నయా ప్రేమ! | Ganesh Venkatraman likes to act with nayanatara | Sakshi
Sakshi News home page

నయా ప్రేమ!

Published Wed, Jun 25 2014 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 9:23 AM

నయా ప్రేమ!

నయా ప్రేమ!

 ప్రేమ గుడ్డి దంటారు. అది మహా చెడ్డది కూడా. కొందరిని కవ్విస్తుంది, మురిపిస్తుంది. చివరికి మాయ చేస్తుంది. చిత్ర రంగంలో చాలామంది నటీనటులు ప్రేమ మాయలో పడి కొట్టుకుపోయారు. తాజాగా నటి నయనతారకు కూడా ప్రేమ కలసి రాలేదు. ఈ భామను అదే ప్రేమ రెండుసార్లు  మోసం చేసింది. అయినా నయనకు మనో నిబ్బరం ఎక్కువ. ముచ్చటగా మూడవసారి ప్రేమలో పడినట్టు తాజా ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ జయం రవికి జంటగా ఆయన సోదరుడు జయం రాజా దర్శకత్వంలో తనీ ఒరువన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార పోలీసు అధికారిగా లాఠీ చేతబడుతున్నారట. ఇంతవరకు బాగానే ఉంది.
 
 ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో గణేష్ వెంకట్రామన్ నటిస్తున్నారు. ఈయన నయనతార స్నేహితుడిగా నటిస్తున్నారట. అయితే నిజ జీవితంలో కూడా వీరిద్దరూ చాలా స్నేహితంగా మెలగుతున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. ఇద్దరూ కలసి ఎక్కువ సమయం గడిపేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయాన్ని నటుడు గణేష్ వెంకట్రామన్ ఖండిస్తున్నారు. నయనతార తన సహ నటి మాత్రమేనని, తమ మధ్య మంచి స్నేహం మినహా మరేమీ లేదని అంటున్నారు. ఎవరైనా మొదట్లోనే అవును మేము ప్రేమించుకుంటున్నాం అని అంటారా? అయితే నిప్పు లేనిదే పొగ రాదన్న సామెత వీరికి తెలియంది కాదు సుమా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement