Britishers
-
Mahakumbh: కుంభమేళాకు భయపడిన బ్రిటీష్ పాలకులు.. విప్లవగడ్డగా మారుతుందని..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గల పవిత్ర త్రివేణీ సంగమంలో జరుగుతున్న కుంభమేళాలో కోట్లాదిమంది భక్తులు, స్వామీజీలు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అత్యంత భారీగా జరుగుతున్న కుంభమేళాను వీక్షించేందుకు, సనాతన ధర్మం గురించి తెలుసుకునేందుకు లక్షలాదిమంది విదేశీయులు కూడా భారత్‌కు తరలిరావడం విశేషం. కుంభమేళాకు ఘన చరిత్ర ఉంది. 1942లో ఆంగ్లేయుల పాలనా కాలంలో జరిగిన కుంభమేళా ఉదంతం గురించి యూపీకి చెందిన భాషావేత్త పృథ్వీనాథ్ పాండే మీడియాకు తెలిపారు.కుంభమేళా కేవలం ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఉత్సవమే కాదు. భారతదేశ స్వాతంత్య్రంలో కూడా కీలక పాత్ర పోషించింది. 1857లో ఆధ్యాత్మిక బోధనలు సాగించిన పండితుడు ప్రయాగ్వాల్ నాటి విప్లవకారులకు అండగా నిలిచారని భాషావేత్త పృథ్వీనాథ్ పాండే తెలిపారు. ఆయన స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా నాటి ఉద్యమకారులకు ఊపిరిపోశారన్నారు. నాడు మహారాణి లక్ష్మీబాయి ప్రయాగ్‌రాజ్ వచ్చినప్పుడు ఆమె పండితుడు ప్రయాగ్వాల్ ఇంట్లో ఆశ్రయం పొందారు. స్వాతంత్య్ర పోరాటంలో కుంభమేళా భాగస్వామ్యం కూడా ఉంది. దేశంలో స్వాతంత్య్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న 1918 నాటి రోజుల్లో కుంభమేళా అంత్యంత వైభవంగా జరిగింది. దీనిలో పాల్గొనేందుకు జాతిపిత మహాత్మాగాంధీ ప్రయాగ్‌రాజ్‌కు వచ్చారు. నాడు ఆయన త్రివేణి సంగమంలో స్నానం చేయడమే కాకుండా, అక్కడున్న సాధువులను కలుసుకున్నారు. యాత్రికులతో సంభాషించారు.హిందువుల ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచిన కుంభమేళా ఉత్సవం బ్రిటిష్ ప్రభుత్వ ఆందోళనను మరింతగా పెంచింది. మరోవైపు అదేసమయంలో గాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమం ఊపందుకుంది. 1942లో ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరిగింది. ఇది తమ పరిపాలనకు అడ్డుకులు కల్పిస్తుందనే ఉద్దేశంలో బ్రిటీషర్లు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే రైళ్లు, బస్సులను అడ్డుకున్నారు. ఈ ప్రయాణ సాధనాలకు సంబంధించిన టిక్కెట్ల విక్రయాలను నిషేధించారని భాషావేత్త పృథ్వీనాథ్ పాండే తెలిపారు. కుంభ్ ప్రాంతం విప్లవ ప్రదేశంగా మారుతుందని బ్రిటీష్ పాలకులు భయపడ్డారు. బ్రిటీషర్లు అడ్డుకున్నప్పటికీ పెద్ద సంఖ్యలో యాత్రికులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివచ్చి, పుణ్యస్నానాలు ఆచరించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఇది కూడా చదవండి: Kumbh Mela: కుంభమేళాకు వెళితే వీటిని తప్పక చూడండి -
‘రాజమాత కుటుంబం బ్రిటిష్ వాళ్లకి సహాయం చేసింది’
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికలో భాగంగా బీజేపీ పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణా నగర స్థానంలో రాజమాత అమ్రితా రాయ్‌ని బరిలోకి దించింది. దీంతో ఆమె ఎవరూ అని సోషల్‌మీడియాలో చర్చ జరిగింది. అయితే అదే స్థానంలో గతేడాది ఎంపీ సభ్యత్వం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) నేత మహువా మొయిత్రా పోటిలో ఉంది. దీంతో టీఎంసీ అమ్రితా రాయ్‌పై విమర్శలకు తెరలేపింది. ఆమె రాజకుటుంబం భారత దేశాన్ని పాలించిన బ్రిటిష్‌వారి పక్షమని మండిపడింది. కృష్ణానగర్‌ను పరిపాలించిన రాజు రాజా కృష్ణచంద్ర రాయ్.. బెంగాల్ నవాబ్ సిరాజ్ ఉద్ దౌలా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో బ్రిటీష్ వారికి సాయం చేసి అనుకూలంగా పనిచేశారని టీఎంసీ నేత కునాల్ ఘోష్ విమర్శించారు. ‘బెంగాల్ నవాబ్ సిరాజ్ ఉద్ దౌలా బ్రిటిష్‌వారి వ్యతిరేకంగా పోరాడుతున్నసమయంలో కృష్ణా నగర్ రాజకుటుంబం బ్రిటీష్వారికి సాయం చేసిందని చరిత్ర చెబుతోంది. అనాడు రాజా కృష్ణచంద్ర రాయ్.. బ్రిటీష్ బలగాలు సాయం చేశారు. బీజేపీ వీర్‌సావర్కర్ పార్టీ. ఈ పార్టీ మహాత్మ గాంధీ హత్యకు బాధ్యత వహించాలి. బ్రిటీష్వారికే సాయం చేసిన కుటుంబాన్ని ఎన్నికల బరిలో దించింది బీజేపీ. మహువా మొయిత్రా దేశంలోని అవినీతిపై పోరాటం చేస్తోంది’ అని కునాల్ ఆరోపణలు చేశారు. టీఎంసీ విమర్శలపై రాజమాత అమ్రితా రాయ్ స్పందించారు. తన కుటుంబంపై చేస్తున్నఆరోపణలు అసత్యాలని తెలిపారు. ‘టీఎంసీ చేసే ఆరోపణలను భారత్, బెంగాల్లో ఎవరూ నమ్మరు. నా కుటుంబంపై చేస్తున్న విమర్శలు అసత్యం. మహారాజా కృష్ణ చంద్ర రాయ్ బ్రిటిష్ పక్షమన్న ఆరోపణ నిజం కాదు. ఆయన అలా ఎందుకు చేశాడు?. ఆయన అలా చేసిఉంటే ఇక్కడ హిందుత్వం ఉండేదా? సనాతన ధర్మం ఉండేదా? ఆయన బెంగాల్‌కు మరో గుర్తింపు తీసుకువచ్చారు. మత వ్యతిరేకత నుంచి రాజా కృష్ణచంద్ర రాయ్ మనల్నీ కాపాడారని ఎందుకు అనుకోకుడదు?’అని ఆమె టీఎంసీ కౌంటర్ ఇచ్చారు. -
పరోటాలపై 18 శాతం జీఎస్టీనా? బ్రిటిషర్లే నయం..!
గాంధీనగర్: రెడీ టూ ఈట్(తినడాకి సిద్ధంగా ఉండేలా తయారు చేసిన) పరోటాలపై అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ 18 శాతం జీఎస్టీ విధించడాన్ని సమర్థించింది గుజరాత్ అప్పలెట్ అథారిటీ ఆప్ అడ్వాన్స్ రూలింగ్(ఏఏఏఆర్). దీన్ని అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది. పరోటాలు.. ప్లెయిన్ చపాతీ, రోటీల కేటగిరీలోకి రావని జీఏఏఏఆర్ ద్విసభ్య బెంచ్ అభిప్రాయపడింది. రెడీ టూ ఈట్ పరోటాలను నిల్వ చేస్తారని, మూడ్నాలుగు నిమిషాల పాటు వేడి పెనంపై కాల్చాల్సి ఉంటుందని, ఆ తర్వాత దాని రంగు కూడా మారుతుందని పేర్కొంది. అందుకే వీటిపై 18శాతం డీఎస్టీ విధించుకోవచ్చని స్పష్టం చేసింది. రోటీ, చపాతీలపై జీఎస్టీ 5శాతంగా ఉంది. ఈ విషయంపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. భారత్‌లో బ్రిటిష్ హయాంలో కూడా ఆహార పదార్థాలపై ఇంత శాతం పన్ను విధించలేదని మండిపడ్డారు. దేశంలో ధరల పెరుగుదలకు అధిక జీఎస్టీ పన్నులే కారణమని విమర్శించారు. జీఎస్టీని తగ్గిస్తేనే ప్రజలకు ఉపశమనం లభిస్తుందని, ధరలు దిగివస్తాయని పేర్కొన్నారు. చదవండి: హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ -
ఘట్టాలు:: జననాలు:: చట్టాలు
ఘట్టాలు 1. ప్రాంతీయ భాషా పత్రికల వ్యతిరేక చట్టం (1878) రద్దయింది. 2. ఇండియాలో స్థానిక స్వపరిపాలనకు బ్రిటన్ తీర్మానం. 3. విద్యారంగ సంస్కరణల కోసం హంటర్ కమిషన్ ఏర్పాటు. జననాలు బిదాన్ చంద్ర రాయ్ : పశ్చిమ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రి; సుబ్రహ్మణ్య భారతి : స్వాతంత్య్ర సమర యోధులు, సంఘ సంస్కర్త, కవి; ఇనాయత్ ఖాన్ : మ్యూజికాలజీ ప్రొఫెసర్ (గుజరాత్); నందాలాల్ బోస్ : మోడర్న్ ఇండియన్ ఆర్టిస్ట్ (పశ్చిమ బెంగాల్); ఆచార్య రామ్ చంద్ర శుక్లా : చరిత్రకారుడు (ఉత్తర ప్రదేశ్); పురుషోత్తమ్ దాస్ టాండన్ : స్వాతంత్య్ర సమర యోధులు (ఉత్తర ప్రదేశ్); వాల్చంద్ హీరాచంద్ : పారిశ్రామికవేత్త (మహారాష్ట్ర); రఘునాథ్ కార్వే : గణితాచార్యులు (మహారాష్ట్ర); బాబా కాన్షీరామ్ : కవి, సామాజిక కార్యకర్త (హిమాచల్ ప్రదేశ్); సీమాబ్ అక్బరాబాదీ: ఉర్దూ కవి (ఆగ్రా); నానాభాయ్ భట్ : సినీ దర్శకులు (గుజరాత్); గీవర్ఘీస్ మర్ ఇవానోయిస్ : క్యాథలిక్ చర్చి ఆర్చి బిషప్ (కేరళ); శ్రీ పురోహిత్ స్వామి : బహుబాషావేత్త, (మహారాష్ట్ర) చట్టాలు పవర్ ఆఫ్ అటార్నీ యాక్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, ప్రెసిడెన్సీ స్మాల్ కాజ్ కోర్ట్స్ యాక్ట్, కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్, ఇండియన్ ట్రస్ట్ యాక్ట్, ఇండియన్ ఈజ్‌మెంట్స్ యాక్ట్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ యాక్ట్, రిజర్వ్ ఫోర్సెస్ యాక్ట్ -
స్వయం పోషకత్వాన్ని దెబ్బతీసిన బ్రిటీష్ పాలన
మొగలుల సామ్రాజ్యం పతనమయ్యాక 1707 నుంచి ఆంగ్లేయుల రాక ప్రారంభమైంది. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం నెపంతో వచ్చి రాజకీయ పెత్తనం చెలాయించింది. తొలి స్వాతంత్య్ర సమరాన్ని(1857) అణచివేసిన తర్వాత 1858 నుంచి భారత ఉప ఖండం యావత్తూ పూర్తిగా బ్రిటిష్ వలస పాలనలోకి వెళ్లిపోయింది. 1947 వరకు సాగిన ఈ పరాయి దోపిడీ పాలనలో మన దేశ వ్యవసాయ రంగం అస్థవ్యస్థమైంది. బ్రిటీష్ వారు వచ్చే నాటికి భూమి ప్రైవేటు ఆస్తిగా లేదు. జమిందారీ, రైత్వారీ పద్ధతులను ప్రవేశపెట్టి రైతుల నుంచి పన్నులు వసూలు చేశారు. జనజీవనం కరువు కాటకాలతో చిన్నాభిన్నం అవుతూ ఉండేది. 1800 – 1900 మధ్య కాలంలో 4 దఫాలుగా విరుచుకు పడిన భీకర కరువుల వల్ల 2.14 లక్షల మంది చనిపోయారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి, గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం ఏమేమి చర్యలు తీసుకోవాలో తెలుసుకోవడం కోసం 1880, 1898, 1901 సంవత్సరాలలో వరుసగా 3 కరువు కమిషన్లను నియమించారు. 1903లో నీటిపారుదల కమిషన్, 1915లో సహకార కమిటీలు చేసిన సిఫార్సులతో ఆయా రంగాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. 1920 నాటికి భూమి వ్యక్తిగత ఆస్తిగా మారింది. భారతదేశ వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల అధ్యయనానికి 1926లో ‘రాయల్ కమిషన్’ ఏర్పాటైంది. ‘దేశానికి ఆహార విధానం అంటూ ఏదీ లేదు. అంతేకాదు, అలాంటిదొకటి అవసరమనే స్పృహ కూడా అప్పటికి లేద’ని అప్పటి భారత ఉప ఖండం స్థితిగతులపై రాయల్ కమిషన్ వ్యాఖ్యానించింది. 1928లో నివేదిక సమర్పించే నాటికి.. మొత్తం జనాభాలో పట్టణ జనాభా దాదాపు 11 శాతం మాత్రమే. కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు. రోడ్లు, రవాణా సదుపాయాలు చాలా తక్కువ. చాలా గ్రామాలు స్వీయ సమృద్ధæయూనిట్లుగా పనిచేస్తూ, తమ అవసరాలన్నిటినీ ఉన్నంతలో తామే తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాయని కమిషన్ పేర్కొంది. భౌగోళికంగా ఇప్పటి మన దేశంతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్‌లతో కూడిన మొత్తం ‘బ్రిటిష్ ఇండియా’ ప్రాంతానికి సంబంధించి రాయల్ కమిషన్ నివేదించిన విషయాలివి. 8 కోట్ల ఎకరాలకు పైగా వరి.. 2.4 కోట్ల ఎకరాల్లో గోధుమ.. 3.3 కోట్ల ఎకరాల్లో జొన్న, సజ్జ తదితర చిరుధాన్యాలు.. 1.8 కోట్ల ఎకరాల్లో పత్తి, 1.4 కోట్ల ఎకరాల్లో నూనెగింజలు, 1.4 కోట్ల ఎకరాల్లో పప్పుధాన్యాలు సాగవుతున్నాయని కమిషన్ పేర్కొంది. ‘పశువులకు ప్రపంచంలో ఏ దేశంలో లేనంత ప్రాధాన్యత భారతదేశంలో ఉంది. పశువులు లేకుండా ఇక్కడ వ్యవసాయాన్ని ఊహించలేం. పాడి కోసం, ఎరువు కోసమే కాకుండా.. దుక్కికి, సరుకు రవాణాకు కూడా పశువులే ఆధారంగా నిలుస్తున్నాయి. 1924–25 నాటికి దేశంలో ఆవులు, ఎద్దులు, గేదెలు, దున్నలు 15.1 కోట్లు, మేకలు, గొర్రెలు 6.25 కోట్లు, గుర్రాలు, గాడిదలు 32 లక్షలు, ఒంటెలు 5 లక్షలు ఉన్నాయని రాయల్ కమిషన్ తెలిపింది. భారతీయ వ్యవసాయ రంగం అభివృద్ధికి లార్డ్ కర్జన్ సారధ్యంలోని బ్రిటిష్ ప్రభుత్వం చేసిన కృషి శ్లాఘనీయమని రాయల్ కమిషన్ వ్యాఖ్యానించింది. 1903 జూన్ 4న బీహార్, దర్భాంగా జిల్లాలోని పూసలో జాతీయ వ్యవసాయ విద్య, పరిశోధనా స్థానం ఏర్పాటుకు ఉత్తర్వులిచ్చారు. పూస ఎస్టేట్‌లో దేశీ పశు సంపదపై పరిశోధనా స్థానాన్ని కూడా పెట్టించారు. ఆ క్రమంలోనే భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా తొలి దశలో 1924కు ముందే 5 వ్యవసాయ కళాశాలలు ఏర్పాటయ్యాయి. పాడి, పంటలతో గ్రామం స్వయం పోషకత్వం కలిగి వుండేది. వ్యవసాయానికి ఉపాంగాలుగా వృత్తి పరిశ్రమలు వుండేవి. బ్రిటిష్ పారిశ్రామిక విప్లవం మన వృత్తులను దెబ్బతీసింది. బ్రిటన్‌లో పరిశ్రమల అభివృద్ధికి ముడిసరుకు కోసం ఇక్కడ వ్యాపార పంటలను ప్రోత్సహించారు. వ్యవసాయంతో పాటు కుటీర పరిశ్రమలను బ్రిటిష్ పాలకులు చావు దెబ్బతీశారు. దేశీ పత్తి పంట సాగు, కుటుంబ పరిశ్రమగా చేనేత వస్త్రాల తయారీలో భారతీయ గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాయి. మస్లిన్స్, కాలికోస్ వంటి మేలు రకాల వస్త్రాలను ప్రపం^è దేశాలకు ఎగుమతి చేసిన వెయ్యేళ్ల చరిత్ర మనది. అటువంటిది బ్రిటిష్ పాలనలో తల్లకిందులైంది. బ్రిటన్‌లో యంత్రాలకు పొడుగు పింజ అమెరికన్ పత్తి అవసరం. అందుకని, మన దేశంలో దేశీ పత్తికి బదులు అమెరికన్ రకాలను సాగు చేయించి, పత్తిని బ్రిటన్‌కు ఎగుమతి చేయటం.. అక్కడ యంత్రాలపై ఉత్పత్తి చేసిన వస్త్రాలను దిగుమతి చేసి మన దేశంలో అమ్మటం.. ఇదీ బ్రిటిష్ పాలకులు స్వార్థంతో చేసిన ఘనకార్యం. దీని వల్ల మన దేశీ పత్తి వంగడాలు మరుగునపడిపోయాయి. చేనేత పరిశ్రమ చావు దెబ్బ తిన్నది. ఆహార ధాన్యాలు పండించే పొలాలు కూడా అమెరికన్ పత్తి సాగు వైపు మళ్లాయి. 1928 తర్వాతి కాలంలో దేశం రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలతో పాటు వ్యవసాయం, నీటిపారుదల రంగాలు కూడా విస్తారమైన మార్పులకు గురయ్యాయి. 1757లో 16.5 కోట్లున్న దేశ జనాభా 1947 నాటికి 42 కోట్లకు పెరిగింది. పెరిగిన జనాభాకు తగినట్లుగా ఆహారోత్పత్తిని పెంచడానికి నీటిపారుదల సదుపాయాలను బ్రిటిష్ ప్రభుత్వం 8 రెట్లు పెంచింది. పంజాబ్, సిం«ద్ ప్రాంతాల్లో భారీ ఎత్తున నీటిపారుదల సదుపాయం కల్పించారు. అదేవిధంగా, కృష్ణా, గోదావరి డెల్టాను సస్యశ్యామలం చేసేందుకు సర్ ఆర్థర్ కాటన్ ఆధ్వర్యంలో ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజ్‌లను నిర్మించారు. 1920 తర్వాత పెద్దగా కరువు పరిస్థితుల్లేకపోవటంతో ఆహారోత్పత్తి కుదుటపడింది. అయినా, 1943లో 3 లక్షలకు పైగా బెంగాలీయులు ఆకలి చావులకు బలయ్యారు. ప్రకృతి కరుణించక కాదు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో విన్స్టన్ చర్చిల్ తీసుకున్న నిర్ణయాల వల్ల కృత్రిమ ఆహార కొరత ఏర్పడి ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. దీనికి మించిన విషాదం ఆధునిక భారతీయ చరిత్రలో మరొకటి లేదు. -
మిరపకాయ టపా పేరిట పోస్టల్ కవర్ విడుదల
రాజవొమ్మంగి: విప్లవ వీరుడు, మన్యందొర అల్లూరి సీతారామరాజు ఉపయోగించిన ‘‘మిరపకాయ టపా’’ పేరిట తపాలా శాఖ శుక్రవారం రాజవొమ్మంగిలో తపాలా కవర్ విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ తరహా కార్యక్రమం ఆయన పాదముద్రలు పడిన ప్రాంతాలైన రంపచోడవరం, అడ్డతీగలలో పూర్తికాగా, ఇప్పుడు రాజవొమ్మంగి వంతు వచ్చింది. తాను వస్తున్నాను కాసుకోండి ఖబడ్దార్ (జాగ్రత్తపడు) అంటూ.. ప్రాణనష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో అల్లూరి సీతారామరాజు మిరపకాయ టపా పంపేవారట. అలా ఓ వైపు బ్రిటీష్ సేనలను జాగృతం చేస్తూనే, మరోవైపు ఉరుములేని మెరుపులా వచ్చి వాలిపోలియేవారని చెబుతారు. తాను ఎప్పుడు, ఎలా ఎక్కడకు వస్తున్నది, ఏం చేయబోతుంది, లేఖ రాసి బాణానికి గుచ్చి, దాంతో పాటే ఎర్ర మిరపకాయల గుత్తి కట్టి వదిలేవారట. ఆ విధంగా వచ్చిన రామబాణాన్ని చూసి ముష్కరులకు నిద్రపట్టేది కాదని, అప్పటి సాయుధ పోరులో అల్లూరి సీతారామరాజు చూపిన ప్రతిభా పాటవాలను నేటికీ గిరిజనులు కథలుగా చెప్పుకుంటారు. ఆ మహానుభావుని ఉద్యమాల పంథా నూరేళ్ల పండగను జరిపే బరువు బాధ్యతలను తపాలా శాఖ తన భజస్కంధాలపై వేసుకుంది. స్వాతంత్య్ర సమరంలో ఎంతోమంది అసువులుబాయగా, మన్యంలో గిరిజనుల కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన అల్లూరికి పరిపరి విధాలుగా ఆ శాఖ నివాళులర్పిస్తోంది. ఈ కార్యక్రమంలో సాధారణ పోస్టుమన్ నుంచి పోస్ట్‌మన్ జనరల్ వరకు పాల్గొంటూ అల్లూరి స్ఫూర్తి నేటి తరం యువతకు ఎంతో అవసరం అని చాటి చెబుతోంది. హాజరు కానున్న ఎంపీ, ఎమ్మెల్యేలు.. మిరపకాయ టపా పేరిట రాజవొమ్మంగి జయలక్ష్మి థియేటర్లో నిర్వహించే అల్లూరి ఉద్యమ శతజయంతి వేడుకలకు అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయభాస్కర్, అల్లూరి సీతారామరాజు జాతీయ యువజన సంఘం అధ్యక్షుడు పడాల వీరభద్రరావు, పోస్ట్ మాస్టర్ జనరల్ (విశాఖపట్నం) ముత్యాల వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. (చదవండి: అటవీ వనం కన్నీరు..గొడ్డలి వేటుకు కనుమరుగవుతున్న పచ్చదనం) -
అన్నీ ఓకే కానీ, ఆ విషయంలో బ్రిటిషర్లకు ఇబ్బందులు.. అప్పుడే వచ్చిందో ఆలోచన!
Britishers Uncomfortable In India: ఇప్పుడంటే మనకు సీలింగ్ ఫ్యాన్లు ఉన్నాయి. కానీ కరెంటు సౌకర్యం లేని వంద, రెండు వందల ఏళ్ల కింద పరిస్థితి ఏమిటో తెలుసా? బ్రిటిషర్లు ఉక్కపోత తట్టుకోవడానికి ఏం చేశారో తెలుసా..? గదిలో పైనుంచే వేలాడే వింజామర్లాంటి పంకాలను తయారు చేయించారు. ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ బ్రిటిషర్లు ఇండియాకు వచ్చిన కొత్తలో ఇక్కడి చాలా పరిస్థితులకు తగ్గట్టుగా సర్దుకుపోగలిగారు. కానీ వారికి వచ్చిన చిక్కల్లా ఒక్కటే. మన ఎండాకాలం. బ్రిటిష్‌వారికి బాగా ఎండకొట్టడమంటే.. మనకు చలికాలంలో మధ్యాహ్నం ఉన్నట్టు ఉంటుందంతే. కానీ ఇక్కడి ఎండాకాలంలో ఎండ వేడిని తట్టుకోవడానికి వారు నానా తంటాలూ పడ్డారు. కరెంటు లేకపోవడంతో ఫ్యాన్లు వాడలేరు. ఈ క్రమంలోనే భారీ ‘మ్యాన్యువల్ పంకా’లపై దృష్టిపెట్టారు. (చదవండి: సర్పంచ్ పదవికి వేలం పాట.. ఓర్ని! అన్ని లక్షలేందిరా సామీ..) వింజామరల నుంచి స్ఫూర్తి పొంది.. బ్రిటిష్ వాళ్లు వచ్చేప్పటికి మన దేశంలో రాజుల పాలన నడుస్తోంది. ఆ సమయంలో రాజులు, వారి కుటుంబ సభ్యులు, ఉన్నత స్థానాల్లో ఉండే పాలకులకు సేవకులు ‘వింజామర’లతో గాలి ఊపేవారు. వింజామరలు అంటే.. వస్త్రం, పక్షుల ఈకల వంటి వాటితో తయారై, పెద్దసైజు విసనకర్రల్లా ఉంటాయి. ఇక్కడి ఎండను, వేడిని తట్టుకోలేని బ్రిటిషర్లు.. ఆ వింజామరలను చూసి.. వాటి తరహాలో ‘పంకా’లను తయారు చేయించి వాడటం మొదలుపెట్టారు. గది నిండా గాలి వచ్చేలా.. నిజానికి ఒకరిద్దరికి అయితే వింజామరలు సరిపోతాయి. కానీ ఓ పెద్ద గది నిండా ఉండే వారికి గాలి రావాలంటే ఎలా? ఈ ఆలోచనతోనే పెద్ద పంకాలను తయారు చేయించేవారు. ► గది వెడల్పు కన్నా కాస్త తక్కువ పొడవున్న ఓ దూలాన్ని లేదా గట్టి వెదురు బొంగును తెచ్చి.. దానికి రెండు, మూడు అడుగుల మేర ఎత్తు వచ్చేలా అడ్డంగా వస్త్రాన్ని అమర్చేవారు. దీనిని గది మధ్యలో పైకప్పు నుంచి వేలాడదీసేవారు. ఆ దూలానికి తాళ్లు కట్టి.. ఏదో ఓ వైపు గోడలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రంధ్రాల ద్వారా బయటికి వేసేవారు. బయట కొందరు కూలీలు/బానిసలను పెట్టి ఆ తాడును లాగుతూ, వదులుతూ ఉండేలా చూసేవారు. ఇవే పంకాలు! కూలీలు/బానిసలు తాడును లాగుతూ, వదులుతూ ఉన్న కొద్దీ (పిల్లలు పడుకున్న ఊయలను తాడుతో ఊపినట్టుగా..).. గదిలో పైన ఏర్పాటుచేసిన ‘పంకా’లు.. అటూ ఇటూ ఊగుతూ గదిలో గాలి వీచేది. ఇలా పంకాలు ఊపే కూలీలను ప్రత్యేకంగా ‘పంకా వాలా’లు అని పిలిచేవారు. ► అప్పట్లో బ్రిటిషర్లు మాత్రమేకాదు.. స్థానిక రాజులు, అధికారులు, ధనికులు తమ ఇళ్లు, ఆఫీసుల్లో కూడా ఇలాంటి ‘పంకా’లను ఏర్పాటు చేయించుకుని.. కూలీలు/బానిసలతో వినియోగించుకునేవారు. ఇంటి నిండా పంకాలే.. బాగా డబ్బున్నవారు, వ్యాపారులు, బ్రిటిషర్లలో కాస్త పైస్థాయి ఆఫీసర్ల నివాసాల్లో అయితే.. ఏకంగా హాలు, బెడ్రూంతో పాటు బాత్రూమ్లలోనూ పంకాలు ఏర్పాటు చేసుకునేవారు. ఒక్కోచోట నుంచి ఒక్కో తాడు ఇంటి బయటికి అమర్చేవారు. బయట ఉన్న పంకావాలాలు వాటిని లాగుతూ, వదులుతూ ఊపేవారు. 19వ శతాబ్దం మొదలయ్యాక.. విద్యుత్ అందుబాటులోకి రావడంతో ఈ ‘పంకా’లు అంతర్థానమైపోయాయి. (చదవండి: కీలక విషయాలు వెల్లడి.. రాష్ట్రాల కోవిడ్ మృతుల సంఖ్యలో భారీ తేడా?) -
పంచెకట్టులో రెచ్చిపోయిన పిచ్చయ్య.. బిత్తరపోయిన బ్రిటిష్ దొరలు
బాల్ బ్యాడ్మింటన్ దిగ్గజం, అర్జున అవార్డు గ్రహీత 104 ఏళ్ల పిచ్చయ్యను ఇంటర్వ్యూ చేసేందుకు ‘సాక్షి’ అనుకోకుండా ఆదివారం ఆయనుంటున్న మనవడి ఇంటికెళ్లింది. పిచ్చయ్య నెమ్మదిగా తన వివరాలు చెప్పారు. ఆయన మనవడు దగ్గరుండి ఆయన చెప్పిన విషయాలను వివరించారు. ‘సాక్షి’తో చివరిసారిగా ఆయన మాటామంతీ.. ‘లగాన్’ సినిమాలో అమీర్ ఖాన్ క్రికెట్ ఆడేందుకు బ్యాట్ పట్టుకుని పంచెకట్టుతో బరిలోకి దిగుతా డు. బ్రిటిష్ దొరలు అతన్ని హేళన చేస్తారు. 2001 నాటి ఈ ముచ్చట చాలామందికి తెలుసు. కానీ సరిగ్గా ఇలాంటి ఉదంతమే నిజ జీవితంలో అంతకు అరవై ఏళ్ల ముందే చోటు చేసుకుంది. వరంగల్ స్పోర్ట్స్: స్వాతంత్య్రానికి పూర్వం 1939– 40లో అప్పటి మద్రాస్‌లో స్టేట్ స్టాఫ్ క్లబ్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతున్నాయి. ఆ పోటీల్లో ఓ ఆటగాడు నిక్కర్, టీ షర్ట్ లాంటి క్రీడా దుస్తులకు భిన్నంగా పంచెకట్టుతో కోర్టులో అడుగు పెట్టాడు. అతడి కాళ్లకు కనీసం బూట్లు కూడా లేవు. అతడిని చూసిన బ్రిటిష్ దొరలు, క్రీడా విశ్లేషకులు.. ‘పొలం దున్నుకునే వాడిని బ్యాడ్మింటన్ కోర్టుకు ఎందుకు రానిచ్చారు’ అని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ.. మ్యాచ్ ముగిసిన తర్వాత వాళ్లకు అర్థమైంది ‘వీడు వచ్చింది కోర్టును దున్నేయడానికి అని..’ నాటి నుంచి వెనుతిరిగి చూడకుండా కోర్టును దున్నేస్తూ చివరికి బాల్ బ్యాడ్మింటన్‌లో లెక్కకు మించిన అవార్డుల పంట పండించారు. అతనే మన ‘అర్జున’ పిచ్చయ్య. క్లబ్బుల్లో నేర్చుకుని..ఛాంపియన్‌షిప్‌లు గెలిచి పిచ్చయ్య సమకాలీకులెవరూ ఇప్పుడు లేరు. మనవడు చెప్పిన వివరాలు, అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. పిచ్చయ్య బందరు పట్ట ణంలో మినర్వ క్లబ్, మోహన్ క్లబ్‌లలో బాల్ బ్యాడ్మింటన్ ఆడడం అలవాటు చేసుకున్నారు. 1935–36లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలో విజేతగా నిలిచారు. హైదరాబాద్ రాష్ట్రంలో చాదర్‌ఘాట్‌లో జరిగిన పోటీల్లో ఆజంజాహి మిల్లు తరఫున ఆడి గెలిచారు. 1954–55లో హైదరాబాద్‌లోనే జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. 15 జాతీయస్థాయి పోటీల్లో కెప్టెన్‌గా వ్యవహరించి 9 ఛాంపియన్షిప్లను గెలుపొందడంలో కీలకపాత్ర వహించారు. హైదరాబాద్ స్టేట్ తరఫున 5, ఆంధ్రప్రదేశ్ తరఫున 9 జాతీయస్థాయి పోటీల్లో ఆడారు. 1966లో జంషెడ్‌పూర్‌లో జరిగిన మ్యాచ్ తర్వాత పిచ్చయ్య స్టార్ ఆఫ్ ఇండియాగా అవతరించారు. పిచ్చయ్య పేరుపై రాకెట్లు వింబుల్డన్ ఆఫ్ బాల్ బ్యాడ్మింటన్ అని పిలిచే మధురై టోర్నీ ఫైనల్లో నాటి మేటి ఆటగాడు దక్షిణామూర్తిపై విజయం సాధించి విజార్డ్ ఆఫ్ బాల్ బ్యా డ్మింటన్గా పేరుపొందారు. ఆ మ్యాచ్‌లో పిచ్చయ్య ప్రదర్శన చూసి పంజాబ్ జలంధర్‌లో బాల్ బ్యా డ్మింటన్ రాకెట్లు తయారు చేసే కంపెనీ పిచ్చయ్య పేరుపై రాకెట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. అప్పట్లో సొంత ఇల్లే లేదు.. జాతీయస్థాయిలో ఆడిన పిచ్చయ్యకు అప్పట్లో సొం త ఇల్లూ లేదు. అంత తాహతూ లేదు. దీంతో అప్పటివరకు తనకు వచ్చిన వెండి బహుమతులను అమ్మేయగా రూ.19 వేలు రాగా.. వాటితో 1965లో వరంగల్ కృష్ణ కాలనీలో సొంత ఇల్లు కట్టుకున్నట్లు ఆయన స్నేహితులు చెబుతుంటారు. తర్వాత ప్రభు త్వం వరంగల్‌లోని దేశాయిపేటలో 500 గజాల స్థలం కేటాయిస్తే.. పాత ఇల్లు అమ్మి ఇక్కడ కొత్త ఇల్లు కట్టుకున్నారు. ఆయనకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. 104 ఏళ్ల వయసులోనూ తన పనులు తానే చేసుకునే వారు. శాకాహారం మాత్రమే తీసుకునేవారు. ఆరోగ్యంగా ఉన్న సమయంలో ఎక్కడికైనా సైకిల్ పైనే వెళ్లేవారు. -
తొలి ఆంగ్లేయుడు శ్వేతజాతీయుడు కాదా..?
