సినిమా ఇండస్ట్రీలో వచ్చామా, పనిచేశామా, వెళ్లిపోయామా అనేలా ఉంటారు. మరికొందరు మాత్రం ఊహించని వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. భావన అలాంటి హీరోయిన్ అని చెప్పొచ్చు. 'మహాత్మ', 'ఒంటరి' లాంటి తెలుగు సినిమాలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ జీవితంలో కాంట్రవర్సీలు బోలెడు ఉన్నాయి. కిడ్నాప్, లైంగిక దాడికి గురవడం, అబార్షన్ అయిందని రూమర్స్.. ఇలా చెప్పుకొంటూ పోతే చాలానే ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనపై వచ్చిన పుకార్ల గురించి స్పందించింది.
(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)
కేరళకు చెందిన భావన.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు కిడ్నాప్ అయింది. ఓ స్టార్ హీరోని ఈమెని ఎత్తుకెళ్లి, లైంగిక దాడికి పాల్పడ్డాడని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ కేసులో మలయాళ హీరో దిలీప్‌ని అరెస్ట్ కూడా చేశారు. ఈ రచ్చ తర్వాత కొన్నాళ్లకు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన భావన.. 2018లో నిర్మాత నవీన్ ని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం సినిమాలు చేసుకుంటోంది. తాజాగా ఈమె నటించిన 'నడికర్' అనే మలయాళ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఈ ప్రమోషన్లలో మాట్లాడుతూ.. అప్పట్లో తన అబార్షన్ గురించి వచ్చిన రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది.
'అమెరికా వెళ్లి అబార్షన్ చేయించుకున్నానని అన్నారు. అలువాలో గర్భస్రావం అయిందని, కొచ్చి-చెన్నైలోనూ అబార్షన్ చేయించుకున్నానని ప్రచారం చేశారు. ఇలా పలుమార్లు జరగడం వల్ల నేను చనిపోయానని కూడా మాట్లాడారు. వాటిని ఇప్పుడు గుర్తుచేసుకుంటే చిరాకేస్తోంది. అప్పుడు నా గురించి వచ్చిన రూమర్స్ విని మెంటల్‌గా చాలా డిస్ట్రబ్ అయ్యాను. కానీ ఇప్పుడు మాత్రం స్ట్రాంగ్‌గా నిలబడ్డాను' అని భావన చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: నీ ముఖానికి డ్యాన్సా? ట్రోలింగ్‌పై స్పందించిన నటి)
Comments
Please login to add a commentAdd a comment