
సాక్షి, అలహాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మేజా మండలం వద్ద గంగా నదిలో పడవ మునగిపోయింది. ఈ ఘటనలో ఆరుగురిని స్థానికులు రక్షించగా.. పలువురు గల్లంతయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పడవ సామర్థ్యం కన్నా ఎక్కువ మంది ఎక్కడం వల్లే మునిగిపోయినట్లు భావిస్తున్నారు.