భావన కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు | main accused arrested in bhavana case | Sakshi
Sakshi News home page

భావన కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు

Published Fri, Feb 24 2017 2:40 AM | Last Updated on Wed, Sep 26 2018 6:09 PM

భావన కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు - Sakshi

భావన కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు

కోచి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నటి భావనపై వేధింపుల కేసులో ప్రధాన నిందితుడు పల్సర్‌ సునీ, సహనిందితుడు వీపీ విగీశ్‌లను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారు ఎర్నాకులం స్థానిక కోర్టులో లొంగిపోవడానికి వచ్చినపుడు హైడ్రామా చోటుచేసుకుంది. కోర్టు ప్రాంగణం నుంచే నిందితులను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారు.

అంతకు ముందు పోలీసుల కళ్లుగప్పి వారిద్దరు లాయర్ల దుస్తుల్లో కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించా రు. ఇది గమనించిన లాయర్లు పోలీసులను అప్రమత్తం చేశారు. ఆ తరువాత నిందితులిద్దరినీ ప్రశ్నించడానికి ఆలువా పోలీస్‌ క్లబ్‌కు తరలించారు. కోర్టు రూం నుంచే తమ క్లయింట్లను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారంటూ నిందితుల తరఫు లాయర్లు అడిషనల్‌ చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదుచేశారు. నిందితులను తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలన్న లాయర్ల పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement