ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గల పవిత్ర త్రివేణీ సంగమంలో జరుగుతున్న కుంభమేళాలో కోట్లాదిమంది భక్తులు, స్వామీజీలు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అత్యంత భారీగా జరుగుతున్న కుంభమేళాను వీక్షించేందుకు, సనాతన ధర్మం గురించి తెలుసుకునేందుకు లక్షలాదిమంది విదేశీయులు కూడా భారత్‌కు తరలిరావడం విశేషం. కుంభమేళాకు ఘన చరిత్ర ఉంది. 1942లో ఆంగ్లేయుల పాలనా కాలంలో జరిగిన కుంభమేళా ఉదంతం గురించి యూపీకి చెందిన భాషావేత్త పృథ్వీనాథ్ పాండే మీడియాకు తెలిపారు.
కుంభమేళా కేవలం ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఉత్సవమే కాదు. భారతదేశ స్వాతంత్య్రంలో కూడా కీలక పాత్ర పోషించింది. 1857లో ఆధ్యాత్మిక బోధనలు సాగించిన పండితుడు ప్రయాగ్వాల్ నాటి విప్లవకారులకు అండగా నిలిచారని భాషావేత్త పృథ్వీనాథ్ పాండే తెలిపారు. ఆయన స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా నాటి ఉద్యమకారులకు ఊపిరిపోశారన్నారు. నాడు మహారాణి లక్ష్మీబాయి ప్రయాగ్‌రాజ్ వచ్చినప్పుడు ఆమె పండితుడు ప్రయాగ్‌వాల్ ఇంట్లో ఆశ్రయం పొందారు. స్వాతంత్య్ర పోరాటంలో కుంభమేళా భాగస్వామ్యం కూడా ఉంది. దేశంలో స్వాతంత్య్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న 1918 నాటి రోజుల్లో కుంభమేళా అంత్యంత వైభవంగా జరిగింది. దీనిలో పాల్గొనేందుకు జాతిపిత మహాత్మాగాంధీ ప్రయాగ్‌రాజ్‌కు వచ్చారు. నాడు ఆయన త్రివేణి సంగమంలో స్నానం చేయడమే కాకుండా, అక్కడున్న సాధువులను కలుసుకున్నారు. యాత్రికులతో సంభాషించారు.
హిందువుల ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచిన కుంభమేళా ఉత్సవం బ్రిటిష్ ప్రభుత్వ ఆందోళనను మరింతగా పెంచింది. మరోవైపు అదేసమయంలో గాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమం ఊపందుకుంది. 1942లో ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరిగింది. ఇది తమ పరిపాలనకు అడ్డుకులు కల్పిస్తుందనే ఉద్దేశంలో బ్రిటీషర్లు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే రైళ్లు, బస్సులను అడ్డుకున్నారు. ఈ ప్రయాణ సాధనాలకు సంబంధించిన టిక్కెట్ల విక్రయాలను నిషేధించారని భాషావేత్త పృథ్వీనాథ్ పాండే తెలిపారు. కుంభ్ ప్రాంతం విప్లవ ప్రదేశంగా మారుతుందని బ్రిటీష్ పాలకులు భయపడ్డారు. బ్రిటీషర్లు అడ్డుకున్నప్పటికీ పెద్ద సంఖ్యలో యాత్రికులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివచ్చి, పుణ్యస్నానాలు ఆచరించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు.
ఇది కూడా చదవండి: Kumbh Mela: కుంభమేళాకు వెళితే వీటిని తప్పక చూడండి
Comments
Please login to add a commentAdd a comment