PV narsimha rao
-
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న
-
Hyderabad: ఇదేం ట్రెండ్రా నాయనా.. నడిరోడ్డుపై రొమాన్స్ చేసిన జంట
హైదరాబాద్: బీహార్‌లోని గయ, ఉత్తరప్రదేశ్‌లోని హపూర్, ఘజియాబాద్‌ల్లో రోడ్లపై ప్రయాణిస్తున్న జంటలు వికృత చేష్టలకు పాల్పడిన వీడియోలు ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి ఓ ఘటనే శనివారం రాత్రి నగరంలోని పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్ వేపై చోటు చేసుకుంది. అయితే ఉత్తరాదిలోని జంటలు ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తూ రెచ్చిపోగా... నగరంలోని జంట మాత్రం మరో అడుగు ముందుకు వేసి కారును వాడుకుంది. శనివారం రాత్రి ఎక్స్‌ప్రెస్ వేపై ఓ కియా కారు శంషాబాద్ వైపు నుంచి మెహదీపట్నం వైపు ప్రయాణించింది. ఇది ఎక్స్‌ప్రెస్ వేపై ఉండగానే దాని సన్‌రూఫ్ ఓపెన్ చేసుకున్న ఓ జంట అందులోంచి బయటకు నిలబడింది. పబ్లిక్‌గానే ఆలింగనాలు, చుంబనాలతో అభ్యంతరకరంగా ప్రవర్తించింది. ఆ కారు వెనుకే మరో కారులో ప్రయాణిస్తున్న వారు ఈ దృశ్యాలను తమ సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఇవి ఆదివారం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఉత్తరాదిలోని నగరాలు, పట్టణాల్లో ఇలా వీధుల్లో వికృత చేష్టలకు పాల్పడిన జంటల్ని అక్కడి పోలీసులు సోషల్ మీడియాలోని వీడియోల ఆధారంగా పట్టుకుని చర్యలు తీసుకున్నాయి. ఎక్స్‌ప్రెస్ వే జంట విషయంలో ఇక్కడి పోలీసుల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి. -
ఆస్ట్రేలియాలో పీవీ విగ్రహావిష్కరణ
సాక్షి, హైదరాబాద్/సనత్‌నగర్: భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఆస్ట్రేలియాలో శనివారం ఆవిష్కరించారు. ఆ దేశ రాజధాని సిడ్నీలోని స్ట్రాత్‌ఫీల్డ్ ఉద్యానవనంలో ఏర్పాటుచేసిన పీవీ విగ్రహాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, పీవీ కుమార్తె వాణీదేవి, ఎన్ఆర్ఐ ఓవర్సీస్ కన్వీనర్ మహేశ్ బిగాల, అక్కడి నగర మేయర్ మాథ్యూ బ్లాక్మెర్, కౌన్సిలర్ సంధ్యారెడ్డి, హార్న్ కౌన్సిలర్ శ్రీని పిల్లమర్రితో కలిసి ఆవిష్కరించారు. ఆస్ట్రేలియాలో మహాత్మాగాంధీ విగ్రహం తరువాత ప్రతిష్ఠించిన రెండో భారతీయుడి విగ్రహం పీవీదే కావడం గమనార్హం. భారతదేశ పాలనావ్యవస్థలో అనేక మార్పులు, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశ అభ్యుదయానికి పీవీ పాటుపడ్డారని పలువురు వక్తలు కొనియాడారు. పీవీ సంస్కరణల ఫలితాలను, ప్రయోజనాలను ప్రస్తుతం భారత్ ప్రజలు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమానికి డాక్టర్ హేమచందర్‌రావు కల్వకోట, సుజాత కల్వకోట, భారతి, విజయ హాజరయ్యారు. ఇదీ చదవండి: యూకే లేబర్ పార్టీ లాంగ్‌లిస్ట్‌లో ఉదయ్ -
PV Narasimha Rao: ఇంతింతై వటుడింతై అన్నట్లుగా..
సాక్షి, మంథని(జగిత్యాల): ఇంతింతై వటుడింతై అన్నట్లుగా.. లక్నేపల్లి అనే ఒక కుగ్రామంలో పుట్టి, రాజకీయ పరమపదసోపానంలో ఒక్కో మెట్టును అధిగమించి భారత ప్రధానిగా అత్యున్నత స్థానాన్ని అధిష్టించిన అపర చాణక్యుడు పీవీ నరసింహారావుకు నేడు శత జయంతి. 1921 జూన్ 28లో జన్మించిన పీవీ 1957లో మొట్టమొదటిసారిగా మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించారు. ఇప్పటికీ ఆయన జ్ఞాపకాలు ఈ ప్రాంత ప్రజల మదిలో కదలాడుతూనే ఉన్నాయి. పీవీ శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. మంథని నుంచే ప్రారంభం విద్యాభ్యాసం అనంతరం న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించేందుకు వచ్చిన పీవీ, స్వామి రామానంద తీర్థ శిష్యరికంలో మొదట 1952లో కరీంనగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. అటు తర్వాత 1957లో మొదటిసారిగా మంథని నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం వరుసగా 1962, 1967, 1972 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఉన్నత విద్యాశాఖ మంత్రి, న్యాయశాఖ మంత్రిగా సేవలందించిన ఆయనను కాంగ్రెస్ అధిష్టానం 1972లో ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేయడంతో 1977 వరకు పనిచేశారు. ఆ తర్వాత హన్మకొండ నుంచి రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు. 1984లో హన్మకొండ, మహారాష్టలోని రాంటెక్ నుంచి ఎంపీగా పోటీ చేయగా హన్మకొండలో ఓటమి చవిచూసినా, రాంటెక్‌లో విజయం సాధించారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ మంత్రివర్గంలో వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహించిన ఆయన అపార అనుభవాన్ని గడించారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు గాడితప్పిన భారత ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు నూతన సంస్కరణలను ప్రవేశపెట్టి ప్రపంచ ముఖచిత్రంలో మన దేశ ఖ్యాతిని నిలబెట్టిన బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ. 1991లో భారత ఆర్థిక నిల్వలు తరిగిపోయి ప్రధాని చంద్రశేఖర్ హయాంలో బంగారం నిల్వలను విదేశాల్లో తనఖా పెట్టాల్సిన పరిస్థితుల్లో ప్రధానిగా పగ్గాలు చేపట్టిన పీవీ ఆర్థిక నిపుణుడు మన్మోహన్‌సింగ్‌కు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు అప్పగించాడు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా నూతన ఆర్థిక సంస్కరణలకు తెర తీశారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడమే కాకుండా అభివృద్ధి చెందేందుకు దోహద పడ్డాడు. కేంద్రీయ విద్యాలయాలు. భూసంస్కరణలు, వన్యప్రాణి సంరక్షణ చట్టాలు లాంటి అనేక సంస్కరణలకు రూపకర్త అయిన పీవీ చిరస్మరణీయుడు. ప్రధానిగా పీవీ 1991లో రాజీవ్ గాంధీ హత్యానంతరం రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉన్న పీవీని ప్రధాని పదవి వెతుక్కుంటూ వచ్చింది. దేశంలో కాంగ్రెస్ సంపూర్ణ మెజార్టీ రావడంతో ప్రధానిగా పీవీ పేరునే పార్టీ పెద్దలు ప్రతిపాదించారు. పీవీనే ప్రధాని పదవికి అర్హుడని ఏకగ్రీవంగా మద్దతు తెలుపడంతో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆరు నెలల్లో కర్నూలు జిల్లా నంద్యాల నుంచి ఎంపీగా పోటీ చేసి, 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1991 నుంచి 1996 వరకు ప్రధానిగా పనిచేశారు. ప్రధానిగా దేశంలో ఉన్న ప్రధాన సమస్యలను పరిష్కరించిన పీవీ ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారు. చదవండి: Jagananna Colonies: 3 రోజుల్లో లక్షల ఇళ్లు -
చేపతో కాజాలు ఎలా చేయాలంటే?
కూసుమంచి: ‘నీకేం తెలుసు.. చేపల పులుసు’ అని తేలిగ్గా తీసిపారేయొద్దు. చేపలతో 90 రకాల వెరైటీలు చేయొచ్చని తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఈ వంటకాల తయారీలో మహిళలకు శిక్షణనిస్తూ ఘు మఘుమలాడుతోంది ఖమ్మం జిల్లా పాలేరులోని పీవీ నర్సింహారావు మత్స్య పరిశోధన కేంద్రం. పోషకాహార విలువలు కలిగిన చేపలు.. చికెన్, మటన్‌తో పోలిస్తే చౌకగానే లభిస్తాయి. చేపలతో చేసే విభిన్న వంటకాలకు ప్రస్తుతం మార్కెట్లో మం చి గిరాకీ ఉంది. ఈ క్రమంలోనే చేపల వంటకాల తో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మత్స్య పరి శోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విద్యాసాగర్‌రెడ్డి పర్యవేక్షణలో మహిళలకు శిక్షణనిస్తున్నారు. ఇక్కడ ఇదే తొలిసారి మహిళా మత్స్యకారులు కేవలం చేపలను పట్టి విక్రయిస్తేనే లాభం లేదు.. చేపల ఉత్పత్తులతో వంటకాలు తయారుచేసి విక్రయిస్తే అదనపు ఆదాయం పొందవచ్చనే ఉద్దేశంతోనే ఇప్పటివరకు మూడు దఫాలుగా 180 మంది మహిళా మత్స్యకారులకు శిక్షణనిచ్చారు. ప్రస్తుతం పంజాబ్‌లోని లూథియానాకు చెందిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎస్సీ సబ్‌ప్లాన్‌లో భాగంగా ఎస్సీ మహిళలకు దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా చేపల ఉత్పత్తుల తయారీలో శిక్షణనిస్తున్నారు. ఇందుకు వేదికైన పాలేరులోని మత్స్య పరిశోధన కేంద్రంలో ప్రస్తుతం కూసుమంచి మండలం గైగొళ్లపల్లికి చెందిన 50 మంది మహిళలు తర్ఫీదు పొందుతున్నారు. శిక్షణానంతరం వీరంతా తాము తయారుచేసే చేపల ఉత్పత్తులతో స్వయం ఉపాధి కల్పించుకోవచ్చు. మాంసంతో పచ్చళ్లు.. స్నాక్స్ ఏపీలోని భీమవరానికి చెందిన చేపల ఉత్పత్తుల తయారీ నిపుణురాలు పెన్మత్స భాగ్యలక్ష్మి పలు వంటలను పరిచయం చేస్తున్నారు. చేపల పులుసు, ఫ్రై, పచ్చడితోపాటు చేప కాజాలు, చేప చపాతీ, చేప ఫింగర్స్, చేప బజ్జీ, చేప పసంద్, చేప బిర్యానీ, ఫిల్లెట్స్, లాలీపాప్, సమోసాలు, రొయ్యల పొడి, రొయ్యల రోల్స్.. ఇంకా చేప మెత్తటి మాంసంతో కూర, పచ్చళ్లు, బోన్స్.. అందులోని కీమాతో స్నాక్స్.. ఇలా చేపలతో 90 రకాల వంటలను చేయవచ్చని ఇక్కడ చెబుతున్నారు. -
పీవీకి భారతరత్న ఇవ్వాల్సిందే..!
