incharge Collector
-
జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ‘పొంగులేటి’!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన శ్రీనివాస్‌రెడ్డి.. ఈ ప్రభుత్వంలో రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, మంత్రివర్గ కూర్పు పూర్తయిన కొద్ది రోజులకే సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రులను నియమించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌కు ఇన్చార్జ్ మంత్రులుగా బాధ్యతలు అప్పగించారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాలకు, సత్యవతిరాథోడ్ మహబూబాబాద్, ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రిగా వ్యవహరించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం ఉమ్మడి జిల్లాకు ఒకే మంత్రిని.. అది ఇతర జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని నియమించింది. గతంలోనూ(రాష్ట్ర విభజనకు ముందు) కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాంరెడ్డి వెంకట్‌రెడ్డిని జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా కొనసాగించింది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గురించి.. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకత కలిగిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి .. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ నుంచి ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. పాలేరు ఎమ్మె ల్యే, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి 2016లో మృతి చెందారు. అదే సంవత్సరం పొంగులేటి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మృతితో వచ్చిన ఉపఎన్నికల్లో తుమ్మల నాగేశ్వర్రావు బీఆర్ఎస్ నుంచి గెలుపొందాడు. తుమ్మల గెలుపులో శ్రీనివాస్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. అయితే 2019 వరకు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగిన తనకే తర్వాత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తిరిగి ఖమ్మం ఎంపీ టికెట్ ఇస్తారని ఆశించగా.. నామా నాగేశ్వర్రావుకు కేటాయించడం పొంగులేటిని అసంతృప్తికి గురిచేసింది. పార్టీ నేతల జోక్యంతో ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేసిన శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పార్టీలో ఇమడ లేక పోయారు. ఈ ఏడాది జనవరి 2 నుంచి పార్టీకి అంటీముట్టనట్లుగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డి జూలై 2న కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో పాలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో కీలకమైన రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖలు నిర్వహిస్తున్న ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా నియమితులయ్యారు. కాగా తాజాగా నియామకమైన జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఏసీడీపీ తదితర నిధుల వినియోగం, ఎమ్మెల్యే, ముఖ్యనేతలను సమన్వయం చేయడంలో కీలకంగా వ్యవహరించడంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ కార్యక్రమాలను, పథకాల అమలును పర్యవేక్షిస్తారు. ఇవి కూడా చదవండి: ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా మంత్రి సీతక్క! -
రుణ మంజూరుకు ప్రత్యేక శిబిరాలు
ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): కార్పొరేషన్ల రుణాల మంజూరులో జాప్యం నివారణకు ఇన్చార్జి కలెక్టర్ సృజన చర్యలు చేపట్టారు. 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను ఎస్సీ, ఎస్టీ, కాపు కార్పొరేషన్లతో పాటు బీసీ ఫెడరేషన్, మైనారిటీ, క్రిస్టియన్ కార్పొరేషన్లు ద్వారా ఆయా వర్గాల ప్రజలకు కేటాయించిన సబ్సిడీ రుణాలు లబ్థిదారులకు చేరడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కార్పొరేషన్లు ద్వారా బ్యాంకులకు సబ్సిడీ నిధులు విడుదలైనప్పటికీ లబ్ధిదారులకు అందడంలేదు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ల పరిధిలోని బ్యాంకు అధికారులు, లబ్ధిదారులకు సమన్వయం ఏర్పరచడానికి మండలాల వారీగా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని సృజన నిర్ణయించారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం శుక్రవారం నుంచి నిర్దేశించిన తేదీలలో ఆ మండలాలలో లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి రుణాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమం సత్ఫలితాలిస్తే దాదాపు 8 వేల మంది లబ్థిదారులకు ఉపశమనం లభించనుంది. లబ్ధిదారులు సంబంధిత పత్రాలతో శిబిరాలకు హాజరుకావాలని.. లేని యడల ఇప్పటికే వారి బ్యాంకులలో జమ చేసిన నిధులు తిరిగి ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని అధికారులు వెల్లడించారు. మండలాల వారీగా శిబిరాల తేదీలు 4న మాకవరపాలెం, 5న ఎస్.రాయవరం, 7న నక్కపల్లి, 8న కోటవురట్ల ఎంపీడీవో కార్యాలయాల్లో శిబిరాలు జరుగుతాయి. అలాగే 9న నాతవరం, నర్సీపట్నం, నర్సీపట్నం అర్బన్ మండలాలు కలపి నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయంలో, 10న భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం, భీమినిపట్నం అర్బన్ కలపి భీమునిపట్నం ఎంపీడీవో కార్యాలయంలో శిబిరం నిర్వహిస్తారు. 11న చీడికాడ, చోడవరం కలపి చోడవరం ఎంపీడీవో కార్యాలయంలో, 14న రాంబిల్లి, పరవాడ, అచ్యుతాపురం, మునగపాక కలపి అచ్యుతాపురం ఎంపీడీవో కార్యాలయంలో శిబిరం ఏర్పాటు చేస్తారు. 15న సబ్బవరం, పెందుర్తి కలపి పెందుర్తి ఎంపీడీవో కార్యాలయంలో, 16న ఎలమంచిలి అర్బన్, మండలం కలపి యలమంచిలి ఎంపీడీవో కార్యాలయంలో శిబిరం నిర్వహిస్తారు. లబ్ధిదారులు తీసుకురావాల్సినపత్రాలు ♦ రుణం కోసం ఆన్లైన్లో నమోదు చేసుకున్న దరఖాస్తు ♦ తెలుపు రేషన్ కార్డ్, అధార్‌కార్డు ♦ జీఎస్టీతో కూడిన యూనిట్ కోటేషన్ ♦ డ్రైవింగ్ లైసెన్స్, బ్యాడ్జి (ట్రాన్స్‌పోర్టు సెక్టార్ వారు) ♦ ఆవులు, గేదెల కోనుగోలు అంగీకార పత్రాలు -
దిశానిర్దేశకుడు పీవీ
- పీవీ ఇంటిని మ్యూజియంగా మార్చేందుకు కృషి - మాజీ ప్రధాని జయంతి సభలో ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ వంగర(భీమదేవరపల్లి) : దేశానికి దిశా..దశ నిర్దేశించిన గొప్ప మేధావి మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు అని, ఆయన ఆశయూలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. శనివారం మండలంలోని వంగరలో పీవీ నర్సింహరావు 93వ జయంతి అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ పీవీ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. వంగరలోని పీవీ ఇంటిని మ్యూజియంగా మార్చేందకు సీఎం కేసీఆర్‌కు విన్నవిస్తామన్నారు. ఈ సందర్భంగా పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు పీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగదును అందించారు. కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డీవో చంద్రశేఖర్, పీవీ సొదరుని కుమారుడు, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు పీవీ మదన్మోహన్, జెడ్పీటీసీ సభ్యురాలు మాలోతు రాంచందర్‌నాయక్, సర్పంచ్ ఉపసర్పంచ్ వొల్లాల రమేశ్, కాల్వ సునీత, మండల ప్రత్యేకాధికారి నర్సింహరావు, తహశీల్దార్ కృష్ణవేణి, ఎంపీడీవో నర్సింహారెడ్డి, హౌసింగ్ డీఈఈ మహేశ్, ఏఈలు రాజమల్లారెడ్డి, కిషన్ పాల్గొన్నారు. సాగుకు యోగ్యమైన భూమే పంపిణీ దళితులకు పంపిణీ చేయనున్న భూమి సాగుకు యోగ్యంగా ఉంటుందని ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి ఓ గ్రామాన్ని ఎంపికచేసి భూ పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. భూమిలేని దళితులకు 3 ఎకరాలు అందిస్తామన్నారు. పంపిణీ చేసిన భూమిలో బోరుబావి, విద్యుత్ సౌకర్యంతో పాటుగా డ్రిప్ సౌకర్యం అందిస్తామన్నారు. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం... తమ కుటుంబం టీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటుందని పీవీ నర్సింహరావు సొదరుడి కుమారుడు మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు పీవీ మదన్మోహన్రావు చెప్పారు. ఇంత కాలానికి పీవీకి గుర్తింపు వచ్చిందన్నారు. వంగరలోని పీవీ విగ్రహానికి శాశ్వత నిచ్చెన ఏర్పాటు చేరుుంచాల్సిన అవసరం ఉందన్నారు.