త్వరలో పెళ్లికూతురు కానున్న భావన | Bhavan getting ready to marriage | Sakshi
Sakshi News home page

త్వరలో పెళ్లికూతురు కానున్న భావన

Published Sun, Dec 18 2016 12:57 AM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM

త్వరలో పెళ్లికూతురు కానున్న భావన

త్వరలో పెళ్లికూతురు కానున్న భావన

నటి భావన త్వరలో పెళ్లికి సిద్ధం అవుతున్నారు. మిష్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్తిరం పేసుదడి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు నాయకిగా పరిచయమైన మాలీవుడ్‌ బ్యూటీ భావన. తొలి చిత్రంతోనే సక్సెస్‌ను అందుకున్న ఆ భామకు ఆ తరువాత వరుసగా అవకాశాలు తలుపుతట్టాయి. దీపావళి, వెయిల్, కిళక్కుకడర్‌కరైశాలై, ఆర్య చిత్రాల్లో నటించిన భావన ఎక్కువ కాలం ఇక్కడ నిలదొక్కుకోలేక పోయారు. అయితే ఆ తరువాత కొంత కాలం టాలీవుడ్‌ చేయూత నిచ్చింది. ప్రస్తుతం మలయాళం, కన్నడ చిత్రాల్లోనే నటిస్తున్నారు. భావన ఒక కన్నడ నిర్మాత ప్రేమలో పడ్డారన్న ప్రచారం చాలా కాలంగా హల్‌చల్‌ చేస్తోంది. ఈ విషయాన్ని భావన అంగీకరించారు. అయితే తన ప్రియుడైన ఆ నిర్మాత పేరు మాత్రం చెప్పడానికి నిరాకరించారు. సరైన సమయంలో తన ప్రియుడి పేరును వెల్లడిస్తానని పేర్కొన్నారు. భావన, కన్నడ నిర్మాత డీప్‌గా ప్రేమించుకుంటున్నారట.పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారట.

నిజానికి వీరి పెళ్లి ఇప్పటికే జరిగి ఉండాల్సిందని, అయితే నటి భావన తండ్రి ఆ మధ్య మరణించడంతో పెళ్లి వాయిదా పడిందని ఆమె స్నేహితురాళ్ల సమాచారం. తాజాగా భావన పెళ్లికి సిద్ధం అయినట్లు, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తన చిరకాల ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. కేరళ రాష్ట్రం,తిరువనంతపురానికి చెందిన భావన పెద్దగా హంగులు, ఆర్భాటాలకు పోకుండా సింపుల్‌గా రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకోనున్నారని కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులే వారి పెళ్లికి అతిథులు కానున్నారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement