gynacolgists confrence
-
Health: మెనోపాజ్ వల్ల హార్మోన్స్ సమస్యా? అయితే ఇలా చేయండి!
మెనోపాజ్ వల్ల హార్మోన్స్ తగ్గిపోతాయి కదా.. దాని ప్రభావం ఆరోగ్యం మీద పడకుండా ఉండటానికి మాత్రల ద్వారా హార్మోన్స్‌ను రీప్లేస్ చేయవచ్చా? – జి. సోనీ, సిద్ధిపేటమెనోపాజ్ తరువాత హార్మోన్స్ డెఫిషియెన్సీ వల్ల సైడ్ఎఫెక్ట్స్, ఇబ్బందులతో చాలామంది బాధపడుతుంటారు. వాటిని తగ్గించడానికి చాలామంది హెచ్ఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారిప్పుడు. అయితే దీనిని డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి. అదికూడా వైద్య పరీక్షల అనంతరం. ఈ హెచ్ఆర్టీ అందరికీ సరిపడకపోవచ్చు.ఈ హార్మోన్స్ థెరపీతో ముఖ్యంగా హాట్ ఫ్లషెస్, రాత్రిళ్లు చెమటలు పట్టడం, మూడ్ స్వింగ్స్, వెజైనా పొడిబారిపోవడం వంటి సమస్యలను పరిష్కరించవచ్చు. ఆస్టియోపొరాసిస్ అంటే ఎముకలు గుల్లబారడం వంటి సమస్యనూ నివారిస్తుందీ హెచ్ఆర్టీ. ఈ సింప్టమ్స్ అన్నీ మెనోసాజ్ వచ్చిన కొన్నినెలలకు కనపడతాయి. ట్రీట్మెంట్ మొదలుపెట్టాక కనీసం మూడు నెలలు అయితే కానీ దాని ప్రభావం కనిపించదు.ఒకవేళ ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే డోస్, ప్రిపరేషన్ మార్చేయవచ్చు. అయితే బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, అంతకుముందు బ్లడ్ క్లాట్స్ ఉన్నా, హై బీపీ, లివర్ ప్రాబ్లమ్ ఉన్నవారిలో హెచ్ఆర్టీ సురక్షితం కాదు. హెచ్ఆర్టీలో హార్మోన్స్‌ను సింగిల్ డోస్‌గా కానీ.. కంబైన్డ్ డోస్ టాబ్లెట్స్‌గా కానీ ఇస్తారు. ఇవి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్స్‌తో ఉంటాయి. స్కిన్ పాచెస్, జెల్స్, పెసరీస్ కూడా ఉంటాయి. హెచ్ఆర్టీకి ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి.జీవనశైలిలో మార్పులు అంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, మసాలా ఆహారపదార్థాలు, టీ, కాఫీ, ఆల్కహాల్ వంటివాటికి దూరంగా ఉంటూ.. తాజా ఆకుకూరలు, బాదం పప్పు, అక్రోట్స్, సోయా బీన్స్ వంటివి తీసుకుంటూంటే మెనోపాజ్ సింప్టమ్స్ అంతగా బాధించవు.. తగ్గుతాయి కూడా.ఇవి చదవండి: Health: లోయర్ బ్యాక్ పెయిన్‌తో ఇబ్బందా! ఆలస్యం చేశారో?? -
Health: లోయర్ బ్యాక్ పెయిన్‌తో ఇబ్బందా! ఆలస్యం చేశారో??
నాకు 35 ఏళ్లు. చాలా రోజులుగా లోయర్ బ్యాక్ పెయిన్‌తో సఫర్ అవుతున్నాను. డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలా? ఎక్సర్‌సైజెస్‌తో మేనేజ్ చేయొచ్చా? ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి.. ఎలాంటివి చేయకూడదు? – వి. శుభదా, హైదరాబాద్లోయర్ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఎక్సర్సైజెస్ కూడా స్టార్ట్ చేయాలి. ఆలస్యం చేయడం వల్ల సమస్యలు ఎక్కువవుతాయి. స్పైన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. దాని చుట్టూ లిగమెంట్స్, జాయింట్స్, మజిల్స్ ఉండి.. దాన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అదేపనిగా రెస్ట్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. కదలికలతోనే స్పైన్ ఆరోగ్యంగా ఉంటుంది. దానికి పూర్తిగా విశ్రాంతి ఇస్తే కదలికలు తగ్గి ఇంకా పెయిన్ పెరిగే ప్రమాదం ఉంటుంది.రెండు రోజుల కన్నా ఎక్కువ బెడ్ రెస్ట్ తీసుకోకూడదు. స్పెషలిస్ట్‌ని సంప్రదించి సమస్య ఎక్కడుందో తెలుసుకోవాలి. మొబిలిటి పెరిగే వ్యాయామాలు చేయాలి. జాయింట్స్ బిగుసుకుపోకుండా చూసుకోవాలి. జాయింట్స్ స్టిఫ్‌గా అయిపోతే బ్యాక్ పెయిన్ మరింత ఎక్కువవుతుంది. యాక్టివ్‌గా ఉంటే కండరాలు స్ట్రాంగ్‌గా ఉంటాయి. వాకింగ్, స్విమ్మింగ్, యోగా, డాన్సింగ్ వంటివి చేయొచ్చు. Knee రోలింగ్, Knee to Chest, పెల్విక్ టిల్ట్స్ వంటి సింపుల్ ఎక్సర్సైజెస్ చేయాలి.ఇవన్నీ కూడా ఫిజియోథెరపిస్ట్ సమక్షంలో ప్రయత్నించాలి. కొంచెం నొప్పి తగ్గాక బ్యాక్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్ చేయాలి. వెల్లకిలా పడుకుని మోకాళ్ల కిందిభాగంలో రెండు పిల్లోస్‌ని, బోర్లా పడుకునే అలవాటున్నవారు పొట్టకింద రెండు పిల్లోస్, పక్కకు తిరిగి పడుకునేవారు రెండు మోకాళ్ల మధ్యలో ఒక పిల్లోను సపోర్ట్‌గా పెట్టుకోవాలి. అలాగే కూర్చుని ఉన్నప్పుడు నడుము వెనకభాగంలో పిల్లోని సపోర్ట్‌గా పెట్టుకోవాలి. లోయర్ బ్యాక్ పెయిన్ సూచనలు కనిపించగానే వెంటనే సంబంధిత డాక్టర్ని సంప్రదించాలి.మూత్ర విసర్జన కష్టమవుతున్నా, మలమూత్రాల మీద నియంత్రణ తప్పినా, మల ద్వారం దగ్గర నంబ్నెస్ ఉన్నా.. కాళ్లు నిస్సత్తువగా అనిపించినా.. తిమ్మిర్లున్నా, బాలెన్స్ తప్పుతున్నా, కాళ్లల్లో తీవ్రమైన నొప్పి ఉన్నా దగ్గర్లోని ఫిజీషియన్ని లేదా న్యూరాలజిస్ట్‌ని సంప్రదించాలి. అవసరమైన టెస్ట్‌లు చేస్తారు. పైన చెప్పిన పరిస్థితులు ఉంటే ఇంట్లో ఎలాంటి చిట్కా వైద్యాలు చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.ఇవి చదవండి: విడిపోతామని భయంగా ఉంది! అసలు కారణమేంటి? -
జాగ్రత్తలతో మాతాశిశు మరణాల నివారణ
భీమవరం టౌన్: గర్భిణులు ఆరోగ్యçృరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటిని ముందుగానే గుర్తించి వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తే మాతాశిశువులు క్షేమంగా ఉంటారని సీనియర్ వైద్యులు తెలిపారు. భీమవరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో ఐఎంఏ, గైనకాలజిస్టుల అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘అత్యంత ప్రమాదకరస్థితిలో గర్భం’ అంశంపై సదస్సు నిర్వహించారు. ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ డీవీ చలపతిరావు, కార్యదర్శి డాక్టర్ ఇర్రింకి లక్ష్మి, గర్భిణి, స్త్రీల వైద్య అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ సుంకర నరసవాణి సదస్సుకు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. విజయవాడకు చెందిన ఐవీఎఫ్ క్లినిక్ డాక్టర్ వి.పద్మజ మాట్లాడుతూ మహిళలు గర్భం దాల్చినపుడు శరీరంలో వ్యతిరేక కణాలు ఉత్పత్తి అయి కొన్ని సమస్యలు ఏర్పడతాయన్నారు. శిశువు ఎదుగుదల లేకపోవడం, నెలలు నిండకుండానే ప్రసవం సంభవిస్తుందన్నారు. ఇటువంటి సమస్యలను ఏ విధంగా నివారించాలి, గర్భిణులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను వివరించారు. ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల గైనిక్ డిపార్ట్మెంట్ హెచ్‌వోడీ డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ గర్భిణులకు వచ్చే షుగర్ వ్యాధుల గురించి వివరించారు. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ గైనిక్ డిపార్ట్మెంట్ మాజీ హెచ్‌వోడీ డాక్టర్ కె.రమాదేవి మాట్లాడుతూ గర్భిణులకు అధిక రక్తపోటు ఏర్పడితే నియంత్రించేందుకు కనుగొన్న నూతన వైద్య పద్ధతులను వివరించారు. రాజమండ్రి తపని హాస్పటల్స్ డాక్టర్ డి.పద్మజ మాట్లాడుతూ ప్రసవం సమయంలో తల్లికి జరిగే ప్రమాదాలు, అందుకు కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. డాక్టర్ ఇర్రింకి లక్ష్మి మాట్లాడుతూ గర్భస్రావానికి దారి తీసే పరిస్థితులు, నివారణ మార్గాలను తెలిపారు. ఏలూరు ఆశ్రం హాస్పటల్ గైనిక్ డిపార్ట్మెంట్ హెచ్‌వోడీ డాక్టర్ కె.వందన మాట్లాడుతూ ప్రసవానంతరం జరిగే రక్తస్రావాలు, దానికి కారణాలు, నివారణ మార్గాలు చెప్పారు. డాక్టర్ మేళం జగదీశ్వరి, డాక్టర్ సుంకర నరసవాణి తదితరులు మాట్లాడారు. సదస్సుకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ మెంబర్, పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి పర్యవేక్షణాధికారిగా వ్యవహరించారు. జిల్లా నలుమూలల నుంచి గైనకాలజిస్టులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.