లండన్ : పురాతన బ్రిటిషర్లు శ్వేతజాతీయులు కాదని డీఎన్ఏ పరీక్షల ద్వారా తేలింది. పదివేల సంవత్సరాల క్రితం మరణించిన వ్యక్తి ఎముకలపై తొలిసారిగా నిర్వహించిన అత్యంతాధునిక జన్యు పరీక్షలు, ఫేషియల్ రీకన్స్ర్టక్షన్ టెక్నిక్స్ ద్వారా అసాధారణ విషయాలు వెలుగుచూశాయి. తొలితరం ఆంగ్లేయులు నలుపు వర్ణంతో, ఉంగరాల జుట్టు, నీలి కళ్లు కలిగిఉన్నారని తెలిసింది. బ్రిటన్‌లోని సోమర్సెట్ చెద్దార్ లోయలో లభించిన అతిపురాతన మానవ కళేబరంపై పరీక్షలు నిర్వహించిన శాస్త్రవేత్తలు విస్తుగొలిపే అంశాలను వెల్లడించారు. తాము పరిశీలించిన మానవ కళేబరం జీవించి ఉంటే సదరు వ్యక్తి ‘బ్లాక్’ అని స్పష్టం చేశారు. ఆంగ్లేయులు శ్వేతజాతీయులు కాదని, కాలక్రమేణా వారి చర్మం వర్ణం మారిఉండవచ్చని తమ పరిశోధనలో తేలినట్టు వారు పేర్కొన్నారు. 1903లో సోమర్సెట్లోని చెద్దార్లో లభించిన కళేబరం, వాటి ఎముకలు అప్పటి నుంచి సంచలనంగానే మారాయి. వందేళ్లకు పైగా శాస్త్రవేత్తలు ‘చెద్దార్ మెన్’ కథను వెలికితీసే పనిలో పడ్డారు. అతని ముఖకవళికలు, పూర్వాపరాలు, తన పూర్వీకుల గురించి ఎలాంటి విషయాలు వెలుగుచూస్తాయనేది ఎప్పటికప్పుడు ఉత్కంఠ కలిగిస్తోంది. నేచురల్ హిస్టరీ మ్యూజియం, యూనివర్సిటీ కాలేజ్ లండన్ నిర్వహించిన జన్యు పరీక్షల్లో సంచలన విషయాలు వెలుగుచూశాయని మ్యూజియం శాస్త్రవేత్త డాక్టర్ టామ్ బూత్ చెప్పారు. -
రోజుకు రెండు గంటలు ఒత్తిడితో చిత్తు
లండన్ : ఆధునిక జీవితంలో ఒత్తిడి రొటీన్‌గా మారింది. తాజా అథ్యయనం ప్రకారం బ్రిటన్వాసులు ఏడాదిలో దాదాపు 27 రోజులు ఒత్తిడిలో మునిగితేలుతారని తేలింది. చిన్న చిన్న విషయాలకూ వీరు ఒత్తిడితో చిత్తవుతారని పేర్కొంది. వాలెట్, బ్యాగ్, కీస్ పోయినందుకో..సమయానికి ట్రైన్‌ను అందుకుంటామా లేదా..వంటి చిన్నకారణాలతోనూ ఒత్తిడితో సతమతమవుతుంటారని తెలిపింది. రోజులో రెండు గంటల పాటు బ్రిటిషర్లు టెన్షన్ పడుతుంటారని 2000 మంది పురుషులు, మహిళలను పలకరించిన ఈ సర్వేలో వెల్లడైంది. రోజువారీ బిజీ జీవితం వల్లే ఒత్తిడి ఎదుర్కొంటున్నామని రెండు వంతుల మంది చెప్పగా...సమయం లేకపోవడంతో టెన్షన్ పడుతున్నామని 38 శాతం మంది చెప్పుకొచ్చారు. ఏటా 3676 సార్లు స్ట్రెస్‌కు గురవుతున్నామని పెద్దలు చెప్పగా..చిన్న విషయాలకూ టెన్షన్ పడుతుండటం తమ ఆరోగ్యాలపై ప్రభావం చూపుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. బిజీ జీవితంలో చిన్న విషయాలకూ టెన్షన్ పడుతుండటం దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని బ్రిటన్‌లో ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ లూయిస్ హెచ్చరించారు. -
తెల్లోళ్లకు చద్దికూడే ఇష్టం!!
బ్రిటిష్ వాళ్లంటే అబ్బో.. తెల్లదొరలు, చాలా ఖరీదైన తిండి తింటారని అనుకుంటాం కదూ. కానీ, నిజానికి వాళ్లలో చాలామంది తాజా కూరగాయలు వండుకోవడం కంటే, చద్ది కూడే ఇష్టపడతారట. అప్పటికప్పుడు వేడి చేసుకుని తినేయడం అంటేనే వాళ్లకు బాగా నచ్చుతుందని ఓ సర్వేలో తేలింది. బ్రిటిష్ కుటుంబాలు జేబులో పెట్టుకుని వెళ్లేలా ప్యాకెట్లలో ఉన్న ఆహారాలు, లేదా సీసాల్లో నిల్వ చేసి, సాయంత్రానికి వేడిచేసుకుని తినేలా ఉండేవి అంటేనే ఎక్కువగా ఇష్టపడుతున్నాయట. వారానికి నాలుగు రోజులు ఇలాగే చేస్తున్నాయని ఈ సర్వేలో తేలింది. ప్రధానంగా మీట్ బాల్స్, సాసేజ్ఓ కాసరోల్, కాటేజ్ పై లాంటివాటిని బ్రిటిషర్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇవన్నీ హాయిగా ప్యాక్ చేసి సిద్ధంగా ఉంటాయి. ప్యాకెట్ తెరుచుకుని తినేస్తే సరిపోతుంది. అందుకే వాళ్లు వీటిమీద మోజు పడుతున్నారని సర్వే చేసిన సంస్థ తెలిపింది. పగలంతా పని చేసిన తర్వాత కూడా మళ్లీ సాయంత్రం వచ్చి వంట చేసుకుని తినాలంటే బ్రిటిష్ వాళ్లకు చాలా ఇబ్బందిగా ఉంటోందని, దానికి బదులు ఎంచక్కా ప్యాకెట్లు తెచ్చుకుని, వేడి చేసుకుని తినేయడమే వీలుగా ఉంటోందని చెప్పారు. వంటగదిలో గంటల తరబడి వంట చేస్తూ ఉండటం అంటే ఎవరికీ ఇష్టం ఉండదని, పైగా శనివారం రాత్రి హాయిగా టీవీ ముందు కుటుంబంతో కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకోకుండా.. వంటగదిలో ఎలా కూర్చుంటామని అడుగుతున్నారు.