యూపీలోని కాన్పూర్‌కు చెందిన ఓ బుడ్డోడు అలహాబాద్ హైకోర్టును ఒక ప్రత్యేక అభ్యర్థనతో ఆశ్రయించాడు. తాను చదువుకుంటున్న పాఠశాల సమీపంలో మద్యం దుకాణం ఉందని, దానిని తొలగించాలంటూ ఆ ఐదేళ్ల చిన్నారి హైకోర్టులో పిటిషన్ వేశాడు.
మందుబాబులు పాఠశాలను అసాంఘిక కార్యకలాపాలకు ఆడ్డాగా మార్చారని ఆ చిన్నారి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారి కారణంగా తమ చదువులు దెబ్బతింటున్నాయని పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని కోరింది.
కాన్పూర్‌లోని ఓ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్న ఐదేళ్ల చిన్నారి అథర్వ తన కుటుంబ సభ్యుల సాయంతో కోర్టుకు ఈ ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన హైకోర్టు ప్రతి సంవత్సరం ఈ మద్యం దుకాణం కాంట్రాక్టును ఎలా పునరుద్ధరిస్తున్నారని యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ పాఠశాల కాన్పూర్ నగరంలోని ఆజాద్ నగర్ ప్రాంతంలో ఉంది. అక్కడికి 20 మీటర్ల దూరంలో మద్యం దుకాణం ఉంది. నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల తర్వాతే తెరవాలి. అయితే తరచూ ఉదయం ఆరు గంటల నుంచే ఇక్కడ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని అథర్వ కోర్టుకు తెలిపాడు.
అథర్వ కుటుంబ సభ్యులు ఈ విషయమై కాన్పూర్ అధికారులకు, యూపీ ప్రభుత్వానికి అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాగా ఈ పాఠశాల 2019లో ప్రారంభమయ్యిందని, మద్యం దుకాణానికి సంబంధించిన ఒప్పందం దాదాపు 30 ఏళ్లనాటిదని వైన్స్ దుకాణ యజమాని వాదనకు దిగారు. ఈ నేపధ్యంలో అధర్వ తన కుటుంబ సభ్యుల సహకారంతో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసును జస్టిస్ మనోజ్ కుమార్ గుప్తా, జస్టిస్ క్షితిజ్ శైలేంద్రలతో కూడిన డివిజన్ బెంచ్ విచారిస్తోంది. ఈ కేసులో తదుపరి విచారణ మార్చి 13న జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment