నగల దుకాణంలో తలకు గన్‌ పెట్టి.. | Robbery at gunpoint in jewellery store of Allahabad | Sakshi
Sakshi News home page

నగల దుకాణంలో తలకు గన్‌ పెట్టి..

Published Tue, Feb 28 2017 10:30 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

నగల దుకాణంలో తలకు గన్‌ పెట్టి.. - Sakshi

నగల దుకాణంలో తలకు గన్‌ పెట్టి..

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ఓ నగల దుకాణంలో దోపిడిదొంగల అరాచకం సీసీటీవీ ఫొటేజీలో కనిపించింది. మంగళవారం అలాహాబాద్‌ పట్టణంలోని ఓ నగల దుకాణంలోకి  ప్రవేశించిన దొంగలు.. నగల వ్యాపారి తలకు గన్‌ పెట్టి బెదిరించి అందినకాడికి దోచుకెళ్లారు.

పక్కా ప్లాన్‌తో మొహానికి ముసుగులు ధరించిన ముగ్గురు దొంగలు నగల దుకాణంలోకి ప్రవేశించారు. అందులో ఓ వ్యక్తి వ్యాపారి తలకు గన్‌ పెట్టగా.. మిగతా ఇద్దరు బ్యాగుల్లో ఆభరణాలు నింపుకున్నారు. అనంతరం ముగ్గురూ అక్కడ నుంచి నిమిషాల్లో పారిపోయారు. వ్యాపారి ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫొటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement