గాంధీనగర్: రెడీ టూ ఈట్(తినడాకి సిద్ధంగా ఉండేలా తయారు చేసిన) పరోటాలపై అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ 18 శాతం జీఎస్టీ విధించడాన్ని సమర్థించింది గుజరాత్
అప్పలెట్ అథారిటీ ఆప్ అడ్వాన్స్ రూలింగ్(ఏఏఏఆర్). దీన్ని అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది.
పరోటాలు.. ప్లెయిన్ చపాతీ, రోటీల కేటగిరీలోకి రావని జీఏఏఏఆర్ ద్విసభ్య బెంచ్ అభిప్రాయపడింది. రెడీ టూ ఈట్ పరోటాలను నిల్వ చేస్తారని, మూడ్నాలుగు నిమిషాల పాటు వేడి పెనంపై కాల్చాల్సి ఉంటుందని, ఆ తర్వాత దాని రంగు కూడా మారుతుందని పేర్కొంది. అందుకే వీటిపై 18శాతం డీఎస్టీ విధించుకోవచ్చని స్పష్టం చేసింది. రోటీ, చపాతీలపై జీఎస్టీ 5శాతంగా ఉంది.
ఈ విషయంపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. భారత్‌లో బ్రిటిష్ హయాంలో కూడా ఆహార పదార్థాలపై ఇంత శాతం పన్ను విధించలేదని మండిపడ్డారు. దేశంలో ధరల పెరుగుదలకు అధిక జీఎస్టీ పన్నులే కారణమని విమర్శించారు. జీఎస్టీని తగ్గిస్తేనే ప్రజలకు ఉపశమనం లభిస్తుందని, ధరలు దిగివస్తాయని పేర్కొన్నారు.
చదవండి: హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
Comments
Please login to add a commentAdd a comment