అలా అమ్మ అయ్యాను | The concept of TV actress is familiar to Telugu audiences | Sakshi
Sakshi News home page

అలా అమ్మ అయ్యాను

Published Wed, Jun 12 2019 5:17 AM | Last Updated on Wed, Jun 12 2019 5:42 AM

The concept of TV actress is familiar to Telugu audiences - Sakshi

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా, టీవీ నటిగా భావన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. జీ తెలుగులో ప్రసారమవుతున్న కళ్యాణవైభోగం ద్వారా మోడ్రన్‌ మదర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆట, మాట, నటనలతో బోర్‌ లేకుండా రోజులు హ్యాపీగా గడిచిపోతున్నాయి అంటూ తన మనసులోని ముచ్చట్లను పంచుకున్నారు భావన.

ఇప్పుడు చేస్తున్న సీరియల్స్‌?
కళ్యాణ వైభోగం, పౌర్ణమి సీరియల్స్‌లో హీరోయిన్స్‌కి మదర్‌గా నటిస్తున్నాను. ఓ కుకరీ షోకి యాంకరింగ్‌ చేస్తున్నాను. డ్యాన్స్‌ షోస్‌లో పాల్గొంటున్నాను. వేటికవి భిన్నంగా అలాగే లుక్‌లోనూ డిఫరెంట్‌గా ఉండటంతో ఎక్కడా బోర్‌ అనేది లేకుండా రోజులు గడిచిపోతున్నాయి. చేస్తున్న పని వల్ల చాలా రిలీఫ్‌గా ఉంటుంది.

టీవీ హీరోయిన్‌ నుంచి అమ్మ క్యారెక్టర్‌కి మారడం?
(నవ్వుతూ) కొంచెం కష్టమే. అయితే, అమ్మ అనగానే ఇలాగే ఉంటుందనే ఒకలాంటి పిక్చర్‌ మన కళ్లముందు నిలుస్తుంది. దీనికి పూర్తి భిన్నంగా నేను చేసే సీరియల్స్‌లో అమ్మ వెస్ట్రన్‌ లుక్‌తో అందంగా ఉంటుంది. కళ్యాణవైభోగం సీరియల్‌లో నాది తల్లి పాత్ర అయినా హీరోయిన్‌ – నేను సిస్టర్స్‌లా ఉంటాం. హీరో, హీరోయిన్, తల్లి .. ఈ ముగ్గురి చుట్టూ కథ తిరుగుతుంది.

అమ్మగా ఎలా మొదలు?
ఏడేళ్ల క్రితం పుత్తడిబొమ్మ సీరియల్‌ నుంచి మదర్‌ క్యారెక్టర్‌ స్టార్ట్‌ అయ్యింది. మా ఇంట్లోవాళ్లు కూడా నన్ను తల్లి పాత్రల్లో అంగీకరించడానికి కొంత టైమ్‌ పట్టింది. అయితే కావాలని అమ్మ పాత్రలను నేను ఎంచుకోలేదు. అనుకోకుండా పుత్తడిబొమ్మ సీరియల్‌లో హీరోయిన్‌ చిన్నప్పుడు అమ్మగా ఉండటానికి ఓకే చేశాను. తర్వాత ఆ పాప పెద్దయ్యింది. అలా మదర్‌గా నేనే కంటిన్యూ అయ్యాను. దీంతో అమ్మ పాత్రలు చేస్తున్నాను. అలాగని బాధ లేదు. వర్క్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాను.

ఇండస్ట్రీకి ఎంట్రీ?
చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నాలుగేళ్ల వయసులోనే ఇండస్ట్రీకి వచ్చాను. మా నాన్నగారి ఫ్రెండ్‌ ఇండస్ట్రీలో ఉండేవారు. వాళ్ల ద్వారా నా ఎంట్రీ సులువు అయ్యింది. చిక్కడు దొరకుడు, భారతంలో బాలకృష్ణుడు, స్వయంకృషిలో సుమలత చిన్నప్పుడు, విజృంభణ, లాయర్‌ సుహాసినిగా చిన్నప్పుడు.. ఇలా పద్నాలుగు సినిమాలు చేశాను. ఆ తర్వాత సీరియల్స్‌ చేస్తూ వచ్చాను.  
భవిష్యత్తు నటన గురించి?
బాగా మాస్‌ క్యారెక్టర్‌ చేయాలని ఉంది. అలా అని అదొక కల కాదు. కాకపోతే అలా కూడా ప్రేక్షకుల్ని మెప్పించాలి అని ఉంది. నన్ను ఇప్పటివరకు పాజిటివ్‌గా – నెగిటివ్‌గా చూశారు. భావన మాస్‌గా కూడా బాగా నటించగలుగుతుందని తెలుస్తుంది.

వర్క్‌లో ఇన్‌వాల్వ్‌మెంట్‌?
మా భార్యా–భర్త ఇద్దరిలో ఎవరూ ఎవరి వర్క్‌ని డిస్ట్రబ్‌ చేసుకోం. ముందుగా ప్లాన్‌ చేసుకుంటాం. సజెషన్స్‌ కూడా పెద్దగా ఏమీ ఉండవు. అమ్మ, అత్తయ్య మాత్రం ఎమోషన్‌ సీన్స్‌ చేసినప్పుడు ఎలా యాక్ట్‌ చేశానో చెబుతారు. ముఖ్యంగా మా అత్తయ్య అలాంటి సీన్‌ చూసిన వెంటనే ఫోన్‌ చేస్తుంటుంది.  

పిల్లల ఆలనా పాలనా?
నేను చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చేస్తున్నప్పుడు స్కూల్‌కి వెళ్లడం కుదరలేదు. దీంతో ఇంట్లో ఉండే ప్రైవేట్‌గా ఎగ్జామ్స్‌కి ప్రిపేర్‌ అయ్యాను. అందుకే మా పిల్లలకు చదువు మీదే కాన్‌సంట్రేషన్‌ చేస్తాను. గతంలో ఏదైనా ఇంగ్లీష్‌ మూవీకి వెళ్లినా మా వారు నాకు ఎక్స్‌ప్లెయిన్‌ చేసేవారు. ఇప్పుడు నా కూతురు ఎక్స్‌ప్లెయిన్‌ చేస్తుంది. షాపింగ్‌కి ఏదైనా మర్చిపోతానేమో అని గతంలో నేను లిస్ట్‌ రాసుకునేదాన్ని. ఇప్పుడా పని మా అమ్మాయి చేస్తుంది. చాలా విషయాల్లో నా పిల్లలు నాకు తోడుంటున్నారు. నా ప్రపంచం వాళ్లే. ఉదయం షూటింగ్‌కి తిరిగి ఇల్లు చేరేసరికి రాత్రి తొమ్మిది అవుతుంది. ఇంటికి వచ్చేసరికి పిల్లలు గోల చేస్తే కొద్దిగా అరిచేస్తాను. అదే వాళ్లు అమ్మవాళ్లింటికి వెళ్లి, ఒక్కరోజు చూడకపోయినా బెంగ పెట్టేసుకుంటాను.  

సీరియల్స్‌ అన్నీ ఒకేలా..
జనాల చేతిలో రిమోట్‌ ఉంది. నచ్చలేదు అంటే చానెల్‌ మార్చేస్తారు. కానీ, ఎవరూ అలా చేయడం లేదు కదా! సీరియల్‌ని తిట్టుకుంటూనైనా చూసేస్తున్నారు. సీరియల్‌లో ఆ క్యారెక్టర్‌కి ఏది అవసరమైతే అదే చూపిస్తారు డైరెక్టర్‌. అత్త, అమ్మ క్యారెక్టర్లు ముందు విలన్‌ అన్నారు. ఇప్పుడు పాజిటివ్‌గా మారుతున్నాయి.
– నిర్మలారెడ్డి

ఇంట్లో అమ్మగా..?
నాకు ఇద్దరు కూతుళ్లు. మా పెద్ద పాప పేరు గాయత్రి. రెండవది సరయు. ఇద్దరూ చదువుకుంటున్నారు. నెలలో 15–20 రోజులు షూటింగ్స్‌తో బిజీగా ఉన్నా మిగతా రోజులు పిల్లలతోనే ఉంటాను. మా వారు విజయ్‌కృష్ణ డైరెక్టర్‌. ప్రస్తుతం కథలో రాజకుమారికి వర్క్‌ చేస్తున్నారు. నాకు షూటింగ్స్‌ ఉన్నప్పుడు మా అత్తగారు, అమ్మ వాళ్ల సాయం ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement