ట్రైనీ ఐపీఎస్ అధికారిపై కేంద్ర హోంశాఖ సస్పెన్షన్ వేటు వేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ శిక్షణ నుంచి సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. కాగా వివరాల్లోకి వెళితే... కడపకు చెందిన ట్రైనీ ఐపీఎస్ అధికారి మహేశ్వరరెడ్డి తనను మోసం చేశాడంటూ భావన బిరుదల గతంలో హోంశాఖతో పాటు, పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆమె ఫిర్యాదుతో పోలీసులు మహేశ్వరరెడ్డిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.