
ఆప్ అన్ని పార్టీల్లాంటిదేనా?
ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అన్ని పార్టీల్లాంటిదేనా? ఆ పార్టీ నేతలు పొద్దస్తమానం విమర్శించే పార్టీలకి, ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలాంటి తేడా లేదా?
అలహాబాద్ లో శుక్రవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ పై ప్రశ్నలు సంధించిన ఇద్దరు మహిళా కార్యకర్తలపై దాడి జరిగింది. వారిని కొట్టి, తిట్టి నేట్టేయడం జరిగింది. సమావేశ ప్రారంభం లోనే ఆమ్ ఆద్మీ పార్టీ ముస్లింలకు సీట్లెందుకు ఇవ్వలేదని నాజ్ ఫాతిమా అనే కార్యకర్త ప్రశ్న వేసింది. అంతే ... ఆమెపై దాడి చేసి అక్కడినుంచి బయటకి తోసేశారు. ఆ తరువాత శ్రద్ధా పాండేయ అనే మరో మహిళా కార్యకర్త పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నారని ఆరోపణ చేశారు. ఆమెకు కూడా అదే శాస్తి జరిగింది.
అయితే పార్టీ కార్యకర్తలు పలువురు పలురకాల ఆరోపణలు చేశారు. అవినీతిపరులకు టికెట్లివ్వడం నుంచి పలు అంశాలను లేవనెత్తారు. దీంతో సమావేశాన్ని మధ్యలోనే వదిలిపెట్టి సంజయ్ సింగ్ వెళ్లిపోయారు.