
లక్నో: ఒక కుటుంబంలోని మొత్తం ఐదుగురు సభ్యులు చనిపోయి వుండడం కలకలం సృష్టించింది. ఉత్తరప్రదేశ్, అలహాబాద్, ధుమాంగంజ్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ విషాదం వెలుగులోకి వచ్చింది. అనుమానాస్పద పరిస్థితిలో మృతదేహాలు పడివుండటం పలు సందేహాలకు తావిస్తోంది.
స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఇంటి తాళం వేసి వుండటంతో పగుల గొట్టి ప్రవేశించిన పోలీసులు అనుమానాస్పద స్థితిలో ఐదు మృతదేహాలను గుర్తించారు. ఒక వ్యక్తి (భర్త) ముందుగదిలో ఉరికి వేలాడుతూ కనిపించగా, లోపల ఫ్రిజ్‌లో మహిళ (భార్య) మృతదేహం కనిపించింది. ఇద్దరు కుమార్తె శవాలు సూట్‌కేస్‌లో, బీరువాలో కుక్కి వుండగా, మూడువ కుమార్తె శవం మరో గదిలో పడి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మతృదేహాలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. భార్య, ముగ్గురు కుమార్తెలను హత్య చేసి భర్తకూడా ఆత్మహత్య చేసుకొని వుండొవచ్చనే సందేహాన్ని అలహాబాద్ సీనియర్ సూపరింటెండెంట్ నితిన్ తివారీ వ్యక్తం చేశారు. దర్యాప్తు జరుగుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment