రూ.9999 డ్రా చేసిన అపరిచితుడు | stranger drawn Rs .9999 | Sakshi
Sakshi News home page

రూ.9999 డ్రా చేసిన అపరిచితుడు

Published Mon, Dec 26 2016 11:16 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

రూ.9999 డ్రా చేసిన అపరిచితుడు - Sakshi

రూ.9999 డ్రా చేసిన అపరిచితుడు

  • లబోదిబోమంటున్న బాధితురాలు
  • అలహాబాద్‌ బ్యాంకు మేనేజర్‌కు ఫిర్యాదు
  •  

    హిందూపురం అర్బన్‌ : బ్యాంకు మేనేజర్‌నంటూ ఫోన్‌ చేసిన అపరిచితుడు ఖాతాదారురాలి ఏటీఎం కార్డుపై నంబర్‌ తెలుసుకుని, కాసేపటి తర్వాత రూ.9999 నగదు డ్రా చేసిన సంఘటన సోమవారం చూసింది. హిందూపురం పట్టణంలోని ఎంఎఫ్‌ రోడ్డులో నివాసముంటున్న రాజాబాయికి అలహాబాద్‌ బ్యాంకులో 50275179945 నంబరుతో అకౌంట్‌ ఉంది. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో 73610 20259 నంబరు నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. ‘నేను బ్యాంకు మేనేజర్‌ మాట్లాడుతున్నా. మీ ఏటిఎం బ్లాక్‌ అయ్యింది. అది రిలీజ్‌ చేయడానికి కార్డుపై ఉన్న నంబరు చెప్పండి’ అని కోరడంతో ఆమె చెప్పేసింది. అదే రోజు సాయంత్రం కార్డు పనిచేస్తోందో లేదో చూద్దామని ఏటీఎం కేంద్రానికి వెళ్లింది. మినీ బ్యాలెన్స్‌ చెక్‌ చేస్తే ఖాతాలోంచి రూ.9999 నగదు డ్రాయినట్లు స్లిప్‌ వచ్చింది. తిరిగి తనకు వచ్చిన సెల్‌నంబర్‌కు ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ అని సమాధానం వచ్చింది. ఆందోళన చెందిన బాధితురాలు సోమవారం అలహాబాద్‌ బ్యాంకు మేనేజర్‌ను కలిసి తనకు జరిగిన మోసం గురించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. పాస్‌బుక్‌ ఎంట్రీ చేయించుకోగా పీఓఎస్‌ మెషిన్‌ నుంచి పై మొత్తం డ్రా అయినట్లు కనిపించింది. ఏ ప్రాంతం నుంచి డ్రా అయ్యిందో విచారణ చేస్తామని మేనేజర్‌ తెలిపినట్లుబబాధితురాలు తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement