బ్రిటిష్ వాళ్లంటే అబ్బో.. తెల్లదొరలు, చాలా ఖరీదైన తిండి తింటారని అనుకుంటాం కదూ. కానీ, నిజానికి వాళ్లలో చాలామంది తాజా కూరగాయలు వండుకోవడం కంటే, చద్ది కూడే ఇష్టపడతారట. అప్పటికప్పుడు వేడి చేసుకుని తినేయడం అంటేనే వాళ్లకు బాగా నచ్చుతుందని ఓ సర్వేలో తేలింది. బ్రిటిష్ కుటుంబాలు జేబులో పెట్టుకుని వెళ్లేలా ప్యాకెట్లలో ఉన్న ఆహారాలు, లేదా సీసాల్లో నిల్వ చేసి, సాయంత్రానికి వేడిచేసుకుని తినేలా ఉండేవి అంటేనే ఎక్కువగా ఇష్టపడుతున్నాయట.
వారానికి నాలుగు రోజులు ఇలాగే చేస్తున్నాయని ఈ సర్వేలో తేలింది. ప్రధానంగా మీట్ బాల్స్, సాసేజ్ఓ కాసరోల్, కాటేజ్ పై లాంటివాటిని బ్రిటిషర్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇవన్నీ హాయిగా ప్యాక్ చేసి సిద్ధంగా ఉంటాయి. ప్యాకెట్ తెరుచుకుని తినేస్తే సరిపోతుంది. అందుకే వాళ్లు వీటిమీద మోజు పడుతున్నారని సర్వే చేసిన సంస్థ తెలిపింది.
పగలంతా పని చేసిన తర్వాత కూడా మళ్లీ సాయంత్రం వచ్చి వంట చేసుకుని తినాలంటే బ్రిటిష్ వాళ్లకు చాలా ఇబ్బందిగా ఉంటోందని, దానికి బదులు ఎంచక్కా ప్యాకెట్లు తెచ్చుకుని, వేడి చేసుకుని తినేయడమే వీలుగా ఉంటోందని చెప్పారు. వంటగదిలో గంటల తరబడి వంట చేస్తూ ఉండటం అంటే ఎవరికీ ఇష్టం ఉండదని, పైగా శనివారం రాత్రి హాయిగా టీవీ ముందు కుటుంబంతో కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకోకుండా.. వంటగదిలో ఎలా కూర్చుంటామని అడుగుతున్నారు.
తెల్లోళ్లకు చద్దికూడే ఇష్టం!!
Published Mon, Sep 30 2013 3:25 PM | Last Updated on Fri, Sep 1 2017 11:12 PM
Advertisement
Advertisement