hostel food
-
హాస్టల్ భోజనంలో చచ్చిన కప్ప.. షాకైన విద్యార్థి
రెస్టారెంట్, హోట్సల్, హాస్టల్స్, ఇలా ప్రతిచోట సర్వ్ చేస్తున్న భోజనంలో కీటకాలు, పురుగు దర్వనమిస్తుండటం కలవరం రేపుతోంది. భోజనంలో బల్లులు, ఎలుకలు, బొద్దింకలు, కప్పలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఒడిశాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. భువనేశ్వర్‌లోని కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ టెక్నాలజీ(కేఐఐటీ) హాస్టల్ భోజనంలో ఓ విద్యార్థికి చచ్చిన కప్ప ప్రత్యక్షమైంది. కేఐఐటీ భువనేశ్వర్ విద్యార్థి ఆర్యన్ష్ హాస్టల్లో భోజనం చేస్తుండగా పేరుగన్నంలో కప్ప కనిపించింది. దీంతో ఖంగుతున్న విద్యార్థి వెంటనే ఆ ఆహారాన్ని పడవేశాడు. తనకు ఎదురైన అనుభవాన్ని విద్యార్థి సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్(ట్విటర్)లో షేర్ చేస్తూ విద్యాసంస్థల్లో పరిస్థిని ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చదవండి: డిసెంబర్లోనే అయోధ్య ఎయిర్పోర్ట్ సేవలు! This is KIT Bhubaneswar, ranked ~42 among engineering colleges in India, where parents pay approx 17.5 lakhs to get their child an engineering degree. This is the food being served at the college hostel. Then we wonder why students from India migrate to other countries for… pic.twitter.com/QmPaz4mD82 — Aaraynsh (@aaraynsh) September 23, 2023 ‘ఇది దేశంలోనే ఇంజనీరింగ్ కళాశాలలో 47వ ర్యాంక్ కలిగిన కేఐటీ భువనేశ్వర్ కాలేజ్. ఇక్కడ ఓ విద్యార్థి తమ డిగ్రీని పూర్తి చేసేందుకు తల్లిదండ్రులు దాదాపు 17.50 లక్షలు ఖర్చు చేస్తున్నారు. అంత డబ్బులు తీసుకుని కాలేజీ హాస్టల్లో ఇలాంటి ఆహారాన్ని అందిస్తున్నారు. మెరుగైన విద్య, సౌకర్యాల కోసం ఇండియా నుంచి విదేశాలకు ఎందుకు విద్యార్థులు వలస వెళ్తున్నారో మాకు ఇప్పుడు అర్థమవతుంది’ అని ఆహారంలో కప్ప కనపడిన ఫోటోను షేర్ చేశాడు. ఆర్యాన్ష్ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. కేఐఐటీ కళాశాల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోస్టు చేసిన కొన్ని గంటలకే స్పందించిన కళాశాల యాజమాన్యం మెస్ కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. హాస్టల్లో అందిస్తున్న ఆహారం పూర్తిగా అపరిశుభ్రంగా ఉందని, భోజనంపై విద్యార్థులు అసంతృప్తి చెందారని ఇనిస్టిట్యూట్ పేర్కొంది. కిచెన్, స్టోర్, వంట సరుకులు పరిశుశ్రంగా ఉంచుకోవాలని, ఆహారం తయారు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరిస్తూ.. పనిష్మెంట్గా ఓ రోజు పేమెంట్‌ను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. So, this is the value of human life. The hostel where the frog was served, at Bhubaneswar University, in an attempt to do damage control, decided to deduct only one day's payment from the mess provider company! Just wow. pic.twitter.com/2BSDhUwI8I — Aaraynsh (@aaraynsh) September 24, 2023 అయితే కేవలం ఒక్క రోజు పేమెంట్‌ను మాత్రమే కట్ చేస్తూ తమ వర్సిటీ స్పందించిన తీరుపై ఆర్యాన్ష్ మండిపడ్డాడు. వర్సిటీ పరువును కాపాడుకోవడానికే ఈ చర్య తీసుకుందని, మనిషి జీవితానికి ఉండే విలులు ఇదేనని అసహనం వ్యక్తం చేశాడు. -
వైరల్ వీడియో: ‘హాస్టల్ ఫుడ్.. ఇలాగే ఉంటుంది మరి!’
-
Hostel Food: ‘హాస్టల్ ఫుడ్.. ఇలాగే ఉంటుంది మరి!’
రోజులు మారాయి. ప్రతీది సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. అందుకు కారణాలు అన్వేషించాల్సిన అవసరం లేకుండా పోతోంది. జనాలను ఆకట్టుకోగలిగితే చాలూ.. దానిపై చర్చా.. ఆపై ట్రెండింగ్‌లోకి వచ్చేస్తోంది కూడా. అలా ఓ వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. దాని పేరే ‘హాస్ట్ కా ఖానా’. సర్కారీ పరిధిలోని హాస్టల్స్ మాత్రమే కాదు.. ఈరోజుల్లో వేలకు వేలు తీసుకుంటున్న ప్రైవేట్ హాస్టల్స్ కూడా మెరుగైన సౌకర్యాలను అందించడంలో విఫలం అవుతున్నాయి. ఫ్రాంచైజీల పేరుతో డబ్బును తెగ దండుకుంటున్నాయి. అయితే ‘అంతకు మించి..’ ఫీజుల్ని చెల్లించలేని వాళ్లు ఎలాగోలా సర్దుకుపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇక ఓ హాస్టల్లోని ఫుడ్ ఎంత దారుణంగా ఉందనే వీడియో వైరల్ అవుతోంది ఇప్పుడు. సాక్షి జైన్ అనే ట్విటర్ యూజర్.. హాస్టల్ ఫుడ్‌కు సంబంధించిన వీడియో ఒకటి తన వాల్‌పై పోస్ట్ చేశారు. మడతపెట్టడానికి కాదు కదా.. ఎందుకూ పనికిరాకుండా ఉంది ఆ పరాటా. పైగా రాయిలాగా టపా టపా సౌండ్ కూడా వస్తోంది. ఎవరైనా ఇది ఎలా తింటారంటూ చివర్లో ఆ మహిళ వాయిస్ వినిపిస్తుంది. ఇక ఈ వీడియో కామెంట్లు తెగ వచ్చేస్తున్నాయి. ఇక సెటైర్లకు అంతే లేకుండా పోతోంది. హాస్టల్ ఫుడ్.. ఇలాగే ఉంటుంది మరి! అనే కామెంట్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో ఎక్కడిది అనేదానిపై స్పష్టత మాత్రం లేదు. Hostel ka khana🙃 pic.twitter.com/8FiLCwtZ33 — Sakshi Jain • Content Strategist (@thecontentedge) February 16, 2023 -
సార్.. అన్నంలో పురుగులు ఎట్ల తినాలి?
హైదరాబాద్: ‘సార్.. మధ్యాహ్న భోజనంలో పురు గులు వస్తున్నాయి.. ఎట్ల తినాలి’ అంటూ నాలుగో తరగతికి చెందిన ఓ విద్యార్థిని తన తల్లితో కలసి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఏఎస్ఐ తిరుపతయ్య కథనం ప్రకారం.. మీర్‌పేట సిర్లాహిల్స్‌కు చెందిన పూజిత స్థానిక ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. మంగళవారం పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తుండగా.. అన్నంలో పురుగు రావడంతో పడేసింది. ఇది గమనించిన ఉపాధ్యాయులు అన్నం ఎందుకు పడేశావని అడగ్గా పురుగు వచ్చిందని చెప్పింది. అన్నం తినేది ఉంటేనే పాఠశాలకు రావాలని..లేకపోతే రావొద్దని ఉపాధ్యాయులు మందలించారు. దీంతో పూజిత బుధవారం మధ్యా హ్నం తల్లి రాణితో కలిసి మీర్‌పేట సీఐ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేసింది. ఏఎస్ఐ తిరుపతయ్య తనిఖీ చేయగా కూరగాయలు వారం రోజుల క్రితం తెచ్చినవి కావడంతో దాదాపు పాడైపోయి ఉండడం, బియ్యం కూడా నాణ్యతగా లేకపోవడాన్ని గుర్తించారు. ఈ విషయమై ప్రధానోపాధ్యాయుడు గంగాధర్‌ను వివరణ కోరగా బాలిక రెండురోజుల నుంచి పాఠశాలకు గైర్హాజరైందని తెలిపారు. పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ అన్నంలో పురుగులు వచ్చాయని బాలిక ఫిర్యాదు చేసిన విషయం తెలియగానే మండల విద్యాధికారి కృష్ణయ్య వెంటనే పాఠశాలను తనిఖీ చేశారు. కూరగాయలు, బియ్యం నాణ్యతగానే ఉన్నాయన్నారు. ఉపాధ్యాయులు బెదిరించినట్లు వస్తున్న ఆరోపణలపై వాస్తవాలు తెలియాల్సి ఉందన్నారు. మధ్యాహ్నం వరకే పాఠశాల ఉండటంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారని, గురువారం విచారణ చేపడతామని తెలిపారు. -
నరకమే ‘నారాయణ’
నెల్లూరు రూరల్: హాస్టల్లో ఆహారం సరిగా లేదని బయట నుంచి పార్శిళ్లు తెచ్చుకున్న ఇంటర్ విద్యార్థులను నారాయణ జూనియర్ కాలేజీ సిబ్బంది చితకబాదారు. కాళ్లతో తన్ని కర్రలతో కొడుతూ విచక్షణా రహితంగా ప్రవర్తించడంతో ఇద్దరు విద్యార్థులు స్పృహ కోల్పోయారు. నెల్లూరులోని ధనలక్ష్మీపురం నారాయణ కళాశాల హాస్టల్లో ఈ దారుణం వెలుగులోకి రావడంతో కోపోద్రిక్తులైన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఆకలేస్తోందని వేడుకున్నా.. నారాయణ హాస్టల్లో ఎంసెట్ లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న నెల్లూరు, కావలి, తిరుపతి ప్రాంతాలకు చెందిన కొందరు విద్యార్థులు సోమవారం రాత్రి భోజనం సరిగా లేదని బయట నుంచి ఆహారాన్ని తేవడంతో సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. విద్యార్థుల వద్ద ఆహార పొట్లాలను లాక్కుని పక్కన పడేశారు. ఈ విషయం తెలియడంతో మరికొందరు విద్యార్థులు అక్కడకు చేరుకుని ఉదయం నుంచి ఏమీ తినకపోవడంతో ఆకలిగా ఉన్నందున బయట నుంచి తెప్పించుకున్నామని, పార్శిళ్లు ఇవ్వాలని కోరారు. ఇందుకు నిరాకరించిన సెక్యూరిటీ సిబ్బంది కళాశాల ఉద్యోగులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న నారాయణ సిబ్బంది బయట నుంచి ఆహారం ఎలా తెప్పించుకుంటారంటూ విద్యార్థులపై రెచ్చిపోయారు. కాళ్లతో తన్ని కర్రలతో కొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే స్పృహ కోల్పోయారు. కొందరు విద్యార్థులు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో మంగళవారం ఉదయం అక్కడకు చేరుకున్న బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పిల్లలను విచక్షణా రహితంగా చావబాదడం ఏమిటని నిలదీశారు. అనంతరం అక్కడకు చేరుకున్న నారాయణ విద్యాసంస్థల ఉన్నత ఉద్యోగులు తప్పు జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వబోమని బుజ్జగించారు. విషయాన్ని గోప్యంగా ఉంచాలని వేడుకున్నారు. పది రోజుల్లో ఎంసెట్ పరీక్ష ఉన్నందున చేసేదేమీ లేక తల్లిదండ్రులు మెత్తబడ్డారు. దీనిపై నారాయణ విద్యాసంస్థల ఏజీఎం పద్మారెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా బయట నుంచి ఆహారం తెస్తే ఫుడ్ పాయిజన్ అవుతుందనే ఉద్దేశంతో ఆహార పొట్లాలను పక్కన పెట్టిన మాట వాస్తవమేనన్నారు. విద్యార్థులపై ఎలాంటి దాడి జరగలేదన్నారు. -
పురుగుల అన్నం పెడుతున్నారు..
సాక్షి, కొమ్మాది(భీమిలి): ఆ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా విద్యార్థినులు మంచాన పడ్డారు. వారం రోజులుగా పురుగుల అన్నం పెడుతుండటంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో అదే తిని 70 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జీవీఎంసీ 4వ వార్డు కొమ్మాది మైత్రీభవన్‌లోని శ్రీచైతన్య మహిళా జూనియర్ కళాశాలలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై ఆగ్రహించిన విద్యార్థినుల తల్లిదండ్రులు కళాశాల ఆవరణలో ఆందోళనకు దిగారు. విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాలివి. జీవీఎంసీ నాల్గో వార్డు కొమ్మాదిలోని మైత్రీభవన్‌లో శ్రీ చైతన్య మహిళా జూనియర్ రెసిడెన్షియల్ కళాశాలలో గురువారం రాత్రి విద్యార్థినులు తినే ఆహారం విషతుల్యం కావడంతో 70 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి కొంత మందిని, శుక్రవారం మరికొందరిని దగ్గరలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. కళాశాలలో పెడుతున్న భోజనం నాణ్యత లేకపోవడం, పురుగులు పట్టిన అన్నం వండి పెడుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ విషయాన్ని పశ్నిస్తే యాజమాన్యం భయబ్రాంతులకు గురి చేస్తోందని, తప్పని పరిస్థితుల్లో ఈ భోజనం తినడంతో అనారోగ్యానికి గురయ్యామని విద్యార్థులు తెలిపారు. ఈ సమాచారాన్ని తోటి విద్యార్థులు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. శుక్రవారం ఉదయం కళాశాలకు చేరుకున్న తల్లిదండ్రులు యాజమాన్యాన్ని జరిగిన సంఘటనపై ప్రశ్నించారు. యాజమాన్యం నుంచి నిర్లక్ష్యంగా సమాధానం రావడంతో వారంతా ఆందోళనకు దిగారు. కళాశాల యాజమాన్య నిర్లక్ష్య వైఖరి వల్లే తమ పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, పిల్లలకు బాగులేకుంటే కనీసం ఫోన్ చేసి సమాచారం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ పిల్లలు బాగా నీరసించిపోయి నడవలేని పరిస్థితిలో ఉన్నారని, వీరికి ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని మండిపడ్డారు. తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు యాజమాన్యం నుంచి సరైన సమాధానం లేకపోవడంతో కళాశాల ఆవరణలో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు వెనక్కి తగ్గారు. అన్నంలో పురుగులు.. వినాయకచవితి నుంచి పాఠశాల యాజమాన్యం ఆహార నాణ్యతను పట్టించుకోవడం లేద ని విద్యార్థినులు తెలిపారు. వారం రోజుల నుంచి తినే అన్నంలో పురుగులు వస్తున్నాయ ని, గురువారం రాత్రి పెట్టిన భోజనంలో కూడా పురుగులు ఉన్నాయన్నారు. ఈ ఆహారం తినే ఫుడ్ పాయిజన్ అయిందని, వీటిని తిన్న 70 మంది అస్వస్థతకు గురయ్యారన్నారు. శుక్రవారం ఉదయం అందరినీ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి.. చికిత్స చేయించి.. వెంటనే కళాశాలకు తీసుకుని వచ్చేసారని, ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే పరీక్షలకు పంపించమని సిబ్బంది బెదిరించారని వాపోయారు. అడుగడుగునా నిర్లక్ష్యం.. తమ పిల్లల భవిష్యత్ కోసం లక్షలు వెచ్చించి ఈ కళాశాలలో చేర్పించామని, తినే ఆహారంలో పురుగులు వస్తున్నాయని ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యమే 70 మంది అస్వస్థతకు కారణమైందన్నారు. ఇక్కడ తాగేందుకు మంచినీరు కూడా లేదన్నారు. కనీసం తమతో ఫోన్లో కూడా మాట్లాడనివ్వడం లేదని వాపోయారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను వారి తల్లిదండ్రులు తమ ఇళ్లకు తీసుకెళ్లారు. ఇంత నిర్లక్ష్యమా.. మా పిల్లల బంగారు భవిష్యత్ కోసం లక్షల్లో ఫీజులు వెచ్చించి కళాశాలకు పంపిస్తే.. చదువు దేవుడెరుగు కనీసం నాణ్యమైన భోజనం కూడా పెట్టరా. వారం రోజులుగా పురుగులు అన్నం తిని మా అమ్మాయి అస్వస్థతకు గురైంది. సంబంధిత అధికారులు స్పందించి యాజమాన్యంపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. – మధుబాబు, ఓ విద్యార్థిని తండ్రి, శ్రీకాకుళం అన్నం తినలేకపోతున్నాం. ఇక్కడ మాకు పెడుతున్న భోజనం తినలేకపోతున్నాం. ఇదేంటని ప్రశ్నిస్తే కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు కూడా చెప్పకూడదని బెదిరిస్తున్నారు. ఇక్కడ భోజనం తిని ఫుడ్ పాయిజన్ కావడంతో ఆస్పత్రి పాలయ్యాం. – హేమ, అస్వస్థతకు గురైన విద్యార్ధిని. పునరావృతం కాకుండా చూసుకుంటాం.. కళాశాలలో ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థినులు అస్వస్థత గురికావడం వాస్తవమే. మెస్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరిగింది. భవిష్యత్‌లో ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకుంటాం. – బాలసూర్య, ప్రిన్సిపాల్, శ్రీ చైతన్య జూనియర్ కళాశాల అంతా రహస్యంగానే... నాలుగు రోజుల నుంచి విద్యార్థినులకు పలు ఆరోగ్య సమస్యలు వస్తున్నట్టు తెలిసింది. అయితే గురువారం రాత్రి తిన్న ఆహారం విషతుల్యమై 70 మంది మంచాన పడ్డారు. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని భావించిన యాజమాన్యం.. అందరినీ ఒకే ఆస్పత్రికి కాకుండా పది మంది చొప్పున పలు ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించింది. వెంటనే అందరినీ మళ్లీ కళాశాలకు తీసుకొచ్చేసింది. వసూళ్లపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల ఆరోగ్యంపై చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహించిన కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
పురుగుల అన్నం తినమంటున్నారు..!
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: తాము తినే అన్నంలో పురుగులొస్తే సైతం తీసేసి తినమని వార్డెన్ చెబుతున్నారని జిల్లా కేంద్రంలోని తిరుమలాహిల్స్ వద్ద ఉన్న ఎస్టీ బాలికల గురుకుల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు శుక్రవారం తిరుమలాహిల్స్ వద్ద నుంచి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వరకు విద్యార్థినులు ర్యాలీగా వచ్చి, కలెక్టరేట్ ముందు భైఠాయించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. అన్నం ఇలాగే ఉంటుందని, లేకుంటే వండుకుని తినాలని వార్డెన్ అనేక సార్లు పేర్కొంటుందన్నారు. హాస్టల్లో మూడేళ్ల నుంచి ఉంటూ తాము చదువుతున్నామని, ప్రిన్సిపాళ్లు మారినా హాస్టల్లో పరిస్థితి మాత్రం మారడం లేదన్నారు. తమ హాస్టల్‌కు కలెక్టర్, మాజీ విద్యాశాఖ మంత్రి వచ్చి వెళ్లినా సమస్యలు మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. ప్రహరీ లేకపోవడంతో పాములు, ఇతర జంతువులు హాస్టల్లోకి వస్తున్నాయని, వీటి వల్ల ఏ ఇబ్బందులు వచ్చిన ఎవ్వరు పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యంగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు, బాత్రూంలు, నీటి వసతి లేకపోవడం వంటి అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఎవరైనా చనిపోతే ఇంటికి వెళ్లాల్సి వస్తే చనిపోయిన దానికి ప్రూఫ్ చూపిస్తేనే పంపిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. సమస్యలపై అనేక సార్లు రీజినల్ కోఆర్డినేటర్‌తో పాటు పై అధికారులకు ఎన్ని సార్లు నివేదించినా అసలు స్పందిచలేదని, తాము నిత్యం అవస్థలు ఎదుర్కొంటున్నామ న్నారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్లో ఏఓకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం నాయకులు లోకేష్‌నాయక్, రవీందర్, సంతోష్, డీవైఎఫ్ఐ నాయకులు రాజ్‌కుమార్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
పుస్తెలు తాకట్టుపెట్టి ఫీజులు కట్టినం
హుస్నాబాద్‌రూరల్ మెదక్ : పిల్లలకు ఇంగ్లిష్ చదువులు చెప్పించాలని పుస్తెలు తాడు తాకట్టుపెట్టి హుస్నాబాద్ ఎస్ఆర్ ప్రైవేట్ పాఠశాలలో చేర్పించి రూ. 30వేల ఫీజు కట్టిన.. మా పిల్లలకు నూకల బువ్వ, నీళ్ల చారు, పురుగులు పడ్డ దొడ్డు బియ్యం కూడు పెడతారా..? అని అంకుషాపూర్‌కు చెందిన రేణుక పాఠశాల ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. ఎండకాలంలో టీచరమ్మలు మా తండాకు వచ్చి మంచి చదువులు చెప్తం.. హాస్టల్లో ఉంచుతాం అని మాయ మాటలు చెప్తే పిల్లగాడిని హాస్టల్లో చేర్చిన.. ఇప్పుడు రాత్రి పూట పురుగులు పడ్డ బువ్వ తినకపోతే సార్లు కట్టెలతో కొడుతున్నరని మా కొడుకు ఏడువబట్టేనని పాఠశాల రేణుక కన్నీరు పెట్టుకుంది. హుస్నాబాద్ పట్టణంలోని ఎస్ఆర్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం హాస్టల్ వసతి కల్పిస్తామని చెప్పి ఒక్కో విద్యార్థి నుంచి రూ. 30వేల ఫీజు వసూలు చేసింది. గిరిజన పిల్లల వద్ద ఫీజులు తీసుకున్న యాజమాన్యం విద్యార్థులకు చదువులు చెప్పకపోగా, పురుగులు పడిన నూకల బువ్వ, నీళ్ల చారు పెడుతున్నారని ఆరోపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. విద్యార్థులకు వడ్డించే భోజనం, పురుగులు పట్టిన బియ్యం బయట వేసి యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. మా ఫీజులు తిరిగిచ్చి మా పిల్లలను మాకు అప్పగించాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో హుస్నాబాద్, కోహెడ ఎస్సైలు సుధాకర్, సతీష్‌లు అక్కడకు చేరుకొని ఆందోళన చేస్తున్న పిల్లల తల్లిదండ్రుల సమస్యలు తెలుసుకున్నారు. పాఠశాల యాజమాన్యం సమక్షంలోనే విద్యార్థులకు వడ్డించే భోజనాన్ని పరిశీలించారు. పిల్లలకు ఇలాంటి ఆహారం ఇవ్వడం భావ్యం కాదని మందలించారు. పిల్లల తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే పాఠశాలపై కేసు నమోదు చేస్తామని చెప్పారు. దీంతో ఆందోళనకారులు కేసులు కాకుండా మా ఫీజులు మాకు ఇచ్చి మా పిల్లలను అప్పగించి న్యాయం చేయాలని వేడుకున్నారు. మా అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఇంగ్లిష్ చదువుల పేరుతో పిల్లలను చేర్చుకున్నట్లు గిరిజనులు, ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నూకల బువ్వ తినకపోతే కొడుతరు పురుగులు పడ్డ నూకల బువ్వ తినకపోతే సార్లు కర్రతో కొడుతరు. నీళ్ల చారు పెడుతరు. హాస్టలు విషయాలు ఇంటికాడ చెప్పితే కొడుతమని బెదిరిస్తున్నారు. మా ఫ్రెండ్‌ను కర్రతో కొడుతే చేతులకు వాతలు వచ్చినై. మాకు బోరు నీళ్లు ఇస్తరు.. సార్లు క్యాన్ నీళ్లు తాగుతరు. – శరత్‌కుమార్, 4వ తరగతి -
భోజనంలో పురుగులున్నాయంటూ ఆందోళన
బాలాజీచెరువు: జేఎన్టీయూకే నలంద బాయ్స్ హాస్టల్స్ విద్యార్థులు భోజనంలో పురుగులు ఉన్నాయంటూ మంగళవారం రాత్రి గేటు వద్ద నిరసన తెలియజేశారు. వారం రోజులుగా ఈ సమస్య వస్తుండగా మెస్ ఇన్చార్జికి తెలిపామని, సమస్యను పరిష్కరించకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ నిరసన తెలియజేశారు. దాదాపు 50 మంది విద్యార్థులు గేటు వద్ద కూర్చుని రాత్రి 11గంటల వరకూ నిరసన తెలియజేశారు. దీంతో మెస్ నిర్వాహకులు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు నిరసన విరమించారు. ఈ సమస్య కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి వెళ్లలేదని, బుధవారం తెలియజేసి తమ సమస్యను పరిష్కరించుకుంటామని కొంతమంది విద్యార్థులు పేర్కొన్నారు. -
కానుక ఏదీ?
కస్తూర్బా విద్యాలయాలను పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది. విద్యార్థినులకు పౌష్టికాహారం అందించేందుకు జనవరి 1నుంచి ప్రభుత్వం కొత్త మెనూ ప్రవేశపెట్టింది. అయితే ఇప్పటివరకు ఏం వడ్డించాలనేదానిపై స్పష్టత లేకపోవడంతో పాఠశాలలో కొత్త మెనూ అమలు కావడంలేదు. దన్వాడ (నారాయణ్ పేట్) : కస్తూర్బా పాఠశాలో విద్యార్థినులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతన మెనూ ప్రవేశపెట్టింది. గురుకుల విద్యాలయాలను పటిష్టం చేయాలనే ఉద్దేశంతో వారంలో నాలుగు రోజులు మాంసాహారం అందిస్తామన్న ప్రభుత్వ ప్రకటన నీటి మూటలుగానే మిగిలింది. అధికారులు గుడ్డుతోనే సరిపుచ్చుతున్నారు. జనవరి మొదటి వారం నుంచి కొత్త మెనూ అమలు చేస్తామని ప్రభుత్వం ముందస్తుగానే ప్రకటించింది. ఎలా అమలు చేయాలనే అంశంపై స్పష్టత లేకపోవడంతో అధికారులు, పాఠశాల ప్రత్యేక అధికారులు జాప్యం చేస్తున్నారు. పౌష్టికంగా ఉండేందుకే.. ప్రభుత్వ వసతిగృహంలో ఎక్కువశాతం, పేద మధ్యతరగతి వారే అధికంగా ఉంటారు. వీరికి సరైన ఆహారం అందించడంతోపాటు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం పూనుకుంది. ఇప్పటికే ప్రతి ఆదివారం కోడి కూర, వారంలో ఐదు రోజులు కోడి గుడ్లు వండి వడ్డిస్తున్నారు. అదనంగా రోజూ నెయ్యి, నెలలో రెండు రోజులు మాంసాహారం పెట్టేందుకు నిర్ణయించారు. పాలు, చపాతి, పల్లిపట్టి, ఇడ్లీ, పూరి వంటి అల్పాహారం అందిస్తున్నారు. కొత్త మెనూతో బాలికల్లో రక్తహీనత, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని విద్యార్థులు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా చదువుపై దృష్టి సారిస్తారని తల్లితండ్రులు విద్యార్థులను పాఠశాలలో చేర్పించేందుకు ఆసక్తి చుపిస్తారని ప్రభుత్వం కొత్త మెనుకు శ్రీకారం చుట్టింది. ఈనెల 2నుంచే అమలు చేయాల్సి ఉన్నా.. తల్లిదండ్రులకు దూరంగా ఉన్న విద్యార్థినులకు పౌష్టికాహారం అందించేందుకు ఈనెల 2 నుంచి కొత్త ఆహార పట్టిక అమలు చేయాల్సి ఉంది. కాని అధికారులు టెండర్ ప్రక్రియ పూర్తి చేయకపోవడం లేక అమలులో లోపంతో మెనూ ప్రకటనకే సరిపోయింది. విద్యార్థుల తల్లిదండ్రులు కొత్త మెనూను ప్రవేశ పెట్టలని కోరుతున్నారు. కొత్తమెనూపై స్పష్టతలేదు కొత్త మెనూకు సంబంధించిన బోర్డును పాఠశాలలో ఏర్పాటు చేశారు. కాని ఇప్పటికీ ఎంత వడ్డించాలి, కొత్త టెండర్ వేయాలా వద్దా అనే స్పష్టతలేదు. పాత టెండర్దారులకే అప్పగిస్తారా అనే అంశం కూడా తెలియడంలేదు. రెండురోజుల్లో పూర్తి సమాచారం రాగానే ప్రారంభిస్తాం. – సంగీత, మండల విద్యాశాఖ అధికారి -
భోజనంలో పురుగులు...
-
ఆంధ్రా వర్సిటీ హాస్టల్ భోజనంలో బల్లి
-
ఆంధ్రా వర్సిటీ హాస్టల్ భోజనంలో బల్లి
ఏయూ క్యాంపస్: విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలోని నాగార్జున హాస్టల్లో విద్యార్థులకు శుక్రవారం రాత్రి భోజనంలో బల్లి అవశేషం దర్శనమివ్వడం ఆందోళనకు దారి తీసింది. బల్లిని చూసిన విద్యార్థులు భోజనం మానేసి ఆందోళనకు దిగారు. అప్పటికే కొందరు విద్యార్థులు భోజనం ముగించగా... ఏమవుతుందోనన్న ఆందోళనలో ఉండిపోయారు. విద్యార్థుల ఆందోళనతో చీఫ్ వార్డెన్ విశ్వనాథం హాస్టల్‌కు చేరుకుని విచారణ చేపట్టారు. అయితే, విద్యార్థులు ఎవరికీ ఏమీ కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.