
వారికి ఉరి శిక్ష విధించాలి!
నటి భావన లైంగికవేధింపుల సంఘటన దక్షిణాదిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దర్యాప్తులో ఆమె కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది.మంత్రి కొడుకుల హస్తం ఉందని, ప్రముఖ నటుడికి ఈ దురాగతంలో భాగం ఉందని, మరో మహిళా వ్యాపారవేత్తే ఈ ఘటనకు సూత్రధారి అని ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు మాత్రం ముమ్మరంగా సాగుతోంది. కాగా భావన లైంగికవేధింపులకు గురైన విషయాన్ని నటి రెజీనా ముందుకు తీసుకురాగా తానూ అడ్జెస్ట్‌మెంట్ వ్యాఖ్యలను ఎదుర్కొన్నానని అన్నారు.ఈ బ్యూటీ సందీప్‌కిషన్, శ్రీలతో కలిసి నటించిన మానగరం చిత్రం మార్చి 10వ తేదీన తెరపైకి రానుంది.
విలేకరుల సమావేశంలో పాల్గొనడానికి చెన్నై వచ్చిన రెజీనాను భావన సంఘటనపై స్పందించాల్సిందిగా అడిగినప్పుడు సినిమాలో మనతో నటించే యూనిట్‌పై నమ్మకం కలగాలన్నారు.ఇది చాలా క్లిష్టవైున పరిస్థితి అని పేర్కొన్నారు.సెన్సిటివ్ అయిన ఈ అంశం గురించి తాను మాట్లాడదలచుకోలేదని అన్నారు.అయితే అత్యాచారయత్నానికి పాల్పడ్డ వారికి ఉరి శిక్ష లాంటి దండన విధించాలన్నారు. లేదా వారిని పెట్టే టార్చర్‌కు మరెవరూ మహిళలపై అత్యాచారం చేయడానికి భయపడేలా ఉండాలన్నారు.
ఏదేవైునా స్త్రీలు తమ రక్షణ విషయంలో తరచూ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.తాను ఆరంభంలో తమిళ చిత్రాల్లో నటించానని,ఆ తరువాత తెలుగు చిత్రాల వైపు దృష్టి సారించానన్నారు. అలాంటి సమయంలో ఎవరో ఒకరు తనకు ఫోన్ చేసి తమిళ చిత్రంలో నటించడానికి కాల్‌షీట్స్ అడిగారన్నారు. తరువాత అడ్జెస్ట్‌మెంట్ అనే పదాన్ని ఉపయోగించారని, దాంతో తానా చిత్రంలో నటించలేదని తెలిపారు.ఆ తరువాత తనకలాంటి సంఘటనలు ఎదురవ్వలేదని చెప్పారు.ఏ రంగంలో అయినా మనం చాలా జాగ్రత్తగా ఉంటే ఎవరి సాయం అవసరం లేకుండా సురక్షితంగా ఉండవచు్చనని అంటున్నారా ఉత్తరాది భామ.