మొరట్టు ఖైదీతో భావన | Bhavana in Murattu Kaidhi movie | Sakshi
Sakshi News home page

మొరట్టు ఖైదీతో భావన

Published Tue, Feb 17 2015 12:51 AM | Last Updated on Sat, Sep 2 2017 9:26 PM

మొరట్టు ఖైదీతో భావన

మొరట్టు ఖైదీతో భావన

కన్నడ నటుడు సుదీప్ మొరట్టు ఖైదీగా తమళ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయనకు జంటగా భావన నటించారు. నాన్ ఈ చిత్రంతో విలన్‌గా కోలీవుడ్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్న సుదీప్ ఈ చిత్రం ద్వారా హీరోగా అలరించేందుకు సిద్ధమయ్యా రు. కన్నడంలో సూపర్ స్టార్‌గా ఎదిగిన సుదీప్‌కు తమిళంలోనూ రాణించాలనే ఆశ, ఆకాంక్ష చాలా కాలంగా ఉంది. ఈ మొరట్టు ఖైదీ చిత్రంతో తన కోరిక నెర వేరుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర కృప ఎంటర్ ప్రైజెస్ పతాకంపై నిర్మాత ఉదయ్ కే మెహతా రూపొందిస్తున్నారు.
 
 శశాంక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రముఖ టాలీవుడ్ నటుడు జగపతి బాబు ముఖ్య పాత్ర పోషించడం విశేషం. ఇతర పాత్రల్లో నాజర్, ప్రదీప్ రావత్, రవి శంకర్, ఆశీష్ విద్యార్థి వంటి సీనియర్ నటులు నటించారు. హరికృష్ణ సంగీతాన్ని, శేఖర్ చంద్రు ఛాయాగ్రహణం అందించారు. మంచి వాణిజ్య విలువలతో జనరంజకంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని కోవై వేల్ ఫిల్మ్స్ సంస్థ తమిళనాడు  విడుదల హక్కులను సొంతం చేసుకుని త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తోంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement