పీవీకి భారతరత్న ఇవ్వాల్సిందే..! | NRI Telugu Communities Demands Bharat Ratna To PV Narasimha Rao In USA | Sakshi
Sakshi News home page

ప్రవాస భారతీయ సంఘాల డిమాండ్..!

Published Tue, Nov 24 2020 5:57 PM | Last Updated on Tue, Nov 24 2020 6:07 PM

NRI Telugu Communities Demands Bharat Ratna To PV Narasimha Rao In USA - Sakshi

వాషింగ్టన్‌: భారత మాజీ ప్రధాని.. మన తెలుగు జాతి ముద్దు బిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని ప్రవాస భారతీయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని తెలుగువారంతా పీవీకి భారతరత్న ఇవ్వాలంటూ రిమెంబరింగ్ పీవీ, రిమైండ్‌ పీపుల్‌, రిక్వెస్ట్‌ ఇండియన్‌ గవర్నమెంట్‌ భారతరత్న ఫర్‌ పవీ అంటూ మూడు ఆర్‌ల సిరీస్‌తో ఉద్యమంతో ముందుకు కదులుతున్నారు. ఈ మేరకు పీవీ శతాబ్ది జన్మదినం సందర్భంగా రిమెంబరింగ్ పీవీ నరసింహా రావు, రిమైండ్ పీపుల్, రిక్వెస్ట్ భారత ప్రభుత్వం భారతరత్నఫర్ పీవీ అని డిమాండ్‌ చేస్తు ప్రవాస భారతీయ సంఘాలు కార్యక్రమాన్ని చేపట్టాయి. అంతేగాక ఆన్‌లైన్ ద్వారా కూడా ఈ సంఘాలు భారతీయుల మద్దతును కోరుతున్నాయి. అనేక ప్రవాస భారతీయ సంఘాలు, సంస్థలు పీవీ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అక్టోబర్ 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు పీవీ ఘనతను స్మరించుకుంటూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి ఈ కార్యక్రమాల ద్వారా పీవీకి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌కు మద్దతు కూడగడుతున్నాయి. అమెరికాలోని వివిధ రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా పీవీ నరసింహారావు గురించి తెలిసిన ప్రముఖులు, మేధావులు నాయకులు కూడా ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు.

అమెరికాలోని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్( ఏఏపీఐఆర్‌) ఉత్తర అమెరికా తెలుగు సంఘము (టీఏఎన్‌ఏ), అమెరికా తెలుగు సంఘం (ఏటీఏ) ఉత్తర అమెరికా తెలుగు సంఘం (ఎన్‌ఏటీఎస్‌), ఉత్తర అమెరికా తెలుగు సమితి (ఎన్‌ఏటీఏ) సిలికాన్‌ ఆంధ్ర  తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్‌), సెయింట్ లూయిస్ గుజరాత్ సమాజ్‌లతో పాటు అమెరికాకు చెందిన 81 భారతీయ సంఘాలన్నీ ముక్తకంఠంతో పీవీకి భారతరత్న ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళుతున్నాయి. భారతరత్న ఫర్ పీవీ అనే అభ్యర్థనను భారత ప్రభుత్వం గుర్తించేలా చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి. పీవీ శత జయంతోత్సవాలు జరుగుతున్న ఈ తరుణంలో ఆయనకు భారతరత్న వచ్చే వరకు తెలుగు సంఘాలు తమ వంతు కృషి  చేస్తామని స్పష్టం చేస్తున్నాయి. అంతేగాక పీవీ ప్రాముఖ్యత, భారతీయ చరిత్రలో ఆయన స్థానం వివరిస్తూ... పీవీకి భారతరత్న అనే వినతి పత్రంపై ప్రవాస సంఘాలు సంతకాలు చేశాయి. అక్టోబర్ 2న ప్రారంభించిన ఈ సంతకాల సేకరణ ఇప్పటికీ దిగ్విజయంగా కొనసాగుతోంది.

ఈ కార్య నిర్వాహక బృంద సభ్యులు స్వర్ణ ప్రసాద్, గుళ్ళపల్లి శ్రీనివాస్,  డాక్టర్ అశోక్ కుమార్, చింతా ప్రవీణ్,  తాళ్లూరి శ్రీధర్, అశ్విన్ పటేల్, కాజా విశ్వేశ్వర రావు (సెయింట్ లూయిస్ ఎమ్‌ఓ), బడ్డి అశోక్, దేవబత్తిని హరి (డెట్రాయిట్, ఎమ్‌ఐ), మేడిచెర్ల మురళీకృష్ణ, కపిల ప్రకాష్, శరత్ చంద్ర (ఎడిసన్, ఎన్‌జే), పురం ప్రవీణ్ (అట్లాంటా, జీఏ), కొండెపు సుధ (డీసీ), చల్లా కవిత( వాషింగ్టన్ డీసీ),అట్లూరి శ్రీహరి (ఎల్‌ఏ) కల్వకోట సరస్వతి (ఓహెచ్‌) ఇలా చాలా మంది  ప్రవాస భారతీయ సంఘాల ప్రతినిధులు పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. అంతేకాదు ఈ సంద్భంగా పీవీ  నరసింహారావు మీద ప్రత్యేక సంచికను కూడా  వెలువరించనున్నారు. తమ ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి మద్దతుకై ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని వివరాలూ సోషల్ మీడియాలో ప్రచురిస్తున్నారు. సాధారణ పౌరులు కూడా (petition at: https://www.change.org/CTIPetitionBharatRatna4PV) ఈ లింక్‌ ద్వారా సంతకం చేసి తమవంతుగా మద్దతుగా ఈ ఉద్యమంలో పాల్గొనాలని ఎన్‌ఆర్‌ఐ సంస్థలు కోరుతున్నాయి. 

ఈ కార్యక్రమాన్ని సోషల్‌ మీడియాలో చూడాలంటే ఈ కింది లింక్‌లు క్లిక్‌ చేయండి

BharatRatna4PV YouTube Channel 

Facebook:  https://m.facebook.com/BharatRatna4PV-104140028106254 

YouTube:  https://youtube.com/channel/UCM3UlMkHF6rWH_KEPiCnZ6A 

BharatRatna4PV Short Film Teaser: https://youtu.be/KTTU2cJ9ENE

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement