ఆందోళన రేపిన బాలిక హత్య | 7-Year-Old Raped, Then Killed, Family Not Allowed To Cremate Her | Sakshi
Sakshi News home page

ఆందోళన రేపిన బాలిక హత్య

Published Thu, Jun 30 2016 3:27 PM | Last Updated on Sat, Aug 25 2018 4:14 PM

ఆందోళన రేపిన బాలిక హత్య - Sakshi

ఆందోళన రేపిన బాలిక హత్య

అలహాబాద్: ఏడేళ్ల బాలికపై 15 బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచార ఘటన జరిగిన 20 రోజుల తర్వాత నిందితుడి తండ్రి బాధిత బాలికను కిరాతంగా హత్య చేశాడు. మానవత్వానికి మచ్చ తెచ్చిన ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో జరిగింది. బాలిక మృతదేహాన్ని ఖననం చేసేందుకు ప్రయత్నించిన పోలీసులను అడ్డుకోవడంతో బాలిక తండ్రితో పాటు ఆమె తరపు వారిపై బుధవారం పోలీసులు లాఠీచార్జి చేశారు.

జూన్ 5న బాలికపై పొరుగింట్లో ఉంటున్న 15 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు కేసు పెట్టినా పోలీసులు పట్టించుకోలేదు. చివరకు ఈ నెల 26న నిందితుడిని అరెస్ట్ చేశారు. రెండు రోజుల తర్వాత నిందితుడు తండ్రి సహా ఐదుగురు బాలిక ఇంటిపై దాడి చేసి ఆమెను బలవంతంగా లాక్కుపోయారు. తర్వాత కత్తి గాయాలతో బాలిక మృతదేహాన్ని పొలాల్లో కనుగొన్నారు. నిందితుడి తండ్రి బాలికను హత్య చేసినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ బాలిక మృతదేహాన్ని ఖననం చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో వారిపై పోలీసులు లాఠిచార్జి చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేపట్టామని పోలీసు సీనియర్ అధికారి జోగిందర్ కుమార్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement