‘ఉపాధి’ సంస్థకు మళ్లీ ఊపిరి
గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం వర్థిల్లాలంటే గ్రామీణ ఉత్పత్తులు పెరగాలి. అందుకు నైపుణ్యమున్న యువసైన్యాన్ని సృష్టించాలి. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా రామానందతీర్థ గ్రామీణ విద్యాసంస్థ.. గ్రామీణ విశ్వవిద్యాలయంగా, గ్రామీణ చేతివృత్తుల ఆధునీకరణ కేంద్రంగా అవతరించాలి.
వినోబాభావే భూదానో ద్యమంతో భూదాన్ పో చంపల్లి గ్రామం చరిత్ర కెక్కింది. గాంధీజీ కలలు గన్న గ్రామస్వరాజ్యం వర్థిల్లాలని రామనాందతీర్థ కంకణం కట్టుకుని పనిచేశాడు. ఆయన శిష్యుడు పి.వి.నర్సింహారావు మహోన్నత ఆశయంతో భూదాన్ పోచంపల్లిలో నెలకొ ల్పిన ‘‘రామనందతీర్థ గ్రామీణ విద్యాసంస్థ’’ అనుకున్న లక్ష్యాన్ని ఇప్పటికీ చేరుకోలేదు.
ఈ సంస్థ ఏర్పడి 19ఏళ్లు గడుస్తున్నా ముందడుగులేదు. పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలోని దుండిగల్‌లో నెలకొ ల్పిన ‘‘గాంధీగ్రామ్ గ్రామీణ విశ్వవిద్యాలయం’’ ఎంతో పురోగతి సాధిస్తుంటే, ఉమ్మడి రాష్ట్ర పాలకులు మాత్రం రామానందతీర్థ గ్రామీణ విద్యా సంస్థకు మనుగడ లేకుండా చేశారు.
తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా రామానందతీర్థ గ్రామీణ విద్యాసంస్థ పునరుజ్జీవనం పొందనుంది. గ్రామాల్లో చేతివృత్తులు కళకళలాడేందుకు, యువత స్వతంత్రంగా తన కాళ్లపై తాను నిలబడేవిధంగా ఉండేందుకు ఈ సంస్థను నెలకొల్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మారుతున్న పరిస్థితు లకు అనుగుణంగా గ్రామం మారుతోంది. అవసరా లు మారుతున్నాయి.
ఇందుకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దే పనిని ఈ సంస్థ చేయాలి. ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్‌లో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీకి సంబం ధించిన సర్వీసు రంగానికి డిమాండ్ బాగా ఉంది. దీనికి సంబంధించిన సాంకేతికమైన వస్తువుల వాడకం, రిపేర్లు చేయటం, ఈ విద్యా సంస్థ ద్వారా నేర్పుతున్నారు. సోలార్, ఎలక్రి ్టకల్స్, ఐటి రంగాలలో సేవలను అందించేందుకు యువతకు తర్ఫీదు నిస్తున్నారు.
రామనందతీర్థ గ్రామీణ విద్యా సంస్థ ద్వారా ఇప్పటి వరకు 1లక్షా 50 వేల మందికి శిక్షణ నిచ్చారు. ప్రతి ఏడాది 8వేల మందికి శిక్షణనిస్తున్నారు. శిక్షణ పొందిన యువతీ యువకులు సగానికి సగం స్వ యం సిద్ధంగా తమ పనులు తాము చేసుకుంటు న్నారు. శిక్షణ పొందిన మహిళలు అత్యధిక శాతం గ్రామీణ ప్రాంతాల లో స్వయం ఉపాధితో జీవనం కొనసాగిస్తున్నారు. ఈ సంస్థలో శిక్షణ పొంది హై స్కూల్‌లో పార్ట్‌టైం క్రాఫ్ట్ టీచర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు.
ఈ శిక్షణ ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి పెరుగుతున్న వలసలు నివారించేందుకు, సమతుల్యాభివృద్ధి సాధించటానికి సాధ్యమవుతుంది. అయితే ఈ శిక్షణలలో కూడా ఇంకా ఎన్నో మా ర్పులు చేయవలసి ఉంది. స్థానిక వనరులను ఉప యోగించుకుని నిలబడే స్థానిక సాంకేతిక పరిజ్ఞా నాన్ని శిక్షణగా ఇవ్వాలి. మొత్తంగా ఈ గ్రామీణ వి ద్యాసంస్థను ఉత్పత్తి కేంద్రంగా మార్చాలి. అప్పుడే యువతకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇందుకు పాలకుల ప్రోత్సాహం తోడైతే మంచి ఫలి తాలు వస్తాయి. పక్కనే ఉన్న తమిళనాడులోని గాంధీగ్రామ్‌లో ‘‘గాంధీగ్రామ్ రూరల్ యూనివ ర్సిటీ’’, ‘‘గాంధీగ్రామ్ రూరల్‌ట్రస్ట్’’ల ఆధ్వర్యంలో అవసరాలకు తగ్గ కోర్సులు ప్రవేశ పెట్టారు. ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దారు.
