Seven-Year-Old Girl
-
ఆందోళన రేపిన బాలిక హత్య
అలహాబాద్: ఏడేళ్ల బాలికపై 15 బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచార ఘటన జరిగిన 20 రోజుల తర్వాత నిందితుడి తండ్రి బాధిత బాలికను కిరాతంగా హత్య చేశాడు. మానవత్వానికి మచ్చ తెచ్చిన ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో జరిగింది. బాలిక మృతదేహాన్ని ఖననం చేసేందుకు ప్రయత్నించిన పోలీసులను అడ్డుకోవడంతో బాలిక తండ్రితో పాటు ఆమె తరపు వారిపై బుధవారం పోలీసులు లాఠీచార్జి చేశారు. జూన్ 5న బాలికపై పొరుగింట్లో ఉంటున్న 15 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు కేసు పెట్టినా పోలీసులు పట్టించుకోలేదు. చివరకు ఈ నెల 26న నిందితుడిని అరెస్ట్ చేశారు. రెండు రోజుల తర్వాత నిందితుడు తండ్రి సహా ఐదుగురు బాలిక ఇంటిపై దాడి చేసి ఆమెను బలవంతంగా లాక్కుపోయారు. తర్వాత కత్తి గాయాలతో బాలిక మృతదేహాన్ని పొలాల్లో కనుగొన్నారు. నిందితుడి తండ్రి బాలికను హత్య చేసినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ బాలిక మృతదేహాన్ని ఖననం చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో వారిపై పోలీసులు లాఠిచార్జి చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేపట్టామని పోలీసు సీనియర్ అధికారి జోగిందర్ కుమార్ తెలిపారు. -
అదృశ్యమైన బాలిక శవమై తేలింది
పింప్రి, న్యూస్‌లైన్: లోనావాలాలోని కుమార్ రిసార్ట్‌లో రెండు రోజుల క్రితం జరిగిన ఓ పెళ్లిలో అదృశ్యమైన ఏడేళ్ల బాలిక మంగళవారం శవమై కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... రాయిగడ్ జిల్లా ఇందాపూర్‌ుకు చెందిన ఓ జైన్ కుటుంబం ఈ నెల 15న ఇక్కడ జరిగిన వివాహానికి హాజరైంది. ఆ రోజు సాయంత్రం నుంచి వారి ఏడేళ్ల కుమార్తె కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో సోమవారం ఉదయం తల్లిదండ్రులు లోనావాలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంగళవారం సాయంత్రం కుమార్ రిసార్ట్ టైపై ఓసోలార్ బోర్డు కింద బాలిక శవం కనిపించింది. ఆమె మెడను పదునైన ఆయుధంతో కోసి హత్య చేశారని పోలీసులు చెప్పారు. బాలికపై అత్యాచారం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానంవ్యక్తం చేశారు. బాలిక మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని, శవ పరీక్షకు తరలించి, దర్యాప్తులు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకొని రిసార్ట్‌పై రాళ్లు రువ్వారు. స్థానికుల ఆగ్రహం బాలిక హత్యకు నిరసనగా బుధవారం లోనావాలాలో స్థానికులు స్వచ్ఛందంగా బంద్ పాటించి, రాస్తారోకో నిర్వహించారు. కుమార్ రిసార్ట్ భవనంపై రాళ్ల వర్షం కురిపించారు. ప్రజలను శాంతింపజేయడానికి పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో లాఠీ చార్జీ చేశారు. బాలికపై అత్యాచారం జరిగినట్టు అనుమానాలు వ్యక్తం కావడంతో, ఆగ్రహం చెందిన ప్రజలు లోనావాలా నగరంతో పాటు మావల్, ఖపోలి పరసరాల నుంచి భారీ సంఖ్యల ఉదయం నుంచే ఇక్కడికి చేరుకోవడం ప్రారంభించారు. పోలీసుల లాఠీ చార్జీలో పలువురు మహిళలు గాయపడ్డారు. -
ఏడేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
న్యూఢిల్లీ: ఏడేళ్ల బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటన పశ్చిమ ఢిల్లీలోని పశ్చిమ్‌విహార్ ప్రాంతంలో ఈ నెల మూడో తేదీన చోటుచేసుకుంది. ఈ విషయం ఆదివారం వెలుగులోకొచ్చింది. వివరాలిలా ఉన్నాయి. మామిడిపండు ఇస్తామంటూ ముగ్గురు నిందితులు బాధితురాలిని సమీపంలోని ఉద్యానవనానికి తీసుకుపోయి అక్కడ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులంతా పది నుంచి 15 ఏళ్ల వయసువారేనని పోలీసులు తెలిపారు. వీరిని జువెనైల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచిన అనంతరం కస్టడీకి తరలించామన్నారు. ఆదివారం ఉదయం బాధితురాలి మర్మాంగంలో సమస్యలు తలెత్తడంతో జరిగిన సంఘటనను తల్లికి వివరించింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుమేరకు పశ్చిమ్‌విహార్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు.