ప్రేమ పెళ్లి పెటాకులై.. పరిహారం డబ్బు కోసం అమ్మాయి తరఫు బంధువు వ్యవహరించిన తీరుతో మనస్తాపం చెంది యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన అమరాపురం మండలొ కొర్రేవులో మంగళవారం జరిగింది. మృతుని తండ్రి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొర్రేవులో ఉప్పర రంగనాథ్ ఇంటికి కోడలి వరుసయ్యే యువతి నెలన్నర క్రితం గుడిబండ మండలం నుంచి వచ్చింది. ఈ ఇంటి సమీపంలోనే ఉంటున్న సన్న హనుమంతగౌడ (22)కు ఆ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఈ క్రమంలో ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం ఊరిలోకి తిరిగి వచ్చారు. కులాలు వేరు కావడంతో ఈ పెళ్లిని రంగనాథ్ ఒప్పుకోలేదు. యువతిని ఇంటికి తీసుకెళ్లి.. ఆమె మెడలోని తాళిబొట్టును తెంచేశాడు. అనంతరం యువతిని స్వగ్రామానికి పంపించేశాడు.