గాంధీగ్రామ్ రూరల్ యూనివర్సిటీలో 58 కోర్సులున్నాయి. గ్రామీణ ఎంబీఏ, గ్రామీణ మేనేజ్ మెంట్, గ్రామీణ విద్యకు సంబంధించి మూడేళ్ల డిగ్రీ కోర్సులున్నాయి. సిద్ధా ఆయుర్వేదిక్ సెంటర్ ద్వారా హెర్బల్‌కు చెందిన 250 రకాల ఉత్పత్తులు చేస్తున్నారు. చాక్‌లెట్‌లు, బిస్కెట్‌తోపాటుగా పలు రకాల స్నాక్స్ చేస్తున్నారు. ఈ గాంధీగ్రామ్ నుంచి తయారు చేస్తున్న వస్తువులకు బాగా డిమాండ్ ఉంది. గ్రామ గ్రామాన అమ్మకాలు జరుగుతున్నాయి.
మన దగ్గరున్న రామానంద తీర్థ గ్రామీణ వి ద్యా సంస్థలో ఉత్పత్తులులేవు. ఒక్క సర్వీస్ రంగా నికి చెందిన కొన్ని రకాల శిక్షణలనే ఇస్తున్నారు. ఈ విద్యాసంస్థ 100 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. రామా నందతీర్థ గ్రామీణ విశ్వవిద్యాలయంగా ఈ సంస్థను తీర్చిదిద్దితే గ్రామీణ అవసరాలను తీర్చే అనేక కో ర్సులను ప్రారంభించవచ్చును. అదేవిధంగా రామా నందతీర్థ సంస్థను గాంధీగ్రామ్ రూరల్ ట్రస్ట్‌గా మార్చి ఉత్పత్తులను చేయవచ్చును. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా వేలాది మంది యువత కు స్వయం ఉపాధి కల్పించేందుకు ఈ సంస్థ ద్వారా ఉత్పత్తుల రంగాన్నీ అభివృద్ధి చేయాలన్న తలంపు తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పథక రచన చేస్తోంది.
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి కేటీఆర్ రామానందతీర్థ గ్రామీణ విద్యాసంస్థ రూపురేఖలు మార్చేందుకు ప్రత్యేకదృష్టి పెట్టి సమాలోచనలు చేస్తున్నారు. అదే జరిగితే అనేక ఉత్పత్తుల కేంద్రం గా ఈ సంస్థ మారుతుంది. ప్రస్తుత సాంఘిక సంక్షే మ శాఖ హాస్టల్స్‌కు అవసరమైన వస్తువులను, ఉత్పత్తులను ఈ సంస్థ ద్వారానే అందించవచ్చును. లక్షలాది మంది విద్యార్థులకు కావాల్సిన సబ్బులు, పేస్టుల దగ్గర నుంచి నిత్యావసరంగా ఉపయోగించే వస్తువులను ఈ సంస్థ ద్వారానే ఉత్పత్తి చేసి ప్రభు త్వానికి కోట్లాది రూపాయలు ఆదా చేయవచ్చును. ఈ సంస్థ ద్వారా తయారయ్యే వాటిని ప్రభుత్వమే కొని వేలాది మంది యువతకు ఉపాధి అవకాశా లకు దోహదపడుతుంది.
రామనందతీర్థ గ్రామీణ విద్యాసంస్థ ద్వారా నైపుణ్యత గల మానవ వనరులను తయారు చేయ వచ్చును. అదే విధంగా ఉత్పత్తిరంగానికి కేంద్రంగా మార్చవచ్చును. పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ ఈ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడితే కొంత వరకు గ్రామీణ వలసలను నివారించవచ్చును. గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం వర్థిల్లాలంటే గ్రామీణ ఉత్పత్తులు పెరగాలి. అందుకు నైపు ణ్యమున్న యువసైన్యాన్ని సృష్టించాలి. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా రామానంద గ్రామీణ విద్యాసంస్థ రూరల్ యూనివర్సిటీగా, గ్రామీణ చేతివృత్తుల ఆధునీకరణ కేంద్రంగా అవతరించాలి. యువతకు ఉపాధి కేంద్రంగా మారితే ఈ సంస్థ పెట్టిన లక్ష్యం నెరవేరుతుంది.
(వ్యాసకర్త, సామాజిక విశ్లేషకులు)