వాషింగ్టన్: భారత మాజీ ప్రధాని.. మన తెలుగు జాతి ముద్దు బిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని ప్రవాస భారతీయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని తెలుగువారంతా పీవీకి భారతరత్న ఇవ్వాలంటూ రిమెంబరింగ్ పీవీ, రిమైండ్ పీపుల్, రిక్వెస్ట్ ఇండియన్ గవర్నమెంట్ భారతరత్న ఫర్ పవీ అంటూ మూడు ఆర్ల సిరీస్‌తో ఉద్యమంతో ముందుకు కదులుతున్నారు. ఈ మేరకు పీవీ శతాబ్ది జన్మదినం సందర్భంగా రిమెంబరింగ్ పీవీ నరసింహా రావు, రిమైండ్ పీపుల్, రిక్వెస్ట్ భారత ప్రభుత్వం భారతరత్నఫర్ పీవీ అని డిమాండ్ చేస్తు ప్రవాస భారతీయ సంఘాలు కార్యక్రమాన్ని చేపట్టాయి. అంతేగాక ఆన్లైన్ ద్వారా కూడా ఈ సంఘాలు భారతీయుల మద్దతును కోరుతున్నాయి. అనేక ప్రవాస భారతీయ సంఘాలు, సంస్థలు పీవీ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అక్టోబర్ 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు పీవీ ఘనతను స్మరించుకుంటూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి ఈ కార్యక్రమాల ద్వారా పీవీకి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌కు మద్దతు కూడగడుతున్నాయి. అమెరికాలోని వివిధ రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా పీవీ నరసింహారావు గురించి తెలిసిన ప్రముఖులు, మేధావులు నాయకులు కూడా ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. అమెరికాలోని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్( ఏఏపీఐఆర్) ఉత్తర అమెరికా తెలుగు సంఘము (టీఏఎన్‌ఏ), అమెరికా తెలుగు సంఘం (ఏటీఏ) ఉత్తర అమెరికా తెలుగు సంఘం (ఎన్ఏటీఎస్), ఉత్తర అమెరికా తెలుగు సమితి (ఎన్ఏటీఏ) సిలికాన్ ఆంధ్ర తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్), సెయింట్ లూయిస్ గుజరాత్ సమాజ్‌లతో పాటు అమెరికాకు చెందిన 81 భారతీయ సంఘాలన్నీ ముక్తకంఠంతో పీవీకి భారతరత్న ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళుతున్నాయి. భారతరత్న ఫర్ పీవీ అనే అభ్యర్థనను భారత ప్రభుత్వం గుర్తించేలా చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి. పీవీ శత జయంతోత్సవాలు జరుగుతున్న ఈ తరుణంలో ఆయనకు భారతరత్న వచ్చే వరకు తెలుగు సంఘాలు తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేస్తున్నాయి. అంతేగాక పీవీ ప్రాముఖ్యత, భారతీయ చరిత్రలో ఆయన స్థానం వివరిస్తూ... పీవీకి భారతరత్న అనే వినతి పత్రంపై ప్రవాస సంఘాలు సంతకాలు చేశాయి. అక్టోబర్ 2న ప్రారంభించిన ఈ సంతకాల సేకరణ ఇప్పటికీ దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ కార్య నిర్వాహక బృంద సభ్యులు స్వర్ణ ప్రసాద్, గుళ్ళపల్లి శ్రీనివాస్, డాక్టర్ అశోక్ కుమార్, చింతా ప్రవీణ్, తాళ్లూరి శ్రీధర్, అశ్విన్ పటేల్, కాజా విశ్వేశ్వర రావు (సెయింట్ లూయిస్ ఎమ్ఓ), బడ్డి అశోక్, దేవబత్తిని హరి (డెట్రాయిట్, ఎమ్ఐ), మేడిచెర్ల మురళీకృష్ణ, కపిల ప్రకాష్, శరత్ చంద్ర (ఎడిసన్, ఎన్జే), పురం ప్రవీణ్ (అట్లాంటా, జీఏ), కొండెపు సుధ (డీసీ), చల్లా కవిత( వాషింగ్టన్ డీసీ),అట్లూరి శ్రీహరి (ఎల్ఏ) కల్వకోట సరస్వతి (ఓహెచ్) ఇలా చాలా మంది ప్రవాస భారతీయ సంఘాల ప్రతినిధులు పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. అంతేకాదు ఈ సంద్భంగా పీవీ నరసింహారావు మీద ప్రత్యేక సంచికను కూడా వెలువరించనున్నారు. తమ ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి మద్దతుకై ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని వివరాలూ సోషల్ మీడియాలో ప్రచురిస్తున్నారు. సాధారణ పౌరులు కూడా (petition at: https://www.change.org/CTIPetitionBharatRatna4PV) ఈ లింక్ ద్వారా సంతకం చేసి తమవంతుగా మద్దతుగా ఈ ఉద్యమంలో పాల్గొనాలని ఎన్ఆర్ఐ సంస్థలు కోరుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో చూడాలంటే ఈ కింది లింక్‌లు క్లిక్ చేయండి BharatRatna4PV YouTube Channel Facebook: https://m.facebook.com/BharatRatna4PV-104140028106254 YouTube: https://youtube.com/channel/UCM3UlMkHF6rWH_KEPiCnZ6A BharatRatna4PV Short Film Teaser: https://youtu.be/KTTU2cJ9ENE -
విదేశీ వ్యవహారాల్లో పీవీది చెరగని ముద్ర
సాక్షి, హైదరాబాద్: ఇరుగుపొరుగు దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పడంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు సఫలీకృతమయ్యారని, విదేశాంగ వ్యవహారాల్లో ఆయన చెరగని ముద్ర వేశారని లోక్‌సభ సభ్యుడు, విదేశీ వ్యవహారాల శాఖ మాజీమంత్రి శశిథరూర్ అన్నారు. పీవీ హయాంలో అమెరికాతో ఆర్థికంగా బలమైన ఒప్పందాలు జరిగాయని, విదేశాంగ విధానంలో ఆయన అనేక మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. ఆదివారం టీపీసీసీ ఆధ్వర్యంలో పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్పర్సన్ గీతారెడ్డి అధ్యక్షతన ఇందిరాభవన్‌లో జరిగిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. దక్షిణాసియా దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడంతోపాటు లుక్ ఈస్ట్, లుక్ వెస్ట్ పాలసీ రూపొందించిన ఘనత పీవీకి దక్కుతుందన్నారు. ఆర్థికంగా ప్రపంచ దేశాలకు భారత్‌ను ఒక రోల్‌మోడల్‌గా నిలిపారని కొనియాడారు. సరళీకరణ విధానాలను ప్రవేశపెట్టి కేవలం రెండేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను 36 శాతం పెంచారని తెలిపారు. పీవీ నేతృత్వంలో భారత్.. ప్రపంచ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిందని, ప్రధానిగా ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం దేశం అభ్యున్నతికి కారణమైందని అన్నారు. దేశం అణ్వాయుధ సాంకేతికతను సాధించడంలో కీలకపాత్ర పోషించారని, 1993 లో చైనాలో పర్యటించడం ద్వారా స్నేహహస్తం అందించి సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించారని గుర్తు చేశారు. మైనారిటీ ప్రభుత్వాన్ని తన చాణక్యంతో నడిపిన పీవీ ప్రపంచ స్థాయి మేధావి అని, పది భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే మేధస్సు ఉన్నగొప్ప వ్యక్తి అని శశిథరూర్ కొనియాడారు. పీవీ ప్రధానిగా నేను సైన్యంలో..: ఉత్తమ్ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పీవీ నర్సింహారావు నాయకత్వంలో భారతదేశం గొప్పగా వెలుగొందిందని వ్యాఖ్యానించారు. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు తాను సైన్యంలో ఉన్నానని, వాయుసేనను బలోపేతం చేయడం కోసం మిగ్– 21 ఫ్లైట్లు సైన్యంలో ప్రవేశ పెట్టారని, రష్యాతో స్నేహపూర్వక బంధాలను ఏర్పాటు చేసి సైన్యాన్ని బలోపేతం చేశారన్నారు. ఇంకా వెబ్ నార్ లో తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ ఆర్.సి.కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, మాజీ ఎంపీ, కమిటీ గౌరవాధ్యక్షుడు వి.హనుమంతరావు, వైస్ చైర్మన్, ఎమ్యెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి హర్కర వేణుగోపాల్, శ్రవణ్ రెడ్డి పాల్గొన్నారు. డిగ్రీ అధ్యాపకులుగా పదోన్నతులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధ్యాపకులు, లైబ్రేరియన్లుగా పనిచేస్తున్న 33 మందికి డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులు, లైబ్రేరియన్లుగా పదోన్నతులు కల్పిస్తూ కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. 5వ జోన్లో 14 మంది, ఆరో జోన్లో 16 మంది, సిటీ జోన్లో ముగ్గురు పదోన్నతి పొందిన వారిలో ఉన్నారు. -
పీవీకి భారతరత్న ఇవ్వాలి
మొయినాబాద్ రూరల్(చేవెళ్ల): మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు, పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు కె.కేశవరావు అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని తోలుకట్ట సమీపంలో స్వామి రామానందతీర్థ ఔషధ కేంద్రంలో స్వామి రామానందతీర్థ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్పర్సన్ సురభి వాణిదేవి, పరిశోధనా సంస్థ అధ్యక్షుడు పీవీ ప్రభాకర్‌రావు ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహావిష్కరణ, శత జయంతి ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి హాజరయ్యారు. పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కె.కేశవరావు మాట్లాడుతూ.. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహాలను ఆరు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేశామన్నారు. పీవీకి భారతరత్న కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. పార్లమెంట్లో ఆయన విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. పీవీ పేరుతో తెలంగాణలో త్వరలో ఆడిటోరియం నిర్మించేందుకు చర్య లు తీసుకుంటున్నట్లు వివరించారు. మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి మాట్లాడుతూ.. పీవీ శతజయంతి ఉత్సవాలు రాష్ట్రంలో నిర్వహించేం దుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. మన ప్రాంత మహనీయుల సేవలను భావి తరాలకు తెలియజేసే అవకాశం తెలంగాణ ఏర్పాటుతోనే సాధ్యమైందన్నారు. -
ఈనెల 24 నుంచి పీవీ శతజయంతి ఉత్సవాలు
సాక్షి, హైదరాబాద్ : ఎవరెన్ని చెప్పినా మాజీ ప్రధాని పి.వి. నర్సింహారావు కాంగ్రెస్ కుటుంబానికి చెందిన వ్యక్తి అని, ఆయన శత జయంతి వేడుకలు నిర్వహించడం తమకు గర్వకారణమని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఏడాది పొడవునా ఆయన శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఆదివారం గాంధీభవన్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటయిన పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ సమా వేశం జరిగింది.ఇందులో ఉత్తమ్‌తో పాటు మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్, మాజీ మంత్రి గీతారెడ్డి, గౌరవాధ్యక్షుడు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, వైస్ చైర్మన్, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కన్వీనర్ మహేశ్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్యే సీతక్క, కమిటీ సభ్యులు మల్లు రవి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, దాసోజు శ్రావణ్, బొల్లు కిషన్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా ఉత్తమ్ మాట్లాడుతూ ఈనెల 24 నుంచి పీవీ శతజయంతి ఉత్సవాలు ప్రారంభించనున్నట్టు చెప్పారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టేందుకు గాను అదే రోజున పీవీ తన మొదటి ప్రసంగం చేశారని, అందుకే ఆ రోజు నుంచి శతజయంతి ఉత్సవాలు ప్రారంభించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈనెల 24న జూమ్ యాప్ ద్వారా 1000 మంది పాల్గొనేలా కార్యక్రమం చేపట్టాలని, ఇందిరా భవన్లో ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి వక్తల ప్రసంగాలు వినేలా ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమా వేశానికి వక్తలుగా పీవీ సన్నిహితుడు, మాజీ ప్రధా ని మన్మోహన్ సింగ్, కేంద్ర మాజీ మంత్రులు చిదంబరం, జై రాం రమేష్‌లు జూమ్ యాప్ ద్వారా మాట్లాడేలా ఆహ్వానించాలని నిర్ణయించారు. అదే విధంగా ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలు, పీవీ కుటుంబీకులే వారి సందేశాలను వీడియో రూపంలో పంపుతారని, వాటిని కూడా ప్రదర్శించాలని ఉత్తమ్ చెప్పారు. ఈ సమావేశం అనంతరం ఇందిరా భవన్లో ఈనెల 24న జరిగే కార్యక్రమ ఏర్పాట్లను ఉత్తమ్ పరిశీలించారు. ఆ తర్వాత గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పీవీ నరసింహారావు వంద శాతం కాంగ్రెస్ వాది అని అన్నారు. వంగర గ్రామం నుంచి సామాన్య కాంగ్రెస్ కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, దేశ ప్రధానిగా పీవీ ఎదిగారని చెప్పారు. -
కౌలలాంపూర్‌లో పీవీ శతజయంతి ఉత్సవాలు
కౌలలాంపూర్: తెరాస మలేషియా, తెలంగాణ మలేషియా అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెరాస కో ఆర్డినేటర్ మహేష్ బిగాల అధ్యక్షతన మంత్రి కేటీఆర్ సమక్షంలో 51 దేశాల తెలుగు సంఘాల ప్రతినిధులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు జరిగాయి. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మలేషియా తెలంగాణ అసోసియేషన్, తెరాస మలేషియా ఆధ్వర్యంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ కోర్ కమిటీ సభ్యులతో కలిసి పీవీ జయంతి ఉత్సవాలను మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ఘనంగా జరిపారు. (నెహ్రూను మించిన ప్రధాని పీవీ) ఈ సందర్భంగా మలేషియా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు సైదం తిరుపతి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాలు అన్నీ కలిసి ఈ వేడుకలను నిర్వహిచండి అని పిలుపునివ్వడం కేసీఆర్ గొప్పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస మలేషియా అధ్యక్షుడు చిట్టిబాబు మాట్లాడుతూ పీవీ చేసిన కృషిని గుర్తించిన కేసీఆర్.. వారికి తగిన గుర్తింపునివ్వడం చాలా సంతోషంగా ఉందంటూ కేసీఆర్‌కు తెరాస మలేషియా తరపున ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. పీవీ శతాబ్ది జయంతి ఉత్సవాల కమిటీ సభ్యునిగా నియమితులైన తెరాస ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాలకు తెరాస మలేషియా తరపున హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైటా అధ్యక్షులు సైదం తిరుపతి, తెరాస మలేషియా అధ్యక్షులు చిట్టి బాబు చిరుత, కమిటీ సభ్యులు కుర్మ మారుతి, గుండా వెంకటేశ్వర్లు, రమేష్ గౌరు, మునిగల అరుణ్, బొయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి, గద్దె జీవన్ కుమార్, సందీప్ కుమార్ లగిశెట్టి, సత్యనారాయణరావ్ నడిపెల్లి, రవితేజ, హరీష్ గుడిపాటి, శ్రీనివాస్ ముల్కల, సాయి హేమంత్, రఘునాత్ నాగబండి, ఓం ప్రకాష్ బెజ్జంకి, శ్యామ్, దిలీప్ కపిడి, రాజేష్ తోడేటి పాల్గొన్నారు. (అచ్చమైన భారత రత్నం) -
పీవీ నరసింహారావుకు సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి : భారత మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు శత జయంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా పీవీ గొప్పతనాన్ని వెల్లడించారు. 'పీవీ నరసింహారావు ప్రస్తుతం మన మధ్య లేకపోయినా ఆయన సేవలు మాత్రం ఎప్పటికి గుర్తుండిపోతాయి. ఆయన ఒక తెలివైన రాజకీయవేత్త, రాజనీతిజ్ఞులు, బహుభాషా పండితుడు. దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారిన సందర్భంలో ప్రధాని పదవి చేపట్టిన పీవీ గొప్ప సంస్కరణలు తీసుకువచ్చారు. దేశాన్ని ఆర్ధిక సరళీకరణ వైపు పరుగులు పెట్టించారు. దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని భవిష్యత్తు తరాల వారు కూడా గుర్తుంచుకుంటారు.' అంటూ పేర్కొన్నారు. -
360 డిగ్రీస్ పర్సనాలిటీ పీవీ: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: భారత్‌కు సంస్కారం, గొప్ప చరిత్ర ఉందని ప్రపంచానికి తెలియజేసిన గొప్ప వ్యక్తి పీవీ నరసింహరావు అని, ఆయనలాంటి వ్యక్తి తెలంగాణ బిడ్డ అయినందుకు గర్వంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం నెక్లెస్ రోడ్డులో పీవీ శతజయంతి ఉత్సవాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా పీవీ జ్ఞానభూమి వద్ద ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..పీవీ నరసింహారావు గురించి చెప్పడానికి కొంత సాహసం కావాలని, ఒక్క మాటలో చెప్పాలంటే 360 డిగ్రీస్ పర్సనాలిటీ పీవీ నరసింహారావు కొనియాడారు. (చదవండి : పీవీ నరసింహారావుకు సీఎం కేసీఆర్ నివాళి) పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలియని, గొప్ప సంస్కరణ శీలి అని అన్నారు. సంస్కరణలకు పీవీ నిలువెత్తు రూపమని సీఎం కీర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. గురుకుల పాఠశాలలను తీసుకొచ్చింది పీవీనే అని, ప్రపంచానికే గొప్ప సందేశాన్ని ఇచ్చిన నేత పీవీ నరసింహరావని.. మన పీవీ మన తెలంగాణ ఠీవీ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. భూసంస్కరణలు తీసుకొచ్చి ఎంతో మంది పేదలకు న్యాయం చేశారన్నారు. 360 డిగ్రీల వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి పీవీ అని,ఆయన ఏ రంగంలో ఉన్న అందులో సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. విద్యాశాఖను మానవవనరుల శాఖగా మార్చడమే కాకుండా నవోదయ పాఠశాలలకు శ్రీకారం చుట్టి అనేక మంది ప్రతిభావంతుల్ని దేశానికి అందించారన్నారు. 360 డిగ్రీలపర్సనాలిటీ అని పీవీ చరిత్రపై ఓ పుస్తకమే రాయొచ్చని సలహా ఇచ్చారు. ఆయన జీవిత చరిత్ర వ్యక్తిత్వ పఠిమను పెంపొదించుకోవడానికి ఉపయోగపడుతందని సీఎం కేసీఆర్ అన్నారు. -
అయ్యా నిజం చెప్పమంటారా...!
సాక్షి, న్యూఢిల్లీ : దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనతో తనకున్న అనుభవాలను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ గుర్తు చేసుకున్నారు. ‘పీవీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు నేను సికింద్రాబాద్ ఎంపీగా ఉన్నాను. అనేకసార్లు వివిధ ప్రజా సమస్యల మీద వారికి పలు వినతిపత్రాలు ఇచ్చాను. ఏపీలో పొగాకు రైతుల సమస్య తీవ్రంగా ఉండేది. ప్రభుత్వం పొగాకు కొనుగోలు చేయకపోవడంతో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులం.. టీడీపీ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర రావు, సీపీఎం నుంచి భీంరెడ్డి నర్సింహా రెడ్డి, సీపీఐ నుంచి ధర్మభిక్షం, బీజేపీ నుంచి నేను పీవీని కలిశాం. ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేసి రష్యాకు ఎగుమతి చేయాలని వినతి పత్రం ఇచ్చాం. ఆయన మొత్తం చదివి మమ్మల్ని చూసి.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. మీరు మంత్రిగా పనిచేశారు. మీకు పరిస్థితులు బాగా తెలుసు. దత్తాత్రేయకు మంత్రిగా అనుభవం లేదు గనుక వారికి తెలియక పోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదుగదా అన్నారు. అప్పుడు నేను ‘మీరు తెలుగు బిడ్డ. మీరు తలుచుకుంటే ఎందుకు వీలుకాదని’అన్నాను. దానికి వారు చిరునవ్వుతో ‘అయ్యా నిజం చెప్పమంటారా? అంటూ.. ఇంతకు ముందు మనం ఎగుమతిచేసిన పొగాకు డబ్బే రష్యా నేటి వరకు మనకు ఇవ్వలేదు. ఇప్పుడు అది పతనావస్థలో ఉంది. మళ్లీ అక్కడకు పొగాకు పంపితే మనకు డబ్బులు రావు. అందుకే ఇది సాధ్యం కాదని సమాధానమిచ్చారు. ఏ విషయమైనా లోతుగా ఆలోచించి నిక్కచ్చిగా చెప్పే పీవీ.. స్థితప్రజ్ఞులు. సాధారణంగా వారి జవాబు మౌనం. కానీ దాన్ని వీడి మాకు వాస్తవాన్ని విశదీకరించారు. ప్రధాని కారుకు అడ్డం పడినా.... ఒకసారి ప్రధాన మంత్రిగా పీవీ హైదరాబాద్ వచ్చినప్పుడు నేను, జి.పుల్లారెడ్డితో కూడిన ప్రతినిధి బృందం అల్ కబీర్ సంస్థను నిషేధించాలని వినతిపత్రం ఇవ్వడానికి రాజ్ భవ¯Œ కు చేరుకున్నాం. మాకు అనుమతి లేదని భద్రతా సిబ్బంది గేటు వద్దనే ఆపారు. అప్పుడు ప్రధాని విమానాశ్రయానికి బయలుదేరి వెళుతూ.. వారు రెండో కారులో ముందు వరుసలో కూర్చొని ఉన్నారు. నేను వారి కారుకు అడ్డంగా వెళ్లాను. ప్రధాని కారుకు అడ్డుపడినపుడు భద్రతా సిబ్బంది కాల్పులు జరిపే అవకాశం ఉన్నప్పటికీ నేను ముందుకు కదిలాను. పీవీ నన్ను గమనించి.. కారును ఆపి నన్ను తన కారులో కూర్చోబెట్టుకున్నారు. ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అప్పాయింట్మెంట్ దొరకలేదేమోనని నన్ను సమాధానపరిచి, కారులోనే ఎయిర్పోర్ట్ వరకు తోడ్కొని వెళ్లి సమస్యను సాంతం విని, దానిపై చర్చించి నానుండి మెమొరాండం తీసుకున్నారు. 1998 లో నేను తొలిసారి అటల్ బిహారి వాజ్‌పేయి ప్రభుత్వంలో పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా ప్రమాణం చేసిన తరువాత మర్యాదపూర్వకంగా నేను పీవీని కలిసేందుకు వారి ఇంటికి వెళ్లా.. వారు పుస్తక పఠనం చేస్తున్నారు. నన్ను ఆప్యాయంగా పలకరించి.. మీరు చాలా కష్టపడి నేడు కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. మీ సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధి లో ‘శ్రీ రామానంద తీర్ధ‘సంస్థ ఉంది. దానికి చెందిన భూమిని కొందరు ఆక్రమిస్తున్నారు. భూమిని రక్షించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆ వివరాలకోసం మాజీ మంత్రి కేవీ కేశవులు కలుస్తారని తెలిపారు. నేను వెంటనే ఆ స్థలాన్ని పరిశీలించి అక్రమ కట్టడాలను తొలగింపజేసి ప్రహరీని కట్టే ఏర్పాటు చేయించాను. తరువాత పీవీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ.. మాట నిలుపుకున్నారు దత్తాత్రేయ .. అని ప్రశంసించారు. పీవీ మేధావి. బహు భాషా కోవిదులు, రాజకీయ దురంధరుడు, దేశం విపత్కర సమయంలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తెచ్చి గాడిన పెట్టిన తొలి ప్రధాని. తెలుగు బిడ్డ, తెలంగాణవాది. ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా ప్రత్యేక ముద్ర వేశారు..’అని బండారు దత్తాత్రేయ తన అనుభవాలను పంచుకున్నారు. -
పీవీ.. అపర మేధావి
సాక్షి, వరంగల్ : పాములపర్తి వెంకట నరసింహారావు. దక్షిణాది నుంచి ప్రధాని పగ్గాలు చేపట్టిన తొలి నాయకుడు... దివాలా అంచున కొట్టుమిట్టాడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను సంస్కరణలతో గాడిన పెట్టిన మహామేధావి... ఐదేళ్లపాటు మైనారిటీ ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపిన అపర చాణక్యుడు.. 9 భారతీయ భాషలతో పాటు 8 విదేశీ భాషలను అనర్గళంగా మాట్లాడిన బహుభాషా కోవిదుడు. స్వాతంత్య్రోద్యమకారుడు, రాజనీతిజ్ఞుడు, మృదుస్వభావి, కవి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఘనతలను, కీర్తిప్రతిష్టలను సొంతం చేసుకున్న అచ్చమైన తెలుగుతేజం మన పీవీ. నేడు ఆయన శత జయంతి. తెలంగాణ ప్రభుత్వం ఆదివారం నుంచి పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పీవీ జీవితంపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. పోరాట వీరుడిగా... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న రుక్నాబాయి–సీతారామారావు దంపతులకు పీవీ నరసింహారావు జన్మించారు. దాదాపు మూడేళ్ల వయసులో కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరకు చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మ ఆయనను దత్తత తీసుకోవడంతో అప్పటి నుంచి పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పీవీ ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ చదివే రోజుల్లోనే అంటే 1938లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరి నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడారు. దీంతో ఓయూ నుంచి ఆయనను బహిష్కరించడంతో ఓ మిత్రుడి సాయంతో నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి నాగపూర్‌లోనే అతని ఇంట్లో ఉంటూ 1940 నుంచి 1944 వరకు ఎల్ఎల్బీ చదివారు. స్వామీ రామానందతీర్థ, బూర్గుల రామకృష్ణారావు అనుయాయిగా స్వాతంత్య్రోద్యమంలో, హైదరాబాద్ విముక్తి పోరాటంలో పీవీ పాల్గొన్నారు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెస్ నాయకులు మర్రి చెన్నారెడ్డి, శంకరరావు చవాన్, వీరేంద్ర పాటిల్‌లతో కలసి పనిచేశారు. 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా స్థానం పొందారు. రాష్ట్ర రాజకీయాల్లో అరంగేట్రం... 1957లో మంథని నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు ఎన్నికయ్యారు. 1962లో తొలిసారి మంత్రి అయ్యారు. 1962 నుంచి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రిగా, 1964 నుంచి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968–71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించారు. సొంత వర్గం లేకున్నా సీఎం పగ్గాలు... కుల ప్రాబల్యం, పార్టీ అంతర్గత వర్గాల ప్రాబల్యం అధికంగా నడిచిన నాటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పీవీది ప్రత్యేక స్థానం. హంగూ ఆర్భాటాలు లేకుండా ఒదిగి ఉండే లక్షణం ఆయనది. తనకంటూ ఒక వర్గం లేదు. బ్రాహ్మణుడైన ఆయనకు కులపరంగా బలమైన రాజకీయ స్థానం లేనట్లే. పార్టీలో అత్యున్నత స్థాయిలో తనను అభిమానించే వ్యక్తులు లేకున్నా పీవీ రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు. 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అనంతరం తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ నేతను సీఎంగా ఎంపిక చెయ్యడం అనివార్యమైంది. దీంతో వివాదాల జోలికి పోని వ్యక్తిత్వం, పార్టీలో ఏ వర్గానికీ చెందని ఆయన రాజకీయ నేపథ్యం 1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి పదవిని సాధించిపెట్టాయి. ముఖ్యమంత్రి పదవి మూణ్ణాళ్ల ముచ్చటే.. ముఖ్యమంత్రిగా పీవీ రికార్డు ఘనమైనదేమీ కాదు. పీఠం ఎక్కీ ఎక్కగానే పార్టీలో అసమ్మతి తలెత్తింది. ఈ విషయమై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ, హైదరాబాద్ మధ్య తిరగడంతోనే సరిపోయేది. ఆ సమయంలోనే ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు తీర్పుతో ఆందోళన చెందిన కోస్తా, రాయలసీమ నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతూ జై ఆం ధ్ర ఉద్యమం చేపట్టారు. పీవీని తెలంగాణ నాయకుల పక్షపాతిగా ఆంధ్ర, రాయలసీమ నాయకులు ఆరోపించారు. ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత మంత్రుల్లో చాలా మంది రాజీనామా చేశారు. దీంతో 1973 జనవరి 8న కొత్త వారితో పీవీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు. కానీ ఆ మర్నాడే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి రాష్ట్రపతి పాలన విధించింది. అలా పీవీ ముఖ్యమంత్రి పదవి ముగిసింది. ఎంపీ నుంచి ప్రధాని వరకు... పీవీ 1977లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. రెండుసార్లు హన్మకొండ నుంచి మరో రెండు పర్యాయాలు మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి, 1991లో ఏపీలోని నంద్యాల నుంచి, 1998లో ఒడిశాలోని బ్రహ్మపూర్ నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. 1980–1989 మధ్య కేంద్రంలో హోం, విదేశాంగ, మానవ వనరుల అభివృద్ధి శాఖలను ఆయన చేపట్టారు. అయితే ఆయన్ను ప్రధాని పదవి అనుకోకుండా వరించింది. 1991 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు. కానీ ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగ్గ నాయకుడు లేకుండా పోయాడు. ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని, పీవీ అందరికీ ఆమోదయోగ్యుడుగా కనిపించడంతో ఆయన్ను ప్రధానిగా ఎంపిక చేసింది. అయితే అప్పటికి ఆయన ఎంపీ కాకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1991 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన గంగుల ప్రతాపరెడ్డి చేత కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయించి అక్కడి ఉప ఎన్నికలో పీవీని నిలిపింది. అలా పీవీ ఆ ఎన్నికలో గెలిచారు. తన ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేకపోయినా రాజనీతిజ్ఞతతో వ్యవహరించి ఐదేళ్ల పరిపాలనా కాలాన్ని పూర్తిచేసుకున్నారు. ప్రధాని పగ్గాలు చేపట్టిన వెంటనే ‘లైసెన్స్ రాజ్’కు తెరదించి దేశాన్ని ఆర్థిక సంస్కరణల బాటలో పరుగెత్తించారు. పీవీ ఇంటిపక్కనే మ్యూజియం పీవీ శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఆయన ఇంటికి మెరుగులు దిద్దుతున్నారు. పురాతన భవనం పక్కనే నిర్మిస్తున్న భవన నిర్మాణం పూర్తయింది. ఆయన స్మారకార్థం పీవీ ఉపయోగించిన కుర్చీ, మంచం, కళ్లజోడు, ఆయన రాసిన, చదివిన పుస్తకాలు మొదలైన 100కి పైగా వస్తువులను ఈ మ్యూజియంలో భద్రపరచి సందర్శకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. వంగర.. సమస్యలతో సతమతం పీవీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక భూ సంస్కరణల చట్టాన్ని అమలు చేయడంలో భాగంగా తనకున్న వెయ్యి ఎకరాల భూమిని వంగర, మంగళపల్లిలోని పేదలకు పంపిణీ చేశారు. అలాగే ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో వంగరలో పలు అభివృద్ధి పనులు జరిగాయి. 1996లో ఆయన పదవికి దూరం కావడం.. 2004 డిసెంబర్ 23న పీవీ మరణించడంతో వంగర నిరాదరణకు గురైంది. పోలీస్ స్టేషన్, పీవీ మోడల్ కాలనీ, రక్షిత తాగునీటి బావి, సీసీ రోడ్ల నిర్మాణం, బాలికల గురుకుల పాఠశాల, 24 గంటలు పనిచేసే ఆస్పత్రి, సబ్‌స్టేషన్, గ్రంథాలయ భవనం మంజూరయ్యాయి. టీటీడీ కళ్యాణ మండపం మంజూరైనా అది అనివార్య కారణాల వల్ల నిర్మించలేదు. ఇక మిగతా పనులన్నీ జరిగాయి. ప్రస్తుతం వంగర గ్రామంలో ఇళ్లు లేని నిరుపేదలు ఇంకా ఉన్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేకపోవడంతో తేలికపాటి వర్షానికే రోడ్లన్నీ బురదమయంగా మారుతున్నాయి. వీధి దీపాలు లేకపోవడంతో రాత్రివేళ గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. వంగర నుంచి రత్నగిరికి, మంగళపల్లికి, మాణిక్యాపూర్‌కు వెళ్లే దారి గుంతల మయంగా మారింది. దీంతో తమ గ్రామ అభివృద్ధిపై దృష్టిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
పీవీకి భారతరత్న ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: ‘పీవీ నరసింహారావు దేశం గర్వించదగ్గ నాయకుడు. దేశ గతిని మార్చినవారు. భారతరత్న పురస్కారానికి సంపూర్ణ అర్హుడు. పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంత్రివర్గం, అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. ప్రధాని వద్దకు నేనే స్వయంగా వెళ్లి భారతరత్న ఇవ్వాలని విన్నవిస్తా’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొ న్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి విభిన్న రంగాల్లో అందించిన విశిష్ట సేవలను గొప్పగా తలచుకునేలా, చిరస్మరణీయంగా శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఏడాదంతా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. పీవీ జన్మదినమైన జూన్ 28న హైదరాబాద్‌లోని పీవీ జ్ఞాన భూమిలో ప్రధాన కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరిమితంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో తాను పాల్గొంటానని, అదే రోజు దాదాపు 50 దేశాల్లో పీవీ జయంతి వేడుకలు నిర్వహిస్తామని, మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమాల నిర్వహణను పర్యవేక్షిస్తారని సీఎం వెల్లడించారు. ఉత్సవాల నిర్వహణకు తక్షణం రూ.10 కోట్ల కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే రోజుల్లో నిర్వహించే కార్యక్రమాలను బట్టి, నిధులు విడుదల చేసుకుంటూ పోతామన్నారు. పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ కె.కేశవరావు, మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు రమణాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి సోమేశ్‌కుమార్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, పీవీ నరసింహారావు కుమారుడు పీవీ ప్రభాకర్ రావు, కుమార్తె వాణిదేవి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.