
అలహాబాద్ : ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో ఓ రౌడీషీటర్‌ను సినీ ఫక్కీలో దారుణంగా హత్య చేశారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అలహాబాద్‌లోని రాజాపూర్ కాలనీలో దుర్గామాత పూజ చేయడానికి ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో అందరు చుస్తుండగానే కొందరు దుండగులు ఓ వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపారు. అనంతరం బాంబు వేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధంచి దృశ్యాలు సీసీ కెమెరాలో రాకార్డయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన వ్యక్తిని నీరజ్ బాల్మీకిగా గుర్తించారు. అతనిపై రౌడీషీటుందని, పాత కక్షలే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment