
సాక్షి, అమరావతి : భారత మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు శత జయంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా పీవీ గొప్పతనాన్ని వెల్లడించారు. 'పీవీ నరసింహారావు ప్రస్తుతం మన మధ్య లేకపోయినా ఆయన సేవలు మాత్రం ఎప్పటికి గుర్తుండిపోతాయి. ఆయన ఒక తెలివైన రాజకీయవేత్త, రాజనీతిజ్ఞులు, బహుభాషా పండితుడు. దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారిన సందర్భంలో ప్రధాని పదవి చేపట్టిన పీవీ గొప్ప సంస్కరణలు తీసుకువచ్చారు. దేశాన్ని ఆర్ధిక సరళీకరణ వైపు పరుగులు పెట్టించారు. దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని భవిష్యత్తు తరాల వారు కూడా గుర్తుంచుకుంటారు.' అంటూ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment