దిశానిర్దేశకుడు పీవీ
- పీవీ ఇంటిని మ్యూజియంగా మార్చేందుకు కృషి
- మాజీ ప్రధాని జయంతి సభలో ఇన్‌చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్
వంగర(భీమదేవరపల్లి) : దేశానికి దిశా..దశ నిర్దేశించిన గొప్ప మేధావి మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు అని, ఆయన ఆశయూలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇన్‌చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. శనివారం మండలంలోని వంగరలో పీవీ నర్సింహరావు 93వ జయంతి అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ పీవీ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. వంగరలోని పీవీ ఇంటిని మ్యూజియంగా మార్చేందకు సీఎం కేసీఆర్‌కు విన్నవిస్తామన్నారు.
ఈ సందర్భంగా పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు పీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగదును అందించారు. కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డీవో చంద్రశేఖర్, పీవీ సొదరుని కుమారుడు, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు పీవీ మదన్‌మోహన్, జెడ్పీటీసీ సభ్యురాలు మాలోతు రాంచందర్‌నాయక్, సర్పంచ్ ఉపసర్పంచ్ వొల్లాల రమేశ్, కాల్వ సునీత, మండల ప్రత్యేకాధికారి నర్సింహరావు, తహశీల్దార్ కృష్ణవేణి, ఎంపీడీవో నర్సింహారెడ్డి, హౌసింగ్ డీఈఈ మహేశ్, ఏఈలు రాజమల్లారెడ్డి, కిషన్ పాల్గొన్నారు.
సాగుకు యోగ్యమైన భూమే పంపిణీ
దళితులకు పంపిణీ చేయనున్న భూమి సాగుకు యోగ్యంగా ఉంటుందని ఇన్‌చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి ఓ గ్రామాన్ని ఎంపికచేసి భూ పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. భూమిలేని దళితులకు 3 ఎకరాలు అందిస్తామన్నారు. పంపిణీ చేసిన భూమిలో బోరుబావి, విద్యుత్ సౌకర్యంతో పాటుగా డ్రిప్ సౌకర్యం అందిస్తామన్నారు.
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం...
తమ కుటుంబం టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటుందని పీవీ నర్సింహరావు సొదరుడి కుమారుడు మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు పీవీ మదన్‌మోహన్‌రావు చెప్పారు. ఇంత కాలానికి పీవీకి గుర్తింపు వచ్చిందన్నారు. వంగరలోని పీవీ విగ్రహానికి శాశ్వత నిచ్చెన ఏర్పాటు చేరుుంచాల్సిన అవసరం ఉందన్నారు.