Paratha Post
-
వైరల్ వీడియో: ‘హాస్టల్ ఫుడ్.. ఇలాగే ఉంటుంది మరి!’
-
Hostel Food: ‘హాస్టల్ ఫుడ్.. ఇలాగే ఉంటుంది మరి!’
రోజులు మారాయి. ప్రతీది సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. అందుకు కారణాలు అన్వేషించాల్సిన అవసరం లేకుండా పోతోంది. జనాలను ఆకట్టుకోగలిగితే చాలూ.. దానిపై చర్చా.. ఆపై ట్రెండింగ్‌లోకి వచ్చేస్తోంది కూడా. అలా ఓ వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. దాని పేరే ‘హాస్ట్ కా ఖానా’. సర్కారీ పరిధిలోని హాస్టల్స్ మాత్రమే కాదు.. ఈరోజుల్లో వేలకు వేలు తీసుకుంటున్న ప్రైవేట్ హాస్టల్స్ కూడా మెరుగైన సౌకర్యాలను అందించడంలో విఫలం అవుతున్నాయి. ఫ్రాంచైజీల పేరుతో డబ్బును తెగ దండుకుంటున్నాయి. అయితే ‘అంతకు మించి..’ ఫీజుల్ని చెల్లించలేని వాళ్లు ఎలాగోలా సర్దుకుపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇక ఓ హాస్టల్లోని ఫుడ్ ఎంత దారుణంగా ఉందనే వీడియో వైరల్ అవుతోంది ఇప్పుడు. సాక్షి జైన్ అనే ట్విటర్ యూజర్.. హాస్టల్ ఫుడ్‌కు సంబంధించిన వీడియో ఒకటి తన వాల్‌పై పోస్ట్ చేశారు. మడతపెట్టడానికి కాదు కదా.. ఎందుకూ పనికిరాకుండా ఉంది ఆ పరాటా. పైగా రాయిలాగా టపా టపా సౌండ్ కూడా వస్తోంది. ఎవరైనా ఇది ఎలా తింటారంటూ చివర్లో ఆ మహిళ వాయిస్ వినిపిస్తుంది. ఇక ఈ వీడియో కామెంట్లు తెగ వచ్చేస్తున్నాయి. ఇక సెటైర్లకు అంతే లేకుండా పోతోంది. హాస్టల్ ఫుడ్.. ఇలాగే ఉంటుంది మరి! అనే కామెంట్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో ఎక్కడిది అనేదానిపై స్పష్టత మాత్రం లేదు. Hostel ka khana🙃 pic.twitter.com/8FiLCwtZ33 — Sakshi Jain • Content Strategist (@thecontentedge) February 16, 2023 -
పరోటాలపై 18 శాతం జీఎస్టీనా? బ్రిటిషర్లే నయం..!
గాంధీనగర్: రెడీ టూ ఈట్(తినడాకి సిద్ధంగా ఉండేలా తయారు చేసిన) పరోటాలపై అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ 18 శాతం జీఎస్టీ విధించడాన్ని సమర్థించింది గుజరాత్ అప్పలెట్ అథారిటీ ఆప్ అడ్వాన్స్ రూలింగ్(ఏఏఏఆర్). దీన్ని అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది. పరోటాలు.. ప్లెయిన్ చపాతీ, రోటీల కేటగిరీలోకి రావని జీఏఏఏఆర్ ద్విసభ్య బెంచ్ అభిప్రాయపడింది. రెడీ టూ ఈట్ పరోటాలను నిల్వ చేస్తారని, మూడ్నాలుగు నిమిషాల పాటు వేడి పెనంపై కాల్చాల్సి ఉంటుందని, ఆ తర్వాత దాని రంగు కూడా మారుతుందని పేర్కొంది. అందుకే వీటిపై 18శాతం డీఎస్టీ విధించుకోవచ్చని స్పష్టం చేసింది. రోటీ, చపాతీలపై జీఎస్టీ 5శాతంగా ఉంది. ఈ విషయంపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. భారత్‌లో బ్రిటిష్ హయాంలో కూడా ఆహార పదార్థాలపై ఇంత శాతం పన్ను విధించలేదని మండిపడ్డారు. దేశంలో ధరల పెరుగుదలకు అధిక జీఎస్టీ పన్నులే కారణమని విమర్శించారు. జీఎస్టీని తగ్గిస్తేనే ప్రజలకు ఉపశమనం లభిస్తుందని, ధరలు దిగివస్తాయని పేర్కొన్నారు. చదవండి: హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ -
ఆ మూడు పరోఠాలు తింటే మొనగాళ్లే
రోహ్తక్ : అది ఢిల్లీ-రోహ్తక్ బైపాస్ రోడ్డు. అక్కడ ఓ బిజీ పఠోఠా సెంటర్ దర్శనిమిస్తుంది. ఆ హోటల్ యాజమాని బోర్డు మీదే ఓ బంఫరాఫర్ ఇస్తున్నట్లు ప్రకటన ఇవ్వటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆయన చేసే ఛాలెంజ్‌లో మీరు గెలిస్తే చాలూ 5100 రూపాయల నజరానాతోపాటు.. జీవితాంతం అక్కడ ఫుడ్ ఫ్రీగా దొరుకుతుంది. అయితే బరిలోకి దిగే ముందు మీరు గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇవి ఆషామాషీ పరోఠాలు కావు. ఏదో మనం ఇంట్లో తయారు చేసుకున్నట్లు అరచేతిలో పట్టే సైజుతో ఉండవు. ఆ ఒక్కో పరోఠా బరువు సుమారు కేజీ దాకా ఉంటుంది. పరిమాణం 1 అడుగు పొడవు, 6 అంగుళాల మందం ఉంటుంది. ఒకవేళ వాళ్లు ఓడిపోతే ఆ మూడు పరోఠాల ఖర్చుకు అయ్యే సొమ్మును కక్కాల్సి ఉంటుంది. ఇలాంటి మూడు పరోఠాలను మూడు కేజీల పిండితో తయారు చేస్తారు. ఎంతో మంది ముందుకు వచ్చిన ఈ భారీ పరోఠాలను 50 నిమిషాల్లో తినడం తమ వల్ల కాదంటూ తులెత్తేస్తారంట. ఈ ప్రకటన చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ సవాల్లో ఎవరూ గెలుపు సాధించలేకపోయారని హోటల్ యజమాని చెబుతున్నారు. హిందుస్థాన్ కా సబ్ సే బడా పరోఠా అని బోర్డు మీద వాటి ఫోటోలు చూశాక కూడా మీరు ఛాలెంజ్‌ను స్వీకరించి గెలిస్తే మాత్రం మీరు నిజంగా మొనగాళ్లేనని ఆయన అంటున్నారు. -
’పరాటపోస్ట్’ని కొనుగోలు చేసిన ’హలో కర్రీ’
-
హెలో కర్రీ చేతికి పరాటా పోస్ట్
రూ.50 కోట్లు పెట్టుబడులు పెట్టనున్న బ్లూచిప్ కంపెనీ... ⇒ డిసెంబర్‌కల్లా దేశంలో 90 ఔట్లెట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాణ్యమైన పరాటాలు ఇప్పుడు హెలో కర్రీ మెనూలోకి వచ్చి చేరాయి. హోమ్ డెలివరీ రంగంలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన పరాటా పోస్ట్‌ను ,ఈ నగరం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెలో కర్రీ కొనుగోలు చేసింది. ఎంత మొత్తానికి కొనుగోలుచేసిందీ కంపెనీ వెల్లడించలేదు. పరాటా పోస్ట్‌ను కొనుగోలు చేసిన సందర్భంగా హలో కర్రీ సీఈఓ రాజు భూపతి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పలు