లక్నో: ఉత్తరప్రదేశ్, మీరట్‌లో దారుణం జరిగింది. కొందరు వ్యక్తులు ఓ బాలునిపై దాడి చేసి మూత్రం పోశారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
నవంబర్ 13న బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో బాలునిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆ రోజు రాత్రి బాధితుడు ఇంటికి కూడా వెళ్లలేదు. మరునాడు ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు విషయం తెలిపాడు. కానీ యూరినేషన్ ఘటనను మాత్రం బయటకు వెల్లడించలేదు. తాజాగా బాలునిపై మూత్రం పోసిన దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో విషయం బయటకు వచ్చింది.
వీడియో బయటకు వచ్చిన తర్వాత బాధితుడు పోలీసులకు అసలు విషయాన్ని బయటపెట్టాడు. కొందరు దుండగులు తనను బందించి శరీరంపై మూత్రం పోశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనకు పాల్పడినవారిలో బాలుని స్నేహితులు ఉన్నారని బాధితుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వీడియో ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటివరకు నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. బాలురు గొడవ పడటానికి గల కారణాలు మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు.
ఇదీ చదవండి: Lightning Strikes In Gujarat: అకాల వర్షాలు.. పిడుగుపాటుకు 20 మంది మృత్యువాత
Comments
Please login to add a commentAdd a comment