
రోజులు మారాయి. ప్రతీది సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. అందుకు కారణాలు అన్వేషించాల్సిన అవసరం లేకుండా పోతోంది. జనాలను ఆకట్టుకోగలిగితే చాలూ.. దానిపై చర్చా.. ఆపై ట్రెండింగ్‌లోకి వచ్చేస్తోంది కూడా. అలా ఓ వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. దాని పేరే ‘హాస్ట్ కా ఖానా’.
సర్కారీ పరిధిలోని హాస్టల్స్ మాత్రమే కాదు.. ఈరోజుల్లో వేలకు వేలు తీసుకుంటున్న ప్రైవేట్ హాస్టల్స్ కూడా మెరుగైన సౌకర్యాలను అందించడంలో విఫలం అవుతున్నాయి. ఫ్రాంచైజీల పేరుతో డబ్బును తెగ దండుకుంటున్నాయి. అయితే ‘అంతకు మించి..’ ఫీజుల్ని చెల్లించలేని వాళ్లు ఎలాగోలా సర్దుకుపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇక ఓ హాస్టల్‌లోని ఫుడ్ ఎంత దారుణంగా ఉందనే వీడియో వైరల్ అవుతోంది ఇప్పుడు.
సాక్షి జైన్ అనే ట్విటర్ యూజర్.. హాస్టల్ ఫుడ్‌కు సంబంధించిన వీడియో ఒకటి తన వాల్‌పై పోస్ట్ చేశారు. మడతపెట్టడానికి కాదు కదా.. ఎందుకూ పనికిరాకుండా ఉంది ఆ పరాటా. పైగా రాయిలాగా టపా టపా సౌండ్ కూడా వస్తోంది. ఎవరైనా ఇది ఎలా తింటారంటూ చివర్లో ఆ మహిళ వాయిస్ వినిపిస్తుంది. ఇక ఈ వీడియో కామెంట్లు తెగ వచ్చేస్తున్నాయి. ఇక సెటైర్లకు అంతే లేకుండా పోతోంది. హాస్టల్ ఫుడ్.. ఇలాగే ఉంటుంది మరి! అనే కామెంట్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో ఎక్కడిది అనేదానిపై స్పష్టత మాత్రం లేదు.
Hostel ka khana🙃 pic.twitter.com/8FiLCwtZ33
— Sakshi Jain • Content Strategist (@thecontentedge) February 16, 2023
Comments
Please login to add a commentAdd a comment