ఉత్సవాల నిర్వహణలో భాగం గా చేయాల్సిన కార్యక్రమాలను సీఎం నిర్దేశించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ► యావత్ దేశ ప్రజలకు ఆయన గొప్పతనం చెప్పుకునేలా జాతీయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలను శత జయంతి ఉత్సవాలకు ఆహ్వానించాలి. ► భారత పార్లమెంటులో పీవీ చిత్రపటం పెట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరాలి. ► రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మెమోరియల్ పెట్టిన విధంగానే హైదరాబాద్‌లో పీవీ మెమోరియల్ ఏర్పాటు కావాలి. కేకే నేతృత్వంలోని కమిటీ రామేశ్వరం వెళ్లి వచ్చి, పీవీ మెమోరియల్ ఎలా ఉండాలో ప్రభుత్వానికి సూచించాలి. ► వివిధ సందర్భాలకు సంబంధించిన పీవీ ఫొటోలను సేకరించాలి. వాటిని భద్రపరచాలి. ఫొటో ఎగ్జిబిషన్లు నిర్వహించాలి. ► హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, వంగరతో పాటు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో పీవీ కాంస్య విగ్రహాలను నెలకొల్పాలి. ► రాష్ట్ర అసెంబ్లీలో పీవీ చిత్ర పటాన్ని పెట్టాలి. ► పీవీ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ గతిని మార్చేశాయి. పీవీకి ముందు దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేది? పీవీ తర్వాత ఎలా మారింది? అనే విషయాలను పొందుపరుస్తూ ప్రత్యేక సంచిక రావాలి. ► పీవీ సర్వేల్లో పెట్టిన మొదటి రెసిడెన్షియల్ స్కూల్ దేశంలో గురుకులాల స్థాపనకు నాంది పలికింది. దేశ వ్యాప్తంగా నవోదయ పాఠశాలలను నెలకొల్పారు. ఇలా విద్యారంగ అభివృద్ధికి చేసిన కృషిని వివరించేలా రచనలు చేయించాలి. ► పీవీ గొప్ప సాహితీవేత్త. అనేక భాషలపై పట్టున్న పండితుడు. అనేక రచనలు చేశారు. శత జయంతి ఉత్సవాల సందర్భంగా పీవీ రాసిన పుస్తకాలను పునర్ముద్రించాలి. అముద్రితంగా ఉన్న వాటిని అచ్చువేయాలి. వాటిని లైబ్రరీలకు, విద్యా సంస్థలకు, ప్రముఖులకు ఉచితంగా పంపిణీ చేయాలి. ► విద్య, సాహిత్య, రాజకీయ తదితర రంగాల్లో విశేష కృషి చేసిన వారిని ప్రత్యేకంగా గుర్తించడం కోసం పీవీ స్మారక అవార్డు నెలకొల్పాలి. క్రమం తప్పకుండా అవార్డులు ఇవ్వాలి. ► రాష్ట్రంలోని ప్రతి ఊరికీ పీవీ గొప్పతనం తెలిసేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు అందులో భాగస్వాములు కావాలి. ► పీవీ తెలుగువాడు. తెలంగాణవాడు. జర్నలిస్టు. సాహితీవేత్త. కాబట్టి పీవీకి ఘనమైన అక్షర నివాళి అర్పించేలా రచయితలు ప్రత్యేక రచనలు చేయాలి. కవులు పాటలు రాయాలి. పత్రికలు ప్రత్యేక వ్యాసాలు ప్రచురించాలి. బిల్ క్లింటన్, జాన్ మేజర్ లాంటి వివిధ దేశాల మాజీ అధ్యక్షులు, మాజీ ప్రధానులు, మంత్రులతో పీవీకి అనుబంధం ఉంది. వారి అభిప్రాయాలు కూడా సేకరించాలి. వీలయితే వారిని ఉత్సవాలలో భాగస్వాములను చేయాలి. పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి. స్వాతంత్య్ర సమరయోధుడుగా, రాజకీయ నాయకుడిగా, జర్నలిస్టుగా, బహుభాషా కోవిదుడిగా, రచయితగా ఆయన చేసిన కృషిని తెలిపేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేక సావనీర్, వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలతో ప్రత్యేక సంచికలు రావాలి. పీవీకి తెలంగాణ రాష్ట్రంతోనే కాకుండా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాలతో, దేశ వ్యాప్తంగా అనేక మందితో అనుబంధం ఉంది. ప్రధానిగా, విదేశాంగ శాఖ మంత్రిగా సేవలందించడం వల్ల విదేశాల్లో కూడా ఆయనతో అనుబంధం కలిగిన వారున్నారు. పీవీ జయంతిని రాష్ట్ర, అంతర్రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో నిర్వహించాలి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌లతో పీవీకి ప్రత్యేక అనుబంధం ఉంది. వారిద్దరినీ కూడా భాగస్వాములను చేసేలా ప్రత్యేక కార్యక్రమం రూపొందించాలి. -
‘పీవీపై మన్మోహన్ వ్యాఖ్యలు అవాస్తవం’
సాక్షి, హైదరాబాద్: 1984 సిక్కు అల్లర్లపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను పీవీ నరసింహారావు మనవడు ఎన్వీ సుభాష్ తీవ్రంగా ఖండించారు. పీవీపై మాజీ ప్రధాని చేసిన చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని అన్నారు. ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీపై నిందలు రాకూడదనే ఇలాంటి నిందలు వేస్తున్నారని విమర్శించారు. సిక్కుల ఊచకోత విషయంలో హోంమంత్రిగా వాటిని నివారించుటకు చర్యలు తీసుకున్నారు కానీ వాటికి కారణం ఆయన కాదని సుభాష్ అభిప్రాయపడ్డారు. గురువారం మన్మోహన్ వ్యాఖ్యలపై స్పందించిన సుభాష్.. కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి పీవీపై నిందలు వేస్తూనే ఉందని అసహం వ్యక్తం చేశారు. పీవీపై మన్మోహన్ చేసిన వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని, ఆయన వెంటనే క్షమాపణలు చెప్పలని డిమాండ్ చేశారు. కాగా సిక్కు అల్లర్లు జరిగిన సమయంలో అప్పటి హోంమంత్రి పీవీ నరసింహారావు మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ సలహామేరకు వ్యవహరించి ఉన్నట్లయితే ఆ అల్లర్లే జరిగి ఉండేవి కావని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. గుజ్రాల్ సూచనలపై పీవీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని అభిప్రాయపడ్డారు. ఆ అల్లర్లు జరిగే ముందు రోజు ఐకే గుజ్రాల్ అప్పటి హోంమంత్రి పీవీ నరసింహారావు ఇంటికి వెళ్లారని ఆయన తెలిపారు. పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని, ఆర్మీని వెంటనే రంగంలోకి దించాలని గుజ్రాల్ అప్పటి హోంమంత్రి పీవీకి సూచించారని మన్మోహన్ గుర్తు చేసుకున్నారు. -
మన్మోహన్‌కు ‘పీవీ’ పురస్కారం
హైదరాబాద్: మాజీ ప్రధాని, దివంగత నేత పీవీ నర్సింహారావు పేరిట అందించే జీవన సాఫల్య పురస్కారాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అందించనున్నారు. ఫిబ్రవరి 28న ఢిల్లీలోని తీన్‌మూర్తి భవన్లో మన్మోహన్‌కు అవార్డును ప్రదానం చేయనున్నారు. ఇండియా నెక్ట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటైన జ్యూరీ కమిటీ ఈ మేరకు వెల్లడించింది. శుక్రవారం ఇక్కడ ప్రెస్‌క్లబ్‌లో సమావేశమైన జ్యూరీ సభ్యులు లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, ఇండియా నెక్ట్స్ సలహా మండలి సభ్యుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్లు పీవీ నర్సింహారావు జీవన సాఫల్య పురస్కారానికి మన్మోహన్‌ను అన్ని విధాలా అర్హుడిగా నిర్ణయించినట్లు ప్రకటించారు. విశ్రాంత న్యాయమూర్తి ఎంఎన్ వెంకటాచలయ్య అధ్యక్షతన డాక్టర్ సుభాష్ కశ్యప్, కార్తికేయన్ జ్యూరీ కమిటీ సభ్యులందరం కలిసి మన్మోహన్ సింగ్‌ను అవార్డుకు అర్హుడిగా ఎన్నుకున్నట్లు జయప్రకాష్ నారాయణ తెలిపారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. పీవీ నర్సింహారావు జీవన సాఫల్య పురస్కారం మన్మోహన్ సింగ్‌కు ఇవ్వడం సముచితమన్నారు. ఇండియా నెక్ట్స్ జాతీయ కన్వీనర్ ఎస్వి.సూర్యప్రకాశ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. -
పీవీ సోనియాను జైలుకు పంపాలనుకున్నారా!
మార్గరెట్ అల్వా ఆత్మకథలో ఆసక్తికర విషయాలు! 1992లో బోఫోర్స్ కేసులో పోలీసు ఫిర్యాదును కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పునివ్వగా.. ఆ ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని అప్పటి పీవీ నరసింహారావు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో సోనియాగాంధీ ప్రధాని పీవీపై ఆగ్రహం వ్యక్తం చేశారని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మార్గరేట్ అల్వా వెల్లడించారు. మార్గరెట్ అల్వా పీవీ ప్రభుత్వంలో సిబ్బంది వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. ఆమె ఆధీనంలోనే సీబీఐ ఉండటంతో బోఫోర్స్ అప్పీలు విషయమై మార్గరెట్ సోనియాను కలిశారు. ఈ అప్పీలు విషయంలో తన పాత్ర ఏమీ లేదని, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి నేరుగా ఆదేశాలు వెళ్లాయని ఆమె సోనియాకు తెలుపగా.. 'ప్రధాని ఏం చేయాలనుకుంటున్నారు? నన్ను జైలుకు పంపాలనుకుంటున్నారా?' అంటూ సోనియా ఆగ్రహంగా పేర్కొన్నారని మార్గరెట్ అల్వా తన స్వీయచరిత్రలో తెలిపారు. 'కరెజ్ అండ్ కమిట్మెంట్' పేరిట రూప పబ్లికేషన్స్ ఆమె రాసిన ఆత్మకథను ప్రచురించింది. ఈ పుస్తకంలో సోనియాగాంధీ, అప్పటి ప్రధాని పీవీ నరసింహారావుకు ఉన్న విభేదాలు, వారి మధ్య రాజీ కుదర్చడానికి తాను చేసిన ప్రయత్నాలను ఆమె వివరించారు. 'కాంగ్రెస్ (పీవీ) ప్రభుత్వం నా కోసం ఏం చేసింది? ఈ ఇంటిని చంద్రశేఖర్ ప్రభుత్వమే కేటాయించింది. నా కోసంగానీ, నా పిల్లల కోసం గానీ ఎలాంటి ప్రయోజనాలు ఆయన నుంచి కోరడం లేదు' అని సోనియా తనతో పేర్కొన్నట్టు మార్గరెట్ తెలిపారు. పీవీ మీద సోనియా చాలా కోపంతో ఉన్నారని పేర్కొన్నారు. 'సోనియా ఆయన (పీవీ)ను ఎంతమాత్రం విశ్వసిస్తున్నట్టు కనిపించలేదు. రాజీవ్‌గాంధీ హత్యకేసులో పాత్రపై విచారణ ఎదుర్కొంటున్న (ఆధ్యాత్మికవేత్త) చంద్రస్వామితో పీవీ సాన్నిహిత్యం ఉండటమే ఇందుకు కారణం. ప్రధానికి దూరంగా ఉంటూ ఆయనను బలహీనుడ్ని చేయాలని ఆమె ఎప్పుడూ భావించేది. కానీ, బాబ్రీ మసీదు ఘటన తర్వాత (బోఫోర్స్ కేసులో ప్రభుత్వం అప్పీలుతో) ఇద్దరి మధ్య ప్రచ్ఛన్నయుద్ధం, అనుమానాలు మొదలయ్యాయి' అని మార్గరెట్ తన పుస్తకంలో వివరించారు. -
నవీన భారత నిర్మాత పీవీ
ఏపీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ సాక్షి, హైదరాబాద్: నవ భారత నిర్మాత పండిట్ నెహ్రూ అయితే, నవీన భారత నిర్మాత మన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఎమెస్కో, పెంగ్విన్ పబ్లికేషన్స్ ప్రచురణ సంస్థల నేతృత్వంలో హోటల్ తాజ్ కృష్ణలో నిర్వహించిన ‘నరసింహుడు’, ‘హాఫ్ లయన్’ పుస్తకాల ఆవిష్కరణ సభలో ఆయన ప్రసంగించారు. సామాజిక సమతుల్యతను సాధించిన వారెవరైనా ఉన్నారంటే అది పీవీయేనని ఆయన స్పష్టం చేశారు. భారత హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య మాట్లాడుతూ పీవీ నర్సింహారావుపై ఆయన త్వరితగతిన నిర్ణయాలు తీసుకోరనే అభాండం వేశారని, కానీ ఆయనంత వేగంగా నిర్ణయాలు తీసుకున్న ప్రధాని మరొకరు లేరన్నారు. మాజీ ఐఏఎస్ పీవీఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ పీవీ జీవితం రాజకీయవేత్తలకు ఓ సందేశం అన్నారు. సీబీఐ మాజీ డెరైక్టర్ విజయ రామారావు మాట్లాడుతూ అయోధ్య ఘటనలో పీవీ నర్సింహారావును నిందించడం సరికాదన్నారు. రచయిత వినయ్ సీతాపతి మాట్లాడుతూ భారతీయుల మదిలో చెరగని ముద్రవేసిన మహానుభావుడి గురించి ఈ పుస్తకం రాయడం తనకు గొప్ప అనుభూతిని కలిగించిందన్నారు. పీవీని గుర్తించే సమయం ఆసన్నమైంది పీవీ నర్సింహారావు ఆర్థిక సంస్కరణలు, భూ సంస్కరణల అమలుతో పాటు అణ్వాయుధ తయారీలో ఎంతో నిగూఢంగా వ్యవహరించారన్నారని సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. మార్గరెట్ థాచర్, డెంగ్‌తో సమానంగా పీవీని గుర్తించే సమయం ఆసన్నమైందని కె.రామచంద్రమూర్తి అభిప్రాయపడ్డారు. సభకు అధ్యక్షత వహించిన ఎమెస్కో విజయ్‌కుమార్ మాట్లాడుతూ పీవీ అమలు చేసిన ఆర్థిక సంస్కరణలు, భూ సంస్కరణల ఫలితమే నేటి భారతమన్నారు. పెంగ్విన్ సీనియర్ ఎడిటర్ రజని మాట్లాడుతూ భారతీయ చరిత్రలో పీవీ స్థానాన్ని మననం చేసుకొనే సందర్భమిదేనన్నారు. . పీవీ ఆర్థిక సంస్కరణలను హర్షించలేని వారిలో తానూ ఒకరినని, అయినా చరిత్రలో పీవీ స్థానాన్ని చెరిపేయాలని ఎవరైనా అనుకుంటే అది సాధ్యం కాదని ఎడిటర్ కె.శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఎమెస్కో ప్రధాన సంపాదకులు డాక్టర్ . చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఎంతో క్లిష్టమైన పనే అయినా రచయిత నిష్పాక్షికంగా, సమకాలీన ఆధారాలతో ఈ పుస్తకాన్ని మనకందించారన్నారు. పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన సీనియర్ పాత్రికేయులు వల్లీశ్వర్, టంకశాల అశోక్, కె.బి.గోపాలంలకు ఎమెస్కో విజయ్ కుమార్ కృత జ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పీవీ నర్సింహారావు కుమారుడు పీవీ ప్రభాకర్ రావు తన తండ్రితో అనుభవాలను నెమరేసుకున్నారు. -
పీవీ గొప్ప శక్తిమంతుడు
హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహరావు జయంతి ఇరు రాష్ట్రాల కాంగ్రెస్‌లను కలిపిందని ఏపీపీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో పీవీ నరసింహరావు 94వ జయంతి వేడుకలు నెక్లెస్ రోడ్డులోని ఆయన సమాధి జ్ఞానభూమి వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీకి రఘువీరారెడ్డి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారత ప్రధానిగా పీవీ సేవలను రఘువీరారెడ్డి కొనియాడారు. భారత్ అగ్రగామి దేశంగా ఉందంటే అది పీవీ ఘనతే అని ఆయన తెలిపారు. విభిన్న ఆలోచనలున్న వారిని ఐక్యంగా ఉంచే గొప్ప శక్తిమంతుడు పీవీ అని రఘువీరా అభివర్ణించారు. భారత ప్రధానిగా పీవీ కాంగ్రెస్‌యేతర పక్షాలను ఒప్పించి కేంద్రంలో విజయవంతంగా ప్రభుత్వాన్ని నడపగలిగారని గుర్తు చేశారు. బీజేపీలో చెప్పుకోవడానికి గొప్ప నేతలు లేరని ... అందుకే ఆ పార్టీ పీవీ పేరు వాడుకుంటుందని విమర్శించారు. కావాలంటే గాంధీని హత్య చేసిన గాడ్సే పేరు వాడుకోవాలంటూ బీజేపీ నేతలకు రఘువీరారెడ్డి సూచించారు. భవిష్యత్తులో కూడా అనేక అంశాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కాంగ్రెస్‌లు కలసి పని చేస్తాయని రఘువీరా స్పష్టం చేశారు. -
అంతగా అయితే పీవీ పేరు పెట్టండి: కేసీఆర్
-
అంతగా అయితే పీవీ పేరు పెట్టండి: కేసీఆర్
హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును పునరుద్దరించడాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఖండించారు. తెలంగాణ ప్రాంత మనోభావాలను గౌరవించకుండా ఆంధ్రప్రాంత నేత పేరు పెట్టడం తగదని ఆయన అన్నారు. ఎన్టీఆర్ పేరును పెట్టడంపై శుక్రవారం శాసనసభలో దుమారం రేగింది. శుక్రవారం ఈ అంశాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇది చాలా సున్నితమైన అంశమని... ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్టీఆర్ పేరు పెట్టడం తగదన్నారు. శంషాబాద్ విమానాశ్రయం పేరు మార్పు చేయాలనుకుంటే తెలంగాణ ప్రాంతంవారి పేర్లే పెట్టాలన్నారు. కావాలంటే విమానాశ్రయానికి తెలంగాణ వీరులు పెట్టాలని, అంతగా అయితే మాజీ ప్రధాని పీవీ నరసింహరావు పేరు పెట్టాలని కేసీఆర్ సూచించారు. అంతేకానీ ఆంధ్రవారి పేర్లు తెచ్చి తమపై రుద్దొద్దని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ సంస్కృతిపై దాడి జరిగిందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఇప్పుడిప్పుడే స్వయంపాలన జరుగుతోందని... ఈ సమయంలో విమానాశ్రయం పేరు మార్చటం తెలంగాణ ప్రజలను కించపరచటమేనని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మరోవైపు కమ్యూనిస్టు పార్టీలు కూడా తమ ఆలోచనలను మార్చుకున్నాయని...కమ్యునిస్టుల పేపరైన విశాలాంధ్ర... ఇక్కడ తెలంగాణ పేపరు ప్రారంభించి ప్రజల మనోభావాల్ని గౌరవిస్తుంటే కేంద్రం మాత్రం ముర్ఖంగా వ్యవహరిస్తోందన్నారు. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారని, అందుకే ఆయన పేరు విమానాశ్రయానికి పెట్టారని కేసీఆర్ అన్నారు. ఈ అంశంపై స్పీకర్ అన్ని పార్టీల సభ్యులతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు. -
‘ఉపాధి’ సంస్థకు మళ్లీ ఊపిరి
గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం వర్థిల్లాలంటే గ్రామీణ ఉత్పత్తులు పెరగాలి. అందుకు నైపుణ్యమున్న యువసైన్యాన్ని సృష్టించాలి. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా రామానందతీర్థ గ్రామీణ విద్యాసంస్థ.. గ్రామీణ విశ్వవిద్యాలయంగా, గ్రామీణ చేతివృత్తుల ఆధునీకరణ కేంద్రంగా అవతరించాలి. వినోబాభావే భూదానో ద్యమంతో భూదాన్ పో చంపల్లి గ్రామం చరిత్ర కెక్కింది. గాంధీజీ కలలు గన్న గ్రామస్వరాజ్యం వర్థిల్లాలని రామనాందతీర్థ కంకణం కట్టుకుని పనిచేశాడు. ఆయన శిష్యుడు పి.వి.నర్సింహారావు మహోన్నత ఆశయంతో భూదాన్ పోచంపల్లిలో నెలకొ ల్పిన ‘‘రామనందతీర్థ గ్రామీణ విద్యాసంస్థ’’ అనుకున్న లక్ష్యాన్ని ఇప్పటికీ చేరుకోలేదు. ఈ సంస్థ ఏర్పడి 19ఏళ్లు గడుస్తున్నా ముందడుగులేదు. పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలోని దుండిగల్‌లో నెలకొ ల్పిన ‘‘గాంధీగ్రామ్ గ్రామీణ విశ్వవిద్యాలయం’’ ఎంతో పురోగతి సాధిస్తుంటే, ఉమ్మడి రాష్ట్ర పాలకులు మాత్రం రామానందతీర్థ గ్రామీణ విద్యా సంస్థకు మనుగడ లేకుండా చేశారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా రామానందతీర్థ గ్రామీణ విద్యాసంస్థ పునరుజ్జీవనం పొందనుంది. గ్రామాల్లో చేతివృత్తులు కళకళలాడేందుకు, యువత స్వతంత్రంగా తన కాళ్లపై తాను నిలబడేవిధంగా ఉండేందుకు ఈ సంస్థను నెలకొల్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మారుతున్న పరిస్థితు లకు అనుగుణంగా గ్రామం మారుతోంది. అవసరా లు మారుతున్నాయి. ఇందుకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దే పనిని ఈ సంస్థ చేయాలి. ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబం ధించిన సర్వీసు రంగానికి డిమాండ్ బాగా ఉంది. దీనికి సంబంధించిన సాంకేతికమైన వస్తువుల వాడకం, రిపేర్లు చేయటం, ఈ విద్యా సంస్థ ద్వారా నేర్పుతున్నారు. సోలార్, ఎలక్రి ్టకల్స్, ఐటి రంగాలలో సేవలను అందించేందుకు యువతకు తర్ఫీదు నిస్తున్నారు. రామనందతీర్థ గ్రామీణ విద్యా సంస్థ ద్వారా ఇప్పటి వరకు 1లక్షా 50 వేల మందికి శిక్షణ నిచ్చారు. ప్రతి ఏడాది 8వేల మందికి శిక్షణనిస్తున్నారు. శిక్షణ పొందిన యువతీ యువకులు సగానికి సగం స్వ యం సిద్ధంగా తమ పనులు తాము చేసుకుంటు న్నారు. శిక్షణ పొందిన మహిళలు అత్యధిక శాతం గ్రామీణ ప్రాంతాల లో స్వయం ఉపాధితో జీవనం కొనసాగిస్తున్నారు. ఈ సంస్థలో శిక్షణ పొంది హై స్కూల్లో పార్ట్‌టైం క్రాఫ్ట్ టీచర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ శిక్షణ ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి పెరుగుతున్న వలసలు నివారించేందుకు, సమతుల్యాభివృద్ధి సాధించటానికి సాధ్యమవుతుంది. అయితే ఈ శిక్షణలలో కూడా ఇంకా ఎన్నో మా ర్పులు చేయవలసి ఉంది. స్థానిక వనరులను ఉప యోగించుకుని నిలబడే స్థానిక సాంకేతిక పరిజ్ఞా నాన్ని శిక్షణగా ఇవ్వాలి. మొత్తంగా ఈ గ్రామీణ వి ద్యాసంస్థను ఉత్పత్తి కేంద్రంగా మార్చాలి. అప్పుడే యువతకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇందుకు పాలకుల ప్రోత్సాహం తోడైతే మంచి ఫలి తాలు వస్తాయి. పక్కనే ఉన్న తమిళనాడులోని గాంధీగ్రామ్‌లో ‘‘గాంధీగ్రామ్ రూరల్ యూనివ ర్సిటీ’’, ‘‘గాంధీగ్రామ్ రూరల్ట్రస్ట్’’ల ఆధ్వర్యంలో అవసరాలకు తగ్గ కోర్సులు ప్రవేశ పెట్టారు. ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దారు. గాంధీగ్రామ్ రూరల్ యూనివర్సిటీలో 58 కోర్సులున్నాయి. గ్రామీణ ఎంబీఏ, గ్రామీణ మేనేజ్ మెంట్, గ్రామీణ విద్యకు సంబంధించి మూడేళ్ల డిగ్రీ కోర్సులున్నాయి. సిద్ధా ఆయుర్వేదిక్ సెంటర్ ద్వారా హెర్బల్కు చెందిన 250 రకాల ఉత్పత్తులు చేస్తున్నారు. చాక్లెట్లు, బిస్కెట్తోపాటుగా పలు రకాల స్నాక్స్ చేస్తున్నారు. ఈ గాంధీగ్రామ్ నుంచి తయారు చేస్తున్న వస్తువులకు బాగా డిమాండ్ ఉంది. గ్రామ గ్రామాన అమ్మకాలు జరుగుతున్నాయి. మన దగ్గరున్న రామానంద తీర్థ గ్రామీణ వి ద్యా సంస్థలో ఉత్పత్తులులేవు. ఒక్క సర్వీస్ రంగా నికి చెందిన కొన్ని రకాల శిక్షణలనే ఇస్తున్నారు. ఈ విద్యాసంస్థ 100 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. రామా నందతీర్థ గ్రామీణ విశ్వవిద్యాలయంగా ఈ సంస్థను తీర్చిదిద్దితే గ్రామీణ అవసరాలను తీర్చే అనేక కో ర్సులను ప్రారంభించవచ్చును. అదేవిధంగా రామా నందతీర్థ సంస్థను గాంధీగ్రామ్ రూరల్ ట్రస్ట్‌గా మార్చి ఉత్పత్తులను చేయవచ్చును. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా వేలాది మంది యువత కు స్వయం ఉపాధి కల్పించేందుకు ఈ సంస్థ ద్వారా ఉత్పత్తుల రంగాన్నీ అభివృద్ధి చేయాలన్న తలంపు తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పథక రచన చేస్తోంది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి కేటీఆర్ రామానందతీర్థ గ్రామీణ విద్యాసంస్థ రూపురేఖలు మార్చేందుకు ప్రత్యేకదృష్టి పెట్టి సమాలోచనలు చేస్తున్నారు. అదే జరిగితే అనేక ఉత్పత్తుల కేంద్రం గా ఈ సంస్థ మారుతుంది. ప్రస్తుత సాంఘిక సంక్షే మ శాఖ హాస్టల్స్‌కు అవసరమైన వస్తువులను, ఉత్పత్తులను ఈ సంస్థ ద్వారానే అందించవచ్చును. లక్షలాది మంది విద్యార్థులకు కావాల్సిన సబ్బులు, పేస్టుల దగ్గర నుంచి నిత్యావసరంగా ఉపయోగించే వస్తువులను ఈ సంస్థ ద్వారానే ఉత్పత్తి చేసి ప్రభు త్వానికి కోట్లాది రూపాయలు ఆదా చేయవచ్చును. ఈ సంస్థ ద్వారా తయారయ్యే వాటిని ప్రభుత్వమే కొని వేలాది మంది యువతకు ఉపాధి అవకాశా లకు దోహదపడుతుంది. రామనందతీర్థ గ్రామీణ విద్యాసంస్థ ద్వారా నైపుణ్యత గల మానవ వనరులను తయారు చేయ వచ్చును. అదే విధంగా ఉత్పత్తిరంగానికి కేంద్రంగా మార్చవచ్చును. పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ ఈ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడితే కొంత వరకు గ్రామీణ వలసలను నివారించవచ్చును. గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం వర్థిల్లాలంటే గ్రామీణ ఉత్పత్తులు పెరగాలి. అందుకు నైపు ణ్యమున్న యువసైన్యాన్ని సృష్టించాలి. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా రామానంద గ్రామీణ విద్యాసంస్థ రూరల్ యూనివర్సిటీగా, గ్రామీణ చేతివృత్తుల ఆధునీకరణ కేంద్రంగా అవతరించాలి. యువతకు ఉపాధి కేంద్రంగా మారితే ఈ సంస్థ పెట్టిన లక్ష్యం నెరవేరుతుంది. (వ్యాసకర్త, సామాజిక విశ్లేషకులు) -
దిశానిర్దేశకుడు పీవీ
- పీవీ ఇంటిని మ్యూజియంగా మార్చేందుకు కృషి - మాజీ ప్రధాని జయంతి సభలో ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ వంగర(భీమదేవరపల్లి) : దేశానికి దిశా..దశ నిర్దేశించిన గొప్ప మేధావి మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు అని, ఆయన ఆశయూలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. శనివారం మండలంలోని వంగరలో పీవీ నర్సింహరావు 93వ జయంతి అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ పీవీ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. వంగరలోని పీవీ ఇంటిని మ్యూజియంగా మార్చేందకు సీఎం కేసీఆర్‌కు విన్నవిస్తామన్నారు. ఈ సందర్భంగా పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు పీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగదును అందించారు. కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డీవో చంద్రశేఖర్, పీవీ సొదరుని కుమారుడు, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు పీవీ మదన్మోహన్, జెడ్పీటీసీ సభ్యురాలు మాలోతు రాంచందర్‌నాయక్, సర్పంచ్ ఉపసర్పంచ్ వొల్లాల రమేశ్, కాల్వ సునీత, మండల ప్రత్యేకాధికారి నర్సింహరావు, తహశీల్దార్ కృష్ణవేణి, ఎంపీడీవో నర్సింహారెడ్డి, హౌసింగ్ డీఈఈ మహేశ్, ఏఈలు రాజమల్లారెడ్డి, కిషన్ పాల్గొన్నారు. సాగుకు యోగ్యమైన భూమే పంపిణీ దళితులకు పంపిణీ చేయనున్న భూమి సాగుకు యోగ్యంగా ఉంటుందని ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి ఓ గ్రామాన్ని ఎంపికచేసి భూ పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. భూమిలేని దళితులకు 3 ఎకరాలు అందిస్తామన్నారు. పంపిణీ చేసిన భూమిలో బోరుబావి, విద్యుత్ సౌకర్యంతో పాటుగా డ్రిప్ సౌకర్యం అందిస్తామన్నారు. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం... తమ కుటుంబం టీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటుందని పీవీ నర్సింహరావు సొదరుడి కుమారుడు మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు పీవీ మదన్మోహన్రావు చెప్పారు. ఇంత కాలానికి పీవీకి గుర్తింపు వచ్చిందన్నారు. వంగరలోని పీవీ విగ్రహానికి శాశ్వత నిచ్చెన ఏర్పాటు చేరుుంచాల్సిన అవసరం ఉందన్నారు. -
పీవీకి తెలంగాణ ప్రభుత్వం ఘన నివాళి