జడ్జీలు నిర్భీతి ప్రబోధకులుగా ఉండాలి | Judges Are Not Fearful Saints | Sakshi
Sakshi News home page

జడ్జీలు నిర్భీతి ప్రబోధకులుగా ఉండాలి

Published Sat, May 11 2019 8:25 AM | Last Updated on Sat, May 11 2019 8:26 AM

Judges Are Not Fearful Saints - Sakshi

న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ స్వతంత్రతను పరిరక్షించడానికి జడ్జీలు నిర్భయులైన ప్రబోధకులుగా ఉండాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 2012లో ఓ న్యాయవాది యూపీలోని అలహాబాద్‌ చీఫ్‌ మెజిస్ట్రేట్‌పై దాడికి ప్రయత్నించాడు. ఈ కేసును శుక్రవారం విచారించిన ధర్మాసనం..‘జడ్జీలు నిర్భీతితో, నిష్పాక్షికంగా తమ తీర్పులను ఇవ్వాల్సి ఉంటుంది. వారిని అవమానించడం, దూషించడం ద్వారా తీర్పులను ప్రభావితం చేయరాదు’ అని వ్యాఖ్యానించింది. ఈ కేసులో దిగువకోర్టు విధించిన 6 నెలల జైలుశిక్ష, రూ.2 వేల జరిమానాను సమర్థించిన సుప్రీంకోర్టు.. శిక్ష అమలును మూడేళ్ల పాటు వాయిదా వేసింది. 2022, జూన్‌ 30 వరకూ సదరు న్యాయవాది అలహాబాద్‌ జిల్లా కోర్టు ప్రాంగణంలోకి రాకుండా, సత్ప్రవర్తనతో మెలిగితే ఈ శిక్షను కొట్టివేస్తామని స్పష్టం చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement