జేడీయూ లీడర్ షాకింగ్ వీడియో.. | JDU Youth Leader Caught on Camera Beating a Student in Patna | Sakshi
Sakshi News home page

జేడీయూ లీడర్ షాకింగ్ వీడియో..

Published Tue, Aug 9 2016 4:15 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

జేడీయూ లీడర్ షాకింగ్ వీడియో..

జేడీయూ లీడర్ షాకింగ్ వీడియో..

పాట్నా: బిహార్లో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లి గదిలో బందించి చితక్కొడుతున్న వీడియో బయటకు వచ్చి హల్ చల్ చేస్తోంది. అధికార పార్టీ జేడీయూకు చెందిన విద్యార్థి విభాగం నేతలు ఈ దాష్టీకానికి పాల్పడటం గమనార్హం. ఈ ఘటన రెండు నెలల కిందటే జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది.

వీడియో రికార్డయిన దృశ్యాల ప్రకారం..  జేడీయూ విద్యార్థి విభాగానికి చెందిన ప్రధాన కార్యదర్శి మనీశ్ మాలిక్ శివం అనే విద్యార్థిని కిడ్నాప్ చేశాడు. అనంతరం ఓ గదిలో బందించి ఆ విద్యార్థి బట్టలు విప్పేసి మరికొందరితో కలసి దారుణంగా కొట్టాడు. ఈ ఘటన తాజాగా బయటకు రావడంతో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement