లండన్ : ఆధునిక జీవితంలో ఒత్తిడి రొటీన్‌గా మారింది. తాజా అథ్యయనం ప్రకారం బ్రిటన్‌వాసులు ఏడాదిలో దాదాపు 27 రోజులు ఒత్తిడిలో మునిగితేలుతారని తేలింది. చిన్న చిన్న విషయాలకూ వీరు ఒత్తిడితో చిత్తవుతారని పేర్కొంది. వాలెట్, బ్యాగ్, కీస్ పోయినందుకో..సమయానికి ట్రైన్‌ను అందుకుంటామా లేదా..వంటి చిన్నకారణాలతోనూ ఒత్తిడితో సతమతమవుతుంటారని తెలిపింది. రోజులో రెండు గంటల పాటు బ్రిటిషర్లు టెన్షన్ పడుతుంటారని 2000 మంది పురుషులు, మహిళలను పలకరించిన ఈ సర్వేలో వెల్లడైంది.
రోజువారీ బిజీ జీవితం వల్లే ఒత్తిడి ఎదుర్కొంటున్నామని రెండు వంతుల మంది చెప్పగా...సమయం లేకపోవడంతో టెన్షన్ పడుతున్నామని 38 శాతం మంది చెప్పుకొచ్చారు. ఏటా 3676 సార్లు స్ట్రెస్‌కు గురవుతున్నామని పెద్దలు చెప్పగా..చిన్న విషయాలకూ టెన్షన్ పడుతుండటం తమ ఆరోగ్యాలపై ప్రభావం చూపుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. బిజీ జీవితంలో చిన్న విషయాలకూ టెన్షన్ పడుతుండటం దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని బ్రిటన్‌లో ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ లూయిస్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment