లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ముఖ్య పట్టణమైన అలహాబాద్ పేరును మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది కుంభమేళా జరగనున్న నేపథ్యంలో త్వరలోనే అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా మార్చనున్నట్లు ప్రకటించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. అలహాబాద్ పేరు మార్పు ప్రతిపాదన గవర్నర్ ముందు పెట్టామని.. అందుకు ఆయన అంగీకరించారని తెలిపారు.
కేబినెట్ ఆమోదం అనంతరం ‘ప్రయాగ్ రాజ్’ వాడుకలోకి వస్తుందని చెప్పారు. కుంభమేళా ఏర్పాట్లపై మాట్లాడుతూ.. ‘ఇప్పటికే ఏర్పాటు ప్రారంభమయ్యాయి. కుంభమేళా జరిగే ప్రాంతంలో అన్ని సదుపాయలను ఏర్పాటు చేస్తున్నాం. ఆ పాంత్రంలో ఎటీఎంలు, సెల్ టవర్లు, చేతిపంపులు, నీటి ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నాం. భక్తులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటాం’ అని సీఎం అన్నారు. 2019 జనవరి 15న కుంభమేళా ప్రారంభం కానుంది. దాదాపు 192 దేశాల నుంచి కోట్లలో భక్తులు రానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment