లక్నో: ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు ఎగబడడంతో ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఓ యువకుడు జరిపిన కాల్పుల్లో మహిళతో పాటు ముగ్గురు గాయపడ్డారు. ముఫార్డ్ గంజ్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ వద్ద గురువారం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
బ్యాంకు ఖాతాల కోసం పేద ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడకు తరలివచ్చారు. క్యూ లైను నుంచి ఇద్దరు యువకులను గెంటేయడంతో గొడవ ప్రారంభమైంది. వారిపై దాడి జరగడంతో ఓ యువకుడు కాల్పులు జరిపాడు. గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకామె పరిస్థితి విషమంగా ఉంది.
'జన్ ధన్' కోసం ఘర్షణ, కాల్పులు
Published Fri, Aug 29 2014 8:56 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement