
హీరోయిన్ భావన్, నిర్మాత నవీన్ ల వివాహం ఈరోజు ఉదయం కేరళలోని త్రిసూర్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కొద్దిమంది సన్నిహితులు బందు మిత్రులు మాత్రమే హాజరయ్యారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేసిన భావన ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. భావన హీరోయిన్ గా నటించిన ఓ సినిమాను నవీన్ నిర్మించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డా ఈ జంట పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. భావన తెలుగులోనూ మహాత్మా, ఒంటరి లాంటి సినిమాలతో అలరించింది.
Comments
Please login to add a commentAdd a comment