విశేషాలు వెల్లడించారు. అవి.... ఎంత తింటే.. అంతే డబ్బులు సింగిల్, ఫ్యామిలీ, జంబో ప్యాక్స్.. ఇదీ స్థూలంగా బిర్యానీ ప్యాక్‌ల రకాలు. హలో కర్రీ అనే స్టార్టప్ ఒక అడుగు ముందుకేసి హైటెక్‌సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ పేరుతో వినూత్న రెస్టారెంట్‌ను ప్రారంభించింది. దీని ప్రత్యేకత ఏంటంటే మనకు ఎంత బిర్యానీ రైస్ కావాలంటే అంత.. ఎన్ని ముక్కలు కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఇక్కడ. గ్రాముకు 50 పైసల చొప్పున చెల్లించాలి అంతే. ఇలా ఎందుకంటే బిర్యానీ బాగా లేదనో, ముక్కలు తినేసి ఆహారం వదలటమో, అనుకున్న దానికంటే ఎక్కువుందనో.. ఇలా కారణాలేమైనా నగరంలో రోజుకు 24.8 శాతం ఆహారం దుర్వినియోగం అవుతోంది. వేస్ట్ కాకుండా ఉండాలంటే ఎంత బిర్యానీ కావాలో ఎంచుకునే అవకాశం కస్టమర్లకే ఇస్తే సరిపోతుందంటారాయన. దేశంలో 80-90 ఔట్లెట్లు.. ప్రస్తుతం హలో కర్రీకి హైదరాబాద్‌లో గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, హైటెక్‌సిటీ, కూకట్‌పల్లిలో ఔట్‌లెట్లున్నాయి. వీటి నుంచి నెలకు 10 వేల ఆర్డర్లొస్తున్నాయి. మరో 15 రోజుల్లో పంజగుట్ట, హిమాయత్‌నగర్‌లోనూ ప్రారంభించనున్నాం. బెంగళూరులో లోనూ సెంటర్లు ఉన్నాయి. డిసెంబర్‌కల్లా దేశంలో 80-90 ఔట్లెట్లు ప్రారంభించానేది లక్ష్యం. 30 నిమిషాల్లో డెలివరీ..: ప్రస్తుతం ఒక్క రోజులో హైదరాబాద్‌లోని మొత్తం హోమ్ డెలివరీ మార్కెట్లో హలో క ర్రీ వాటా 25%. వాట్సాప్, యాప్, ఎస్ఎంఎస్ల ద్వారా కూడా ఆర్డర్లివ్వొచ్చు. ధరలు రూ.79-149 వరకున్నాయి. ఆర్డరిచ్చిన 30 నిమిషాల్లో సరఫరా చేస్తాం. ప్రస్తుతం హలో కర్రీకి 5 లక్షల మంది కస్టమర్లున్నారు. పరాటా పోస్ట్ గురించి.. ఐఐఎం గ్రాడ్యుయేట్లు ముకేష్ లాంబ, రితురాజ్లు 2013లో పరాటా పోస్ట్‌ను ప్రారంభించారు. 55 రకాల పరాటాలు, కూరలను ఈ కంపెనీ సరఫరా చేస్తోంది. గతేడాది 3 లక్షలకుపైగా పరాటాలతో 60 వేల ఆర్డర్లను విజయవంతంగా పూర్తి చేసింది. పరాటాపోస్ట్ కొనుగోలుచేయడంతో పాటు దేశీయ ఫుడ్ డెలివరీ రంగ కంపెనీల కొనుగోలుపై దృష్టిపెట్టాం. ముంబై కంపెనీని త్వరలో కొనుగోలు చేయనున్నాం. రూ.50 కోట్ల పెట్టుబడులు.. 2014లో కంపెనీ ప్రారంభించే రోజుల్లో రూ.3.5 కోట్ల పెట్టుబడులు పెట్టాం. తర్వాతి నెల రోజుల్లోనే వెంచర్ క్యాపిటలిస్ట్ శశిరెడ్డి రూ.3 కోట్లు సీడ్ ఫండ్ అందించారు. తాజాగా రూ.50 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒక బ్లూ చిప్ కంపెనీ ముందుకొచ్చింది. నెల రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తాం.