
నడిరోడ్డుపై చితకబాదుతున్న నిందితులు
అలహాబాద్: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ భూవివాదం రిటైర్డ్ పోలీస్ అధికారి ప్రాణాలను తీసింది. నడిరోడ్డుపై వెళ్తున్న ఆ మాజీ పోలీస్ అధికారిని దుండగలు పట్టపగలే చితక్కొట్టారు. పెద్ద పెద్ద రాడ్లతో దారుణంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ ఆ అధికారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది. ఆ వృద్ధునిపై దాడి చేస్తుంటే పక్కన ఉన్నవారు ఆపడానికి కూడా ప్రయత్నించలేదు.
70 ఏళ్ల అబ్దుల్ సమద్ ఖాన్ రిటైర్డ్ ఎస్‌ఐ. అతను సైకిల్‌పై వస్తుండగా.. ఓ వ్యక్తి పెద్ద రాడ్‌తో అతనిపై దాడి చేశాడు. దీంతో అబ్దుల్ కిందపడిపోగా మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి దాడి చేశారు. అనంతరం వారు అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడ్డ అబ్దుల్‌ను స్థానికులు అసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భూవివాదమే కారణమని, నిందితుల్లో ఒకరికి నేరచరిత్ర ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment