అతణ్ణి రెండేళ్లుగా ప్రేమిస్తున్నా | yes iamin love : bhavana | Sakshi
Sakshi News home page

అతణ్ణి రెండేళ్లుగా ప్రేమిస్తున్నా

Published Fri, Feb 21 2014 11:42 PM | Last Updated on Sat, Sep 2 2017 3:57 AM

అతణ్ణి రెండేళ్లుగా ప్రేమిస్తున్నా

అతణ్ణి రెండేళ్లుగా ప్రేమిస్తున్నా

 ఔనండి.. నేను ప్రేమలో పడ్డా.. అయితే ఏంటి? అన్నట్లుగా ఉంది భావన వ్యవహారం. ఈ మలయాళ బ్యూటీ ప్రేమలో పడిందనే వార్త గత కొంత కాలంగా ప్రచారంలో ఉంది. ఇన్నాళ్లూ ఈ వార్త నిజం కాదని చెప్పుకుంటూ వచ్చిన భావన, ఇప్పుడు మాత్రం ‘యస్.. యస్.. ఐయామ్ ఇన్ లవ్’ అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. గత రెండేళ్లుగా ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నానని, అయితే అందరూ అనుకుంటున్నట్లు ఇప్పుడే పెళ్లి చేసుకోనని పేర్కొన్నారు. ఈ ఏడాది చివర్లో లేక వచ్చే ఏడాది ప్రారంభంలో పెళ్లి చేసుకుంటానన్నారు. ఇంతకీ మీ మనసు దోచుకున్న ఆ యువకుడు ఎవరు? అని అడిగితే.. అది మాత్రం అడగొద్దంటున్నారు.

అది పూర్తిగా తన వ్యక్తిగతమని, ఆ వివరాల్లోకి వెళ్లొద్దని అంటున్నారు. మొత్తానికి మరో ఏడాది లోపు భావన పెళ్లి చేసుకుంటారని మాత్రం అర్థమవుతోంది. ఈలోపు ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయాలనుకుంటున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement