
కారు డ్రైవర్లే కాలనాగులు!
ఎవర్ని నమ్మాలో... ఎవర్ని నమ్మకూడదో... ఆలోచించాల్సిన పరిస్థితి. ఒకరు మాజీ.. ఇంకొకరు తాజా.. ఇద్దరూ కారు డ్రైవర్లే. హీరోయిన్ భావన పట్ల కాలనాగులుగా మారారు. తెలుగులో ‘ఒంటరి’, ‘మహాత్మ’ పాటు పలు మలయాళ, కన్నడ చిత్రాల్లో భావన హీరోయిన్‌గా నటించారు. స్వతహాగా ఆమె మలయాళీ.
శుక్రవారం రాత్రి కేరళలోని ఎర్నాకుళంలో ఓ సినిమా షూటింగ్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు దుండగులు ఆమె కారును అడ్డుకున్నారు. తర్వాత అందులోకి ఎక్కి భావనను లైంగిక వేధింపులకు గురి చేశారు. సుమారు గంటన్నర పాటు అనుచితంగా ప్రవర్తించి, ఫొటోలు, వీడియో లు తీసుకుని ఆ తర్వాత వదిలేశారు. అక్కణ్ణుంచి దగ్గరలోని ఓ నిర్మాత ఇంటికి వెళ్లిన భావన.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తుల్లో ఒకరు... భావన మాజీ కారు డ్రైవర్ సునీల్‌కుమార్ కావడం గమనార్హం. తన గురించి లేనిపోని అసత్యాలు ప్రచారం చేస్తున్నాడనే ఉద్దేశంతో కొంతకాలం క్రితం అతణ్ణి ఉద్యోగం నుంచి తొలగించారు భావన. ఈ మాజీ డ్రైవర్‌కిSతాజా డ్రైవర్ మార్టిన్ సహకారం అందించాడని పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తర్వాత సమాజంలో అమ్మాయిల భద్రత పట్ల పలువురు హీరోయిన్లు ఆందోళన వ్యక్తం చేశారు.