కేరళ కుట్టి భావన గుర్తుందా..!
అప్పుడప్పుడూ తెలుగులోనూ కనిపించే ఈముద్దుగుమ్మ తన పెళ్లిపై వచ్చిన రూమర్లను కొట్టి పారేసింది. ఉన్నట్టుండి ఫోన్ కాల్స్, మెసేజ్‌లు ముంచెత్తడంతో ‘పెళ్లి చేసుకొనేది మా సోదరుడు.. నేను కాదు. అదీ వచ్చే ఏడాది జనవరిలో’ అంటూ స్పష్టం చేసిందీ సుందరి.
ప్రస్తుతం మలయూళ, కన్నడ చిత్రాలతో తాను చాలా బిజీగా ఉన్నానని.. మరికొన్ని కమిట్‌మెంట్స్ వల్ల వేరే ప్రాజెక్ట్‌లు ఓకే చేయులేకపోతున్నానని.. ఇప్పుడప్పుడే పెళ్లి గురించి ఆలోచన లేదని చెప్పింది.