పెనుకొండ: చుట్టుపక్కల వాళ్లు తన గురించి తప్పుగా అనుకుంటున్నారనే బాధతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అనంతపురం జిల్లా పెనుకొండ మండలం మంగాపురంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు... గ్రామానికి చెందిన భావన(15) స్థానిక పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. ఈ క్రమంలో రెండు రోజుల కిందట బాలిక పాఠశాలకు వెళ్తున్న సమయంలో పెనుకొండకు చెందిన ఆటో డ్రైవర్ ఆమెను కిడ్నాప్ చేశాడు.
ఆ తర్వాత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. బాలిక తిరిగి ఇంటికి చేరింది. ఈ విషయం పై తన గురించి చుట్టుపక్కల వాళ్లు తప్పుగా అనుకుంటున్నారని మనస్థాపానికి గురైన భావన శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో అందరు నిద్రపోయిన తర్వాత చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.