
న్యూఢిల్లీ: ఈడీ ప్రధాన కార్యాలయం నుంచి తనను పోలీస్ లాకప్‌కు తరలించకుండా అడ్డుకోవాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌సింగ్ కోర్టును కోరారు. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో శనివారం ఈ మేరకు పిటిషన్ వేశారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ ఆయనను బుధవారం అరెస్టు చేయడం తెలిసిందే.
కోర్టు ఆయనకు ఈనెల 10 దాకా రిమాండ్ విధించింది. దీంతో ఆయనను ఈడీ ప్రధాన కార్యాలయంలోని లాకప్ రూంలో ఉంచారు. అక్కడ పురుగు మందులు కొడుతున్నారనే నెపంతో తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌కు తరలించేందుకు ప్రయతి్నంచారని సంజయ్‌సింగ్ ఆరోపించారు. తనను టార్చర్ చేసేందుకు కుట్ర పన్నారన్నారు. తరలింపు ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో అమానవీయంగా వ్యవహరించారన్నారు.