భయంకరంగా వేధించేవాడు. ఆమె భర్త బారి నుంచి తప్పించుకోవడానికి ఏకంగా ఆ దేశం నుంచే పారిపోయి వచ్చింది. అమెరికాలో తలదాచుకున్నప్పటికీ అతడు ఆమెను వదల్లేదు. ఆమె వివరాలను సేకరిస్తూ వేధింపు కొనసాగించాడు. అంతటి కష్టాల్లో ఉన్న వాళ్లకు అండగా నిలబడే ప్రొఫెషన్ కావడంతో ఇందులో సంతోషం ఉంటుంది’’ అన్నారు రచన. రైతు బిడ్డని రైతు కేసుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో రచన పేరును ప్రస్తావించారు. ఆ విషయాన్ని గుర్తు చేసినప్పుడు.. ‘‘అన్ని రకాల కేసులనూ చేస్తున్నప్పటికీ రైతు బిడ్డను కావడంతోనో ఏమో భూమిని కోల్పోయిన రైతు బాధ వింటుంటేనే తీరని ఆవేదన కలిగేది. ప్రభుత్వం బలవంతపు భూసేకరణ చేయడంతో బాధిత రైతులు న్యాయసహాయం కోసం వచ్చినప్పుడు జీవోఎంఎస్ 123ని ప్రశ్నిస్తూ కేసు వేశాం. క్రయవిక్రయాల్లో విక్రయించే వ్యక్తి ఇష్టపూర్వకంగా అమ్ముతున్నారా లేక ఏదైనా ఒత్తిడి కారణంగా ఇష్టం లేకపోయినా విధిలేని పరిస్థితుల్లో అమ్ముతున్నారా అనేది చాలా ముఖ్యం. అయితే ఇక్కడ కొంటున్నది ప్రభుత్వం కావడంతో, అమ్మక తప్పని విధంగా ఒత్తిడి చేస్తుండడంతో రైతులు ఆవేదనను మనసులో దాచుకుని, కన్నీళ్లను దిగమింగుకుని సంతకాలు చేయాల్సి వస్తోంది. ‘ఇష్టపూర్వకంగానే విక్రయిస్తున్నాను’ అనే మాట అనడానికి గొంతు పెగలక మౌనంగా తలూపితే దానినే ఆమోదంగా నమోదు చేసి పని కానిచ్చేస్తుంటారు ప్రభుత్వ ఉద్యోగులు. ఇలాంటి పరిస్థితుల్లో నా చదువుని రైతుల పక్షాన పోరాడడానికి వినియోగించకుండా ఉండగలనా?’’ అని తిరిగి ప్రశ్నించారు రచన. అస్తిత్వ పోరాటం మహిళలకు కొన్ని తరాలుగా కనిపించని అడ్డుగోడగా ఉన్న గ్లాస్ సీలింగ్‌ని బ్రేక్ చేయగలుగుతున్నారిప్పుడు. ఇంటి బాధ్యతలను నిర్వర్తిస్తూనే ప్రొఫెషన్లో రాణిస్తున్న వైనం ఇది. అలాగని మహిళలకు ఫ్రీ హ్యాండ్ ఉందని కాదు. ప్రతి దశలోనూ తనను తాను నిరూపించుకుంటూనే ముందుకుసాగాలి. భర్త, అత్తమామలు, అమ్మానాన్నలకు సమాధానం చెప్పుకోవాల్సిందే. మగవాళ్లకు ఆ దుస్థితి ఉండదు. ఒకవేళ అతడు తన ఉద్యోగంలో వెనుకబడినా, వ్యాపారంలో నష్టపోయినా సమాజం అతడిని తప్పు పట్టదు. పైగా జీవితంలో ఒడిదొడుకులుంటాయని సపోర్టుగా నిలుస్తుంది కూడా. అదే స్త్రీ విషయానికి వచ్చే సరికి... ఆమె వ్యాపారంలో చిన్న పొరపాటు జరిగినా, ఉద్యోగంలో ఒకడుగు వెనుకబడినా ఆమెకు ఎవరి నుంచి ఎటువంటి మాట వంతు ధైర్యం చెప్పే వారుండరు. వెంటనే... ‘ఇంట్లో కూర్చోక ఇవన్నీ అవసరమా’ అని ఆమె చుట్టూ ఉన్న వాళ్లే అంటారు. ఆమె అస్తిత్వ పోరాటం చేస్తూనే ఉంది. ప్రకృతి ఆమెకి సొంత అస్తిత్వాన్నిచ్చింది. ఆ అస్తిత్వాన్ని గుర్తించడానికి సమాజానికి మనసొప్పడం లేదు. ‘‘అయితే ఇది మన దేశంలో మాత్రమే కాదు, దాదాపుగా ప్రపంచం అంతా ఇలాగే ఉంది. తేడా అంతా... తమ సమస్యలను భారతీయ మహిళలు ఎదుర్కొనే పద్ధతికి, బయటి దేశాల మహిళలు ఎదుర్కొనే పద్ధతికి మధ్యనే ఉంటోంది. మన మహిళల్లో సహనం, సహించే గుణం, సహించగలిగినస్థాయులు ఎక్కువ. చాలా దేశాల్లో అది కనిపించదు. తమ సంతోషాన్ని హరించే ఏ పరిస్థితినీ భరించరు. చాలా దేశాల్లో మహిళలకు రాజకీయ హక్కులు, రాజకీయరంగంలో పాల్గొనే హక్కులు, అవకాశాలు మనకంటే పుష్కలంగా ఉన్నాయి. అయినా మహిళ ఎదుర్కొనే ఇబ్బందుల గురించి చర్చ పెడితే మన దగ్గరకంటే ఏ మాత్రం తగ్గవు. మహిళలు ఆర్థికంగా భర్త మీద ఆధారపడే పరిస్థితులు మాత్రం మనదేశంలోనే ఎక్కువ. ఆర్థిక స్వావలంబన మనిషిలో ధైర్యాన్ని పెంచుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యాక్టర్స్ ఇందుకు భిన్నంగా ఉంటున్నాయి. ఆర్థిక స్థిరత్వం ఉన్న మహిళలు కూడా సామాజిక సమీకరణల కారణంగా ఇబ్బందులను భరిస్తూనే ఉన్నారు. ఈ భరించే తత్వం ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కొనసాగుతోంది’’ అన్నారామె. సరిదిద్దే ప్రయత్నం.. మీటూ లైంగిక వేధింపుల మీద సాగుతున్న మీటూ పోరాటం.. మహిళలకు ఎదురవుతున్న వేధింపుల తీవ్రతకు ప్రతీక. ఈ ఉద్యమం మీద స్పందిస్తూ... ‘‘ఎమోషనల్ ఫీలింగ్స్‌ను తెలియచేయడం వరకు తప్పనలేం, కానీ పవర్‌ను అడ్డుపెట్టుకుని మహిళల మీద ఒత్తిడి తేవడం, వేధింపులకు దిగజారడాన్ని సహించకూడదు. ప్రతి బాధితురాలూ తప్పనిసరిగా తనకు ఎదురైన ప్రతికూల సందర్భాన్ని బయటపెట్టాలి. మగవాళ్లు కూడా మీటూని తమకు వ్యతిరేకంగా, తమ మీద జరుగుతున్న పోరాటం అని భావించాల్సిన పని లేదు. సమాజంలో వేళ్లూనుకుని ఉన్న ఒక తప్పును సరిదిద్దే ప్రయత్నం ఇది. ఇందులో మహిళలు తమవంతు భాగస్వామ్యాన్ని ఇవ్వాలి. పని చేసే ప్రదేశంలో మహిళల మీద సెక్సువల్ హెరాస్మెంట్ మగవాళ్లు ఆడుతున్న పవర్‌గేమ్. ఇలాంటి వాటన్నింటినీ ఛేదించుకుంటూనే ఇంత వరకు వచ్చారు మహిళలు. వల్నరబుల్ కండిషన్లో ఎదురీదుతూ ఇంత వరకు వచ్చిన మహిళలను గౌరవించాల్సిన సమయమిది. అలాగే గృహిణులు మీటూ ఉద్యమం నుంచి తమను తాము వేరు చేసుకుని చూడడం సమర్థనీయం కానేకాదు. తమ ఇంట్లో మర్యాదస్థులుగా ఉండే మగవాళ్లలో ఇల్లు దాటగానే ఇలాంటి కోణం బయటపడుతోందా అని కూడా ఆలోచించాలి. మనదేశంలో మహిళలు ఇప్పటికీ తమ జీవితం భర్త చేతుల్లో ఉందనే అనుకుంటారు. బయటి దేశాల్లో మహిళలు తమ జీవితం తమ చేతుల్లో ఉందనుకుంటారు, ఈ తేడా ప్రతి చోటా ప్రతిబింబిస్తూనే ఉంటుంది. మహిళల్లో తమ హక్కుల గురించిన అవగాహన పెరగాలి. న్యాయసేవ గురించిన చైతన్యం లేకపోవడం వల్ల ఎమోషనల్‌గా వీక్ మూమెంట్లో కేసులంటూ వెళ్లడం, ఎవరు ఎలా డైరెక్షన్ ఇస్తే అలా ముందుకుపోవడం జరుగుతోంది. దాంతో ఎదురయ్యే ప్రతికూలాంశాలకు తిరిగి ఆ మహిళలే బాధ్యులు కావల్సి వస్తోంది’’ అని ఆవేదన చెందారు రచన. న్యాయవ్యవస్థ అండ లైంగిక వేధింపులకు గురైన విషయాన్ని ఎండగట్టాల్సిందే. ఈ దౌష్ట్యాన్ని నివారించడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరికీ భర్త నుంచి ప్రియారమణికి (ఎం.కె.అక్బర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన జర్నలిస్టు) ఉన్నంత అండ ఉండవచ్చు ఉండకపోవచ్చు. ‘‘అయితే తన కోసం ఎవరో ఒకరు వచ్చి, అండగా నిలుస్తారని చూస్తూ ఉండడం కంటే, పర్యవసానాలు ఎలా ఉన్నా సరే తొలి అడుగును వేయడమే కరెక్ట్. ఎటువంటి పర్యవసానమైనా సరే, అది మహిళల తెలివితేటలు, పట్టుదలకు మించినవి కాలేదు. సమాజాన్ని సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం అత్యవసరంగా ఉన్న పరిస్థితి ఇది. ధైర్యం చేయాల్సిందే. ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కూడా మహిళల మనోధైర్యాన్ని పెంచేదిగా ఉంది. మహిళ అస్తిత్వ పోరాటం చేస్తున్న ఈ సందర్భంలో ఈ తీర్పు రావడం అంటే... న్యాయవ్యవస్థ మహిళలకు అండగా ఉందని చెప్పడానికి నిదర్శనం. అది 1997 నాటి పంకజ్ చౌదరి, గుంజేశ్, మరో ఇద్దరు స్నేహితులు ఒక మహిళ మీద సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసు. సదరు మహిళ నైతిక వర్తన మీద బురద జల్లుతూ అలాంటి మహిళ విషయంలో జరిగిన రేప్‌ను నేరంగా పరిగణించరాదని వాదించారు వాళ్లు. జస్టిస్ భానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీలు ‘నో అంటే నో, ఆమె శీలవర్తనల విశ్లేషణలకు తావే లేదు’ అని, ముద్దాయిలకు ఒక్కొక్కరికి పదేళ్లు జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చారు’’ అని గుర్తుచేశారు రచన. ఇది మా నైతిక విధి ప్రతి న్యాయవాది కూడా తప్పనిసరిగా ఎథికల్ డ్యూటీ చేయాలని చెబుతుంది న్యాయశాస్త్రం. న్యాయపోరాటం చేయడానికి ఆర్థిక స్థోమత లేని వాళ్ల కేసులను వాదించాల్సిన బాధ్యత ప్రతి న్యాయవాది మీదా ఉంది. ఇది పూర్తిగా సేవాదృక్పథంతో నిర్వర్తించాల్సిన బాధ్యత. లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏర్పాటు కూడా ఇందు కోసమే. ఇందులో లాయర్లు వాలంటరీగా సర్వీస్ ఇస్తారు. కొందరు ఈ కేసులు ఎక్కువ చేస్తారు, కొందరు తక్కువ చేస్తారు, అంతే తప్ప అసలే చేయకుండా ఉండకూడదు. సామాన్యుల్లో చైతన్యం తీసుకురావడానికి సదస్సులు నిర్వహిస్తుంది న్యాయవ్యవస్థ. కానీ వీటికి ప్రచారం తగినంతగా ఉండడం లేదు. వైద్యరంగానికి ఉన్నంత విస్తృత ప్రచారం ఉండాలి. మనిషికి వైద్య సేవ ఎంత అవసరమో, న్యాయసేవ కూడా అంతే అవసరం. లాయర్‌గా సమాజానికి నేను చేయాల్సిన సేవ చేయడం కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఇక కుటుంబం విషయానికి వస్తే నా భర్త రాహుల్ యర్రంరెడ్డి కూడా లాయరే. నా కొడుకు రేయాన్ష్కి నిద్రపోయే ముందు ప్రతిరోజూ కనీసం రెండు కథలైనా చెప్పాలి. తల్లిగా నాకు అవి హ్యాపీయెస్ట్ మూమెంట్స్. అప్పుడు నాకు నేను బ్లెస్డ్ అని మళ్లీ మళ్లీ అనిపిస్తుంది. వైద్యం– న్యాయం మనదేశంలో తమకు ఎంత అన్యాయం జరుగుతున్నా సరే న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సంశయిస్తారు. సమాజానికి– న్యాయవ్యవస్థకు మధ్య కనిపించని దూరం కరడు గట్టి ఉంది. సమాజంలో మారుతున్న అభిప్రాయాలకు అనుగుణంగా న్యాయవ్యవస్థ చట్టాల్లో సవరణలు చేసుకుంటోంది. కానీ చట్టాలు ఎంత హ్యూమన్ ఫ్రెండ్లీగా మారుతున్నాయనే చైతన్యం సమాజంలో కొరవడుతోంది. నిజానికి మనిషి సంతోషంగా జీవించడానికి వైద్యరంగంతోపాటు న్యాయవ్యవస్థ కూడా ప్రధానమే. సకాలంలో వైద్య సేవలు అందకపోతే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది, సమయానికి న్యాయసహాయం అందకపోతే జీవిక ప్రమాదంలో పడుతుంది. -
టీజేఎస్‌లో చేరిన న్యాయవాది రచనారెడ్డి
-
గుడికి వెళ్తూ టీవీ నటులు దుర్మరణం
సాక్షి, బెంగుళూరు: బుల్లి తెర నటులు రచన, జీవన్‌లు గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. రచన స్నేహితురాలి పుట్టిన రోజు కావడంతో పార్టీ చేసుకున్న అనంతరం కుక్కే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకునేందుకు తన ఆరుగురు స్నేహితులతో కారులో బయల్దేరారు. వీరిలో జీవన్ కూడా ఉన్నారు. కారు మాగడి వద్దకు చేరుకున్న తర్వాత వేగంగా వెళ్తున్న బస్సును తప్పించబోయిన డ్రైవర్.. రోడ్డుకు ఎడమ వైపున ఆగివున్న ట్యాంకర్‌ను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో రచన, జీవన్‌లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో గాయపడిన మిగతా వారిని స్థానికులు నీలమంగళలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఓ సీరియల్ షూటింగ్ కోసం గురువారం రాత్రి రచన హైదరాబాద్‌కు రావాల్సివుండగా ఈ దుర్ఘటన జరిగిందని ఆమె తండ్రి గోపాల్ కన్నీరుమున్నీరయ్యారు. రచన, జీవన్‌లు నటించిన 'మహానంది' సీరియల్ కన్నడంలో మంచి ఆదరణ పొందింది. రచన తన కెరియర్ను 'మధుబాల' సీరియల్‌తో ప్రారంభించారు. జీవన్ కన్నడంలో ఇప్పుడిప్పుడే కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. -
రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటులు మృతి
కన్నడ టీవీ సీరియల్స్ మహానది, త్రివేణి సంగమ, మధుబాల లాంటి సీరియల్స్ లో నటించిన యువ నటి రచన, నటుడు జీవన్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. మిత్రులతో కలిసి బెంగుళూరు దగ్గరలోని సుబ్రమణ్య స్వామి పుణ్యక్షేత్రానికి వెళ్లి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న ట్యాంకర్ ను డీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో జీవన్ డ్రైవింగ్ సీట్లో ఉండగా రచన అతని పక్క సీట్లో కూర్చోని ఉంది. వీరితో పాటు ప్రయాణిస్తున్న మిగతావారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బుధవారం రచన, జీవన్ ల స్నేహితుడు కార్తీక్ బర్త్‌డే సందర్భంగా పూజలు నిర్వహించి అక్కడే బర్త్‌డే పార్టీ చేసుకుని గురువారం తెల్లవారు జామున సఫారీ కారులో బయలుదేరారు. తిరిగి వస్తుండగా కర్నాటకలోని మాగుడి తాలుకా సోలూరు సమీపంలోని జాతీయరహదారి వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన రచన, జీవన్ ల మిత్రులను స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. -
ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి భార్య సంచలన వ్యాఖ్యలు
యాదాద్రి: తన భర్త మృతి కేసును సరిగా దర్యాప్తు చేయడం లేదని ఎస్ఐ పిన్నింటి ప్రభాకర్‌రెడ్డి భార్య రచన సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. శిరీష మృతికి సంబంధించిన విషయాలు ఎలా రాబడుతున్నారో అదేవిధంగా తన భర్త మృతికి సంబంధించిన అంశాలు కూడా రాబట్టాలని డిమాండ్ చేశారు. ఒక సాధారణ వ్యక్తికి ఇచ్చే ప్రాధాన్యత కూడా సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి చనిపోతే ఇవ్వడం లేదని వాపోయారు. తన భర్తది ఆత్మహత్య అని, సర్వీసు తక్కువగా ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు అందవని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై డీఐజీని కలుస్తానని రచన చెప్పారు. కాగా, బ్యుటీషియన్ శిరీషపై అత్యాచారయత్నం బెడిసికొట్టడంతో ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని తమ దర్యాప్తులో తేలినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే ఇదంతా కట్టుకథ అని రచన అంతకుముందు కొట్టిపారేశారు. మామూళ్లు ఇవ్వనందుకే తన భర్తను టార్గెట్ చేసి, హత్య చేసి, ఇప్పుడు వివాహేతర సంబంధం అంటగట్టి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. -
అక్టోబర్ 2న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: రచన (నటి), కె.కె. మీనన్ (నటుడు) ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 11. ఇది చాలా ప్రత్యేకతను సంతరించుకున్న సంఖ్య. దీనిలో రెండు ఒకట్లు (సూర్యుని సంఖ్య) కలిసి చంద్రుని సంఖ్య 2 ఏర్పడింది కాబట్టి ఇది మాస్టర్ నంబర్ అని చెప్పొచ్చు. ఈ సంవత్సరం మీరు సామాజిక సేవా దృక్పథం కలిగి ఉండి, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. పోయిన సంవత్సరం ప్రారంభించిన ప్రాజెక్టుల నుంచి మంచి లాభాలు గడిస్తారు. వృత్తి, వ్యాపారాలు, ఆర్థిక వ్యవహారాలు అద్భుతంగా ఉంటాయి. ఇంటర్వ్యూలు, ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగోన్నతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అధికంగా చేస్తారు. దానివల్ల ఖర్చులు ఎక్కువ అయినప్పటికీ, మంచి ఫలితం కూడా ఉంటుంది. వీరు బిల్డర్లు గనుక అయితే వీరికిది ల్యాండ్‌మార్క్ ఇయర్‌గా మిగిలిపోతుంది. అయితే చంద్రుని దుష్ర్పభావం వల్ల వీరికి ఈ సంవత్సరం మానసికాందోళన, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, మూడీగా అయిపోతుండటం వంటి ప్రమాదాలున్నాయి కాబట్టి ముందే తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండటం మంచిది. లక్కీ నంబర్స్: 1, 2, 3, 6, 7; లక్కీ కలర్స్: వైట్, సిల్వర్, క్రీమ్, గోల్డెన్; లక్కీ డేస్: శుక్ర, శని, ఆది, సోమవారాలు. సూచనలు: అమ్మవారిని ఆరాధించడం, తల్లిని కానీ, తల్లితో సమానురాలైన వారిని కానీ ఆదరించి, గౌరవించి సేవ చేయడం, ఆలయాలలో, మదరసాలలో, చర్చిలలో అన్నదానం చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్ -
ఒక్కచోట ఇద్దరు... ఒకలా మాత్రం ఉండరు!
ఇద్దరమ్మాయిలు. ఒకరు మహా ఫాస్టు. ఇంకొకరు మరీ మృదువు. ఒకామె పులిపిల్లలా విరుచుకుపడుతుంది. ఇంకొకామె కుక్కపిల్లను చూసినా భయంతో పరుగు పెడుతుంది. ఒకామె జలపాతంలా హుషారుగా ఉంటుంది. ఇంకొకామె మలయ పవనంలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి విభిన్నమైన మనస్తత్వాలు కల రచన, గుంజన్ అనే ఇద్దరమ్మాయిలను ఒక్కచోట చేర్చి తీసిందే ‘సప్నే సుహానే లడక్పన్ కే’. జీ టీవీలో ప్రసారమయ్యే ఈ సీరియల్‌ని అద్భుతమైన సీరియల్ అనడానికి లేదు. అలాగని చెత్తా అనలేం. పాత్రల చిత్రణ బాగుంటుంది. కథ మాత్రం కాస్త కాస్త విసిగిస్తూ ఉంటుంది. అయినా రెండేళ్లుగా నిరాటంకంగా కొనసాగుతుండటం విశేషమే! -
మాటలతో బాట వేసుకుంది!
స్ఫూర్తి మనసులో ఉన్నది చెప్పేందుకు మాట్లాడటం వేరు... మనసులను తాకేట్టుగా మాట్లాడటం వేరు. ఆ కళ, అలా మాట్లాడే తెగువ అందరికీ ఉండవు. కానీ రచనకు ఉన్నాయి. అందుకే ఆమె మాటలతోనే బాట వేసుకుంది. తన మాటలనే అస్త్రాలుగా మార్చి సమస్యలపై ఎక్కుపెడుతోంది. ఎందరి ఆలోచనలకో పదునుపెడుతోంది. మన దేశం ముందుకెళ్తోందని చాలామంది అంటూంటారు కానీ... వెనకబడిన ప్రాంతాలు ఇంకా చాలానే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లాంటి అతి పెద్ద రాష్ట్రంలో ఉన్న పలు చిన్ని చిన్ని గ్రామాల్లో అభివృద్ధి అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. వసతులు ఉండవు. ఆధునికత అన్నమాటకు నిర్వచనం కూడా తెలియదు వారికి. అలాంటిచోట పుట్టిన అమ్మాయి రచన. ఆడపిల్లలు గడపదాటి బయటకు వెళ్లకూడదు, అందరూ వినేలా మాట్లాడకూడదు లాంటి కట్టుబాట్ల మధ్య నలిగిపోయిందామె. ఆడపిల్ల అంటే ఇక ఇంతేనా, నోరు విప్పి మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా అనుకునేది. ఆడపిల్ల అంటే ఏంటో మాటలతోనే అందరికీ చెప్పాలని తహతహలాడేది. ఆ తపనే ఆమెను రేడియో జాకీని చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్పూర్ జిల్లాలో ఎనభైకి పైగా గ్రామాలున్నాయి. అక్కడి పరిస్థితులను మార్చేందుకు జిల్లా మెజిస్ట్రేట్ రణవీర్ ప్రసాద్ ఓ సరికొత్త ప్రణాళిక వేశారు. పలు సమస్యల మీద అవగాహన కల్పించేందుకు ‘లలిత్ లోక్వాణి’ పేరుతో ఓ కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ని స్థాపించారు. అందులో పనిచేయడానికి రావాలని, మహిళల సమస్యలపై గళం విప్పాలని ఆహ్వానించారు. కానీ ఏ ఒక్కరూ వెళ్లేందుకు ధైర్యం చేయలేదు... రచన తప్ప. ఇంట్లోవాళ్లు కాదన్నా, కట్టడి చేయాలని ప్రయత్నించినా ఆగలేదామె. ఇంటి గడప దాటి రేడియో స్టేషన్ గడపలో అడుగుపెట్టింది. మాట్లాడవద్దన్నవాళ్లందరినీ తన మాటలతో ముగ్ధుల్ని చేయడం మొదలుపెట్టింది. ఆమెను చూసి పలువురు అమ్మాయిలు స్ఫూర్తి పొందారు. తామూ జాకీలుగా పనిచేస్తామంటూ వెళ్లారు. ఇప్పుడు ఆ రేడియో స్టేషన్లో చాలామంది మహిళా జాకీలు ఉన్నారు. తమ జిల్లాలోని పలు సమస్యల గురించి వివరిస్తూ అందరినీ చైతన్యవంతుల్ని చేస్తున్నారు.